గురువారం, డిసెంబర్ 31, 2009
తిరుప్పావై పదిహేడవ పాశురం
గోపికలు , పదిమంది గోపికలను మేల్కొలిపికొని నందగోపభావనమును చేరినారు. భావనపాలకుని ద్వారపాలకుని. ప్రార్ధించి వారి యనుమతిని పొందినారు. ద్వారపాలకుడు తలుపు తెరచి వాడలేను. గోపికలందరూ ను నందగోపభావనములోకి ప్రవేశించినారు.నందగోపుడు , యశోద, శ్రీ కృష్ణుడు, బలరాముడు వరసగా మంచాలపై సయనించినారు. వారిని ఈ రోజు మేలుకోల్పుతున్నారు. రాక్షసులు వచ్చి కృష్ణునికి ఏమి కీడు చెయునో అని ! లేక గోపికలు ఎత్తుకుపొతారెమో ! అని భయముతో జాగరుడై ముందు మంచము మీద నందుడు శయనించియుండెను. లేక లేక లభించిన కృష్ణుని వీడ లేక ఒక ప్రక్క కృష్ణుని మరో పక్క బలరాముని మద్యలొ యశొద శయనించి యుండెను. వారిని ఒక్కొక్కరిని ఇందులొ మెలుకొల్పుతున్నారు.
పాశురం :
అమ్బరమే తణ్ణీరే శోఱే అఱం శెయ్యుం
ఎమ్బెరుమాన్ నందగోపాలా! ఎరుందిరాయ్
కొన్బనార్ క్కెల్లాం కొరుందే! కుల విళక్కే
ఎమ్బెరుమాట్టి యశోదా! అఱివుఱాయ్
అమ్బరం ఊడఱుత్తు ఓంగి ఉలగళంద
ఉమ్బర్ కోమానే! ఉఱంగాదు-ఎరుందిరాయ్
శెమ్బొఱ్ కరలడి చ్చెల్వా బలదేవా!
ఉమ్బియుం నీయుం ఉఱంగ్-ఏలోర్ ఎంబావాయ్
Pasuram17-HH.mp3 |
తాత్పర్యము:
వస్త్రములు కావలసినవారికి వస్త్రములు, మంచి నీరు , అన్నము కావసినవారికి అన్నము, ఫలాభిసంధి లేక ధర్మ బుద్ధితో దానము చేయు నందగోపాలా! మా స్వామీ! మేల్కొనుము , ప్రబ్బలి చెట్ల వంటి సుకుమారములగు శరీరములు గల స్త్రీలలో చిగురువంటిదానా! మా వంశమునకు మంగలదీపము వంటిదానా! మా స్వామినీ ! యశోదా! మేలుకొనుము. ఆకాశ మధ్య భాగమును చీల్చు కొని పెరిగి లోకముల నన్నిటిని కొలిచిన త్రివిక్రమా ! నిత్యసురులకు నాయకుడా! నిద్ర పోకూడదు. మేల్కొనుము. స్వచ్ఛమైన ఎర్రని బంగారుముతో చేయబడిన కడియము కాలిని దాల్చిన బలరామా! నీవును, నీ తమ్ముడును మేల్కొనవలెను.
అని గోపికలు ప్రార్ధించిరి.
Happy new year
May bring no tear to any eye
When this New Year in time shall end
Let it be said I've played the friend,
Have lived and loved and labored here,
And made of it a happy year.
తిరుప్పావై పదహారవ పాశురం
ద్వార పాలకులు ను అర్దించుట
పాశురము:
నాయగనాయ్ నిన్ఱ నందగోపనుడైయ
కోయిల్ కాప్పానే! కొడిత్తోన్ఱుం తోరణ
వాశల్ కాప్పానే, మణిక్కదవం తాళ్ తిఱవాయ్
ఆయర్ శిఱుమియరోముక్కు అఱై పఱై
మాయన్ మణివణ్ణన్ నెన్నలే వాయ్-నేరుందాన్
తూయోమాయ్ వందోం తుయిలెర ప్పాడువాన్
వాయాల్ మున్నం మున్నం మాత్తాదే అమ్మా
నీ నేశనిలైక్కదవం నీక్కు- ఏలోర్ ఎంబావాయ్
తాత్పర్యము:
అందరకు నాయకునాయకుడైన నందగోపుని భవనమును కాపాడుభావనపాలకా లోనికి విడువుము . తోరనములతో శోభిస్తున్న ద్వారమునుకాపాడుతున్న ద్వారపాలకా మణులచే అందముగా వున్నా గడియలనుతెరువుము . గోపబాలికలగు మాకు మాయావి అయిన మణివర్ణుడగు శ్రీ కృష్ణపరమాత్మ ద్వని చేయ "పఱ " అను వాయిద్యము ను ఇచ్చెదనని నిన్న నేనుమాట ఇచ్చాను . మేము వేరొక ప్రయోజనము కాంక్షించి రాలేదు. పవిత్రమైనభావముతో వచ్చాము . శ్రీ కృష్ణుని మేల్కొల్పుటకు గానము చేయుటకువచ్చినాము . స్వామీ ముందుగానే నీవు కాదనకు . దగ్గరగా ప్రేమతోఒకదానినిఒకటి చేరి బిగువుగా పట్టుకొని వున్న తలుపులను నీవే తెరచిమమ్ములను లోనకు పోనిమ్ము . అని భావనద్వార పాలకులను గోపికలు వేడుకొన్నారు.
జై శ్రీమన్నారాయణ్ .
మంగళవారం, డిసెంబర్ 29, 2009
తిరుప్పావై పదిహేనవ పాశురం
ఆండాళ్ తిరువడిగళేశరణం :
ఇంతవరకు తొమ్మిదిమంది గోపికలని మేల్కొల్పినారు. పడవ గోపికను ఈ పాశురములో మేల్కొల్పుతున్నారు. దీనితో ముందు భాగము పూర్తవుతుంది. దీనిలో ముందుగా భాగావ్ద్భాక్తులను మేల్కొల్పుతారు. తరువాత భగవానుని మేల్కొల్పుతారు. మొదటి పదిహెను పాశురాలలో మొదటి ఐదు పాశురాలుచె ఈ వ్రతము నాకు పుర్వరంగామునుతెలిపి తరువాత పది పాశురాలలో పది మంది గోపికలను మేల్కొల్పినారు . దీనితో భగవద్ ఆలయములో చేరుకొనుటకు అర్హత కలిగెను. ఇంతవరకు భగవద్భాక్తుల విషయమున ప్రవర్తింపవలసిన విధనములు నిరూపించి ఈ పాశురములో దాని ఫలమును నిరుపించబడుచున్నది. ఇంతవరకు భాగాత్ప్రాప్తికి చేయవలసిన సాధన క్రమము వివరిచారు గోదామాత. అట్టి సాధన చేయుటచే ఏర్పదవలసిన ప్రధాన లక్షణము అహంకారము తొలగుట. అది పుర్ణంగా తొలగినాడు గాని ఆచార్య సమాస్రయనముస్ మంత్రము లభించి భగవదనుభావము కలుగదు . ఇట్టి పరిపూర్ణ స్తితినంది యున్న గోపిక ఈ నాడు మేల్కొల్ప బడుచున్నది.
శిల్ ఎన్ఱ్ అరైయేన్మిన్ నంగైమీర్! పోదరుగిన్ఱేన్
వల్లై ఉన్ కట్టురైగళ్ పండేయున్ వాయఱిదుమ్
వల్లీర్గళ్ నీంగళే నానే తాన్ ఆయిడుగ
ఒల్లై నీ పోదాయ్ ఉనక్కెన్న వేఱుడైయై
ఎల్లారుం పోందారో పోందార్ పోంద్-ఎణ్ణిక్కోళ్
వల్లానై కొన్ఱానై మాత్తారై మాత్తరిక్క
వల్లానై మాయనై ప్పాడ-ఏలోర్ ఎమ్బావాయ్
తాత్పర్యము:
ఈ పాశురము న లోపల ఉన్నా గోపిక కుబయటి గోపికలకు సంవాదము నిబంధింపబడినది. వారి మద్య సంబాషణ ఎలావుందంటే.................
బయటి గోపికలు: ఓ లేత చిలుక వంటి కంఠమాధుర్యము కలదానా ! ఇంకను నిద్ర పోతున్నావా ? అయ్యో ఇది ఏమి ?
లోని గోపిక: పూర్ణులగు గోపికలారా ! చికాకు కలుగునట్లు జిల్లుమని పిలువకండి. నేను ఇదే చెప్పుచున్నాను.
బయటి గోపుకలు: నీవు చాలా నేర్పు కలదానవు. నీమాటలలో నైపుణ్యము కాఠిణ్యము మాకు ముందే తెలియును.
లోని గోపిక : మీరే నేర్పు కలవారు. పోనిండు ! నేనే కఠినురాలను.
బయటి గోపిక : నీకీ ప్రత్యేకత ఏమి? అట్లు ఏకాంతముగా ఎందుకు వుంటావు. వేగముగా బయటకు రా !
లోని గోపిక: అందరు గోపికలు వచ్చినారా.
బయటి గోపికలు: వచ్చిరి , నీవు వచ్చి లెక్కించుకో .
లోని గోపిక: సరే , నేను వచ్చి నేను ఏమి చెయ్యాలి ?
బయటి గోపికలు: బలిష్టమగు కువయాపీడము అను ఏనుగును చంపినవాడను శతృవుల దర్పమును అణచినవాడను , మాయావి అగు శ్రీ కృష్ణుని కీర్తిని గానము చెయుటకు రమ్ము.
జై శ్రీ మన్నారాయణ్
తిరుప్పావై పద్నాల్గవ పాశురం
పరందాముని మహిమ:
ఈమె ఇంటిలో ఒక పెద్ద తోట గలదు . పెరటివైపున వున్నా ఆ తోటలో దిగుడు బావికలదు. ఆ దిగుడు బావిలో తామర పూలు , కాలువలు , ఉన్నవి ఆమె తన్మయత్వముతో అనుభావిచుచు ఇతరంలనే మచి ఉన్నది. అట్టి స్థితిలో ఉన్నా గోపికను నేడు మేల్కొల్పుతున్నారు .
పాశురము:
ఉంగళ్ పురైక్కడై త్తోట్టత్తు వావియుళ్
శెంగరునీర్ వాయ్ నెగిర్ అంద్ ఆమ్బల్ వాయ్ కుమ్బిన కాణ్
శెంగల్పొడి క్కూరై వెణ్బల్ తవత్తవర్
తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోగిన్ఱార్
ఎంగళై మున్నం ఎరుప్పువాన్ వాయ్ పేశుమ్
నంగాయ్! ఎరుందిరాయ్ నాణాదాయ్! నావుడైయాయ్
శంగోడు చక్కరం ఏందుం తడక్కైయం
పంగయ క్కణ్ణానై ప్పాడ-ఏలోర్ ఎంబావాయ్
Pasuram14-HH.mp3 |
స్నానము చేయుటకు గోపికల నందరను లేపుదునని చెప్పి నిద్రించుచున్న ఒకామె ను ఇందుమేల్కొల్పుచున్నారు . ఓ పరిపుర్ణురాలా ! నీ పెరటి తోటలో దిగుడుబావిలోని ఎర్రతామరాలు వికసించినవి కాలువలు ముడుచుకోపోతున్నవి లెమ్ము ! ఎర్రని కాషాయములను దాల్చి తెల్లని పల్లువరస కలిగి వైరాగ్యముతో కూడిన సన్యాసులు తమతమ ఆలాయములలో ఆరాధన చేయుటకు పోతున్నారు లెమ్ము. మమ్ములను ముందుగానే మేల్కొని వచ్చి లేపుదనని మాట ఇచ్చావు మరచావా ?
ఓ లజ్జావిహీనురాలా లెమ్ము ! మాట నేర్పు కలదానా ! శంఖమును ,చక్రమును ధరించిన వాడును , ఆజాను భాహువును అయిన పుండరీకాక్షుని మహిమను గానము చేయుటకు రమ్ము.
ఆదివారం, డిసెంబర్ 27, 2009
తిరుప్పావై పదమూడవ పాశురం
ఆండాళ్ తిరువడిగళేశరణం :
వెనుకటి పాసురములో గోపికను మేల్కొల్పుచున్నప్పుడు కృష్ణ సంకీర్తనము మాని శ్రీ రామచంద్ర గుణమును సంకీర్తనము నొనర్చి శ్రీ రాముడు మనోభి రాముడని గోపికలు పేర్కొనిరి. దానిని విని నందవ్రజమున సంచలన మేర్పడినది. మధురలో పుట్టి శ్రీ కృష్ణుడు గోపావంశమున చేరి తానూ కుడా గోపాలుడే యనునట్లు కలసి మెలసి యుండి వారి కాపాడుచుండగా అట్టి కృష్ణుడు ని విడిచి శ్రీ రాముని కీర్తించుట ఏమి అన్యాయము. ఆనాడు అయోధ్యలో " రామో రామో రామ ఇతి ప్రజానా మభావన్ కదా:"
ప్రజలు రాముడు, రాముడు ,రాముడని అనుకోనుచుదేదివారు. కాని ఇతర ప్రసంగామీలేదు కదా!
నంద వ్రజమున మాత్రము కృష్ణుని తప్ప అన్యుని కీర్తించుట ఏమి హితవు అని .వాదనలు జరుగుతున్నాయి. అవి రెండు గ్రూపులుగా విడి పోయారు. వారి మద్య గొడవ జరుగుతుండగా ఒక పెద్దమ్మ వచ్చి రాముడే కృష్ణుడని , కృష్ణుడే రాముడని వారికి వివరించింది.
ఈ రోజు లేపుచున్న గోపిక నేత్ర సౌందర్యము కలది. నేత్ర సౌందర్యమనగా కృష్ణుడు తన కంటి యందే ఉంఢవలెను కాని కృష్ణుని వెదకుకొని రాక యెట్లుండ గలడు. అను దైర్యముతో తన నేత్ర సౌందర్యమును భావించి ఇంటిలో నే పరుండినది. నేత్రమనగా జ్ఞానము .
నేటి గోపిక కృష్ణుని కలవాలన్న కోరిక కలది అయినాను కృష్ణుని పొందుటకు తానె ప్రయత్నమూ చేయక పరున్నది . ఆ గోపికను ఈ విధముగా లేపుచున్నారు.
పాశురము:
Pasuram13-HH.mp3 |
పుళ్ళిన్ వాయ్ కీండానై ప్పొల్లా అరక్కనై
కిళ్ళి క్కళైందానై కీర్-త్తిమై పాడి ప్పోయ్
వెళ్ళి యెరుందు వియారం ఉఱంగిత్తు
పుళ్ళుం శిలమ్బిన కాణ్ పోదరి క్కణ్ణినాయ్
కుళ్ళ కుళిర క్కుడైందు నీరాడాదే
పళ్ళి క్కిడత్తియో పావాయ్! నీ నన్నాళాల్
కళ్ళం తవిరుందు కలంద్-ఏలోర్ ఎంబావాయ్
తాత్పర్యము :
పక్షి శరీరమున ఆవేశించిన బకాసురుని నోరుచీల్చి తన్ను కాపాడుకొని మనను కాపాడిన శ్రీ కృష్ణుని, దుష్ట రాక్షసుడగు రావణుని పది తలలను హేలగా చిగుళ్ళు త్రుపినట్లు త్రుంపిపారవేసిన శ్రీ రాముని గానముచేయుచు పోయి మనతోడి పిల్లలందరును వ్రత క్షేత్రమును చేరినారు నారు. లోన తుమ్మెదగల తామరపూలను పోలిన కన్నులు కలదానా !
లేడివంటి చూపులు కలదానా ! శుక్రుడు ఉదయించుచున్నాడు . గురుడు అస్తమించుచున్నాడు . పక్షులు కూయుచున్నవి . కృష్ణ విరహ తాపము తీరునట్లు చల్లగా అవగాహన మొనర్చి స్నాన మోనర్పక పాన్పుపై ఏల పడుకున్నావు. ఓసుకుమార స్వభావా! ఈ మంచి రోజున నీవు నీకపటమును వీడి మాతోకలసి ఆనందము అనుభవింపుము .
జై శ్రీ మన్నారాయన్ !
శనివారం, డిసెంబర్ 26, 2009
తిరుప్పావై పన్నెండవ పాశురం
వెనుకటి పాశురము న స్వ ధర్మ నిరతులగు గోపాలుర వంశమున జన్మించిన యామె మేల్కొలుపబడినది.
శరీరము కర్మచేయుతకు వీలుగా నుండునట్లు సృజింపబడినది. ఒక్క క్షణము మైనను కర్మచేయకుండా ఎవరు ఉండలేరు. అందుచే శరీరియయిన ప్రతీ వ్యక్తికి స్వధర్మము కర్మ; పరధర్మము జ్ఞానము . స్వధర్మము జ్ఞానమునకు భగవద్భక్తికి ప్రతిబంధకముగా నుండు పాపములను తొలగించును.
అందుకుగాను " యజ్ఞము ,దానము, తపస్సు మున్నగున్నవి క్రియా కల్లాపమును విడువరాదు . ఆచరిచితీరాలి. యజ్ఞము,దానము,తపస్సు మనస్సులోని మాలిన్యమును తొలగించి ఙానము, తద్వారా భక్తి కలుగుటకు సాయపడును.
కర్మను విడుచుట యనగా కర్మలను మానుట కాదు. కర్మ చేయుటయందు కర్తృత్వాభిమానమును, ఫలమునందాశను ,సంగమును విడచుటయే కర్మ సన్యాసము. కాని నియతమగు కర్మను విడచుట సన్యాసమను మొహముతో విడచుట తామస త్యాగము. శరీర క్లేశము కల్గునను భయముచే కర్మలను మానుట రాజసత్యాగము. భగవద్గీతలొ కర్మన్యాసము అని చెప్పబడి ఉన్నది.
వెనుకటి పాశురములో గోపాలుర స్వధర్మమును ఫల సంగ కర్తృత్వాభిమానములను వదలి యాచరించెడి స్వభావము కలవారని వర్ణించబడింధి.
ఈ పాశురములో అట్టి స్వధర్మము ను కూడా ఆచరించని ఒకానొక గోపాలుని సోదరి మేల్కొల్పబడుచున్నధి.
గోపాలురందరును పరమాత్మయే ఉపాయము -ఉపేయము అని నమ్మినవారు. వారి యెమి చేసినా పరమాత్ముని ప్రీతి కొరకే చేస్తున్నామన్న కోరిక లక్ష్యము కలవారు.
ఇంద్రియ ప్రవ్రుత్తి నిరోధముగల గోపాలుని సోదరిని ఇందు మేల్కొల్పుచున్నారు.
కనైత్త్-ఇళంకత్తెరుమై కన్ఱుక్కిరంగి
నినైత్తు ములై వరియే నిన్ఱు పాల్ శోర
ననైత్త్-ఇల్లం శేఱాక్కుం నచ్చెల్వన్ తంగాయ్
పనిత్తలై వీర నిన్ వాశల్ కడై పత్తి
శినత్తినాల్ తెన్ ఇలంగై క్కోమానై చ్చెత్త
మనత్తుక్కినియానై ప్పాడవుం నీ వాయ్ తిఱవాయ్
ఇనిత్తాన్ ఎరుందిరాయ్ ఈదెన్న పేర్ ఉఱక్కమ్
అనైత్తిల్లత్తారుం అఱింద్-ఏలోర్ ఎంబావాయ్
తాత్పర్యము :
లేగ దూడలు గల గేదెలు పాలుపితుకువారు లేక లేగ దూడలును తలంచుకొని వానిపై మనసు పోవుటచే ఆ దూడలే వచ్చి మొదుగులో మూతి పెట్టునట్లు తోచి పొదుగునుండి కారిపోవుటచే ఇల్లంతయూ బురధగుచున్న ఒకానొక మహైశ్వర సంపన్నుని చెల్లెలా! మంచు తలపై పడుచుండ నీ వాకిట నిలచియుంటిమి. కోపముతో దక్షిన దిక్కున నున్న లంకకు అధిపతియైన రావణుని చంపిన మనోభి రాముడగు శ్రీరాముని గానము చేయుచుంటిమి. అది వినియైనను నీవు నోరు విప్పవా? ఇంక మమ్మేలు కొనవా? ఏమి యీ గాఢ నిద్ర? ఊరివారందరుకూ నీ విషయము తెలిసిపోయినది. లెమ్ము అని కృష్ణుని విడువక సర్వ కాలముల నుండుటచే స్వధర్మమును కూడ చేయలేని దశయందున్న ఐశ్వర్య సంపన్నుడగు ఒక గోపాలుని చేల్లెలిని మేల్కొల్పినారు.
శుక్రవారం, డిసెంబర్ 25, 2009
చార్లెస్ చాప్లెన్
ఈరోజు చార్లీ చాప్లెన్ వర్ధంతి. December 25th,
చార్లీ చాప్లెన్ తెలియని వారువుండరు. ఆయన1889 ఏప్ర్లెల్ 16 వతేదిన ఇంగ్లాండ్ లో జన్మించారు.మనందరికీ తెలిసి చార్లీ చాప్లెన్ అంటె ఆయన హాస్య నటుడు.చాప్లెన్ డ్రస్ స్టయిల్ బిగుతుగా వున్న కోటు, లూజ్ ఫేంట్, పెద్దాషు , చేతికి ఒక వంకీ కర్రా, వంకర టింకరి నడక,మరి దానికి బ్రష్ లాంటి మీసకట్టుతో, చాప్లెన్ మనకు కనిపిస్తారు. ఎలాంటి వారికి అయినా నవ్వుతెప్పించే కళాకారుడు చాంప్లెన్.అయనను తన పాత్రలో ట్రాంప్ గా తయారు చేసుకున్నారు. చాప్లెన్.
చాప్లెన్ మంచి కళాకారుడు, మిమిక్రి చాలాబాగా చిన్నప్పటినుండీ బాగా చేసేవారు.మంచిరచయిత, పాటగాడుకూడా.అయన ఒకశాంతి ప్రియుడు, అందంగాడు, మంచిహృదయంకలవాడు,చాంప్లెన్ ఒక ప్రపంచ అద్బుతాలలో ఒకరు.
ఆయను ను ఈరోజు ఈరకంగా తలచుకుంటున్నందుకు నేను చాలా happy గా వున్నాను.
గురువారం, డిసెంబర్ 24, 2009
తిరుప్పావై పదకొండవ పాశురం
ఆండాళ్ తిరువడిగలే శరణం :
ఈశ్వరుడే ఉపాయము -ఉపేయము లని నమ్మినవారు గోపికలు. తనను పొందించు సాధనము తానె అని భగవానుని ఉపాయత్వమునమ్దు గలవారే ఈ లేపబడుచున్న గోపికలా.
ఈ పాశురములో లేపబడుచున్న గోపిక , కులముచేతను, రూపముచేతను, గుణముచేతను అందమైనది. కృష్ణుడు ఊరుకంతకు ఆదరణీయుడైయున్నట్లే.యీమె కూడా ఊరులోని అందరి మన్ననలను అందిన పిల్ల. ఈ పాశురములోని నిద్ర పోతున్న గోపిక వంశము వారు భరతుని వంశము చెందినవారు. వీరు అభిజాత్యము -సౌందర్యము - ఐశ్వర్యము కల గోపిక ను ఇందు లెపబడుచున్నది. ఈమె సౌందర్యము ను స్త్రీలె పృశంచించుట విశేషము .
గోపికలందరు కౄష్ణపరతంత్రులే.
పాశురము :
కత్తుకఱవై క్కణఙ్గళ్ పలకఱందు
శెత్తార్ తిఱల్ అరియ చ్చెన్ఱు శెరుచ్చెయ్యుం
కుత్తం ఒన్ఱిల్లాద కోవలర్-దం పొఱ్కొడియే
పుత్తరవల్ గుల్ పునమయిలే పోదరాయ్
శుత్తత్తు త్తోరిమార్ ఎల్లారుం వందు నిన్-
ముత్తం పుగుందు ముగిల్ వణ్ణన్ పేర్-పాడ
శిత్తాదే పేశాదే శెల్వప్పెణ్డాట్టి నీ-
ఎత్తుక్కుఱగుం పొరుళ్-ఏలోర్ ఎంబావాయ్
తాత్పర్యము:
లేగ దూడలు గలవియు, దూడల వలె నున్నవియు నగు ఆవులు మందల నెన్నింటినో పాలు పితుక కలవారును,
శత్రువులను ఎదిరించి బలముతో యుద్దము చేయగలవారును , ఏవిధమగు దోషము లేనివారును అగు గోపాలకుల వంశమున మొలచిన ఓ బంగారు తీగ ! పుట్టలోని పాము పడగవలె నున్న నితంబ ప్రదేశము గలదానా! అడవిలోని నెమలివలె అందమైన కేసపాసముతో ఒప్పుచున్నదానా! రమ్ము. చుట్టములును, చెలికత్త్లును మొదలుగా అందరును వచ్చిరి. నీ ముంగిట చేరిరి , నీలమేఘవర్ణుడగు శ్రీ కృష్ణుని నామమును కీర్తించుచుండిరి. కీర్తిమ్చుచున్నా ఉలకవేమి. ఓ సంపన్నురాలా లే మేలుకో అని గోపికలు మేలుకోల్పుతున్నారు .
బుధవారం, డిసెంబర్ 23, 2009
తిరుప్పావై పదవ పాశురం
శ్రీ శ్రీకృష్ణ పరమాత్మ ను విడిచి గోపికలు విరహముచే నిద్ర లేక , వ్రతము చేయవలెనని బయలుదేరి వచ్చుచుండగా పదిమంది నిద్రించుట ఆశ్చర్యముగా ఉండును. వారిలో ఒక్కొక్కరిని ఒక్కొక్కవిదముగా మేల్కొల్పుచున్నారు. వారి నిద్ర కుడా లౌకిక నిద్ర వంటి తామస నిద్ర కాదని అది భావదనుభావము చేత కలిగిన తామస నిద్ర అని తెలియుచున్నది. భగవదనుభావమున్న వారిని మేల్కొల్పుట అనగా వారి అభిముఖ్యమును సంపాదించి వారి విశేషకటాక్షమునకు పాత్రులై పాత్రులై భగవదనుభావయోగ్యతను కలిగించుకోనుతయే! భాగాత్ప్రాప్తికి ఉపాయములు భిన్న భిన్నముగా ఉన్నట్లు కన్పట్టుచుండును. నిష్కామకర్మ, ఆత్మస్వరుప జ్ఞానము , భగవద్భక్తి , భాగాత్ర్పాప్తికి ఉపాయములుగా భగవద్గీతలో నిర్దేశింపబడెను .
నమ్మాళ్వారులు వంటి మహాపురుషులు వారే విధమైన సాధనా లేకుండానే పుట్టినది మొదలు యోగాసాదనలో ఉండి భగవదనుభావమును అనుభవించువారివలె పరిపుర్ణానుభావమును అనుభవించిరి. ఆల్వారాలను ఈ పదియవ పాసురమున మేల్కొలుపు చున్నారు.
ఈ గోపిక ఫలమును ఆశించినది కాదు . లాభనష్టాలు అన్ని పరమాత్మవే కాని తనవి కావని నిశ్చలంగా ఉన్నది.
ఇతర ఇంద్రియములు పనిచేయక కేవలము ఒక్క మనస్సు మాత్రమె పనిచేయుచున్నది. ఆ మనసు లో పరమాత్మ దురులకు ఆటంకములేదని సూచించుటకు కృష్ణుని పొరిగింటి పిల్ల ఈమె . ఫలము సిద్దింపక దుఃఖము కలిగినా ఉద్వేగము చెందదు . తనను పాడుట భగవానునికి ఫలముగా భావించి భాద కలిగినా భగవంతుడే ఉద్వేగము చెందాలని . ఆమె భావిచేది. ఆ సుఖాలమీద తనకి మమకారము లేదు . ఇలాంటి పారతంత్ర్య పరాకాస్తతో ఉన్న గోపిక ఈ గాఢ నిద్రలో మునిగి యున్న కృష్ణుని పొరిగింటి పిల్ల - ఈ వేళ మేల్కొల్పుచున్నారు.
నోత్తు చ్చువర్ క్కం పుగుగిన్ఱ అమ్మనాయ్
మాత్తముం తారారో వాశల్ తిఱవాదార్
నాత్తత్తుళాయ్ ముడి నారాయణన్ నమ్మాల్
పోత్త ప్పఱై తరుం పుణ్ణియనాల్ పండొరునాళ్
కూత్తత్తిన్ వాయ్వీళంద కుమ్బకరణనుం
తొత్తుం ఉనక్కే పెరుందుయిల్ తాన్ తందానో
ఆత్త అనందల్ ఉడైయాయ్! అరుంగలమే
తేత్తమాయ్ వందు తిఱవేలోర్ ఎమ్బావాయ్
తాత్పర్యము:
మేము రాక ముందు నోమునోచి , దాని ఫముగా సుఖనుభావమును పోందినతల్లి ! తలుపుతెరవకపోయినా పోదువుగాక, మాటనైనను పలుకవా! పరిమళముతో నిండిన తులసిమాలలు అలమ్కరిచుకోనిన కిరీటము గల నారాయణుడు, ఏమియులేని మావంటివారము మంగళము పాడినను `పర ' అను పురుశార్ధమును ఓసంగేడి పుణ్యముర్తి , ఒకనాడు కుంభకర్ణుని మృత్యువునోటిలో పడత్రోయగా, ఆ కుంభకర్ణుడు నిద్రలో నీచే ఓడించబడి తనసోత్తగు ఈ గాదా నిద్ర ను నీకు ఒసగినాడా! ఇంత అధికమగు నిద్రమత్తు వదలని ఓ తల్లీ ! మాకందరకు శిరోభుషనమైనదానా! నిద్రనుండి లేచి, మైకము వదలించు కొని, తేరుకొని వచ్చి తలుపు తెరువు , నీ నోరు తెరచి మాటలాడు ఆవరనములోకి వచ్చినీ దర్శనము మాకు కలిగించు.
భగవదనుభావము గలవారు లోకులు నిమ్దిచని తీరున లోకములోకి వచ్చి ఆర్తి గలవారిని ఉద్దరింతురు.
వారి వాక్కు,వారి రూప దర్శనము కూడా భాగాత్ర్పాప్తికి సాధనములే!
ఈ పాశురములో ఏకేంద్రియావస్తలో నుండి ఇంద్రియము లేవియు పనిచేయక మససు భగవదదీనమై సిద్దోపాయనిస్టలో ఉన్న గోపిక మేల్కొల్పబడినది.
మంగళవారం, డిసెంబర్ 22, 2009
తిరుప్పావై తొమ్మిదవ పాశురం
ఇంతవరకు ముగ్గురు గోపికలను లేపినారు . ముదడవ గోపికను లేపుచున్నప్పుడు గేదెలు మొదలగున్నవి ఆహారము సంపాదించుటకు వెళ్తున్నాయని .అంటే తెల్లవారుటకు గుర్తుగా వారు గేదేలగురుంచి చెప్పారు. మిగిలిన పిల్లలు కుడా
అదేపోవటం అయితే వారి ని ఆపి నిన్ను పిలుచుటకు వచ్చాము.గుర్రపు నోటిని చీల్చిన వాడు ,మల్లురను చంపినవాడు అయిన పరమాత్మ మనలను చేరి మనము సేవించినచో అయ్యో, అయ్యో,అని భాదపడి మనలను పరామర్శించి కృపచేయును.
అటువంటి ప్రేమ మనకు కావాలికదా, అవి పరతంత్రాలు కదా. మనకి ప్రియమైన వానికి సేవలు చేయటమే కదా మన స్వరుఉపము. లెమ్ము ముందుగా లెమ్ము అని మూడవ గోపికను మేల్కొల్పినారు.
ఇంతవరకు ముగ్గురును లేపారు ఇప్పుడు నాల్గో గోపికను లేపుచున్నారు .ఈమె పరమాత్మయే ఉపాయము అను అధ్యవసాయమున పరినిస్తితురాలు. భాగావంతునికంటే వేరేఉపాయము లేదని . నమ్మినది . అలాంటి ఆమె నిద్రను చూచి గోదా మిగిలిన గోపికలు మొదటి రెండు పాశురాలు విన్నావు కదా ! మరి విని కుడా పరుంటివా ? లెమ్ము అని మెలొల్పుతున్నరు . మొదటి నాలుగు పాశురాలలొ నిద్ర నుండి మేల్కొల్పు తొ ఉన్న పాశురాలే. నిద్ర గురించి భగవద్గీత లో నాలుగు అవస్తలు గురించి నాలుగు శ్లొకాలలొ వివరించారు. నాలుగు అవస్తలు 1 యతమానవస్థ 2. వ్యతిరేకావస్థ, 3. ఏకేంద్ర్దియావస్థ, 4. వశీకారావస్థ. వీటిగురించి గీతలొ బాగా వివరించారు.
మొదటి రెండు పాశురాలలో శ్రవణము చెప్పబదింధి. తరువాత పాశురములో మననము నిరూపించబదినది. ఈ పాశురము నుండి నాలుగు పాశురములలో ధ్యానదశ వివరించబడినధి. అట్టి ధ్యానములో పరకాస్టనందియున్న గోపిక ఈనాడు మేల్కొల్పబదుచున్నధి.
Pasuram09-HH.mp3 |
దూపం కమళత్తుయిల్ అణైమేల్ కణ్ వళరుం
మామాన్ మగళే! మణి క్కదవం తాళ్ తిఱవాయ్
మామీర్! అవళై ఎళుప్పీరో ఉన్ మగళ్ తాన్
ఊమైయో అన్ఱి చ్చెవిడో అనందలో
ఏమ ప్పెరుందుయిల్ మందిర ప్పట్టాళో
మామాయన్ మదవన్ వైకుందన్ ఎన్ఱెన్ఱు
నామం పలవుం నవిన్ఱేలోర్ ఎంబావాయ్
పరిశుద్ధములగు నవవిధమణులతో నిర్మించబదిన మేడలో సుఖ శయ్యపై చుట్టును దీపములు వెల్గుచుండగా అగరు ధూపము గుమగుమలాడుచుండగా నిద్రపోవుచున్న ఓ అత్త కూతురా ! మణికవాటపుగడియ తీయుము. ఓయత్తా! నీవైనను ఆమెను లేపుము- నీకుమార్తెమూగదా? లేక చెవిటిదా ? లేక జాడ్యముకలదా? లేక ఎవరైన కదలిన ఒప్పమని కావలియున్నారా? లేక గాఢ నిద్రపట్టునట్లు మంత్రించినారా?
"మహామాయావీ ! మాధవా! వైకుంఠవాసా!" అని అనేక నామము లను కీర్తించి ఆమె లేచునట్లు చేయుము.
ఈ సందర్బములో గోదాదేవి భగవంతునికీ భక్తునికి మధ్యా సంబంధమును వివరించినారు.
1. మనందరిని తండ్రి ఆయనే 2. మనందరిని రక్షించేవాడు ఆయనే 3. మనందరిని నావాల్లు అని కల్గిన వాడు ఆయనే- శేశి అంటార 4. మనందరిని భరించేవాడు ఆయనే - భర్త అంటారు 5. మనలోని జ్ఞానాన్ని పనిచేయిస్తూ ఇందులో మనకు తెలియాల్సినవాడు ఆయనే- జ్ఞేయము అంటారు 6. మనందరిని తన వస్తువులుగా కల్గి ఉండి వాటికి స్వామి ఆయనే 7. మనందరికి ఆధారం ఆయనే - నారాయణుడు అంటారు 8. మనందరి లోపలుండే ఆత్మ ఆయనే - అంతర్యామి అంటారు 9. భోక్తా ఆయనే.
లోకంలో మనం ఎదో ఒక సంభందం అమ్మ,నాన్న, భార్య ఇలా ఉన్న ఒక్కొక్క సంభందం వల్ల ఎంత ప్రేమ కల్గి ఉంటాం, అదే ఇన్ని సంభందాలు కల్గి, శాశ్వతంగా వీడని సంభందం మనకు ఆయనతో ఉంటే మరెంత ప్రేమ ఉండాలి ఆయనపై మనకు! కుడా అదే ప్రేమ కల్గి వుంటుంది. ఈ విదముగా భగవద్ సంబందమును వివరించారు మన గోదామాత.
జై శ్రీ మన్నారాయణ !
సోమవారం, డిసెంబర్ 21, 2009
తిరుప్పావై ఎనిమిదవ పాశురం
ఆండాళ్ తిరువడిగలే శరణం :
ఈ ధనుర్మాస వ్రతము చాలా విలక్షణమైన వ్రతము . ఈ వ్రతము వల్ల మన శరీరము మంచి అలవాట్లు నేర్చుకొనుటకు బాగా దోహదపడుతుందని అర్దమవుతుంది.
గోపికను లేపుటకు కీచు కీచు మని పక్షుల అరుపులు వినలేదా ? రేపల్లె గోపికలు తరచూ పెరుగు తరచుట నిత్యకృత్యములు . వారు పున్యస్త్రీలే . వారు తెల్లవారుజామున లేచి తలడువ్వుకొని పూలు ముడుచు కొని శ్రీ కృష్ణుని పాటలు పాడుతూ పెరుగు చిలుకుతారు. అప్పుడు పెరుగు చిలుకుతున్నప్పుడు వచ్చే శబ్దము ఆకాశానికి వ్యాపించే టంత ఎక్కువ వస్తుంది. అయితే వారు చిలుకుతున్నప్పుడు వారి మెడలో వున్న నగలు శబ్దములు కూడా వస్తున్నాయి కదా అవి నీకు వినబదటం లేదా ఓనాయకురాలా నీవు మిక్కిలి తెజస్సు కలదానివి . నీ తెజస్సు మాకు కనబడుతున్నది,తలుపు తెరువు నీ తెజస్సు చుచి మేము అనందించునట్లు చెయి. అని లేపారు.
ఇంతవరకు మేల్కొలినన పిల్లలిద్దరును తమతో చేర్చుకొని వారు ముందు నడచుచుండగా నిద్రపోతున్న మరో గోపికను లేపుటకు బయలుదేరారు.ఆండాళ్ తల్లి మనిషి లక్ష్యం ఏమిటి ? వాటిని చేరుటకు ఏమిచేయ్యలని వారికి వేదాలలోని సారాన్ని తిరుప్పావై రూపములో వివరించింది. ఆ వివరణలోమైత్రేయి సహిత కాత్యాయిని యాజ్నవల్క్య మహర్షి గురించి వివరించింది. ఆమె మెట్ట వేదాంతమ్ వివరించలేదు. ఆమె మార్గమద్యలో ఏదిమమ్చిదొ ఏది చెడ్డదో అనుభవద్యులయిన పెద్ద వాళ్ల సలహాతీసుకొని ముందుకు సాగాలని వారికి ఏ ఋషి గురించి చెప్పింది. శ్రీ కృష్ణుని పొందుటకు తొందరగా లేచిరమ్మని మరో గోపికను లేపుతున్నారు.
కీళ్ వానం వెళ్ళెన్ఱెరుమై శిఱు వీడు
మెయ్యాన్ పరందన కాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుం
పోవాన్ పోగిన్ఱారై ప్పోగామల్ కాత్తు ఉన్నై -
క్కూవువాన్ వందు నిన్ఱోం కోదుగలం ఉడైయ
పాపాయ్! ఎళుందిరాయ్ పాడి ప్పఱై కొండు
మావాయ్ పిళందానై మల్లరై మాట్టియ
దేవాది దేవనై చ్చెన్ఱు నాం శేవిత్తాల్
ఆవా ఎన్ఱారాయుందరుళ్-ఏలోర్ ఎంబావాయ్
Pasuram08-HH.mp3 |
అందుకే మన ఆండాళ్ ఈరోజు అలాంటి ఒక గోపికను మనతో కలిపి, భగవంతుని అనుగ్రహం మనపై పడేట్టు చేస్తుంది.
తిరుప్పావై ఏడవ పాశురం
ఈ నాటి గోపిక విన్నది అయినాను ఈ గొపిక పరున్నది. " నిన్న మనము ఉత్తిష్టను లేపాము కదా ఇంక మనము కృషుని పాటలు పాడుకొంటు వెల్దాము లే అని లేపుతున్నరు. ఈ గోపికలు అందరు కలసి ఈ వ్రతము చేద్దమను కున్నరు అందులొ ఎవ్వరు లేకపొయినా వారి కి మంచిగా అనిపించధు కావునా వారు లేపుతున్నారు .నిన్న లేపామనుటకు గుర్తుగా వారు మూడు శబ్దాలు చెప్పారు. ఈ రోజు కూడా ఆ విదమైన శబ్దాలే వినిపిస్తున్నయని చెప్పుతున్నరు. ఈ పరున్న గోపికకు. ఏమి వినుట లేదా. ఏమి ఈ వెళ ఇంకాపడుకున్నావేమీ. అని అడిగిరి.దీనిచె ప్రదానముగా మొదట చెయవలసినది శ్రవణము . ఇది శ్రవణాభక్థి కలవారు నిన్నా ఈ రోజు ఆశ్రయించుచున్నారు. అని మనకు తెలుస్తున్నది. మొదటిది అవ్యక్తమగు పక్షి శబ్దము ,రెండవధి నాదప్రదానమఘు శంఖము శబ్దము, మూడవది హరి -హరి - హరి అన్న శబ్దమూ మనము విన్నాము కదా. ఈ రోజు కూడా అల్లానె వుంధి లే మనము వ్రతము చెసుకొడానికి వెల్దామని లెపుచున్నరు . గోపికలతో కూడిన మన ఆండాళ్ తల్లి.
వేద పఠనం ప్రారంభించునపుడు ముందుగా " శ్రీ గుభ్యోనమః , హరి ఓం " అని అంటారు. నిన్నను మన గోపికను మేల్కొల్పుటతో మన వ్రతము ప్రారంభము అయినధి . అందుచే పక్షులు శబ్దములు, శంఖనాధము , హరి హరి అన్న శబ్దము వినబడుటలెదా అని అనుచున్నారు. పక్షులు శ్రీ గురు మూర్తులు , అందుచే శ్రీ గురుభ్యొనమః అనినట్లు భావించుచున్నరు. శంఖము హరి శబ్దము - హరి ఓం అనునట్లు భావించాలి.
ఈ విధముగా వ్రతారంబము చెసి ఈనాడు ఆ శ్రావణంలోని వైవిధ్యము ను వేరొక గోపికను లేపుచున్నారు.
పాశురము :
Pasuram07-HH.mp3 |
కీశు కీశెన్ఱెంగుం ఆనైచ్చాత్తన్ కలందు
పేశిన పేచ్చరవం కేట్టిలైయో పేయ్ ప్పెణ్ణే
కాశుం పిఱప్పుం కలకలప్ప క్కై పేర్ త్తు
వాశ నఱుం కుళల్ అయిచ్చ యర్ మత్తినాల్
ఓ శై పడుత్త తయిర్ అరవం కేట్టిలైయో
నాయగ ప్పెణ్ పిళ్ళాయ్! నారాయణన్ మూర్ త్తి
కేశవనై ప్పాడవుం నీ కేట్టే కిడత్తియో
తేశం ఉడైయాయ్! తిఱవేలోర్ ఎమ్బావాయ్
తాత్పర్యము:
భరద్వాజపక్షులు పగలు విడిపోదుము కదాయని తెల్లవారు జామున కలసికొని అన్ని వైపులా ఏ వేవొ మాటలు మాటలాడుకొనుచున్నాయి ఆ మాటాలలో ధ్వనిని నీవు వినలేదా?.
ఓ పిచ్చిదానా ! కుసుమాలకృతములగు కేశబంధము లు వీడుటచే సుగంధములను వెదజల్లుచున్న జుట్టుముడులూగల గోపికలు, కవ్వముతో పెరుగు చిలుకుతున్నప్పుడు, వారి చేతుల కంకణ ద్వనులు, మెడ లోని ఆభరణధ్వనులతోకలసి , విజౄభించి, ఆకాశమునంటుచున్నవి. ఆ ద్వనులు లినలేదా. ఓ నాయకురాలా! సర్వ పదార్ధములలో వాత్సలముతో వ్యాపించియుండి , మనకు కనపడాలని శ్రీ కృష్ణుడు గా అవతరించి , విరోధులను నశింపజేసిన ప్రభువును కీర్తించుండగా వినుటలేదా, లేక వినీ పరుండియుంటివా? నీ తేజస్సు మాకు కనపడుచున్నధి . దానిని ఆపకుండా మేము దర్శించి అనుభవించునట్లు తలుపు తెరువవా.?
అని పలువిదాలుగా ఈ గోపికను నిద్ర లేపుచున్నారు.
శనివారం, డిసెంబర్ 19, 2009
తిరుప్పావై ఆరవ పాశురం
ఆండాళ్ తిరువడిగలే శరణం :
ఇంతవరకు ఈ వ్రతమునకు రంగము సిద్దమైనది. గోదాదేవి మిగిలిన గోపికలును ఈ వ్రతమునకు రావలసినదిగా ఆహ్వానించింది. ఈ వ్రతము ముఖ్య వుద్దేసము భగవంతుని అనుగ్రహము పొందాలని . ఊరివారి దృష్టిలో వర్షాలు పడాలని . ఈ వ్రతము నాచరించుటకు భాగవత్స్తమాగము పొందాలన్న కోరిక కలవారు అందరూ అర్హులే అని గోదామాత మొదటి రోజున చెప్పినది.
వ్రతసమయము లో చేయవలసిన కృత్యాలు ను రెండవ రోజు న వివరించింది.
ఈ వ్రతము సమయమున వారి వారి కోరికలు నేరవారతాయని మూడవ రోజున వివరించింది .
ఈ వ్రతము చేయునపుడు ఇతర దేవతలు అందరూ విదేయులై ఆఙను నెరవేర్చును అని నాల్గవ రోజు వివరించింది .
భగవదనుభావం పొందుటకు ఆటంకము లను కలిగిన భగవన్నామ స్మరణము చే ఆటంకాలు తోలగునని ఐదవ రోజు వివరించింది.
ఇక నుండి వ్రతమునకు ఉపక్రమించు ముందుగా పది రోజులు పదిమంది గోపికలను మేల్కొల్పి వారందరితో కలసి వ్రతమునకు సాగుతున్నారు.
ఈ వ్రతము చేయుటకు గోపికలందరూ అత్యుత్సాహము తో వున్నారు. కొందరు అస్సలు నిద్రపోకుండా మెలకువగా వున్నారు . కృష్ణ ప్రేమ పొందాలని చాలా కోరికతో కలలు కంటున్నారు మరి కొందరు. మరి కొందరు బగావంతుని ప్రేమ పొందుతున్నట్లు కలలు కంటూ మత్తుగా నిద్ర పోతున్నారు. ఆహా కృష్ణుడు కేవలము నా వాడే అనే తలంపుతో మగత నిద్రపోతున్నారు. కొందరైతే అస్సలు నిద్ర పోతాం లేదు. మరి కొందరు నిద్ర పోతున్నారు. అసలు శ్రీ కృష్ణుని ప్రేమ అందరికి సమానమే . మరి భగవంతుని గుణగణాలు మట్టులాంటివి . అవి నిద్రను కలిగిస్తాయి .
ఆ నిద్రనుండి లేవని వారి పట్ల కుడా కృష్ణుని ప్రేమ ఎక్కువే. వారిని మనగోదా నిద్రలేపి వారి మనస్సులో వున్నా దోషాలను వారికి కమ్ము కున్న పొరలను తొలగిస్తుంది. భగవంతనుగ్రహము పొందేలా చేస్తుంది.
ఈ రోజు చిన్న పిల్ల అయిన ఉత్తిష్టను నిద్ర లేపుతున్నది.
పుళ్ళుం శిలమ్బిన కాణ్ పుళ్ళరైయన్ కోయిల్
వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో
పిళ్ళాయ్! ఎళుందిరాయ్ పేయ్ములై నంజుండు
కళ్ళ చ్చగడం కలక్కళియ క్కాలోచ్చి
వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై
ఉళ్ళత్తు క్కొండు మునివర్గళుం యోగిగళుం
మొళ్ళ ఎళుందరి ఎన్ఱ పేరరవం
ఉళ్ళం పుగుందు కుళిరుందేలోర్ ఎమ్బావాయ్
భగవదనుభావము క్రోత్తదవుట వల్ల ఈ వ్రతము గురించి తెలియక తానొక్కత్తె తన ఇంటి లో పడుకొని బయటకు రాకుండా వున్న ఒక అమ్మాయిని లేపుచున్నారు.
ఆహారము సంపాదించుటకు పక్షులు లేచి కలకలాడుచున్నవి . ఆ పక్షులుకు నాయకుడైన గరుత్మంతునకు స్వామీ యగు శ్రీ మహా విష్ణువు ఆలయములో తెల్లని శంఖము సమయము అయినది అని పెద్ద శబ్దము చేయుచున్నది. ఆ ద్వని వినుటలేదా ! ఓ పిల్లా ! లే!. మేము ఎవరు లేపగా లేచామన్న అనో కలుగవచ్చు .పుతన స్తనములందుండు విషమునారగించినవాడును . అసిరావేశము గలిగి చంప నుద్యమించిన కృత్రిమ శకటమును కేలుడునట్లు, పాలకై ఏడ్చి కాలు చాచి పొడి పొడి యగునట్లు చేసినవాడును, క్షీర సాగరమును చల్లని మెత్తని సుకుమారమైన శేషశయ్యపై లోకరక్షచింతనతో యొగనిద్ర సమరియున్న జగత్కారణభుతుడగు ఆ సర్వెస్వరుని తమ హృదయముల పదిలపరచుక్ని మెల్లగా లేచ్చున్న మునులును యోగులను హరి -హరి -హరి అనుచున్నప్పుడు వెల్లిన పెద్ద శబ్ధము మా హృదయములలో చొచ్చి, చల్లబరచి , మమ్ములను మేల్కొల్పినది. నీవునూ లేచి రా .
అందరూ కలసి ఈ వ్రతము చేద్దమను కొని కలసి వెళ్ళి యమునా స్నానాలు చేసి ఈ వ్రతము చెయ్యాలను కున్నారు. దాని కి గాను అందరి నీ తెల్లవారుజామున నిద్రలేపుచున్నారు. వారి లో ముందుగా ఉత్తిష్టను లేపుచున్నారు.
శుక్రవారం, డిసెంబర్ 18, 2009
తిరుప్పావై ఐదవ పాశురం
ఆండాళ్ తిరువదిగల్ శరణం :
మన గోపికలు అందరు మన ఆండాళ్ గోపిక పిలుపు వినిఆమెని అనుసరించి ఒక చోట చేరారు . వారిలో కొందరు వేదాలు తెలిసినవారు . మరి కొందరు పురాణాలు తెలిసినవారు. మరి కొందరు నాట్య కళ తెలిసినవారు. . మరి కొందరు సంగీతము తెలిసినవారు. మరి కొంతమంది కి ధర్మ శాస్త్రము తెలుసు. అందులో కొంతమందికి చాలా డౌట్లు వచ్చాయి. వారు అంటారు. మనము జ్ఞానము లేనివారం కదా? మనము తెలిసి తెలియక చాలా పాపాలు చేసే వుంటాము కదా? మరి ఈ జన్మలో చేసిన పాపాలే కాకుండా ఎన్నో జన్మలనుమ్ది సంపాదించిన పాపాలు వుంటాయి కదా. మనకు మన పాపాలు తోలగానిదే మనకు కృష్ణ భాగవానిని కృప కలుగుతుందా. అని ప్రశ్నిం చుకొన్నారు .
ఒక్కొక్క గోపిక ఒక్కొక రకముగా మాట్లాడుతున్నారు.
మరి శాస్త్రము తెలిసిన గోపిక : "నిజమే మనము చేసిన పాపములు మనము అనుబవిమ్చినా తీరవు. ఈ పాపాలు తీరంది పరమాత్మను చేరలేము. లేక ఒక ఉపాయమున్నది మన పాపాలకు మనమే ప్రాయశ్చిత్తము చేసుకున్నా మనము పరమాత్మ వద్దకు చేరచ్చు. చాలా మంది ఋషులు తపస్సు లు పూజలు చేసి ఫలము అండలేక పోయారు. అందుకే " శ్రేయాంసి బహువిఘ్నాని " అని అన్నారు. కావున మన పాపాలు పోవుటకు మన గోదాచేప్పిన వ్రతమును అనుసరించుదాము.
పురాణాలు తెలిసిన మరో గోపిక రామాయణము గురించి వివరించింది . స్వయముగా భగవంతుడే కష్టాలు పడినాడు . మన లాంటివారికి మరి పాపాలు తొలగి వ్రతము సాగునా అని ప్రశ్నిం చింది .
లోకములో దైవము మానవ రూపమున శిష్ట రక్షణకు అనుభవించవలసి వచ్చినది. ఇది కేవలము దైవ లీలమాత్రమే.
ఈ వ్రతము వల్ల నిస్సంకోచముగా మన పాపాలు తొలగును . వేదంతము తెలిసిన గోపిక : మనము చేయు కర్మలు 2 అవి పుణ్యాలు , పాపాలు . పుణ్యము సుఖాన్ని , పాపము దుఖాన్ని ఇస్తాయి. మనము చేసే పుణ్యాలు పరమాత్మకు దగ్గరకు చేరుస్తాయి . వెనువెంటనే మన పాపాలు పోతాయి.
దూది పింజ నిప్పు తగిలినవెంతనే ఎలా బూడిద అవుతుందో అలాగే మన పాపాలు భగవంతుని దరి చేరగానే నసించుతాయి అని చెప్పింది. కావున ఈ వ్రతము మనకు మంచేచేయును అని వ్రతానికి ఉపక్రమించారు మన గోపికలు.
ఈ తిరుప్పావై లో గోదామాత వేదాల సారాన్ని వివరించింది.Pasuram05-HH.mp3
మాయనై మన్ను వడమదురై మైందనై
తూయ పెరునీర్ యమునైత్తుఱైవనై
ఆయర్ కులత్తినిల్ తోంఱుం అణి విళక్కై
తాయై క్కుడల్ విళక్కం శెయ్ద దామోదరనై
తూయోమాయ్ వందు నాం తూమలర్ తూవి త్తొళుదు
వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క
పోయ పిళైయుం పుగుదురువాన్ నిన్ఱనవుం
తీయనిల్ తూశాగుం శేప్పేలోర్ ఎమ్బావాయ్
తాత్పర్యము : ఆశ్చర్యమగు చేష్టలు కలిగిన వాడు, నిత్యము భగవద్ సంబందము గల ఉత్తర దేసమందలి మధురా నగరికి నిర్వాకుడును, పవిత్రమైన జలముగల యమునా నది రేవు తనకు గుర్తుగా కలవాడును, గోపవంసమున ప్రకాశించిన మంగళ దీపము అయిన వాడును, యశోదా మాత చె తాడు తో బంధింపబడిన శ్రీ కృష్ణునికి పవిత్రమైన పుష్పాలతో నమస్కరించి మనసారా కీర్తించి ధ్యానించి మన పూర్వ సంచిత పాపరాసియు . ఆగామి పాపరాసియు , అగ్నిలో పడిన దూది వలె భాస్మమైపోవును. కావున భగవానుని నామాలు పాడుడు.
మన పాపాలు తొలగుటకు ఎనిమిది పుష్పాలు అర్పించాలి అవి . 1 అహింస , 2 ఇంద్రియనిగ్రహము ,
౩ సర్వభూతదయ , 4 క్షమా , 5 జ్ఞానము , 6 తపస్సు , 7 సత్యము , 8 ధ్యానము
ఇవి విష్ణు ప్రీతి కరమైన పుష్పాలు . వీటి తో పూజించి మంచి పాటలతో కీర్తించిన భగవంతుని కృప పొందవచ్చు అని భావము.
గురువారం, డిసెంబర్ 17, 2009
తిరుప్పావై నాల్గవ పాశురం
ఆండాళ్ తిరువడిగలే శరణం :
గోపికలు తమ వ్రతముచే లోకమంతయు పాడిపంటల తో సమృద్దిగా వుండాలని కోరుకున్నారు. తన వ్రతముంకు స్నానము ప్రదానము కావున స్నానము చేయుటకు అనుగుణముగా జలమును సమృద్దిగా ఉండవలెను అని భావించి వారు ఉపాయము -ఫలమని అనుకోని వేరే వాటిని ఆశ్రయించక భక్తి తో భగవంతుని వినయ విదేయతలతో మెలిగి యున్నారు.
భగవంతుని మీద పాటలు పాడుట వల్ల రాక్షసులు పారిపోడురు. దేవతలు ఆశీ ర్వధించుదురు. శత్రువులు తోలగురు అని తెలుసుకొన్నారు గోపికలు.
ఎవరైతే నిస్వార్ధ బుద్ది కలిగి వుంటారో వారు ఉత్తములుగా బావింతురు.
అల్లాంటి ఉత్తముని పేరు పాడి వ్రతమునకు ఉపక్రమించారు మన గోపికలు.
వెనువెంటనే వారి కోరికలు నెరవేరుటకు వర్ష దేవత పశు సస్య సమృద్ధికి వర్శించుటకు వారి ఎదుట ప్రత్యక్షమైనాడు. ఆ దేవతకి గోపికలు ఈ విధముగా వర్షించాలో ఆఙాపించినారు .
వెనుకటి పాశురములో త్రివిక్రముని కీర్తించి పాడి పంటలు బాగా పండాలని కోరిరి. తరువాత జగత్తునంతకు నిర్వాహకుడు అయిన సూర్యుని ప్రార్ధించుధురు. వూర్యుని అనుగ్రహము వల్ల తాము సకల శుభములు అందవలెనని ఈ గోపికలు వర్ష దేవుని ఈ పాశురములో ప్రార్ధించుధురు.
వీరు మహా భక్థి తో భగవంతుని కారున్యజలమును పొంధి , భగత్కారుణ్య రస వృస్టిని లోకమంతమును పొదునట్లు కొరుకున్నారు.
ఆళి ఉళ్ పుక్కు ముగందు కొడార్ త్తేఱి
ఊళి ముదల్వన్ ఊరువం పోళ్ మెయ్ కఱుత్తు
పాళియన్ తోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్
ఆళిపొల్ మిన్ని వలమ్బురిపోల్ నిన్ఱదిరుందు
తాళాదే శారుంగం ఉదెత శరమళైపోల్
వాళ ఉలగినిల్ పెయ్దిడాయ్ నాంగళుమ్
మార్గళి నీరాడ మగిళుందేలోర్ ఎమ్బావాయ్
తాత్పర్యము:
గంభీర స్వభావుడా! వర్ష నిర్వాహకుడా! ఓ పర్జన్య దేవా! నీవు దాతృత్వములో చూపు ఔదర్యమును ఏ మార్తృమును సంకోచింపజేయుకుము.
గంభీరమగు సముద్రములో మద్యకు పోయి , ఆ సముద్రపు జలము నంతను నీవు పూర్తిగా త్రాగి గర్జించి ఆకాశమున వ్యాపించి సర్వ జగత్కారణ భూతుడగు శ్రీ మన్నారాయణుని దివ్య విగ్రహం వలె శ్యామల మూర్తివై ఆ పద్మనాభుని విశాల సుందర బాహుయుగళిలో దక్షిణ బాహువు నందలి చకృము వలె మెరసి ఎడమ చేతిలో శంఖము వలె ఉరిమి శారఙ్గమను ధనస్సు నుండి విడచి న బాణముల వర్షమా అనునట్లు లోకమంతము సుఖించునట్లు మేము సంతోషముతో మార్గశీర్ష స్నానము చేయునట్లు వర్షింపుము .
పర్జన్య దేవుని మన గోపికలు కోరుకుంటున్నరుఅని అర్ధము .
బుధవారం, డిసెంబర్ 16, 2009
తిరుప్పావై మూడవ పాశురం
మరి వ్రతనియమాలు తెలుసుకున్నారు కదా .....................
మరి ఆ వ్రతఫలితములు ఎలావుండాలనుకున్నరంటే ?
మూడవ పాశురములో వివరించారు.
పాశురం:
ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి
నాంగళ్ నం పావైక్కు చ్చాత్తి నీర్ ఆడినాల్
తీంగిన్ఱి నాడేల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు
ఓంగు పెఱుం జెన్నెలూడు కయల్ ఉగళ
పూంగువళై ప్పోదిల్ పోఱిపండు కణ్-పడుప్ప
తేంగాదే పుక్కిరుందు శీర్ త్త ములై పత్తి
వాంగ క్కుడం నిఱైక్కుం పళ్ళల్ పెరుం పశుక్కళ్
నీంగాద శెల్వం నిఱైందేలోర్ ఎమ్బావాయ్
తాత్పర్యము: బలిచక్రవర్తి ఇచ్చిన దానము నంది ఆకాసమువరకు పెరిగి మూడు లోకములను తన పాదములసు కొలిచిన పురుషోత్తముడగు పరందాముని దివ్యగానమును పాడి మేము మా వ్రతము అను మిషతో స్నానము చేయగానే దేశమంతయు నెలకు మూడు వానలు పడి ఈతి బాధలు లేక సుఖముగా ఉండవలెను. ఆకాశము వరకు పెరిగిన వరిచేలలో చేపలు త్రుళ్ళిపడుచుండగా, కలువపూలులో మనోహరములగు తుమ్మెదలు నిద్రపోతుండగా, సస్యములు సమ్రుద్దిగా ఉండవలెను. పాలు పితుకుటకు కొట్టములొ దూరి స్థిరముగా కూర్చొని పొదుగునంటగానే పాలు కుండలు నిండునట్లు చేపు సమౄద్దిగా గోవులకు ఉండవలెను. లేదు అనే శబ్ధము లేని సంపద దేశమంతా నిండవలెను.
అని మూడవ పాశురము అర్ధము . అయితే గోపికలు ఈ వ్రతము చేయుట వల్ల ఎటువంటి ఫలితాలు పొందుదురో తెలిపారు . ఈ రోజు మన అమ్మ (ఆండాళ్) శ్రీ పరందాముని వామన అవతారము ను కొలచింధి. ఆ పురుషోత్తముడు ఒకసారి చేపవలే , మరోసారి తాబేలుగా, మరొకమారు వరాహమూర్థిగా, ఇంకోసారి నరసిం హముగా , మరొకమారు పరిపూర్ణ మానవ మూర్థిగా అవతరించి మనలను నిరంతరమూ కాపాడుచున్నడు.
భగవంథుడు సర్వ వ్యాప్థి అని చెప్పుటకు ఈ విధముగా చెప్పినధి అమ్మ. భగవంతుడు ఎంతగా ఎదిగాడంటె బ్రహ్మ కడిగిన మొదటి పాదము , బలిచక్రవర్థి కడిగిన రెండో పాదము ఒకసారె చేరాయి . అంటె ఆయన సర్వ వ్యాప్తము అని తెలిసింధి. ఈ విధముగా వున్న స్వామి బలిచక్రవర్థి తలమీద ముడోపాదాన్ని మోపి బలికి రసా తలమును ప్రసాధించారు. ఇది అంతా నారాయణ తత్వముగా అమ్మ వివరించింధి.
లోకము సుఖముగా వుండుటకు ఈ వ్రతము మంచిదని వివరించింధి. మూడు కాలాలు వానలు కురిసి పంటలు బాగాపండి . గోవులు పాలు చెపుముట్టుకొనగానే పాలతో కుండలు నిండిపోవాలని . మన దేశము సస్య స్యామలముగా వుండాలని గోపికలతో వివరించింధి.
గోపికలు ఏకొరికా లేక దేశము సౌభాగ్యము వంకతో ఈ వ్రతముతో శ్రీ కృష్ణుని సేవ చెసుకొని వారి జీవితము దన్యత
చే కూర్చుకోవలె అని ఫలము కోరుతూ ఈ వ్రతము చెయుటకు నిర్నయించుకొనిరి .
ఈ పాశురములో చెప్పిధి ఎమిటంటే ఈ వ్రతము చెయుట వలన బాహ్యముగా సస్య సమృద్ధి ని కలిగించును. అంతరంగమున ఆత్మ ఙాన పరిపూర్తిని ఆచార్య సమృద్ధిని ప్రసాధించును.