Blogger Widgets

ఆదివారం, ఫిబ్రవరి 28, 2010

Holi hai

ఆదివారం, ఫిబ్రవరి 28, 2010

హాయ్ !అందరి కి హొలీ పండగ శుభాకాక్షలు . మరి హొలీ గురించి మనమ్తెలుసుకుందామా.నేను నిన్న అమ్మని అడిగితెలుసుకున్నాను.  ఆవిషయాలే మీకు చెప్తాను. పండగ జరుపుకునే ముందు దానిప్రాముక్యత తెలుసుకుంటే చాలాబాగా జరుపుకోవచ్చుకదా. ఏమంటారు. 
హోలీ అంటే రంగులు పండగ .వసంతకాలంలో వచ్చేపండుగా.ఈ పండుగను వసంతోత్సవంగా జరుపుకుంటారు.ఈ పండుగను 16 రోజులు జరుపుకుంటారు.  ఈ పండుగను శ్రీ కృష్ణుని పండుగగా
జరుపుకుంటారు.మధురలో చాలాబాగాజరుపుతారుట. 
దుల్‌‌‌హేతి , ధులండి మరియు ధులెండి అని కూడా పిలిచే ముఖ్యమైన రోజు హోలీ ఉత్సవ రోజున, ప్రజలు రంగుల పొడిని మరియు రంగు నీళ్ళను
 ఒకరిపై ఒకరు జల్లుకుంటూ ఘనంగా జరుపుకుంటారు.ముందు రోజున హిరణ్యకశ్యపుని చెల్లెలైన 
హోలిక అనే రాక్షసి బొమ్మకు నిప్పంటిస్తారు. దీనిని హోలిక దహన్ (హోలికనుకాల్చడం) లేదా చోటీ హోలీ (చిన్న హోలీ) అని అంటారు. హిరణ్యకశ్యపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసిప్రహ్లాదుడిని మంటలలో వేసినప్పుడు దైవలీలతో తప్పించుకుంటాడు అందుకే భోగి మంటలు అంటిస్తారు. హోలిక ఈ మంటలలో దహనమయ్యింది కానీ విష్ణువుకు పరమ భక్తుడైన ప్రహ్లాదుడు, అతని అపార భక్తితో ఎటువంటి గాయాలు లేకుండా తప్పించుకుంటాడు. ఆంధ్రప్రదేశ్‌లో హోలిక దహన్‌ను కామ దహనం అని అంటారు.
ఈ పండుగను భగవంతుడైన కృష్ణుడి పెరిగిన ప్రాంతాలైన మథురా మరియు వృందావనంలలో 16 రోజులపాటు ఘనంగా జరుపుకొంటారు (ప్రతి సంవత్సరం రంగపంచమి రోజున భగవంతుడైన కృష్ణుడికి రాధపై ఉన్న ప్రేమను కొనియాడతారు). భగవంతుడైన కృష్ణుడు గోపికలతో తన కుచేష్టల ద్వారా ఈ పండుగ ప్రసిద్ధికెక్కేలా చేశాడని నమ్ముతారు. కృష్ణుడు తన తల్లితో అతని యొక్క నల్లని శరీర రంగు మరియు రాధ యొక్క (శక్తి లేదా ప్రపంచాన్ని నడిపే బలం) శరీర రంగు మధ్య వ్యత్యాసం గురించి ఫిర్యాదు చేశాడని నమ్ముతారు. కృష్ణుడి తల్లి రాధ యొక్క ముఖానికి రంగు పూయాలని నిర్ణయించుకుంది. అధికారికంగా ఈ ఉత్సవాలు వసంత ఋతువులో అంటే ప్రేమ వికసించే మాసంలో జరుపుకుంటారు.
హోలీ పుట్టుక వివరాల గురించి వేరొక కథ ఉంది. ఈ కథ ప్రేమ దేవుడైన కామదేవుడు గురించి తెలుపుతుంది.పార్వతి శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి సహాయంగా శివునితపస్సును భంగ పరచడానికి అతనిపై పూల బాణం వదిలిన కామదేవుని శరీరాన్ని శివుడు నాశనం చేసాడు. తరువాత శివుడు, తన త్రినేత్రాన్ని తెరిచి, కామదేవుని శరీరాన్ని బూడిద చేశాడు.కామదేవుని యొక్క భార్య రతి కోరిక మేరకు శివుడు కామదేవుడిని మరలా బ్రతికిస్తాడు కానీ భౌతిక కామం కంటే నిజమైన ఉద్రేక పూరిత ప్రేమ ఆధ్యాత్మికతను తెలియజేసే మానసిక ప్రతిరూపంగా మాత్రమే బ్రతికిస్తాడు. ఈ సంఘటన వలన హోలీ రోజున భోగి మంటలు వేసి ఘనంగా జరుపుకొంటారు.
హోలీ పండుగకు సంవత్సరం పొడవునా ఆచారాలు ఉంటాయి, మొదటగా రంగు పొడిని ఒకరికొకరు పూసుకుంటారు మరియు పొడవైన చిమ్మే గొట్టాలు లేదా చిమ్మే తుపాకుల నుండి రంగు నీటిని జల్లుకుంటారు. ఈ పండుగను చాలా రోజుల ముందుగానే 'హోలీ మిలన్' లేదా బైతక్స్ ద్వారా జరుపుకొన్నారు, సంగీత కచేరీల ద్వారా అనగా పండుగకు సంబంధించిన పాటలను మరియు రాధా మరియు కృష్ణ పురాణ ప్రేమ కథ గురించి పాటలు పాడేవారు; ముఖ్యంగా జానపద పాటలు అనగా "హోరి" పాటలను పాడేవారు. కొన్ని సంప్రదాయక జానపద పాటలు ఆజ్ బిరాజ్ మే హోలీ రే రాసియా కొన్ని తరాల నుండి ఇప్పటి వరకు కూడా ఉన్నాయి.

వసంత కాలంలో వాతవరణములో మార్పూలు జరగటం వల్ల వైరల్ జ్వరం మరియు జలుబు వస్తాయని ప్రజలు విశ్వసిస్తారు.అందుకని, సహజమైన రంగు పొడులను చల్లుకోవడం వల్ల ఔషధముగా పనిచేస్తుందని అర్థం: సంప్రదాయముగా రంగులను నిమ్మ, కుంకుమపసుపుబిల్వ లను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వన మూలికలను తయారు చేస్తారు.
అయితే ఇప్పుడు రంగులు కేమికాల్స్ వాడి తయారు చేస్తున్నారు. అయితే అవి ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. కళ్ళకి తాత్కాలికమైన గుడ్డితనాన్ని ఇస్తాయి , చర్మవ్యాధులు వస్తాయి.రంగుపోడులు వాడటంవల్ల ఆస్తమ వంటి వ్యాదులు వస్తాయి. కావున కృత్రిమమైన రంగులు వాడకుండా. మనైమ్తిలోనే తయారుచేసుకున్న రంగులు వాడితే మంచిది.

దానివల్ల మనకి మన చుట్టూ ఉండేవారికి  వారికి మంచిది కుడా.  వాతావరణం కుడా బాగుంటుంది. పండగని సంతోషంగా ఆనందంగా జరుపుకుందాం. okey నా మరి.

I wish you all happy holi .  
మరి మా అమ్మకు  నచ్చిన హొలీ  Shayari    మీకోసం .
Holi aaye holi aaye
Rang birangi holi aaye
Tarah tarah k rangoo se rangne
dekho phir se holi aaye ..

Lal, gulal, hara, nila
Har dukaan pe hai rangoo ka mela
Main to laal rang leke
tumare gaalon ko rang lagane chala.....

Holi to bas ek bahana hai rangoo ka
Ye tyohaar to hai aapas main
Dosti or Pyar badhane ka,
chalo sare gile sikwe dooe kar ke
ek dusre ko khub rang lagate hain.
milkar holi manate hain......


Holi ka rang to dhul jayega
dosti or pyar ka rang na dhul payega
Yehi to aasli rang hai zindegi ke
Jitna ranglo utna gehera hota jayega.

i wish u a verry happy holi 

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)