ఈరోజు పరశురాముడు జయంతి.
జమదగ్ని ,రేణుకాదేవి ల చివరి కొడుకు పరశురాముడు. జమదగ్ని చాలా కోపం గలవాడు. అతని భార్య రేణుక తనపతిభక్తితో రోజు నదికి వెళ్ళి తనే స్వయంగా మట్టి కుండచేసి ఇంటికి నీళ్ళుతెచ్చేది. ఒకరోజు రేణుకాదేవి చిత్రరధుడనే రాజును చూసింది. ఆరోజు ఆమె నీళ్ళుతేవటానికి కుండ తయారు చేసినా కుండ తయారుకాలేదు. నీళ్ళు తేలేకపోయింది. ఏమి జరిగింది అని దివ్యదృష్టితోచూడగా రేణుక చిత్రరధుని చూడటంవల్లే పాత్రతయారుకాలేదని గ్రహించి తనపుతృలును పిలిచి తల్లిని నరకమన్నాడు. వారందరు తమవల్లకాదన్నారు. అప్పుడు చివరి కొడుకు పరశురాముడు సరే అని తన తల్లిని నరికి వేశాడు. తండ్రి చెప్పిన మాట చేసినందుకు ఒకకోరిక కోరమనగా తనతల్లిని తిరిగి బ్రతికించమన్నాడు పరశురాముడు. తండ్రిమాట జవదాటని కొడుకు.పరశురాముడు. తనతల్లికి ఆ గతిపట్టించింది రాజులు కావున పరశురాముడు రాజులుమీదకోపం పెంచుకొని వారిని నాశనంచేయటం మొదలుపెట్టాడు. పరశురాముని పేరు భార్గవరాముడు. (పరశు= గొడ్డలి ) పరశుతో రాజులు ను నరకుతున్నాడుకావునా పరశు రాముడు అని పేరు వచ్చింది. అప్పట్లో పరశురాముడునుండి రక్షించుకోవటానికి రాజులు అందరు చేతులుకు గాజులు వేసుకొని దాచుకునేవారు.కొందరు గొప్పరాజుల్ పుత్రులును భూదేవి తనలో దాచుకొని రక్షించింది. పరశురాముడు విష్ణువు దశావతారాలలో ఒక అవతారం.
హాయ్ వైష్ణవీ!! నీవే వ్రాస్తున్నావా? శుభాకాంక్షలు. అభినందనలు.
రిప్లయితొలగించండిహాయ్ డియర్, నువ్వు చాలా స్వీట్ గా వున్నావు. నువ్వు చెప్పిన కధ నాకు నిజంగా ఇప్పటివరకు తెలీదు. ఇంకా బోల్డన్ని కధలు చెప్తావని ఎదురుచూస్తున్న.
రిప్లయితొలగించండి