Blogger Widgets

ఆదివారం, మే 16, 2010

లక్ష్మీ కటాక్ష రహస్యం

ఆదివారం, మే 16, 2010

ఈరోజు అక్షయతృతియ చాలామంది బంగారం కొనుక్కొని దేవుని దగ్గర పెట్టి పూజ చేస్తారు. ఈరోజు బంగారం కొంటే మంచిది అంటారు. అందరు కోరుకునే లక్ష్మి కొందరి దగ్గర ఎక్కువగా వుంటుంది. మరికొందరికి చేతికి దక్కినట్టే దక్కి జారిపోతుంది. అసలా ఎందుకు జరుగుతోంది దానికి కారణం ఏమిటి?
శ్రీ మహాలక్ష్మి చూపులు ఎలావుంటాయంటే , దుర్మార్గుల విషయంలో అవి పరమ క్రూరంగా ఉంటాయట. అవే చూపులు తన భక్తులైన దీనులపై దయను కురిపిస్తాయట . దారిద్ర్యమనే అరణ్యాన్ని ఇట్టే దహించివేసి ఏంటో ఉదారంగా సంపదను అనుగాహిస్తాయట . ఓ తల్లీ, అలాంటి నీ చల్లనిచుపులతో నా దురద్రుస్టాన్ని పోగుట్టు అని ప్రార్ధిస్తాడు జగన్నాధ పండితరాయలు తన `లక్ష్మి కరునాలహరి'లోఅన్నారట.

 అసలు దీపమే లక్ష్మి. చీకటినుంచి వెలుగులోకి ప్రయాణించడమే జ్ఞానం , అదే సంపద, జ్ఞానము సంపదా బిన్నమైనవి కావు. ఒకటి వుంటే రెండోది ఉన్నట్టే. ఇతరులను వంచించినచో, అవినీతి మార్గాలలోనో ఐశ్వర్యాన్ని సంపాదిస్తే చాలను కుంటారు చాలామంది. అలాంటివారిని లక్ష్మి వరిమ్చిన్నట్టు కనిపించినా అది చంచలం . దయా, సేవాబావం, శ్రమ, వినయం, వివేకం ఉన్నచ్తే లక్ష్మి స్థిరంగా ఉంటంది. లక్ష్మీ కతాక్షసిద్ధిలోని అసలు రహస్యం ఇదే. లక్ష్మీదేవి-----ఆదిలక్ష్మీ, దైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి విద్యాలక్ష్మి, ధనలక్ష్మి అనే అష్టరుపాలలో ఉంటుందని మనకు తెలుసు. వీటిలో `విద్యాలక్ష్మి' అంటే, జ్ఞానం వివేకం వంటి సద్గునసంపద అని కుడా అర్ధం చేసుకోవాలి. అటువంటి లక్ష్మితత్వాన్ని
అందరుసంపాదించాలి.మంచి మనసే లక్ష్మికి సేఫ్టీ లాకరు ! .


లక్ష్మి ఎక్కడవుంతుందని నారదుడు శ్రీ మహావిష్ణువుని అడుగగా.......
శ్రీ మహావిష్ణువు లక్ష్మి దేవి ఎక్కడెక్కడ ఉంటుందో చెప్పారు అవి ఏమిటంటే ..........


`అఖిల విశ్వం సమస్త ప్రాణులు నా అదీనంలో ఉంటే , నీనేమో నా భక్తుల అదీనంలో ఉంటాను . మీరు నా భక్తులు, కనుక మీకు పరమైస్వర్యాన్ని అందించే ఆచల లక్ష్మిని ప్రసాదిస్తాను. అయితే దానికి ముందు నేను చెప్పబోయే మాటలు వినండి - అం.......... లక్ష్మి ఎవరెవరివద్ద ఉంటుందో, ఎవరివద్దవుండదో , వివరించాడు. లక్ష్మిని కోరుకునే వారందరూ తప్పకుండా దృష్టిలో ఉంచుకోవలసిన విషయాలివి.
భగవద్భాక్తులపై కోపగించే వారి గృహంలో లక్ష్మిదేవే కాదు.శ్రీ హరి కుడా ఉండదు. శంఖద్వని వినిపించని చోటా, తులసిని పూజించని చోట, శంఖరుని అర్చించని చోట , బ్రహ్మవేత్తలకు , అతిధులకు భోజనసత్కారాలు జరగని చోట , లక్ష్మి నివసించదు. ఇల్లు కలకలాడుతు లేని చోట , ఇల్లాలు ఎల్లవేళలా కంటతడి పెట్టిన చోట , విష్ణువును ఆరాధించకుండా ఏకాదశి , జన్మాష్టమి రోజులలో భోజనం చేసేవారి ఇంట లక్ష్మి నివసించదు.

హృదయోమ్లో పవిత్రత లోపించినా, ఇతరులను హింసింస్తున్నా. ఉత్తములను నిమ్దిస్తున్నా లక్ష్మి ఆ ఇంటిలోనుంచి పారిపోతుంది. అనవసరం గా గడ్డిపరకలను తెమ్చినా, చెట్లను కొట్టినా లక్ష్మి కటాక్షం లోపిస్తుంది. నిరాసావాధులను, సుర్యోదయ సమయంలో భోజనం చేసే వాని, తడి పాదాలతో నిద్రపోయేవారిని , వివస్త్రులై నిద్రపోయేవారిని, తలక్రిందులు గా మాట్లాడేవారిని, తమ తలకు రాసుకున్న నూనెనుఇతరులకు అంటించే వారిని కుడా లక్ష్మి వరించదు..
శ్రీ హరి దివ్యచరిత్ర, గుణ గానం జరిగే చోట, సాలగ్రామం, తులసి, శంఖద్వని ఉన్నచోట , లక్ష్మి వోరాజిల్లుతుంది.
ఇలా శ్రీ హరి లక్ష్మీకటాక్షం ఎలా కలుగుతుందో, ఎలాకలగాదో చెప్పారు.
సంపద మన ఆదీనం లో ఉండాలి కాని, మనం సంపద ఆదీనం లో ఉండకుడదు . ఏకాస్త గర్వించిన, అహంకరిమ్చినా ఐశ్వర్యం జారిపోతుంది. సద్వినియోగమే సంపద పరమార్ధము. అది విస్మరించినా లక్ష్మి వీడిపోతుంది. ఇదే లక్ష్మి కటాక్ష రహస్యం.....

1 కామెంట్‌:

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)