శుక్రవారం, డిసెంబర్ 17, 2010
dharma-kshetre kuru-kshetre samaveta yuyutsavah
mamakah pandavas caiva kim akurvata sanjaya
ధృతరాష్ట్ర ఉవాచ:
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః |
మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ||
Dhritarashtra said: O Sanjaya, assembled at the holy-field and place of pilgrimage of Kurukshetra, raring to fight, what did my sons and the sons of Pandu do?
ధృతరాష్ట్రుడు పలికెను: ఓ సంజయా! ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు నా తనయులూ మరియు పాండురాజు తనయులు యుద్దము చేయగొరువారై సమకూడిన పిమ్మట ఏమి చేసిరి?
అన్న శ్లోకం తో భగవద్ గీత ప్రారంభం అయ్యింది. మొత్తం గీతలో దృతరాష్ట్రుడు ఒక్క శ్లోకం మాత్రమె చెప్తాడు.
అప్పుడు సంజయుడు |
drishtva tu pandavanikam vyudham duryodhanas tadaacaryam upasangamya raja vacanam abravit
Sanjaya said: O Dhrtarastra! After seeing the army of the Pandavas arranged in a military array, overwhelmed King Duryodhana went to Dronacharya and spoke these words:
దృష్ట్వా తు పాణ్ణవానీకం వూఢం దుర్యోధనస్తదా |
ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ || |
సంజయుడు పలికెను: ఓ రాజా! పాండవులచే వ్యూహముగా ఏర్పాటు చేయబడిన సైన్యమును గాంచి దుర్యోధనుడు తన గురువు చెంతకు చేరి ఇట్లు పలికెను. |
అని సంజయుని మొదటి శ్లోకం.
అసలు గీత జననం శ్రీ క్రిష్నులవారు అర్జునునికి అమవాస్యరోజు చెప్పారు అది పదకొండు రోజులు తరువాత ఏకాదశి రోజు బయటికి వచ్చింది అదే మనం అందరం గీతాజయంతిగా జరుపుకుంటున్నాం.
మహా భారతం లో భీష్మ పర్వంలో గీత సంపూర్తి అయిన పిదప గీతా శ్లోక సంక్య ను గురించి వివరించారు.
శ్లోకం: షట్సాతాని సవింశాని శ్లోకానాం ప్రాహ కేశవః
అర్జునః సప్తపంచాసత్ సప్తషష్టిం చ సంజయః
దృతరాష్ట్రః శ్లోకం మేకం గీతాయా మానముచ్యతే
తాత్పర్యం: గీతయందు శ్రీ కృష్ణముర్తి 620 శ్లోకంలను, అర్జునుడు 57 శ్లోకాలను, సంజయుడు 67 శ్లోకాలను, |
ధృతరాష్ట్రుడు 1 శ్లోకం చెప్పిరి. మొత్తం మీద ౭౪౫ శ్లోకాలు అని తెలుస్తోంది.
మనం కృతజ్ఞ్యతలు తెలుపుకోవాలి ఎవరెవరికి అంటే గీత ను భోధించిన కృష్ణులవారికి గీత కు నిమితమాత్రుడైన అర్జునుడికి గీత ను చందోబద్దంగా మనకు అందించిన వ్యాసునికి గీత ను రాసిన శ్రీ విఘ్నేసునకు గీత ను ఓమ్ ప్రధంగా ప్రచారం చేసిన సంజయునికి గీత యొక్క తాళ పత్రాలను కాలగర్భములో కలవకుండా కాపాడిన పుణ్యాత్ములకు గీత యొక్క చిన్న చిన్న భావాలను మనకు అర్ధం అయ్యేలా చెప్పిన భాష్యకారులకు గీత ని ఇంటి ఇంటికి ప్రచారం చేసిన, మరియు చేస్తున్న గీతా ప్రచారులకు మన లోకం అంతా కృతజ్నతలుతో వుండాలి . The Gita is the most beautiful and the only truly philosophical song. It contains sublime lessons on wisdom and philosophy. It is the “Song Celestial”. It is the universal gospel. It contains the message of life that appeals to all, irrespective of race, creed, age or religion. |
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.