ఈ పొడుపు కధలకు జవాబులు మీకు తెలుసా అయితే చెప్పండి.
అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు
కొమ్మకోమ్మకి కోటి పూలు
అన్ని పూలకు రెండే కాయలు
ఏమిటవి చెప్పుకోండి చూద్దాం.
[జ] ఆకాశం, చుక్కలు, సూర్యడు, చంద్రుడు
అమ్మ కడుపున పడ్డాను
అంతా సుఖాన వున్నాను
నీచేదేబ్బలు తిన్నాను
నిలువునా ఎండిపోయాను
నిప్పుల గుండు తొక్కాను
గుప్పెడు బూడిదను అయినాను
అయితే నేను ఎవరు మరి?
[జ]పిడక
చూపులేని కన్ను సుందరమైన కన్ను
తోటలేని కన్ను తోట కన్ను
కన్ను కాని కన్ను కాలకంఠుని కన్ను
నా కన్ను కాదు మరి ఎవరి కన్ను?
[జ] నెమలి కన్ను
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.