Blogger Widgets

శనివారం, మార్చి 23, 2013

గొప్ప భారతీయుడిగా భగత్ సింగ్

శనివారం, మార్చి 23, 2013

1931 మార్చి నెల 23వ తేదీ. ఈ రోజునే భగత్ సింగ్ ను ఉరితీశారు. భారత స్వాతంత్ర్యోద్యమంలో కృషి చేసిన భగత్ సింగ్,రాజ్‌గురు మరియు సుఖ్‌దేవ్ లు ఉరి తీయబడ్డారు. అంతకు ముందు జైల్ సూపరింటెండెంట్ ఉరి ఉత్తర్వును అధికారికంగా విడుదలచేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నది అదే. ఉరితీశాక ఓ గంటసేపు శరీరం గాలిలోనే తేలియాడుతూ ఉండాలని కూడా ఈ ఉత్తర్వుద్వారా ఆదేశించారు. భగత్ సింగ్ మరణించారని వైద్యాధికారి ధ్రువీకరించేవరకు శరీరాన్ని కిందకు దింపకూడదు. ఇదంతా కచ్చితంగా అమలవ్వాలన్నదే జైలు అధికారి ఉత్తర్వులోని సారాంశం.   దేశం కోసం భగత్ సింగ్ అలా ప్రాణత్యాగం చేశారు.  

నేటికీ భారత యువత భగత్ సింగ్ నుండీ ఎంతో స్పూర్తిని పొందుతున్నారు.  ఇండియాటుడే 2008లో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం అత్యంత గొప్ప భారతీయుడిగా భగత్ సింగ్ ఎన్నుకోబడ్డాడు. పోటీలో సుభాష్ చంద్రబోస్ ఇంకా గాంధీ వెనుకంజలో ఉండిపోయారు.శతజయంతి సందర్భంలో మేధావుల ఒక సమూహం భగత్ సింగ్ సంస్థాన్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి భగత్ సింగ్ ఆలోచనలను ఇంకా ఆదర్శాలను అమలు చేయటానికి కృషి చేసింది. 2001 మార్చ్ 23న పార్లమెంటులో భగత్ సింగ్ కు నివాళులర్పించారు.2005 లో కూడా ఈ సంప్రదాయాన్ని పాటించారు.పాకిస్తాన్ లోని లాహోర్ లో భగత్ సింగ్ ను ఉరి తీసిన షద్మన్ చౌక్ ను భగత్ సింగ్ చౌక్ గా పేరు మార్చాలని భగత్ సింగ్ ఫౌండేషన్ ఆఫ్ పాకిస్తాన్ అభ్యర్థన చేసింది, న్యాయపరమయిన సమస్యల వల్ల ఇది ఇంకా అమలు కాలేదు.  ఇంత గొప్ప స్వాతంత్ర్య సమరయోదులకు   మన బ్లాగ్ ద్వారా నివాల్లు అర్పిస్తున్నాను.

1 కామెంట్‌:

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)