Blogger Widgets

ఆదివారం, మార్చి 24, 2013

ముత్తుస్వామి దీక్షితులు

ఆదివారం, మార్చి 24, 2013

అత్యద్భుతమైన కృతులను రచించిన ముత్తుస్వామి దీక్షితులు సంగీతత్రయంలోత్యాగరాజు తర్వాత రెండవవారిగా పరిగణింపబడతారు. ముత్తుస్వామి దీక్షితర్ కర్ణాటక సంగీతత్రయంలో ఒకరైన వాగ్గేయకారుడు . 
వాతాపి గణపతిం భజే అన్న కీర్తన విననివారుండరంటే అది అతిశయోక్తి కాదేమో. అది ఆయన రచించినదే. రామ స్వామి దీక్షితర్, సుబ్బలక్ష్మి అంబాళ్ పుణ్యదంపతుల సంతానంగా 1775లో పుట్టాడు. నేడే ముత్తుస్వామి దీక్షితులు వారి జయంతి.  
ఈయన భక్తిశ్రద్ధలుగల వ్యక్తి గుణగణాలను తన బాల్యంలోనే ఇతడు ప్రదర్శించాడు. సంగీతంపై వెలువడిన "వెంకటాముఖి" సుప్రసిద్ధ గ్రంధం "చతుర్‌దండి ప్రకాశికై"ను అధ్యయనం చేశాడు. కావలసినమేరకు మన ధర్మ గ్రంధాల పరమైన జ్ఞానాన్ని కూడా సంపాదించగలిగాడు.రామస్వామి దీక్షితులు వీరి తండ్రి. వీరు సంగీత, వ్యాకరణ, జ్యోతిష, వాస్తు, మాంత్రిక, వైద్య విద్యలలో ఆరితేరిన వ్యక్తి. గురుగుహ ముద్రతో వున్న వీరి కృతులన్నీ సంస్కృతంలోనే వున్నవి. హిందూస్థానీ సంగీతంనుండి వీరు కర్ణాటక సంప్రదాయానికి వీరు తెచ్చిన రాగాలు సారంగద్విజావంతిమొదలైనవి. వీరు అనేక క్షేత్రములు తిరిగి ఆయా ప్రదేశములలో వున్నట్టి దేవస్థానములను సందర్శించి దేవతలపై కృతులు జేసారు. ఆయన రచించిన కృతులలోకమలాంబా నవావర్ణ కృతులునవగ్రహ కీర్తనలు ప్రత్యేక స్థానాన్ని కలిగి వున్నాయి. వీరి యితర ప్రముఖ రచనలు: వాతాపి గణపతిం భజే, మహా గణపతిం, శ్రీనాథాది గురుగుహో, అక్షయలింగ విభో, బాలగోపాల, అఖిలాండేశ్వరి, రామచంద్రం భావయామి, చేత: శ్రీబాలకృష్ణం, శ్రీ వరలక్ష్మి, సిద్ధి వినాయకం, త్యాగరాజ యోగవైభవం, హిరణ్మయీం, అన్నపూర్ణే, అరుణాచలనాథం, ఆనందామృతకర్షిణి, మామవ మీనాక్షి, మీనాక్షి మే ముదం దేహి, నీలకంఠం భజే, స్వామినాథ, శ్రీ సుబ్రహ్మణ్యాయ, పరిమళ రంగనాథం, మొదలైనవి.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)