అనగనగా ఒకసారి ఒక బ్రాహ్మణుడు యజ్ఞము చెయ్యాలని అనుకుని ధర్మరాజు ను సహాయం అడిగాడు. ధర్మరాజు ఆ బ్రాహ్మణుని మరుసటి రోజు రమ్మన్ని పంపివేసాడు. ధర్మరాజు మాటలును విన్న భీముడు నగరమంతా తోరణాలు కట్టించి అలంకరించి , గొప్పగా పండుగ చెయ్యాలని తన పరివారమునకు ఆనతిని ఇచ్చాడు.
ధర్మరాజు భీమసేనునితో "భీమా ! ఈ రోజు ఏమి విశేషము ? ఈ ఏర్పాటులు అన్నీ దేని గురించి?" అని అడిగాడు.
దానికి భీముడు, " అన్నా! మీరు రేపటివరకు జీవించి ఉంఢగలననీ , మీ మాటను మీ మాటను నేరవేర్చుకోగాలరని దృఢ నమ్మకం వున్నది. మీరు ఆడిన మాటను తప్పరని నాకు తెలుసు. ఈ ప్రపంచములో రేపటివరకు జీవించి వుండగలను అన్నా ధీమాగా చెప్పగల వ్యక్తి మీరు తప్ప ఎవరు ఉండగలరు? అందుకనే ఈ పండుగ జరుపుకోదలిచాను. " అని సమాధానము ఇచ్చాడు భీముడు.
ధర్మరాజు తన తమ్ముడు ఇంత సుక్షంగా తన కర్తవ్యమును గుర్తు చేసాడని ఆనందించాడు. ఏ మంచి కార్యమును తలపెట్టిన వెంటనే చెయ్యాలి. ఆలస్యము చేయకూడదు.
గతించిన కాలము మనది కాదు. రేపు మనచేతిలో లేదు. వర్తమానంలో జీవించాలి.
అమ్మమ్మ చెప్పింది tomorrow is too late అని. మీరు కూడా గుర్తు పెట్టుకొండి ఈవిషయాన్ని అనుకున్న పని వెంటనే చేసేయండి. మీకు డౌట్ వుంది కదా ఇంతకీ నా వర్క్ కంప్లీట్ అయ్యిందో లేదో అని నా వర్క్ కంప్లీట్ చేసేసి ఈ స్టొరీ మీకు కూడా షేర్ చేస్తున్నా. వర్క్ కంప్లీట్ అయ్యింది కానీ అంతకు ముందు చాలా టెన్షన్ పడ్డాను కదా . అలా అంత టెన్షన్ పడకుండా అనుకున్న పని వెంటనే చెయ్యాలి అని తెలుసుకున్నాను.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.