Blogger Widgets

సోమవారం, జనవరి 24, 2022

కోవిడ్ కరోనా వచ్చినప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలి. తీసుకోవలసిన జాగ్రత్...

సోమవారం, జనవరి 24, 2022

గురువారం, జనవరి 20, 2022

CGMS help you manage Type 1 or Type 2 diabetes with fewer fingerstick t...

గురువారం, జనవరి 20, 2022

CGMS help you manage Type 1 or Type 2 diabetes with fewer fingerstick tests.

ఆదివారం, జనవరి 16, 2022

భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. పండగ దాని పరమార్థం .....(Happy pon...

ఆదివారం, జనవరి 16, 2022

నమస్కారమండి, అమ్మమ్మ తో నేను చానల్ కి స్వాగతం. భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. పండగ దాని పరమార్థం నేను అమ్మమ్మ ఈ వీడియో లు చేయటానికి చాలా కష్టపడుతున్నాము. మీకు కనకా మా వీడియోలు నచ్చినట్టు అయితే మా చానల్ ని సబ్క్రైబ్ చేయండి. మమ్మల్ని ప్రోత్సహింస్తున్నందుకు మీఅందరికీ మా ధన్యవాధములు.

గురువారం, జనవరి 13, 2022

శుభమగుగాత! సుఖమగుగాత! (వఙ్గక్కడల్ కడైంద మాదవనై క్కేశవనై)

గురువారం, జనవరి 13, 2022

ఈ నెల రోజులు ధనుర్మాస వ్రతం బాగా చేసుకున్నాము కదా ఈ రోజు ఆఖరి  పాసురము.  ఈ వ్రతము సర్వఫలముల నొసంగు నది. అందరు ఆచరించదగినది. ఇట్టి ఈ వ్రతము నాచరింపలేక పొయినను నిత్యము ఈ ముప్పై పాశురములు తప్పక అభ్యాసము చెయువారికి కూడా తాను చేసిన వ్రత ఫలము లభించాలని గొదాదెవి ఈ పాసురములొ ఆశించినది నిత్యము ముప్పై పాసురాలు చదువుటయే ముక్తికి హేతువు . ఈ లోకమున ఐశ్వర్యప్రధము అగు ఇట్టి వ్రతమును తప్పక అందరు ఆచరించి తరింతురుగాక.
గోదాదేవి తాను గోపికగనే వ్రతమునుచెసినది. ఫలము భగవత్ప్రాప్తి , అట్టి భగవానుడే పొదుటకై చేసినయత్నము పాల సముద్రమును ఆనాడు మధించుటలో కాననగును. మనము స్వామిని పొందవలెనని ప్రయత్నము చే
యుటకంటె స్వామియే మనము పొందుటకు ప్రయత్నము చేయునట్లు ఆనాటి అమౄతమధన వృతాంతము నిందు కీర్తించుచున్నారు. ఈ ముప్పై పాశురములు పఠించిన వారికి ఆనాడు పాలసముద్రమును మధింపచెసిన లక్ష్మి ని పొందినట్లు సర్వేశ్వరుడు తనంత తానే ప్రయత్నంచి పొందును. ఇల్లా ఫలశ్రుతిని ఈ పాశురములో చేయుబడుచున్నది.

 వఙ్గక్కడల్ కడైంద మాదవనై క్కేశవనై పాశురము: 

వఙ్గక్కడల్ కడైంద మాదవనై క్కేశవనై
త్తిఙ్గళ్ తిరుముగత్తు చ్చేయిళైయార్ శెన్ఱిఱైఞ్జ్
అఙ్గప్పఱైకొణ్డవాత్తై , యణిపుదువై
పైఙ్గమలత్తణ్డెరియల్ పట్టర్ పిరాన్ కోదైశొన్న
శఙ్గత్తమిళ్ మాలై పుప్పదుం తప్పమే
ఇఙ్గిప్పరిశురై ప్పారీరిరణ్డు మాల్వరైత్తోళ్
శెఙ్గణ్ తిరుముగత్తుచ్చెల్వత్తిరుమాలాల్
ఎఙ్గుం తిరువరుళ్ పెత్తంబురువ రెంబావయ్.

తాత్పర్యము:
ఓడలతో నిండియున్న క్షీరసముద్రమును మధింపచేసిన లక్ష్మీ దేవిని పొం మాధవుడైన వానిని, బ్రహ్మరుద్రులకు కుడా నిర్వాహకుడైన వానిని ఆనాడు వ్రేపల్లెలో చంద్రముఖులగువారును, విలక్ష్నణాభరణములు దాలిచిన వారు అగు గోపికలు చేరి , మంగళము పాడి, పఱ అను వాద్యమును లోకులకొరకును, భగవద్దస్యమును తమకొరకు ను పొందిరి . ఆ ప్రకారము లొకమునంతకును లోకమునకు ఆభరణమైఉన్న శ్రీ విల్లిపుత్తూరులో అవతరించి, సర్వదా తామర పూసలమాలను మెడలొ ధరించిఉండు శ్రీ భట్టనాధుల పుత్రిక అగు గోదాదేవి ద్రావిడ భాషలో ముప్పై పాశురములలో మాలికగా కూర్చినది.

ఎవరీ ముప్పది పాశురములను క్రమము తప్పక చదువుదురో , వారు ఆనాడు గోపికలా శ్రీ కృష్ణుని నుండి పొందిన ఫలమును గూడ పొందుదురు. కేవలము అధ్యయనము చేయుటచేతనే , పుండరీకాక్షుడును, పర్వత శిఖరములవంటి బాహుశిరస్సులు గలవాడును అగు శ్రీ వల్లభుడును చతుర్భుజుడును అగు శ్రీమన్నారాయణుడే వారికి సర్వత్ర సర్వదా ఆనందమును ప్రసాధించును. అని ఫలశ్రుతి పాడిరి.

శుభమగుగాత! సుఖమగుగాత!

శుభమగుగాత! సుఖమగుగాత!

ఉభయ విభూతి నాయకుడౌ శ్రీ

విభుని, ప్రపన్న సులభుని దయచేత !

విలిపుత్తూరున వెలయు భట్ట నా

థుల కూతురు ముప్పదులు తమిళ కృతు

లలరుమాలగా నల్లె - అన్నిటిని

ఎలమి తవిలి పఠియించిన వారికి

శుభ మగుగాత! సుఖమగుగాత!


నావలుగల వనధిని మధియించిన

శ్రీ వల్లభుని కేశవుని దరిసిన

ఆ విధువదనులు దివ్యాభరణాలు

ఏ విధి వ్రత మూని ఏ వర మందిరొ

ఎరిగిన వారికి ఇహపరములలో

శుభమగుగాత! సుఖమగుగాత!


కలిత పద్మాక్ష శిశిర మాలికా

విలసితుడౌ శ్రీ పెరియాళ్వారుల

తులసి మొలక, శూడి కొడుత నాంచారు 

సెలవిచ్చిన ఈ తిరుప్పావై

ఎలమి తవిలి పఠియించినవారికి

శుభమగుగాత! సుఖమగుగాత!


గిరుల వంటి నాలుగు పెనుభుజములు,

అరుణనేత్రములు, శ్రీ ముఖమును గల

ఉభయ విభూతి నాయకుడౌ శ్రీ

విభుని ప్రపన్న సులభుని దయచేత || శుభము||

సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు
ఆండాళ్ తిరువడి గళే శరణం 


 జై శ్రీమన్నారాయణ్ 
సర్వేజనా సుఖినో భవంతు 

ఓం శాంతి శాంతి శాంతీః 

భోగి భోగభాగ్యాలు , పిల్లలకే ఎందుకు బోగిపళ్ళు కధలు- కమామిషులు, మా ఇంటి ...

భోగి భోగభాగ్యాలు , పిల్లలకే ఎందుకు బోగిపళ్ళు  కధలు- కమామిషులు, తెలుసుకోటానికి నేను రడీ మరి మీరు రడీనా...
మా ఇంటి చిన్నికృష్ణునికి బోగిపళ్ళు...

బుధవారం, జనవరి 12, 2022

ఒకటే కోరిక మా కిక (శిత్తం శిఱుకాలే వందున్నై చ్చేవిత్తు, ఉన్ )

బుధవారం, జనవరి 12, 2022

 మార్గ శీర్ష మాసమున గోపికలు తమ పెద్దల అనుమతి పై వర్షమునకై చేసిన వ్రతమే ఈ ధనుర్మాస వ్రతము . పెద్దల సంతృప్తికి తామూ స్నానము ఆచంరింతుమనియు, ఆ వ్రతమునకు పర అను వాద్యము కావలేననియు, బయలుదేరి శ్రీ కృష్ణుని చేరి , ఆ పర నిచ్చి తమకావ్రతమును పుర్తిచేయించి, దాని ఫలముగా అలంకారములను , పరమాన్న భోజనమును చేయింపుమని శ్రీ కృష్ణుని ప్రార్ధించిరి. కాని వారి హృదయగతమగు అభిప్రాయము మాత్రము అది కాదు . శ్రీ కృష్ణునితో కలసి మరి ఎడబాటు లేకుండా వానికి కింకర్యము చేయవలెనని కాంక్షిస్తున్నారు. స్నానమను చోట భగవదత్ప్రాప్తి యనియు పరయను చోట భగవత్ కైంకర్యము అనేది పరమ పురుషార్దము అని అభిప్రాయము వచ్చునట్లు వారిమ్తవరకు మాట్లాడుతున్నారు. ప్రధానంగా తెలుసుకోవలసినవి రెండు విషయాలున్నవి ఇరవైఎనిమిది , ఇరవై తొమ్మిదో పాశురాలలో వివరించి వ్రతమును పూర్తి  చేస్తున్నారు. 

మొదటి పాసురమున గోపికలు ఈ వ్రతమును ప్రారంభించారు.


అయితే గోపికలు ఈ పాసురములో తమ హృదయము నావిష్కరిమ్చి తమ వ్రతమును సమాప్తము చేసి మనము కూడా తరించవలెనని ఈ పాశురములో స్పష్టముగా వివరించినారు.
శిత్తం శిఱుకాలే వందున్నై చ్చేవిత్తు, ఉన్ పాశురము :
శిత్తం శిఱుకాలే వందున్నై చ్చేవిత్తు, ఉన్
పొత్తామరైయడియే పోత్తుం పొరుళ్ కేళాయ్;
పెత్త మ్మేయ్ త్తుణ్ణు ఙ్కులత్తిల్ పిఱంద నీ
కుత్తేవ లెఙ్గ్ ళై క్కొళ్ళామల్ పోకాదు;
ఇత్తైప్పఱై కొళ్వా నన్ఱుకాణ్; గోవిందా ;
ఎత్తైక్కు మేళేళు పిఱ్ విక్కుం, ఉందన్నో
డుత్తోమే యావో మునక్కే నామాళ్ శెయ్ వోం,
మత్తై నఙ్కా మఙ్గళ్ మాత్తే లో రెంబావాయ్

తాత్పర్యము: 
బాగా తెల్లవారకముందే నీ వున్న చోటికి మేము వచ్చి నిన్ను సేవించి, బంగారు తామరపువ్వులవలె సుందరములు, స్పృహణీయములు అయిన చరణములకు మంగళము పాడుటకు ఫ్రయోజనమును వినుము, పశువులను మేపి, అవి మేసిన తరువాతనే తాము భుజించెడి గోపకులమున పుట్టిన నీవు మేము చేయు అంతరంగ కైంకర్యములను స్వీకరింపకుండుట తగదు. నేడు నీనుండి పఱను పుచ్చుకొని పోవుటకు వచ్చినవారముకాము. ఏనాటికిని ఏడేడు జన్మలకును నీతో విడరాని బంధుత్వము కలవారమే కావలెను. నీకే సేవలు చేయువారము కావలెను. మాకు ఇతరములయిన కోరికలేవియు లేకుండునట్లు చేయుము.

ఒకటే కోరిక మా కిక

ఒకటే కోరిక మా కిక

 స్వామీగోవిందా!

మనసు నీకు తెలియదనా! ( మా)

మనవి చేసుకొనుట! ()

 

తెలవారక మున్నే దేవానీ సన్నిధి

చెలులము చేరినీ కొలువే కోరి,

సరస సుందరములు

సంపుల్ల సరోజములు నీ

చరణములకు మంగళా

శాసనమును చేయుట

ఒక పరవాద్యమున కనా?

 స్వామీ గోవిందా  ||ఒకటే||

 

ఆల మేపి బ్రతికే 

బేలలలో ఒకడవై

అవతరించు టేల ? మా

అనుగపు కానేల?

 బంధము నిలుపుము 

డేడు జన్మముల కైన

 కైంకర్యము మానము

ఏనాటికె ఎప్పటికీ   ||ఒకటే||

మంగళవారం, జనవరి 11, 2022

గాజుల గలగలలు ఆడపిల్లకి రక్షణట........😮(Bangles)

మంగళవారం, జనవరి 11, 2022

#bangles,#history#charminar bangles#organizing tips అందరికి నమస్కారం, అమ్మమ్మ తో నేను చానల్ కి స్వాగతం. అతివలు అందానికే కాకుండా సంస్కృతి సాంప్రదాయంతో పాటుగా చేతి గాజులకు ఇంకా చాలా విషయాలు విశేషాలు వున్నాయి తెలుసుకుందామా -అమ్మమ్మ తో నేను మీరు ఈ వీడియో పూర్తిగా చూసి మా ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రిబ్ చేసుకుని, పక్కనే వున్న గంట బెల్ ని క్లిక్ చేయండి. మా వీడియో నచ్చితే , లైక్ చేయండి మరియూ అందరికీ షేర్ చేయండి. మమ్మల్ని ప్రోత్సహింస్తున్నందుకు మీఅందరికీ మా ధన్యవాధములు.

చికాకు పడకు చిడిముడి పడకు (కఱవైగళ్ పిన్ శెన్ఱు పాశురము )

 గోపికలు శ్రీ కృష్ణునితో అన్నారు మేము మార్గ శీర్ష స్నానము చేయవలెనని వచ్చాము . మాకు మా వ్రతమునకు కావలసిన పరికరములు అడిగారు. ఆ వ్రతము చేసిన తర్వాత తామూ పొందవలసిన ఆభరణములను, వస్త్రములను, భోగములను ప్రార్దిమ్చినారు .

శ్రీ కృష్ణునకు వారు హృదయము తెలియును. ఇదంతయు లుకిక వ్రత గాధ కాదు. వీరు కోరునవి లుకిక వ్రతోపకరనములు కావు. ఆముష్మిక ఫలమునండుతకే వీరు కోరుచున్నారు. కాని వీరి నోటివేమ్తనే దానిని చెప్పిమ్చవలెను అని తలంచి ఇట్లు అడిగినారు.
ఓ గోపికలారా ! మీరు కోరినవన్నియు చాలా చక్కగా వున్నాయి. మీరు " పరిశీలించి కృపచేయమని" అనిఅన్నారు.
కదా పరిశీలించినా మీ అభిప్రాయమేమో నాకు తోచటంలేదు. వ్రతము చేసి మహత్తరమైన అలంకరనములను భోగములను అందవలెనన్నా దానికొక అదికారము ఉండాలి కదా? ఫలమునాశించిన మీరు ఆ ఫలాప్రాప్తికి ఏదోఒక యత్నము కుడా చేసి యుండాలి కదా? మా కది కావాలని అన్నంత మాత్రమున నేను ఇచ్చుటకు వీలుకాదు. దానికి తగిన యోగ్యతా మీకున్న ఇవ్వగలను. కావున మీకున్న అధికారము అనగా మీ యోగ్యతా ఎట్టిదో వివరించుము. ఫలమును అందగోరు వారు దానికి సాధనమునుగూడ సంపాదిమ్పవలేనుగాడా? మీరు అట్టి సాధనమును దేనినైనా ఆర్జించినారా ?
ఇట్లు అడుగగానే గోపికలు తమ హృదయము విప్పి చెప్పుచున్నారు .
గోపికలు కామ్క్షిమ్చునది పరమ పుశార్ధముఅగు నారంట భగవత్ పురక భవత్కైమ్కర్యము. దానికి వరేమియు యోగ్య తను సంపాదించుకొని రాలేదు . పరమాత్మే ఉపాయముగా నమ్మిన వారు, వాటి కంటే వేరే ఉపాయము తాము పొందుటకు ప్రతిభందకములని తెలుసుకున్నవారు. కర్మలు చేసి, జ్ఞానము సంపాదించి, భక్తి తో ఉపాసించి పరమాత్మను పొందాలని తలంపు వీరికి లేదు. వాడె వానిని పొందించ వలెనని నమ్మినవారు. అందుచే ఇట్లు భగవానుడే యుపాయమని నమ్మకము కలవారు. భగవానుని ముందు ఏమి విజ్ఞాపనము చేయవలెనో ఆమాటలను గోపికలు ఈ పాసురమున వివరిచుచున్నారు .
కఱవైగళ్ పిన్ శెన్ఱు  పాశురము : 
కఱవైగళ్ పిన్ శెన్ఱు కానం కానమ్ శేర్-నుంద్-ణ్బోమ్
అఱివొన్ఱు మిల్లాద వాయ్-క్కులత్తు, ఉన్ఱన్నై
ప్పిఱవి పిఱన్దనై పుణ్ణియమ్ యాముడయోమ్
కుఱైవొన్ఱుమిల్లాద గోవిందా, ఉందన్నో
డుఱవేల్ నమక్కు ఇంగొరిక్క వొరియాదు
అఱియాద పిళ్ళైగళోమ్ అంబినాల్, ఉన్ఱన్నై
చ్చిఱు పేర్-అళైత్తనవుం శీఱి యరుళాదే
ఇఱైవా! నీ తారాయ్ పఱై ఏలోర్-ఎంబావాయ్

తాత్పర్యము:
పశువుల వెంట వానిని మేపుటకై అడవికిపోయి. అచటనే శుచినియమములు లేక తిని, జీవిమ్చియుమ్డుతయే ప్రయోజనముగా తిని, తిరిగెడివారము. ఏమియు జ్ఞానములేని మాగోప వంశమున మాతో సజాతీయుడవై నీవు జన్మిచిన పుణ్యమే మాకున్న పుణ్యము . మాకెన్ని లోపాలున్నా తీర్చగాల్గినట్లు ఏ లోపము లేని వాడవు కదా నీవు. గోవిందా! ఓ స్వామీ ! నీతో మాకుగల సంబంధము పోగొట్టుకోన వీలుకాదు . లోక మర్యాదనేరుగని పిల్లలము. అందుచే ప్రేమవలన నిన్ను చిన్న పేరు పెట్టి పిలచినాము. దానికి కోపము తెచ్చుకొని మమ్ములననుగ్రహింపక ఉండకుము. మాకు ఆపేక్షితమగు పరను పరను ఇవ్వుము.

చికాకు పడకు చిడిముడి పడకు -

చికాకు పడకు చిడిముడి పడకు -

నీ కరుణ వినా మా కేమ్మున్నది చెప్పు!


మా పున్నెము వలనగదా,

మా కోసమేగాదా, మా

గోపకులములో దిగి

గోవిందుడ వైనావు! || చికాకు||


గోకుల వెంబడి ఏవో

కోనల కొనలలో బడిపోవు

నట్టి  వెర్రిగొల్ల

పొలతులము!


చిన్ని పేర పిలిచాము! ఎన్నో మాట లన్నాము!

ఎన్ని జన్మములదో ఈ వీడిని మనబంధము!

ఇక దయచేయుము వరము పరవాద్యము! ||చికాకు||


సోమవారం, జనవరి 10, 2022

వేడవచ్చునా మరికొన్ని (కూడారై వెల్లుమ్ శీర్ గోవిందా, ఉన్ఱనై )

సోమవారం, జనవరి 10, 2022

 గోపికలు తామూ చరించబోవు మార్గ శీర్ష వ్రతమునకు కావలసిన పరికరములను వెనుకటి పాసురమున విన్నవిమ్చినారు. అందు వారడిగిన ద్రవ్యములు సులభాములేయైననాను వారు కోరిన వారు కోరిన గునముఅలు గల ద్రవ్యము దుర్లభాములు. అందుచే శ్రీ కృష్ణ పరమాత్మ వీరి హృదయము వస్తువులను గోరుట కాదు , నన్నే కోరి వీరీ వస్తువులను కోరినారు. అనుకొనెను.పాచజన్యమును పోలిన శంఖములను కోరారు. మరి అల్లాంటి శంఖము దొరకదు. ఆ శంఖము శ్రీ కృష్ణుని వీడదు. అందుచే శ్రీ కృష్ణుడే శంఖధరుడై తమతో నుండవలెనని వారు కోరారు.

చల్లా పెద్ద పర కావలెనని గోపికలు కోరారు . శ్రీ కృష్ణుడు త్రివిక్రమావతారమున జాంబవంతుడు త్రివిక్రముని విజయమును చాటుచు వాయించిన పరయోకటి కలదు. శ్రీ కృష్ణ రుపముననున్న నేను కుంభ నృత్యము చేయునప్పుడు కట్టుకొని వాయించిన పర చాల పెద్ద పర. ఈ మూడింటిని ఇచ్చెదనని శ్రీ కృష్ణుడు గోపికలకు చెప్పెను. మంగళా శాసనము చేయువారు కావలెనని కోరిరి. మంగళా శాసనము చేయువారెచట నున్న పరమాత్మయే వారి వెంట నుండునని వీరీ అభిప్రాయము.
తమ దేవేరియగు శ్రీ మహాలక్ష్మి నే మంగళ దీపముగా వారితో ఉండునట్లు అంగీకరించెను . జెండా గరుత్మంతుడు . వారికి గరుడునికుడా ఒసగుటకు శ్రీ కృష్ణుడు సమ్మతించెను.
తరువాత చాందినీగా అనంతునే పంపనంగీకరించెను. మధురా నగరమున జన్మించి వ్రేపల్లెకు వచ్చిన ఆ రాత్రి వర్షమున శ్రీ కృష్ణునకు మేలు కట్టుగా తన పడగలనుపయోగించిన మహానీయుడు కదా! అనంతుడు, పడగ, ఆసనము, వస్త్రము, పాదుకలు, తలగడ, చత్రము, చాందిని మొదలగున్నవి విధముల సర్వేస్వరునకు తన శరీరమును భిన్న భిన్న రుపములుగాకుర్చి యుపయోగపడి తనచేతలచే శేషుడు అను పేరు పొందిన మహనీయుడు. వీరు కూడా శేషత్వమునే కోరుతున్నవారగుటచే , శేషునే వారికి చాందినిగా ఇచ్చెను .
ఇలా పరికరములన్నీ సమకూరినవి కదా ! ఇక మీ వ్రతమునకు ఫలమేమో వివరించమని స్వామీ కోరగా . గోపికలు ఈ పాసురమున ఈ వ్రతాచరణముచే తామూ పోందకోరిన ఫలమును వివరించుచున్నారు.  ఈ పాసురము విశేషమైనది నేటి నివేదన చక్కెరపోంగళి ఆరగింపుగాఇస్తారు.  గోపికలు ఈ పాసురము రోజు 108  గిన్నెలు చెక్కరపొంగలి నెయ్యి ఎక్కువ వేసి మోచేతి నుండి కారునట్లు వేసిచేస్తారు.  ఎందుకుఅంటే 26  రోజులు వీరు నెయ్యి వాడలేదు కదా.  అందువల్ల ఈ పాసురము రోజు మంచిగా చెక్కెర పొంగలి నివేదిస్తారు.
కూడారై వెల్లుమ్ శీర్ గోవిందా, ఉన్ఱనై పాశురము:
కూడారై వెల్లుమ్ శీర్ గోవిందా, ఉన్ఱనై
ప్పాడి పఱైకొండు యామ్ పెరుసమ్మానమ్
నాడు పుకరం పరిశినాళ్ నన్ఱాక
శూడగమే తోళ్ వళైయే తోడే శెవి పువ్వే
పాడగమే యెన్ఱనైయ పల్కలనుమ్ యామణివోమ్
ఆడైయడుప్పోం అతన్ పిన్నే పాల్ శోఱు
మూడనెయ్ పెయ్దు మురంగైవరివార
కూడి ఇరుందు కుళిరుంద్-ఏలోర్ ఎంబావాయ్ 

తాత్పర్యము:
తనతో కూడని శత్రువులను జయిమ్చేది కళ్యాణ గుణ సంపదగల గోవిందా ! నిన్ను కీర్తించి వ్రతసాధనమగు పర అను వాద్యమును పొంది పొందదలచిన ఘన సన్మానము లోకులందరు పొగడెడి తీరులో నుండును. చేతులుకు గాజులు మొదలుగు ఆభరణములు , బాహువులకు డందకదియములు , చెవి క్రిందు భాగమున దాలెచేది దుద్దు, పై భాగమున పెట్టుకొనే కర్ణపువ్వులు, కాలి అందెలు మొదలుగు అనేక ఆభరణాలు మేము ధరించాలి. తరువాత మంచి చీరలను దాల్చి వుండాలి. దాని తరువాత పాలు అన్నము మున్నగున్నవి నెయ్యి పోసి ఆ మధుర పదార్ధము మోచేతి వెంబడి కారునట్లు నీతో కలసి కూర్చొని చల్లగా హాయిగా భుజిమ్చవలెను. గోపికలు తమ వ్రత ఫలమును ఇందులో వివరించారు.
 వేడవచ్చునా మరికొన్ని, మా

వేడవచ్చునా మరికొన్ని, మా
వేడుకకై కొన్ని,
కూడనివారిని ఓడించే శుభ
గుణములు గల గోవిందా!

ఆడువారి కోరికలు అనుకోకు!
కూడదనకు గోవిందా! నీ
రాడి వచ్చి వ్రత మూనిన ముదమున
అదిగెద మంతే స్వామి!

సూడిగములు, జుమికీలు, చెనాకులు
పాడగములు, కేయూరములు,
తొడవులన్ని కయి సేయగ వలదో!
తొడగవలదో పలువన్నెల పలువలు! ||వేడవచ్చునా||

ఇంతకన్నా శుభవేళ ఏది?
ఇంతకన్నా ఆనంద మేది?
బంతులుగా నీతోడ గూడి
ఇంతుల మెల్లరము

నెయ్యి వెన్న మీగడలు
తీయని తీయని పాయసము
చేయి మునుగగా ఆరగింప
చేయవా! చిత్తగింపవా!    ||వేడవచ్చునా||

ఆదివారం, జనవరి 09, 2022

అవధరింతువా ! అనుగ్రహింతువా! (మాలే మణివణ్ణా -గరి నీరాడువాన్ )

ఆదివారం, జనవరి 09, 2022

 శ్రీ కృష్ణ పరమాత్మ గోపికల మాటలకు పరమానందము తో వారిని చుచుతూ ఉండిపోయాడు. వారి పాసురము పాసురము మండలమును, నేత్ర ములను , వక్షస్థలమును , నడుమును చూచుచు ఇతర స్పృహ లేనంతగా వ్యామోహముతో పరవశమై ఉన్నాడు . వారి మాటలు విని మరి కొన్ని వినాలన్న కోరికతో ఒక ప్రశ్న అడిగెను " గోపికలారా ! నన్నే కోరి వచ్చాము అని చెప్పారు . మరలా నీకిష్టమైనచో పర అను వాద్యమును ఇమ్మని అంటున్నారు. నన్నే కలియవలేనని కోరిక ఉన్నవారు వేరోక దానిని కాంక్షించారు కదా?  మీరు పర అడుగుటలో ఉద్దేశ్యము ఏమి? మీ కోరిక విషయములో నాకు సందేహముకలుగుతున్నది. అని శ్రీ కృష్ణుడు వారిని ప్రశ్నించెను.  వారు దానికి భగవద్ ప్రీతి కొరకు మా పెద్దలు ధనుర్మాస వ్రతము చెయ్యమన్నారు. మేము పెద్దల యెడ ఉపకారబుద్ధితో ఈ వ్రతము ఆచరించ బూనినాము. అని గోపికలు చెప్పారు.

అంత శ్రీ కృష్ణ పరమాత్మ సరే కానిండు. అయితే ఆవ్రతము ఏమి ? దానికి ప్రమాణము ఏమి ? దానికి కావలిసిన పదార్ధాలు ఏమి ? అవి ఎన్ని కావాలి? వివరాలు తెలపండి. అని అడిగెను. అంత గోపికలు ఈ వ్రతమునకు కావలసిన పరికరములు  అర్ధించుచున్నారు. ఈ పాశురములో  
మాలే మణివణ్ణా -గరి నీరాడువాన్ పాశురము:
మాలే మణివణ్ణా -గరి నీరాడువాన్
మేలైయార్ శేయ్-వనగళ్ వేండువన కేట్టియేల్
ఞాలత్తై యెల్లాం నడుంగ మురల్వన
పాలన్న వణ్ణత్తు ఉన్-పాంచజన్నియమే
పోల్వన శంగంగళ్ పోయ్ ప్పాడుడైయనవే
శాలప్పెరుం పఱైయే పల్లాండిశైప్పారే
కోలవిళక్కే కొడియే వితానమే
ఆలిన్-ఇలైయాయ్ యరుళ్-ఏలోర్ ఎంబావాయ్
తాత్పర్యము:

ఆశ్రిత వ్యామోహముకలవాడా! ఇంద్ర నీలము అను మణిని పోలిన కాంతియు, స్వభావమును కలవాడా! అఘటిత ఘటనా సామర్ధ్యముచే చిన్న మర్రియాకుపై అమరి పరుండువాడా ! మేము మార్గశీర్ష స్నానము చేయగోరి దానికి కావలసిన పరికరాలు అర్ధించి నీ వద్దకు వచ్చితిమి . ఆ స్నాన వ్రతమును మా పూర్వులు శిష్టులు ఆచరించినారు. నీవు విన్నచో దానికి కావలసిన పరికరాలు విన్నవించేదము. ఈ భూమండలమంతను వణుకుచున్నట్లు శబ్ధము చేయు , పాలవలె తెల్లనైన , నీ పాంచజన్యమనబడే శంఖమును పోలిన శంఖములు కావలెను. విశాలమగు చాలా పెద్ద "పర " అను వాద్యము కావాలి మంగళ గానము చేయు భాగవతులు కావాలి. మంగళ దీపములు కావాలి. ధ్వజములు కావాలి. మేలుకట్లు కావాలి. పై పరికరములు ను క్రుపచేయుము అని గోపికలు శ్రీ కృష్ణుని ప్రార్ధించిరి.  సర్వ శ క్తిమంతుడవై మాకోరకు శ్రీ కృష్ణుడు వై సులభుడవైన నీవు మాపై దయ చూపి మా వ్రతమునకు కావలసిన పరికరములు నోసగుమని గోపికలు ఈ ప్రాసురమున ప్రార్ధించినారు

అవధరింతువా ! అనుగ్రహింతువా!
అవధరింతువా ! అనుగ్రహింతువా!
ఆశ్రితజనవత్సలా! నీ నవధరింతువ?
మార్గశిర స్నానమునకు మా నోమునకు
మాకు వలయు వనిని మహేంద్రమణి ప్రభామూర్తి!  || అవధరింతువా||

క్ష్మామండల మదరిపడగ శబ్దించేవి
పాలవన్నె నొప్పారెడు పాంచజన్య మట్టినీ,
శంఖములూ, ప్రబల బహుళ
పటహములూ పరవాద్యము - లను గ్రహింతువా! ||అవధరింతువా ||

మంగళ మణి దీపికల
భృంగారువు, చందువాల,
బంగారపు పళ్ళేరాల,
రంగు రంగు ద్వజపటాల,
పొంగుచు మంగళాశాన
నము పాడే గాయకుల    ||అవధరింతువా ||

ఓ వటపత్రశాయే! నరదాయీ! వరదాయి!

శనివారం, జనవరి 08, 2022

అర్ధులము,అనుగులము, (ఒరుత్తి మగనాయ్ పిఱందు ఓరిరవిల్)

శనివారం, జనవరి 08, 2022

గోపికలు ఈ విధముగా మంగళము పాడుతుఉంటే శ్రీ కృష్ణ పరమాత్మ వారి ప్రేమకు , వాగ్వైభవనమునకు చాలా సంతోష్మ్చి " ఓ గోపికలారా! మీకు జన్మసిద్దాముగా మా యందుగల ప్రీతిచే మంగళము నాకాక్షించుచున్నారు . చాలా సంతోషమే , కానీ ఈ రాత్రివేళ మంచులో నడచి శ్రమ పడి వచ్చారు . చాలా శ్రమ అయ్యింది. కేవలము మంగళ శాసనము కాంక్షతోనే యున్నట్లు చెప్పుతున్నారు . కానీ దానికంటే వేరొక ప్రయోజనము లేదా? ఉన్నచో చెప్పండి. తప్పక నేరవేర్చుతాను. అనెను . నీగుణ కీర్తనము చేయుచూ వచ్చుటచే మంచు , రాత్రి , మొదలగున్నవి మాకు ఇబ్బందిని కలిగించవు. మాకు ప్రధాన ప్రయోజనము నీకు మంగళము పాడుతయే. లోకులకై వ్రతమోనర్చుటకుపర నొసంగిన ఒసగుము. మేము మీ స్వరూపమును మా స్వరూపమును తెలిసిన వారమే. కావునామంగళా శాసనమే ప్రధాన ప్రయోజనము అని తెలియచేయుచు శ్రీ కృష్ణ అవతార రహస్యమును తామెరుగుదుము అని దానిని ఈ పాశురములో వివరించినా మన గోపికలు.    గోపికలు ఈ పాశురములో శ్రీ కృష్ణుని జన్మ రహస్యమును కీర్తించుచు దానివలన శ్రమ తీరి ఆనందించుచున్నారు. అని చెప్పుచున్నారు.
గోపికలు ఈ పాశురములో శ్రీ కృష్ణుని జన్మ రహస్యమును కీర్తించుచు దానివలన శ్రమ తీరి ఆనందించుచున్నారు. అని చెప్పుచున్నారు.
ఒరుత్తి మగనాయ్ పిఱందు ఓరిరవిల్ పాశురము:
ఒరుత్తి మగనాయ్ పిఱందు ఓరిరవిల్
ఒరుత్తి మగనాయ్ యొళిత్తు వళర
తరిక్కిలానాకి త్తాన్ తీంగు నినైంద
కరుత్తై పిరపిత్తు కంజన్ వైత్తిల్
నెరుప్పెన్న నిన్న నెడుమాలే ఉన్నై
అరుత్తిత్తు వందోం పఱై తరుతియాగిల్
తిరుత్తక్క శెల్వముమ్ శేవకముమ్ యాంపాడి
వరుత్తముమ్ తీరుంద్ ముగిరుంద్-ఏలోర్ ఎంబావాయ్ 
తాత్పర్యము:
భగవానుడే తన కుమారుడుగా కావలెనని కోరి , శంఖచక్రగధాధరుడు అగు భగవానునే కుమారునిగా పొందగల్గిన సాటిలేని దేవకీ దేవి కుమారుడవై జన్మించి , శ్రీ కృష్ణుని లీలలను పరిపూర్ణముగా అనుభవించి, కట్టను కొట్టను భగవానుని వశమొనర్చుకొనిన అద్వితీయ వైభావముగల యశోదకు, ఆ రాత్రియే కుమారుడవై, దాగి పెరిగినవాడా! అట్లు పెరుగుచున్న నిన్ను చూచి ఓర్వలేక చంపవలెనని దుష్ట భావముతో నున్న కంసుని అభిప్రాయమును వ్యతముచేసి వానికడుపులో చ్చిచ్చువై నిన్ను చంపవలెనని తలచిన వానిని నీవే చంపిన ఆశ్రిత వ్యామోహము కలవాడా! నిన్నే కోరి వచ్చినాము . పర అను వాద్యము నిచ్చిన ఇమ్ము . సాక్షాత్తు లక్ష్మీ దేవే పొందవలెనని కోరదగిన నీ ఐశ్వర్యమును , నీ వీర చరిత్రమును , కీర్తించి శ్రమను విడిచి పెట్టి సంతోషించు.  భగవానుని పాడుటకు సాధనానుస్టానము చేయుచున్నప్పుడు చాలా శ్రమలు కలుగును. ఆ శ్రమలు శ్రమగా కాక ఆనందముగా ఉండాలి. దానికి నామసంకీర్తనమే సాధనము అని గోపికలు ఇందులో వివరించారు.
అర్ధులము,అనుగులము, 
అర్ధులము,అనుగులము, 
అంజలింప వచ్చినాము!
అడిగిన వర మిడుదు వని,
అనురాగపు గని వని!

ఒక అను కొమరుడవై, వే
రొక అను ఒడిలో దాగి,
ఒదిగిన నిను హింసింపగ
ఊహించిన కంసునకు
అసురునకు కడుపుమంటవు!
అర్ధులకు అమృతాల పంటవు!  ||అర్ధులము||

సిరికూడా వలచే నీ
దొరతనమూ, దౌర్వీర్యము
పరవసమున పాడి పాడి
విరహ మెల్ల మరతుము!
పరవాద్యము కరుణింపుము
పరమానంద మొసంగుము!  ||అర్ధులము||

అమ్మమ్మతో నేను మా పూజా గది.

హాయ్, నమస్కారం , నేను అమ్మమ్మ ఈరోజు ఒక కొత్త వీడియో ని చేసాం . మీకు మా వీడియోలు నచ్చితే . దయచేసి మర్చిపొకుండా నా ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోలు మీ ముందుకు తెస్తాం. ధన్యవాధములు. నా మరోక్ చానల్ ని కూడా చూడండి చానల్ పేరు :Diabetic Challenger link : https://www.youtube.com/channel/UCfuy...

శుక్రవారం, జనవరి 07, 2022

మంగళమని పాడ వస్తిమి, (అన్ఱివ్వులగమ్ అళందాయ్ అడి పోత్తి)

శుక్రవారం, జనవరి 07, 2022

 ప్రస్తుతము గోపికలు మంచి దశకు చేరి ప్రేమ దసలోనున్న వారగుటచే తమకు కలిగిన అమంగళములను అతనిని దర్శించి పోగొట్టుకోవాలని , తమకు లేని మంగళములను సంపాదించుట మాని ప్రేమైక హృదయులై శ్రీ కృష్ణునకు మంగళము పాడుచున్నారు.ఇట్లే గోపికలు శ్రీ కృష్ణ పరమాత్మ వలన తమ కార్యము నెరవేరునని , తమ ప్రభువు నడచి వచ్చి ఆసనము పై కుర్చొనగానే ఆ పాదాలు ఎర్రదనము చూచి తామూ చేసిన యపచారమునకు భాధపడి మంగళము పాడిరి.  ఈ పాశురము చాలా విశేషమైనది.  స్వామివారికి హారతి చాలా ఇష్టం కదా ఈ పాసురములో స్వామికి హారతి ఎక్కువగా ఇస్తారు.  విశేషమైన నివేదనగా దద్యోజనం ఆరగింపుగా ఇవ్వాలి.


                                                        అన్ఱివ్వులగమ్ అళందాయ్ అడి పోత్తి పాశురము:

అన్ఱివ్వులగమ్ అళందాయ్ అడి పోత్తి
శెన్ఱంగు త్తెన్-ఇలంగై శెత్తాయ్ తిఱల్ పోత్తి
పొన్ఱచ్చకడం ఉదైత్తాయ్ పుగర్ పోత్తి
కన్ఱుకుణిలా వెఱిందాయ్ కరిల్ పోత్తి
కున్ఱుకుడైయా వెడుత్తాయ్ కుణమ్ పోత్తి
వెన్ఱు పకై కెడుక్కుమ్ నిన్ కైయిల్ వేల్ పోత్తి
ఎన్ఱెన్ఱుమ్ శేవకమే యేత్తి ప్పఱైకొళ్వాన్
ఇన్ఱు యాం వందోం ఇరంగ్-ఏలోర్ ఎంబావాయ్
తాత్పర్యము:
ఆనాడు బలి చక్రవర్తి తనదికాని రాజ్యమును తానూ ఆక్రమించి దేవతలను పీడించగా ఈ లోకమునంతను వానివద్దనుండి దానము పట్టి పాదములతో కొలిచిన మీ దివ్య పాదములకు మంగళము .రావణుడు సీతమ్మను అపహరించుకొని పోగా ఆ రావనుడుండు లంకకే వెళ్లి సుందరమగు భవనములు కోటయుగల దక్షినదిసనున్న లంకలో ఉన్నా రాక్షసులను చెండాడిన మీ భాహు పరాక్రమములకు మంగళము . శ్రీ కృష్ణునకు రక్షణకై యుంచిన బండిపై ఆవేసించిన రాక్షసుని చంపుటకై ఆ బండికి తగులునట్లు కాలుచాచి నేలకూల్చిన మీ అప్రతిమ కీర్తికి మంగళము .వత్సము పై ఆవేసించిన అసురునితో వెలగ చుట్టుపై నాఎసించిన యసురుని చంపుటకై ఓడిసేలరాయి విసరినట్లుగా వెలగ చెట్టుపైకి దూడను విసరనపుడు ముందువేనుకకు పాదములుంచి నిలచిన మీ దివ్య పాదములకు మంగళము.  ఇంద్రుడు తనకు యాగము లేకుండా చేసినని కోపముతో రాళ్ళ వాన కురియగా గోపాలురకు గోవులకు భాధ కలుగకుండా గోవర్ధన పర్వతమును గోడుగువలే ఎత్తిన మీ వాత్సల్యమునకు మంగళము.  శ త్రువులను సములముగా పెకలిచి విజయము నార్జించి ఇచ్చేది మీ హస్తమునందలి వేలాయుధమునకు మంగళము.
ఈ విధముగా నీ వీర చరత్రములనే కీర్తించి పర అనే సాధనము నందగ మేమీనాడు వచ్చాము అనుగ్రహించుము.
అని ఈ పాశురములో మంగళము పాడుతూ భగవానుని అనుగ్రహించమని కోరుచున్నారు.

                                                                             మంగళమని పాడ వస్తిమి,

మంగళమని పాడ వస్తిమి,
మరిమరి నీ మగటిమికి - మంగళమని!
ముంగిట నిలబడిన మా కొ
సంగుదవని పరవాద్యము || మంగళమని||

అల్లనాడు లోకమ్ముల
అలవోకగ కొలిచిన నీ 
పల్లవారుణ శ్రీపద 
పద్మములకు మంగళమని ,

పెల్లుగ నీ వెత్తి వెడలి
సుందర లంకాద్వీపము
తల్లడబడ మాసిన నీ 
దర్పమునకు మంగళం ||మంగళం||

కాలదన్ని ఒక తృటిలో
కరక శకట ధైత్యుని
నేల రాలు నటు చేసిన
నీ కీర్తికి మంగళమని,

కూళను వత్సాసురు నవ 
లీలగ చిరుకోలవోలె
తూలవిసురు దుడుకు అడుగు
దోయికినీ మంగళం!  ||మంగళం||

దండిగ గోకులమునకై
దలదాలిచి గొడుగువోలె
కొండ నెత్తివేసిన నీ
గుణమునకును మంగళమని

భండనమున నొక వ్రేటున
పగతుర పీచ మ్మడంచి
చెండాడిన నీ చేతి ప్ర
చండాసికి మంగళం! || మంగళం||

గురువారం, జనవరి 06, 2022

తరలిరాగదే, దేవ! దయచేయగదే! (మారి మలై మురైంజిల్ మన్ని క్కిడందుఱంగుం )

గురువారం, జనవరి 06, 2022

 అననన్య గతికలమై వచ్చి నన్నాస్రయించినారము , కటాక్షిం చుము అని గోపికలు ప్రార్ధించగా శ్రీ కృష్ణునకు మనస్సులో చాలా భాద కలగినది. నీలాదేవిని ఆశ్రయించి ఆమె ద్వారా నన్నాశ్రయించిన వారిని నేనే ముందుగా వెళ్లి సాయపడి రక్షించవలసి ఉండగా వేరొక గతిలేని వారమైనాము అని దైన్యముగా పల్కు నట్లు ప్రేరేపించితినే ! ఎంత తప్పు చేసితిని అని శ్రీ కృష్ణుడు చాలా నోచ్చుకోనేను.

ఇలా పడుకున్న శ్రీ కృష్ణుని లేచి నడచి వచ్చి ఆ స్థానమున సింహాసనమున వేంచేసి తమ కోరివిని క్రుపచేయవలేనని గోపికలు ప్రార్ధించుచున్నారు.



మారి మలై మురైంజిల్ మన్ని క్కిడందుఱంగుం పాశురము:
మారి మలై మురైంజిల్ మన్ని క్కిడందుఱంగుం
శీరియ శింగం అరివుత్తు త్తీవిరిత్తు
వేరి మయర్ పొంగ ఎప్పాడుం పేరుందుదఱి
మూరి నిమిరుందు మురంగి ప్పుఱప్పట్టు
పోదరుమా పోలే నీ పూవైప్పూ వణ్ణా ఉన్
కోయిల్ నిన్ఱు-ఇంగనే పోందరిళి క్కోప్పుడైయ
శీరియ శింగాశనత్తిరుందు యాం వంద
కారియం ఆరాయ్-అందరుళ్-ఏలోర్ ఎమ్బావాయ్

తాత్పర్యము:
పర్వత గుహలో వర్షాకాలములో కదలక మెదలక పడుకున్న సౌర్యముగల సింహము మేలుకొని , తీక్ష్ణమగు చూపులు నిటునటు చూచి , ఒకవిధమగు వాసనగల తన ఒంటి వెంట్రుకలు నిగుడు నట్లు చేసి, , అన్ని వైపులా దొర్లి , దులుపుకొని , వెనుకకు ముందుకు శరీరమును చాపి , గర్జించి , గుహనుండి వేల్వడునట్లు, ఓ అతసీపుష్ప సవర్ణ ! నీవు నీ భవనము నుండి ఇట్లే బయటకు వేంచేయి రమణీయ సన్నీవేశము గల లోక్కోత్తరమగు సింహాసనమును అధిష్టించి మేము వచ్చిన కార్యమును ఎరుగ ప్రార్ధించుచున్నాము.
అలా కోరటంతో శ్రీ కృష్ణ పరమాత్మ తన శయనాగారమును వీడి నడచి వచ్చి సింహాసనము నధిరోహించి గోపికలను యుక్తరీతిని పలుకరించవచ్చునని అనుకోవచ్చును.

తరలిరాగదే, దేవ! దయచేయగదే!

తరలిరాగదే, దేవ! దయచేయగదే!
దరసింపగ వచ్చిన మా పని విని పాలింతుగాని తరలి రాగదే!

వానకారులోనే సింహ మొకడు మేల్కాంచి, పొడవు
మేను సారించి, ధూళి తూళించి, కెంపుకెనుల
మానుగ వీక్షించి, పరీమళ భర సటలూగ, గహ్వ
రాననుండి వెలువడు చందాన మందిరమునుండి తరలిరాగదే!

భాసుర బహురత్న ఘటిత భర్మ సింహ పీఠికా
ధ్యాసివై, అనుగ్రహోల్లాసివైన స్వామీ! అత
సీసుమ కోమల శ్యామమోహను, లోకావను, నిను
చూసి చూఇ, మనసు వెళ్ళబోసి, కృతార్థలము కాగ తరలి రాగదే!

పుష్యలక్ష్మి కి నైవేద్యం పూర్ణం కుడుములు తయారి ....పుష్యలక్ష్మీ పూజ మరియ...

Plz do like,share,subscribe my channel ammamma tho nenu

బుధవారం, జనవరి 05, 2022

ఏది ఏది! నీ దయా వీక్షణము ఏది ఏది! (అంగణ్ మా ఞాలత్తరశర్, అబిమాన)

బుధవారం, జనవరి 05, 2022

                          

గోపికలు శ్రీ కృష్ణ పరమాత్మ వద్దకు చేరి మేల్కొనమని వెనుకటి పాశురములో ప్రార్ధించారు. వేరొక గతిలేక నీకే చెందినవారమని చెప్పారు. ఈ పాశురములో తమ ను మెల్లమెల్లగా కనువిచ్చి చూడవలసిందిగా అర్ధించుచున్నారు .

అంగణ్ మా ఞాలత్తరశర్, అబిమాన పాసురము:
అంగణ్ మా ఞాలత్తరశర్, అబిమాన
పంగమాయ్ వందు నిన్ పళ్ళికట్టిల్ కీరే
శంగమ్ ఇరుప్పార్ పోల్ వందు తలై ప్పెయ్-దోమ్
కింగిణివాయ్ చ్చేయ్ద తామరై ప్పూప్పోలే
శెంగణ్ శిఱుచ్చిఱిదే యెమ్మేల్ విరయావో
తింగళుమ్ ఆదిత్తియనుమ్ ఎరుందాఱ్పోల్
అంగణ్ ఇరండుం కొండు ఎంగళ్మేల్ నోక్కుదియేల్
ఎంగళ్మేల్ శాపం ఇరింద్-ఏలోర్ ఎమ్బావాయ్ 

తాత్పర్యము:
సుందరము విశాలమగు మహా పృధ్వీ మండలము నంటాను ఏలిన రాజులు తమకంటే గొప్పవారు లేరనేది అహంకారమును వీడి తమను జయించిన సార్వభౌముని సింహాసనము క్రింద గుంపులు గుంపులు చేరి ఉన్నట్లు , మేమును అభిమాన భంగమై వచ్చి నీ సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నాము. చిరుగంట ముఖమువలె విదియున్న తామరపువ్వులు వలె వాత్సల్యముచే ఎర్రగా నున్న నీ కన్నులను మెల్లమెల్లగా విచ్చి మాపై ప్రసరించుము.
సూర్య చంద్రులిరువురు ఒక్క సారి ఆకాశమున ఉదయించునట్లు ఉండేది నీ రెండు నేత్రములతో మావైపు కటాక్షిమ్చితివా! మేము అనుభావిమ్చియే తీరాలి అనే శాపాము వంటి కర్మ మమ్ములను వీడి పోవును.

ఏది ఏదీ! నీదయావీక్షణము ఏది ఏదీ!

ఏది ఏది! నీ దయా వీక్షణము ఏది ఏది!
ఇంచించుంక పరపుము మాపై, మాపై!

చిరుగజ్జెల వలె విరిసే ఎరనెర్రని తామరల

తెరగున వికసించే ఆ కెంజాయి కందోయి!  ||ఏది ఏదీ||


అందమగు ఈ లోకమందలి ఏలికలు

అందరును మానాభిమానములు వీడి

సుందరము నీ గద్దె బృదములులైన

చందమున, నిలుచు మా డెందములు చల్లబడ! ||ఏది ఏదీ||


ఒక్కకనుకొన చూపేచాలును, చాలును-

పాపముల పరిమార్పను!

ఒక్క కనుకొన ప్రాపె చాలును, చాలును- 

తాపముల చల్లార్పును! ||ఏది ఏదీ||

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)