Blogger Widgets

సోమవారం, మే 06, 2024

అమ్మమ్మ నేర్పిన మెత్త‌ని ప‌కోడీ....పకోడీ కథ, కమామిషు పద్యాలతో. తిని ఆస్వాధించండి.

సోమవారం, మే 06, 2024

అమ్మమ్మ నేర్పిన మెత్త‌ని ప‌కోడీ....
అమ్మమ్మ నేర్పిన మెత్త‌ని ప‌కోడీ రిసిపి చెప్పే  ముందు కొన్నివిషయాలు మీతో షేర్ చేసుకుంటాను .  ఈ పకోడీ మీద పూర్వపు కవులు అనేకమైన పద్యాలు రాశారు. 
అందులో కొన్ని 
చిలకమర్తి వారు పకోడీపై కొన్ని పద్యాలు ఆశువుగా చెప్పారు. పద్యాలు చదివి పకోడీ రుచి ఆస్వాదించండి.
వనితల పలుకులయందున
ననిముష లోకమున నున్న దమృతమటంచున్
జనులనుటె గాని, లేదట
కనుగొన నీయందమృతము గలదు పకోడీ !

ఎందుకు పరమాన్నంబులు
ఎందుకు పలు పిండివంటలెల్లను నాహా ! నీ
ముందర దిగదుడుపున కని
యందును సందియము కలుగ దరయ పకోడీ !

ఆ కమ్మదనము నా రుచి
యా కర కర యా ఘుమ ఘుమ, యా పొమకములా
రాకలు పోకలు వడుపులు
నీకేదగు నెందులేవు పకోడీ !

నీ కర కర నాదంబులు
మా కర్ణామృతములు, నీదు మహితాకృతియే
మా కనుల చందమామగ
నే కొనియాడెదను సుమ్ము నిన్ను పకోడీ!

ఇలా ఎంతో మంది కవులు పకోడీమీద పద్యాలు రాశారు. మా తాతగారు కూడా రాసారనుకొండి . 
ఈ పకోడీ రిసిపీ గురించి అందరితో నా అనుభవం పంచుకుంటాను...ఒక రోజు మా ఇంటికి మా తాతగారిని కలవడానికి తాత  ఫ్రెండ్స్ వచ్చారు.వచ్చిన వారికీ ఎదో ఒకటి పెట్టడం మన అందరి అలవాటు కదా ఉట్టిగా  టీ ఇవ్వలేము కదా  ఇంట్లో ఉల్లిపాయలు,బెండకాయలు,దొండకాయలు ఉన్నాయి,బెండకాయ,దొండకాయ తో ఏమి చేసి ఇవ్వలేము..పోనీ ఉల్లిపాయ గట్టి పకోడీ చేద్దాం అంటే తరగడానికే సగం సమయం అయ్యిపోతుంది..అందుకని మా అమ్మమ్మ నేర్పిన ఈ పకోడీ గుర్తు వచ్చి పది నిమిషాల్లో చేసి వాళ్లకు పెట్టాము వాళ్ళు అంతో అందనందించారు...రుచి ఎంతో కమ్మగా,హాయిగా ఉంటుంది..... పకోడీ అంటే ఇష్టం ఉండనివారు ఎవరు ఉంటారు చెప్పండి. :) 

మా అమ్మమ్మ నేర్పిన పకోడీ రిసిపి మీకోసం . 

కావలిసిన పదార్ధాలు..
   ఉల్లిపాయలు - 2 
 పచ్చిమిర్చి   -  3
                   కరివేపాకు    -   సన్నగా తరిగింది 1 1/2 చెంచా 
             కొత్తిమీర       - సన్నగా తరిగింది   1 1/2 చెంచా 
నెయ్యి          - 1 చెంచా
   నీళ్లు             - సరిపడినంత   
    నూనె         - డీప్  ఫ్రై కి సరిపడినంత 
   ఉప్పు        - రుచికి సరిపడినంత 

              సెనగపిండి   - 1 కప్

తయారీ విధానం :

ముందుగా ఉల్లిపాయలు ని కొంచం పెద్ద ముక్కలుగా తరుగుకోవాలి (డైస్ ) అందులో పచ్చిమిర్చి, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, నెయ్యి  వేసి బాగా కలుపుకోవాలి.  అందులో సెనగపిండి వేసి బాగా కలిపిన తరువాత నీళ్లు వేసుకుని ఇడ్లీ పిండిలాగా కలుపుకోవాలి.  ఇప్పుడు వాటిని వేడి వేడి నూనె లో వేసి మీడియం ఫ్లేమ్ మీద కదపకుండా పైకి తేలిన తరువాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి..

బయట క్రిస్ప్య్ గ లోపల  సాఫ్ట్ గ ఉంటాయి (ఇంకా బాగా రవాలి అంటే ఒక రెండు నిముషాలు బాగా బీట్(beat) చేసుకోవాలి) అంతే  పది నిముషాలు తయారు అయ్యిపోతుంది  . 


ఇదండీ పకోడీ కథ,  కమామిషు పద్యాలతో. తిని ఆస్వాధించండి. 


 


 

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)