నాకు ఇప్పటికీ గుర్తువుంది ఊరిలో మా అమ్మమ్మగారి ఇంటి వాతావరణం ఎప్పటికీ నాకు గుర్తుండిపోతుంది. వేసవి సెలవుల్లో చల్లటి సాయంత్రం వేళ అమ్మమ్మ తాత మావయ్య అంతా మేడమీద చల్లాగావుండేది. అక్కడ అమ్మమ్మ అందరికీ పక్కవెసి అందరికీ బొజనం కలిపి ఒక్కొక్కరికీ తన చేతితో గొరుముద్దలు తినిపించేది . ఆచల్లగాలికి నెను అమ్మమ్మ ఒళ్ళో తలపెట్టుకొని పడుకొనేదాన్ని అమ్మమ్మ తన చెయ్యితో సున్నితంగా నిమురుతూ కదలు మంచి విషయాలు చెప్పేది.
కానీ నాకు మాత్రం, అమ్మమ్మతో గడిపిన ప్రతి క్షణం చాలా ప్రత్యేకం.
ఒక్క రోజు, గడ్డిమీద కూర్చుని, నెయ్యి వేసిన పెసరట్టు తింటూ అమ్మమ్మకి చెప్పాను :
"అమ్మమ్మా! నీ కథలు చాలా మిస్ అయ్యా!"
ఆమె నవ్వుతూ నన్ను ఒడిలోకి తీసుకొని మళ్లీ ఓ పాత కథ ప్రారంభించింది — అరిష్టబుద్ధి అనే గుడ్లగూబ కథ చెప్పింది నాకు తెలియని ప్రతీ పదానికి అర్థం చెబుతూ, ఓసారి కథ ముగిసిన తరువాత, "ఇందులో నీవు ఏం నేర్చుకున్నావు?" అని అడిగేది.
నా చిన్నప్పటినుండి అలా ఆమెతో ఉన్నాను.పగలు, సాయంకాలాలు, బంగారు రంగుల పచ్చడీ వాసనలతో నిండిన ఆమె వంటగది — అమ్మమ్మ చేతుల గాజుల సవ్వడి ఇవన్నీ ఇప్పటికీ నా మనసులో మెరిసిపోతున్నాయి.
సమయం గడిచిపోయింది. కానీ ఇప్పుడు అమ్మమ్మ లేరు. కానీ ఆమె ప్రేమ, ఆమె మాటలు, ఆమె కథలు మాత్రం నాకు మార్గదర్శకంగా ఉన్నాయి.
ప్రతి సారి కష్టపడి పాఠాలు చదివినప్పుడు, లేదా ఎవరికైనా సహాయం చేసినప్పుడు — "నీవు మా అమ్మమ్మలా ఉన్నావు!" అని నాలో నేనే భావిస్తాను. థేంక్యు అమ్మ్మమ్మ
ఈ రోజు హిందువులకు మరియు జైనులకు ప్రత్యకమైన రోజు, అదే అక్షయ తృతీయ . వైశాఖ శుద్ధ తదియనే అక్షయ తృతీయ గా పిలుస్తారు. సంస్కృతం లో ' అక్షయ ' అనగా క్షయం కానిది , తరిగి పోనిది అని అర్థం. హిందూ పంచాంగం ప్రకారం అక్షయ తృతీయ రోజంతా అత్యంత శుభ కరమైన ముహూర్త కాలంగా భావిస్తారు. అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే సంపద అక్షయమవుతుందని భారతీయుల నమ్మకము. ఈ రోజు నాడే రైతులు విత్తనాలుకు పూజ చేసి నాటుతారు. ఎందుకంటే విత్తులు మంచిగా వ్యవసాయం వృద్ది చెందుతుంది. ఇంకా "అక్షయ తృతీయ" నాడే మహావిష్ణువు ఆరో అవతారమైన పరుశురాముడు జన్మించాడని పురాణాలు చెబుతున్నారు. భగీరధుడు తపస్సు ఫలితంగా గంగానది భూమి తరలి వచ్చిన రోజు. యజ్ఞ యాగాదులు చేయటానికి మంచి కాలం. శ్రీ కృష్ణులవారి బాల్య స్నేహితుడు కటిక దరిద్రుడైన సుదాముడు కృష్ణుని దగ్గరకు వెళ్లి అటుకులు సమర్పించి అత్యంత దనవంతుడైనాడు. ధర్మరాజు సూర్యనారాయణ మూర్తి నుండి అక్షయ పాత్రను పొందినాడు. వ్యాసుడు మహాభారతాన్ని చెప్తున్నప్పుడు విఘ్ననాయకుడు అయిన గణపతి భారతాన్ని రాయటం మొదలు పెట్టినరోజు. శంకరాచార్యులు వారు కనకదరా స్తోత్రాన్ని పాడితే కనకం వర్షంలాగ పడిన రోజు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు నిండు సభలో ద్రౌపది కి వస్త్రాపహరణ చేసి అవమానించదలిచారు , అప్పుడు ఆమెకి శ్రీ కృష్ణులు వస్త్రాలు ఇచ్చి ద్రౌపదిని కాపాడిన రోజు. అక్షయ తృతీయ నాడు శ్రీ నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజేనని పురాణాలు చెబుతున్నాయి. కుబేరుడు, దేవతల కోశాధికారి, ధనానికి దేవత అనీ. లక్ష్మీ దేవి మరియు కుబేరుడు అక్షయ్ తృతీయ నాడు పూజిస్తే, సంపద కలగ చేస్తుంది. అంతే కాదు ఈరోజు నాడే అన్నపూర్ణాదేవి జన్మించినది. ఈరోజు కి ఇన్ని విశేషాలు వున్నాయి కాబట్టే అందుకే ఈ పర్వదినాన పుష్పమో, ఫలమో భగవంతుడికి సమర్పించినా, దైవనామస్మరణ చేసినా, చివరికి నమస్కారం చేసిన సంపద, పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి. ఈ క్రమంలో అక్షయ తృతీయ నాడు బంగారం కొనడంతో పాటు అనేక శుభకార్యాలను చేపట్టవచ్చును. ఇందులో పిల్లలను పాఠశాలలో చేర్చడం, పుస్తకావిష్కరణ, పుణ్యస్థలాలను సందర్శించడం వంటి మంచి కార్యాలను చేయవచ్చునని పురోహితులు సూచిస్తున్నారు.
అమ్మమ్మ నేర్పిన మెత్తని పకోడీ రిసిపి చెప్పే ముందు కొన్నివిషయాలు మీతో షేర్ చేసుకుంటాను . ఈ పకోడీ మీద పూర్వపు కవులు అనేకమైన పద్యాలు రాశారు.
అందులో కొన్ని
చిలకమర్తి వారు పకోడీపై కొన్ని పద్యాలు ఆశువుగా చెప్పారు. పద్యాలు చదివి పకోడీ రుచి ఆస్వాదించండి.
వనితల పలుకులయందున ననిముష లోకమున నున్న దమృతమటంచున్ జనులనుటె గాని, లేదట కనుగొన నీయందమృతము గలదు పకోడీ !
ఎందుకు పరమాన్నంబులు ఎందుకు పలు పిండివంటలెల్లను నాహా ! నీ ముందర దిగదుడుపున కని యందును సందియము కలుగ దరయ పకోడీ !
ఆ కమ్మదనము నా రుచి యా కర కర యా ఘుమ ఘుమ, యా పొమకములా రాకలు పోకలు వడుపులు నీకేదగు నెందులేవు పకోడీ !
నీ కర కర నాదంబులు మా కర్ణామృతములు, నీదు మహితాకృతియే మా కనుల చందమామగ నే కొనియాడెదను సుమ్ము నిన్ను పకోడీ!
ఇలా ఎంతో మంది కవులు పకోడీమీద పద్యాలు రాశారు. మా తాతగారు కూడా రాసారనుకొండి .
ఈ పకోడీ రిసిపీ గురించి అందరితో నా అనుభవం పంచుకుంటాను...ఒక రోజు మా ఇంటికి మా తాతగారిని కలవడానికి తాత ఫ్రెండ్స్ వచ్చారు.వచ్చిన వారికీ ఎదో ఒకటి పెట్టడం మన అందరి అలవాటు కదా ఉట్టిగా టీ ఇవ్వలేము కదా ఇంట్లో ఉల్లిపాయలు,బెండకాయలు,దొండకాయలు ఉన్నాయి,బెండకాయ,దొండకాయ తో ఏమి చేసి ఇవ్వలేము..పోనీ ఉల్లిపాయ గట్టి పకోడీ చేద్దాం అంటే తరగడానికే సగం సమయం అయ్యిపోతుంది..అందుకని మా అమ్మమ్మ నేర్పిన ఈ పకోడీ గుర్తు వచ్చి పది నిమిషాల్లో చేసి వాళ్లకు పెట్టాము వాళ్ళు అంతో అందనందించారు...రుచి ఎంతో కమ్మగా,హాయిగా ఉంటుంది..... పకోడీ అంటే ఇష్టం ఉండనివారు ఎవరు ఉంటారు చెప్పండి. :)
మా అమ్మమ్మ నేర్పిన పకోడీ రిసిపి మీకోసం .
కావలిసిన పదార్ధాలు..
ఉల్లిపాయలు - 2
పచ్చిమిర్చి - 3
కరివేపాకు - సన్నగా తరిగింది 1 1/2 చెంచా
కొత్తిమీర - సన్నగా తరిగింది 1 1/2 చెంచా
నెయ్యి - 1 చెంచా
నీళ్లు - సరిపడినంత
నూనె - డీప్ ఫ్రై కి సరిపడినంత
ఉప్పు - రుచికి సరిపడినంత
సెనగపిండి - 1 కప్
తయారీ విధానం :
ముందుగా ఉల్లిపాయలు ని కొంచం పెద్ద ముక్కలుగా తరుగుకోవాలి (డైస్ ) అందులో పచ్చిమిర్చి, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. అందులో సెనగపిండి వేసి బాగా కలిపిన తరువాత నీళ్లు వేసుకుని ఇడ్లీ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటిని వేడి వేడి నూనె లో వేసి మీడియం ఫ్లేమ్ మీద కదపకుండా పైకి తేలిన తరువాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి..
బయట క్రిస్ప్య్ గ లోపల సాఫ్ట్ గ ఉంటాయి (ఇంకా బాగా రవాలి అంటే ఒక రెండు నిముషాలు బాగా బీట్(beat) చేసుకోవాలి) అంతే పది నిముషాలు తయారు అయ్యిపోతుంది .
మామిడికాయలు సీజన్ వచ్చిందంటే మనకి ముందుగా ఆవకాయ సీజన్ అన్నట్టు . మనం పచ్చళ్ళు ఇష్టంగా తయారుచేసుకుంటాం కదా. ఒక్కొక్కసారి మనకి చాలా వుపయోగకరంగావుంటుంది. మనకి కొన్ని పచ్చళ్ళు తెలుసు. కొన్ని తెలియవు. అయితే సాంప్రదాయ పద్దతిలో మన చేసుకునే పచ్చళ్ళు అన్నీ ఒక లిష్ట్ గా ఇక్కడ వుంచాను. తెలియనివారు. సందేహాలువున్నవారు. ఎలా చేసుకోవాలో ఒక్క సారి చూసి చేసుకోండి. సంవత్సరం మొత్తం ఎంజోయ్ చేయండి.
ఇది మా అమ్మమ్మ రిసిపీ నాకు నేర్పించింది
ఇంగువ మిరపకాయలు రిసిపీ:
కావలిసిన పదార్థాలు :
ఎండు మిరపకాయలు - 5
నూనె - అర కప్పు
ఇంగువ - చిటికెడు
విధానం:
ముందుగా ఎండు మిరపకాయలు ముచుకులు తీసి పెట్టుకోవాలి.
స్టవ్ వెలిగించి ముందుగా బాండి పెట్టుకొని అందులో నూనె వేడిచేసుకొని అందులో 3 చిటికెలు ఇంగువ పొడి వేసి తరువాత ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి.
మిరపకాయలు ఎర్రగా వేయించుకోవాలి. స్టవ్ ఆపివేసుకొని మిరపకాయలని నూనెలోనే వుండనివ్వాలి. నూనెను బాగ పీల్చుకొని. రుచిగా వుంటాయి.
ఏదైనా పప్పు లేదా పప్పుకూరలలో అన్నంతో పాటు నంచుకుని తింటే అధిరిపోతుంది అంతే.ఇది నిల్వ పచ్చడిలో కూడా ఎంతో రుచిగా ఉంటుంది మరి మీరు కూడా చేసుకుని చుడండి
ఏప్రిల్ 1 ని మనం ఏప్రిల్ ఫూల్ రోజు గా జరుపుకుంటాం. దీనికి ఒక కధ వుంది. అది ఏమిటంటే పదహారో శతాబ్దం మధ్య వరకు యూరప్ లో కూడ సంవత్సరాది మార్చి నెల మధ్యలోనే జరుపుకునేవారు. యూరప్ లో ఈ నూతన సంవత్సరపు ఉత్సవాలు మరియు వసంత కాలపు ఉత్సవాలు కలిపి ఓ పది రోజుల పాటు వరసగా జరుపుకునేవారు. ఏప్రిల్ 1 రాగానే ఈ ఉత్సవాలు ముగిసే సందర్భంలో ఒకరికొకరు బహుమానాలు ఇచ్చి పుచ్చుకునేవారు. ఇలా ఎప్పుడూ ఘనంగా జరుపుకునేవారు. అలావుండగా అప్పటి ఫ్రాంసు దేశపు రాజు సంవత్సరాదిని మార్చి మధ్య నుండి జనవరి 1 వ తారీఖుకి మార్చుతూ ఒక నోటీసు జారీ చేసాడు. ఆ రోజులలో వార్తాపత్రికలు, రేడియోలు, టీవీలు, కంప్యూటర్స్ లేవు. వారు అప్పట్లో దండోరా వేయించి వుంటారు. కాని రాజు గారి నోటీసు అందరికీ చేరలేదు. అందిన వాళ్ళు కూడ పాత అలవాట్లని వారు మార్చుకోలేకపోయారు. కనుక రాజధానిలో సంవత్సరాది జనవరి ఒకటిన జరిగిపోయినా కానీ దేశపు మూలల్లో మాత్రము ఏప్రిల్ 1 న బహుమానాలు ఇచ్చుకోవటంమానలేదు. అందుకని వాళ్ళని ఎగతాళిగా ఏప్రిల్ ఫూల్స్ అనేవారు. పాత అలవాట్లు మనలేక వారు జరుపుకుంటున్నారు కదా. అందుకని ఇప్పటికీ అల్లరిగా బహుమానాలు ఇచ్చుకోవటం, మరియు ఒకరిని ఒకరు ఫూల్స్ చేసుకుంటున్నారు. అందుకే ఏప్రిల్ 1 ని ఫూల్స్ డే గా జరుపుకుంటున్నారు. చాలా సరదాకా వుంటుంది. ఫూల్స్ అయ్యినవారు బాధపడకుండా సరదాగా తీసుకొని ఎంజాయ్ చేయచ్చు. ఫూల్స్ డే బాగుంది కదండి. Enjoy The Fools Day .