Blogger Widgets

మంగళవారం, ఫిబ్రవరి 23, 2016

ఉదయాద్రి తెలుపాయె

మంగళవారం, ఫిబ్రవరి 23, 2016

తాళపాక  అన్నమయ్య 95 సంవత్సరాలు పరిపూర్ణ జీవితం గడిపి దుందుభి నామ సంవత్సరం ఫల్గుణ బహుళ ద్వాదశి నాడు (ఫిబ్రవరి 23, 1503) పరమపదించాడు. రాగిరేకులమీద వ్రాసిన తిధుల కారణంగా అతని జన్మ, మరణ దినాలు తెలుస్తున్నాయి.  ఇతడు శ్రీమహావిష్ణువు యొక్క ఖడ్గం అయిన నందకాంశ సంభూతుడు అని భావన ఉంది. "పదకవితా పితామహుడు", "సంకీరత్నాచార్యుడు", "పంచమాగమ సార్వభౌముడు", "ద్రవిడాగమ సార్వభౌముడు" - ఇవి అన్నమయ్యకు సమకాలీనులు సాదరంగా ఇచ్చిన బిరుద నామాలు.  అన్నమయ్య వర్ధంతి సందర్బంగా ఒక మంచి పాట. 
ఉదయాద్రి తెలుపాయె నుండు రాజు కొలు వీడె | 
అద నెర్కిగి రాడాయె నమ్మ నా విభుడు ||
చన్నులపై ముత్యాల సరులెల్ల జల్లనాయె | 
కన్నులకు గప్పొదవె గాంత నా కిపుడు |
కనె కలువల జాతి కనుమోడ్చినది మీద | 
వెన్నెల వేసంగి మొగ్గ వికసించె గదవె ||
పువ్వుల లోపలి కురులు బుగులు కొనగా నెర్కసె | 
దవ్వుల దుమ్మెదగములు తరమి డాయగను |
రవ్వసేయ శుక పికము రాయడి కోర్వగ రాదు | 
అవ్వలనెవ్వతె పసల కలరున్నవాడో ||
పన్నీట జలక మార్చి పచ్చకప్రము మెత్తి | 
చెన్ను గంగొప్పున విరులు చెరువందురిమి |
ఎన్నంగల తిరువేంకటేశుం డిదె ననుంగూడి | 
కన్నుల మనసునుం దనియం గరుణించెం గదవే ||

ఆదివారం, ఫిబ్రవరి 14, 2016

భక్తానా మభయప్రదం దినకరం

ఆదివారం, ఫిబ్రవరి 14, 2016

సప్తాశ్వ రథ మారూడం
ప్రచండం కశ్యపాత్మజం 
శ్వేత పద్మ ధరం దేవం
తం సూర్యం ప్రణమామ్యహం 

సూర్యభగవానుని ధ్యాన శ్లోకం !
ధాయెత్పూర్యః మనంతకోటి కిరణం
త్రైలోక్య చూడామణి,
భక్తానా మభయప్రదం దినకరం
జ్యోతిర్మయం శంకరమ్,
ఆదిత్యం జగదీశ మచ్యుత మజం
త్రైయార్ధసారం రవిమ్,
భక్తా భీష్ట ఫలప్రదం ద్యుతినిభం
మార్తాండ మధ్యం విభుమ్!!


ఉషోదయ కిరణాలతో సమస్త జీవ కోటినీ నవ చైతన్యంతో ఉంచుతున్న ఆ సూర్యభగవానుడి జన్మదినమును ధసప్తమి గా జరుపుకుంటాం.  ప్రత్యక్ష భగవానుడు  సమయపాలనా చక్రవర్తి... ఆరోగ్యదాత... అభయప్రదాత... అన్న పేర్లున్నవాడు. రాత్రిపగళ్లతో- చీకటివెలుగులను పంచడంలో సిద్ధహస్తుడు. ఆయనే సూర్యుడు. అదితికశ్యపులకు పుట్టిన సూర్యభగవానుడి జన్మదినమే రథసప్తమి.  రధసప్తమి రోజునుండి వేసవి కాలము ప్రారంబమవుతుంది . అందుకే రధసప్తమిరోజు తప్పకుండా సూర్య నమస్కారములు చేయాలి. మనకు ప్రతినిత్యము ప్రత్యక్షముగా కనిపించే దైవం సూర్యభగవానుడు. ప్రపంచములో అన్ని జీవరాసులకు వేడి, వెచ్చదనము, పాడిపంటలను, వెలుగును ఇచ్చేవాడు భాస్కరుడు. సుర్యారాధన మనకు వేద కాలమునుండి ఉంది. సూర్యుని పేరు సప్తిమ. ఏడు గుర్రాలను (ఏడు  గుర్రముల పేర్లు వరుసగా గాయత్రి, బృహతి, ఉష్ణిక్, జగతి, త్రిష్ణుప్, అనుష్ణుప్, పంక్తి )  వంచిన రధము కలిగినవాడు. సప్తలోకములకు తన శక్తిని ప్రసాదించువాడు సూర్య కిరణాలు ఏడురంగులకు నిదర్శనమని, రధసప్తమినాడు ఆకాసములో గ్రహ నక్షిత్ర సన్నివేసం రధమును పోలి ఉంటుంది కనుకనే ఈ తిధిని రధసప్తమి అని పేరు వచ్చింది.
అనంతసక్తితో కూడుకొన్న కిరణాలు, తేజస్సు, శుద్ధమైన వాడు , భక్తులకు అభయము ఇచ్చేవాడు. జగతికి వెలుగుకారకుడు, జ్యోతిర్మయుడు, శుభానిచ్చే ఆదిత్యుడు, చీకటి పారద్రోలేవాడు, భక్తుల కోరికలు తీర్చేవాడు ఆదిత్యుడు , మార్తాండుడు, శుభంకరుడు, భాస్కరుడు అయిన సూర్యనారాయణమూర్తికి నమస్కారములు అంటూ ధ్యానించాలి.
సుర్యుడు ఆరోగ్య ప్రదాత. అది సైన్స్ ద్వారా కూడానిరూపించబడినది. సూర్య కిరణాలలో డి విటమిన్ కలదు. ఎముకలకు  బలముగా వుంటాయి.  కేన్సర్ రాకుండా కాపాడతాయి.  ఒకప్పుడు సూర్యరశ్మి సమృద్ధిగా ఉండే భారతదేశంలో.. ప్రజలకు అసలు 'విటమిన్‌-డి' లోపమనేదే ఉండదని భావించేవారు. కానీ నేడది వట్టి అపోహేనని తాజా అధ్యయనాలన్నీ రుజువుచేస్తున్నాయి. ప్రస్తుతం మన దేశంలో 90% మందికి విటమిన్‌-డి లోపం ఉంది.
అన్నట్టు రధసప్తమి రొజు స్త్రీలు ఎన్నో నోములు చెయటానికి ప్రారంబధినముగా చెయుదురు. అక్షింతలు వేసుకొని నోములకు నాంది పలుకుదురు.
శుద్ధ సప్తమికి ’రథసప్తమి’ అని పేరు. ఈరోజు ఒక పరిపూర్ణ పర్వం. దీక్షానిర్వహణకి, వ్రతాచరణకి, సాధనాలకు ఈ సప్తమి ప్రసిద్ధి. ఏడాది పొడుగునా సూర్యారాధన చేసిన ఫలం ఈ దినం లభిస్తుంది.
సూర్యునికి రాగి పాత్ర ద్వారా అర్ఘ్యాన్నివ్వడం, ఎర్రచందనం, ఎర్రపువ్వులతో అర్చన చేయడం వంటివి ఈ రోజు ప్రత్యేకతలు.ఆవుపాల పాయసం నివేదించడం, అది కూడా ఆరుబయట సూర్యకిరణాలు పడే తావున ఆవుపేడ పిడకలను మండించి, దానిపై పాయసాన్ని పొంగించడం ఒక చక్కని ప్రక్రియ. వైద్యవిధానం, దేవతా మహిమ కలబోసిన పద్ధతి ఇది.
’రథ’శబ్దం గమనంలోని మార్పుని సూచిస్తుంది. సూర్యకిరణ ప్రసారం భూమికి లభించే తీరులో ఈ రోజునుండి ఒక మలుపు. ఈ మలుపులోని దేవతా ప్రభావాన్ని పొందేందుకు మన సంస్కృతిలో ఈ ఆనవాయితీని ప్రవేశపెట్టారు.
రామాయణంలో రావణవధి సమయంలో శ్రీరాముడు ’ఆదిత్యహృదయం’తో సూర్యోపాసన చేసి విజయం సాధించాడు. భారతంలో ధర్మరాజు ధౌమ్యుని ద్వారా సూర్యాష్టోత్తర శతనామ మంత్రమాలను ఉపదేశం పొంది , ఆదిత్యానుగ్రహంతో అన్న సమృద్ధిని, అక్షయపాత్రని సంపాదించాడు.
శ్రీకృష్ణుని పుత్రుడు సాంబుడు సూర్యోపాసన ద్వారా కుష్టువ్యాధి నుండి విముక్తుడయ్యాడు. చారిత్రకంగా మయూర కవి సూర్యశతక రచనతో ఆరోగ్యవంతుడయ్యాడు.
ఇలా పౌరాణిక చారిత్రకాధారాలు రవికృపా వైభవాన్ని చాటి చెబుతున్నాయి.  ఆదిత్య హృదయం అనే ఈ స్తోతము సూర్యభగవానుడి ని ఉద్దేశించినది. రామాయణం యుద్ధకాండలో శ్రీ రాముడు అలసట పొందినప్పుడు, అగస్త్య మహర్షి యుద్ధ స్థలానికి వచ్చి ఆదిత్య హృదయం అనే ఈ మంత్రాన్ని ఉపదేశిస్తారు.ఈ ఉపదేశము అయిన తరువాత శ్రీరాముడు రావణాసురుడిని నిహతుడిని చేస్తాడు. వాల్మీకి రామాయణం లోని యుద్ధకాండమునందు 107 సర్గలో ఈ అదిత్య హృదయ శ్లోకాలు వున్నాయి.  
సూర్య రశ్మిలో విటమిన్ D ఉంటుంది అది ఎముకల పటుత్వానికి అవసరం అని చెబుతారు. అంతే కాకుండా విటమిన్ D కణ విభజనలో కూడా తోడ్పడుతోంది. దీన వలన గాయాలు మానడమే కాకుండా కాన్సర్ రాకుండా కూడా ఉపయోగం ఉంటుంది. సూర కాంతికి ఎక్కువగా ఎక్స్‌పోజ్ అయిన వారిలో చాలా రకాల కాన్సర్ తక్కువగా వస్తుంది అని డాక్టర్స్ చెబుతారు. ముఖ్యంగా పెద్ద పేగు, మల ద్వారానికి సంబంధించిన కాన్సర్ మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.  పన్నెండు భంగిమలతో కూడిన సూర్యనమస్కారాలలో ఒక సంక్షిప్తమైన ప్రాణాయామం, ధ్యానం సమ్మిళితమైన వ్యాయామం ఇమిడి ఉన్నాయి. 

శుక్రవారం, ఫిబ్రవరి 12, 2016

దయానంద - 'పాఖండ ఖండిని '

శుక్రవారం, ఫిబ్రవరి 12, 2016

దయానంద - 'పాఖండ ఖండిని ' పతాకము 
ఆర్యసమాజ్ స్థాపకుడు, అజ్ఙానాంధకారం, దారిద్య్రం, అన్యాయన్ని ఎదురించి పోరాడి, హిందు ధర్మ సంస్థాపనకు నడుం బిగించిన స్వామి దయానంద సరస్వతి జయంతి నేడు   ఈయన 1857 ప్రథమ స్వాతంత్ర పోరాటం లో చాలా ముఖ్యమైన  పాత్ర పోషించి, ఎందరో స్వాతంత్ర  సమర యోధులకు ప్రేరణ గా నిలిచాడు స్వామీ దయానంద సరస్వతి .
స్వామి దయానంద సరస్వతి 1824 సంవత్సరం లో గుజరాత్ లోని  ఠంకార అనే గ్రామంలోని  మహాశివభక్తులు అయిన ఒక వర్తక కుటుంబం లో జన్మిచారు.  ఈయన చిన్ననాటి నుండి భగవద్భక్తి ఎక్కువగా  కలిగివున్నాడు.  1846 లో భగవంతుడిని వెతకడానికి ఇల్లు వదిలి వెళ్లాడు. ఈ ప్రయాణంలో ఎందరో యోగులు మునుల సాంగత్యంలో గడిపి దయానందఅన్న నామం పొందాడు. భగవంతుని తపనలో భ్రమిస్తూ మథుర లోని స్వామి విరజానంద సరస్వతి కడకు చేరుకున్నాడు, అక్కడే వేదోపనిషత్తులను ఔపోసనం పట్టి గురువు ఆజ్ఞ మేరకు దేశమంతట ప్రబోధించుటకు బయలుదేరెను.  ధర్మం పేరిట జరిగే మోసాలు మూఢనమ్మకాలు గ్రహించాడు.  అలాంటి అధర్మాలను రూపుమాపటానికి ప్రయత్నించారు.  ప్రయాణ మార్గమున దేశ స్థితిగతులు, దీనమైన శోచనీయమైన హిందు సమాజమును అవగాహన చేసుకున్నాడు. భారతావని బ్రిటిష్ పాలనలో ఉంది, ఒకప్పుడు విశ్వమానవ సామ్రాజ్యానికి, ధర్మ సంస్కృతులకు కేంద్రమైన దేశం ఇప్పుడు, అపారమైన దరిద్రంలో స్వయం వినాశనానికి పరుగులెడుతుండడం చూసి శోకించాడు. హిందు సమాజం ఎటువైపు నుండి చూసినా కుల, మత వర్గ విభేదాలతో ఖండములగుచున్నది, అంధ విశ్వాసం, అంటరానితనం, సతి, బాల్య వివాహాలు ధర్మం పేరుతో జరుగుతున్న అవాంఛనీయమైన ఆచారాలు చూసిచలించి పోయి వాటిని ఛేదించడానికి 'పాఖండ ఖండిని ' అన్న పతాకాన్ని ఆవిష్కరించినాడు. భారత దేశాన్ని, హిందు సమాజాన్ని జాగృత పరచాలని సంకల్పించి ఎన్నో పురోగామి సంస్కరణలు చేపట్టాడు. అందులో భాగంగా సతి, బాల్య వివాహాలు, అంటరానితనం, వరకట్న దురాచారాన్ని బహిష్కరించాడు. స్త్రీ విద్య పరిచయం చేసాడు. బ్రిటిష్ సామ్రాజ్యవాదం పోవాలని నమ్మి (స్వరాజ్) స్వయం పరిపాలన అని మొదటి సారి గొంతెత్తినాడు. దయానందుడు వ్రాసిన సత్యార్థ ప్రకాశ్ లో భారత దేశం నుండి సమస్త భారతీయుల మనసులలోని మూఢ నమ్మకాలు, అంధవిశ్వాసాల నిర్మూలన గూర్చి వ్యాఖ్యానించాడు. ధర్మ సంస్థాపనకు శాశ్వత సంస్థగా, దేశ సంఘ సంస్కరణకు పునాదిగా, 10 ఏప్రిల్ 1875 న ముంబాయి నగరంలో మొదటి ఆర్యసమాజము స్థాపించినాడు. ఈ క్రమంలో దయానంద సరస్వతి పెక్కుమందికి కంట్లో నలుసు అయినాడు, పూర్వం ఏడు సార్లు విషప్రయోగాలు జరిగిననూ బస్తి, న్యోళి అనే యోగ ప్రక్రియ ద్వారా ప్రేగులను ప్రక్షాళనము చేసుకుని వాటిని విఫలము చేసినను, చివరిసారిగా 30 అక్టోబర్ 1883 సాయంత్రము జరిగిన విష ప్రయోగంతో క్షీణిస్తూ ఓంకారనాదంతో సమాధి అవస్థలో మోక్షాన్ని పొందాడు.

ఆదివారం, జనవరి 31, 2016

హరి రసమా విహారి సతు

ఆదివారం, జనవరి 31, 2016


హరి రసమా విహారి సతు
సరసోయం మమ శ్రమ సంహారి

దయా నిభృత తనుధారి సం
శయాతిశయ సంచారి
కయాప్యజిత వికారి
క్రియా విముఖ కృపాలధారి

సదా మిథ్యా జ్ఞానీ సతు
మదాలిమతాభిమానీ
తదా శ్రిత సంధానీ సతు
తదా తదా చింతా శయనాని 

పరామృత సంపాది
స్థిరానందాశ్రేది
వరాలాభ వివాది శ్రీ -
తిరువేంకటగిరి దివ్య వినోది

శనివారం, జనవరి 30, 2016

అమరవీరుల దినోత్సవం

శనివారం, జనవరి 30, 2016

మోహన్ దాస్ కరంచంద్ గాంధీ భారతీయులందరిచే ఆదరింపబడే ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడు. ప్రజలు ఆయనను జాతిపిత గా గౌరవిస్తారు. సత్యముఅహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ,సత్యాగ్రహము ఆయన ఆయుధాలు. 20వ శతాబ్దిలోని రాజకీయనాయకులలో అత్యధికముగా మానవాళిని ప్రభావితము చేసిన రాజకీయ నాయకునిగా ఆయనను కేబుల్ న్యూస్ నెట్వర్క్(CNN) జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారు. కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటి, ఆ మహాత్ముడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్నిగడగడలాడించాడు. సత్యాగ్రహమూ, అహింస పాటించడానికి ఎంతో ధైర్యము కావాలని బోధించాడు. మహాత్ముడనీ, జాతిపిత అనీ పేరెన్నిక గన్న ఆయన ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యము సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు.   1948 జనవరి 30వ తారీఖున ఢిల్లీలో బిర్లా నివాసంవద్ద ప్రార్థన సమావేశానికి వెళ్తుండగా ఆయనను నాథూరామ్ గాడ్సే  అనే వ్యక్తి రివాల్వర్ తో గాంధిజీ ని కాల్చి చంపాడు. నేలకొరుగుతూ గాంధీ "హే రామ్" అన్నాడని చెబుతారు.   గాంధి వర్ధంతిని అమరవీరుల దినోత్సవం గా జరుపుకుంటున్నారు  . ఈరోజున భారతదేశం అంతట 11గంటలకి సైరన్ మోగుతుంది . భారతదేశ ప్రజలందరూ స్వాతంత్రం పోరాటంలో ప్రాణాలు  అమరవీరులకు 2 నిమిషాలు మౌనం  శ్రద్ధాంజలి ఘటిస్తారు.  

మంగళవారం, జనవరి 26, 2016

Happy Republic Day

మంగళవారం, జనవరి 26, 2016

శుక్రవారం, జనవరి 08, 2016

అలుకలు చెల్లవు

శుక్రవారం, జనవరి 08, 2016


అలుకలు చెల్లవు హరి పురుషోత్తమ
నలి నిందిర నీతో నవ్వినది // పల్లవి //

ఆదిలక్ష్మి మోహన కమలంబున
వేద మాత నిను వేసినది
ఆదెస నీపై నభయహస్తమును
సాదరముగ గడు సాచినది // అలుకలు //

సిరి దన కన్నుల చింతామణులను
పొరి నీపై దిగ బోసినది
వరద హస్తమున వలచెయి బట్టుక
అరుదుగ నిను మాటాడించినది// అలుకలు //

జలధి కన్య తన సర్వాంగంబుల
బిలిచి నిన్ను నిటు పెనగినది
అలముక శ్రీ వేంకటాధిప నిను రతి
నెలమి నీ వురంబెక్కినది// అలుకలు //


సోమవారం, జనవరి 04, 2016

వెట్టి వలపు చల్లకు విష్ణుమూరితి నాతో

సోమవారం, జనవరి 04, 2016

 వెట్టి వలపు చల్లకు విష్ణుమూరితి నాతో |
 వెట్టిదేర మాటాడు విష్ణుమూరితి ||


వినయము సేసేవు విష్ణుమూరితి | 


వెనకటి వాడవెగ విష్ణుమూరితి |
వినవయ్యా మామాట విష్ణుమూరితి మమ్ము | 


వెనుకొని పట్టకుమీ విష్ణుమూరితి ||


వెరపుగల వాడవు విష్ణుమూరితి నేడు | 

వెరగైతి నిన్ను జూచి విష్ణుమూరితి |
విరివాయె నీమాయలు విష్ణుమూరితి నాకు | 


విరులిచ్చే వప్పటికి విష్ణుమూరితి ||


వెలసె నీ సేతలెల్ల విష్ణుమూరితి మా- | 

వెలుపలలోన నీవె విష్ణుమూరితి |
వెలలేని శ్రీవేంకట విష్ణుమూరితి కూడి | 

విలసిల్లితివి నాతో విష్ణుమూరితి ||

విశ్వరహస్యాల గుట్టు విప్పిన మహానుభావుడు.

మూడు ఆపిల్స్ ప్రపంచ గమనాన్నే మార్చేశాయి. ఒకటో ఆపిల్...ఆడమ్ - ఈవ్ రుచి చూసిన నిషిద్ధ ఫలం. రెండో ఆపిల్...న్యూటన్ విశ్రాంతి తీసుకుంటున్న చెట్టు మీంచి రాలిన పండు. మూడో ఆపిల్...స్టీవ్‌జాబ్స్ స్థాపించిన సంస్థ. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా 'ఆపిల్ కంప్యూటర్స్' రికార్డు సృష్టించింది.  

ఈ రోజు సర్ ఐజాక్ న్యూటన్ జయంతి.  ఐజాక్ న్యూటన్ జనవరి 41643లో లింకన్ షైర్ కౌంటీకి చెందిన ఒక చిన్న కుగ్రామమైన Woolsthorpe Manor అనే గ్రామంలో జన్మించాడు.  న్యూటన్ తండ్రి చనిపోయిన మూడు మాసాలకు జన్మించాడు. నెలలు నిండక మునుపే పుట్టడం వలన పసికందుగా ఉన్నపుడు న్యూటన్ చాలా చిన్నగా ఉండేవాడు. న్యూటన్ తల్లి Hannah Ayscough ఆ పసికందు ఒక లీటర్ పాత్రలో పట్టగలడని చెప్పినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. ఈయన ఒక ఆంగ్లేయ భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త. ఒక సిద్ధాంత కర్త మరియు తత్వవేత్త కూడా. ఈ ప్రపంచంలొ అందరి కంటే గొప్ప శాస్త్రజ్ఞుడని కొనియాడదగిన వాడు. ప్రకృతిసిద్ధమైన తత్వశాస్త్రం మరియు అది సైన్సు గా ఎలా పరిణామం చెందింది? అన్న అంశంపై ఆయన ఎనలేని కృషి చేశారు. అందువలననే ఆధునిక ప్రపంచం న్యూటన్ను సైన్సు పితామహుడిగా గౌరవస్తుంది.

చిన్నతనంలో ఒకరోజు ఆపిల్ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న చిన్ని న్యూటన్ మీద చెట్టుమీదనుండి ఆపిల్ పండు పడింది.  అప్పుడు చిన్న ప్రశ్న మనస్సులో మెదిలింది.  పండు కిందకె ఎందుకు పడింది.  పైకి ఎందుకు పడలేదు అన్న ప్రశ్న.  ఈ ప్రశ్నకు సమాదానం అన్వేషించే క్రమంలోనే గురత్వాకర్షణ సిద్దాంతాని ప్రతిపాదించాడు.  1661 వ సంవత్సరలో గొప్ప చదువుల కోసం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చేరిన న్యూటన్  భౌతిక, గణిత, ఖగోళ  శాస్త్రంలో ఇష్టాన్ని పెంచుకున్నాడు. అక్కడే ప్రొఫెసర్ గా చేరాడు న్యూటన్.  1667 లో పరావర్తన దూరదర్శిని ని కనిపెట్టి అప్పట్లో సంచలనం సృస్టించాడు.   1687 లో ప్రచురితమైన ఆయన శాస్త్ర గ్రంథం en:Philosophiæ Naturalis Principia Mathematica, సైన్సు చరిత్రలో అత్యంత ముఖ్యమైన రచన. ఈ గ్రంథంలో గురుత్వాకర్షణ శక్తి గురించి, న్యూటన్ ప్రతిపాదించిన మూడు గమన నియమాల గురించి ప్రస్థావించాడు. తరువాతి మూడు శతాబ్దాల పాటు భౌతిక ప్రపంచానికి సైన్సు దృక్కోణంగా వెలుగొందిన యాంత్రిక శాస్త్రానికి తరువాత ఆధునిక ఇంజనీరింగ్ కూ ఈ గ్రంథమే పునాది. ఏదైనా ఒక వస్తువు యొక్క గమనం, భూమి మీదైనా లేక ఇతర గ్రహాలమీదైనా ఒకే రకమైన నియమాల మీద ఆధారపడి ఉంటుందని నిరూపించాడు. దీనికి ఆధారంగా కెప్లర్ నియమాలకూ మరియు గురుత్వాకర్షణ సిద్ధాంతాలకూ గల సామ్యాన్ని దృష్టాంతంగా చూపాడు. దీంతో సూర్య కేంద్రక సిద్ధాంతంపైపూర్తిగా అనుమానం తొలిగిపోవడమే కాకుండా ఆధునిక సైన్సు అభివృద్ధి కొత్త పుంతలు తొక్కింది.


"ఎడ్మండ్ హాలే ఆర్థిక సహాయంతో జూలై 1687 లో Principia ప్రచురించబడింది. ఈ పనిలో,న్యూటన్ మూడు సార్వత్రిక చట్టాలు(universal law of gravitation)ని పేర్కొన్నాడు. ఇది ఒక విప్లవాత్క్మక అవిష్కరణ.." Principia తో, న్యూటన్ అంతర్జాతీయంగా గుర్తించబడిన్నాడు. న్యూటన్ పరిశోధనలకు 1705 లో బ్రిటన్ ప్రభుత్వం గుర్తించి "సర్" అనే బిరుదును గౌరవంగా అందించింది.  అప్పటినుండి సర్ ఐజాక్ న్యూటన్ గా పిలవబడుతున్నారు.  
 ఆధునిక యుగంలో  వైజ్ఞానిక విప్లవానికి శ్రీకారం చుట్టిన శాస్త్రవేత్తగా సర్‌ ఐజాక్‌ న్యూటన్‌ చరిత్రలో నిలిచాడు. గురుత్వాకర్షణ శక్తిని, సౌర కుటుంబ చలనానికి మూల సూత్రాన్ని ఆవిష్కరించి, చీకట్లను పారదోలిన మహానీయుడు న్యూటన్‌. అవని నుంచి అంతరిక్షం వరకు పలు రంగాలను అర్ధం చేసు కోవడానికి ఆయన సూత్రాలు కొత్తమార్గాన్ని చూపాయి. 1727 మార్చి 20న న్యూటన్‌ మరణించారు . వైజ్ఞానిక ప్రపంచంలో తన పరిశోధనలతో విప్లవం సృష్టించిన సర్‌ ఐజాక్‌ న్యూటన్‌ ఇలా అన్నారు .''వైజ్ఞానిక, సాంకేతిక ప్రగతి ఏ ఒక్కరివల్లో ఉన్నట్టుండి ఊడిపడేది కాదు. ఎందరో శాస్త్రవేత్తలు తరాల తరబడి చేసే కృషి ఫలితమే ప్రగతి అంటు'' విశ్వరహస్యాల గుట్టు విప్పిన మహానుభావుడు. 

ఆదివారం, జనవరి 03, 2016

చక్కని జాణ యిన్నిట జవరాలు

ఆదివారం, జనవరి 03, 2016


చక్కని జాణ యిన్నిట జవరాలు
చక్కెర బొమ్మ వంటిది జవరాలు
కన్నుల( దప్పకచూచి కప్పురాన నిన్ను వేసి
సన్నసేసీ నదివో జవరాలు
వెన్నెలనవ్వులు నవ్వి వేడుక నీకు( బుట్టించి
చన్నుల నొరసీ నిన్ను జవరాలు
తెరమర(గుననుండి తేనెగార మాటలాడి
సరివెన(గీ నీతో జవరాలు
విరులు నీపై( జల్లి వింతసే(తలెల్లా(జేసి
సరసములు నెరపీని జవరాలు
తమకము నీకు రే(చి దయవుట్ట సేవసేసి
సముకాన గొనరీని జవరాలు
అమర శ్రీవేంకటేశ యిన్నిటా నీవుగూడ(గా
జమళిరతుల జొక్కీ జవరాలు

గురువారం, డిసెంబర్ 31, 2015

గ్రీటింగ్ కార్డు కధలు

గురువారం, డిసెంబర్ 31, 2015

మన మనసులోని భావనలను ఎదుటివారితో కలసి పంచుకోవటానికి  అద్బుత సాధనమే గ్రీటింగ్స్. అవి శుభాకాంక్షలు కావచ్చు.  లేదా మనలోని సంతోషాన్ని  కావచ్చు లేదా ఎదుటివారికి  తప్పు చేసి తన తప్పును దిద్దుకోవాటాని క్షమాపణ చెప్పటానికి కూడా ఉపయోగపడతాయి ఈ కార్డ్లు.  
ఈరోజు మనం గ్రీటింగ్స గురుంచి తెలిసుకుందాం. గ్రీటింగ్స్  అసలు ఎలా తయారు అయ్యిందో అని తెలుసుకుందాం .  మా అమ్మగారి చిన్నప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ వుండేవిట న్యూ ఇయర్ వస్తోంది అంటే వారం రోజులు ముందుగానే షాప్ కి వెళ్లి ఆ గ్రీటింగ్ కార్డ్స్ కొనుక్కొని వచ్చి వాటికి పేర్లు రాసి దూరంగా ఉండేవారికి పోస్ట్ చేసేవారుట.  స్కూల్ ఫ్రెండ్స్, టీచర్స్ కి న్యూ ఇయర్ రోజు వారి ఇంటికి వెళ్లి వారికి wish చేసి వారికి chocolates  ఇచ్చి ఆరోజు అంతా హ్యాపీగా గడిపేవారట.  కొన్ని రోజులు అయిన తరువాత ఎవరి కార్డులు వారే సొంతంగా తయారుచేసుకొని ఇచ్చేవారట.  అప్పట్లో వారికి cakes cut చేయంటము అవి తెలియదుట.  ఇప్పుడు మనము న్యూ ఇయర్ జరుపుకోవటంలో చాలా మార్పులు వచ్చేసాయి.  ఈ సందర్బంగా అసలు ఈ కార్డులు గొడవ ఏమిటో చూద్దాం.

పూర్వం గ్రీటింగ్ ను మొదట ఉత్తరాల ద్వారా తెలుపుకునేవారు.  ఇప్పుడు అయితే అలాంటి ఉత్తరాలే లేవులేండి.  తరువాత గ్రీటింగ్స్ ను షాప్కి వెళ్ళి ఎవరికినచ్చిన  గ్రీటింగు కార్డులు వారు కొనటం వాటిని పోస్టాఫీసుకువెళ్ళి పోస్టు చేసే ఓపికగా ,తీరికగా పంపేవారు.ఇప్పుడు మనకు అంతా నెట్ ప్రపంచంలోనే జరిగిపోతున్నాయి.  షాప్కి వెళ్లక్కరలేదు నచ్చింది ఎతుక్కోనక్కరలేదు. అన్ని నిమిషాలలో చాలామందికి పంపెయవచ్చు.  

అయినా సరే మనం చరిత్రలోకి ఒక్కసారి వేల్లివద్దాం.  మొట్టమొదటిగ్రీటింగ్ కార్డుల చరిత్రను మనం ఓ సారి చెప్పుకుందాం, వాటిని ఎవరు తయారుచేసారు అన్న డౌట్ వచ్చిందామీకు అయితే అది 1842 డిసెంబర్ 9వ తేదీన విలియం మా ఈగ్లే మొట్టమొదటి క్రిస్మస్ కార్డును తయారుచేసాడట!.
విలియం తయారుచేసిన కార్డు పై భాగాన To  అని తరువాత అడుగుబాగాన From  అని వుంచి వాటిని ప్రింట్ తీసుకొని వాటికి మద్యలో మెసేజ్ కి ఖాళీ వుంచి అడుగుని కొంత ప్లేస్ ఉంచేవారు అక్కడ అడ్రస్ రాయటానికి.  తరువాత అమెరికన్ క్రిస్మస్ కార్డు(1824-1909) లో లిధోగ్రాఫర్ లూయిస్ ప్రాంగ్ తయారిచేసాడుట.  ఆ తరువాత 1873 లో ప్రాంగ్ చార్లెస్ డికెన్స్ ఆటొగ్రాఫ్ తో గ్రీటింగ్ కార్డును దిజైన్ చేసి తన మితృలకు,కుటుంబ సభ్యులకు పంపించాడట.1900 సంవత్సరం  వరకు మత సంభందమైన విషయాలకే శుభాకాంక్క్షల కార్డులను పంపించే అలవాటు వుండేవారు తరువాత పుట్టిన రోజులు మొదలుగు వాటికి కూడా గ్రీటింగ్స్ పంపటం మొదలయింది.
అయితే ఆ గ్రీటింగ్స్ కార్డులు పంపటంలో మెల్ల మెల్లగా చాలా మార్పులు చేర్పులుతో మరి మారి మనకు ఈ కార్డులుగా వచ్చాయి. 

Standard Greeting Cards:కార్డు షీట్ పరిమాణాలు వివిధ రకాలుగా చేతితో తయారు చేసినట్లు. కార్డులు మరియు ఆహ్వానాలను పంపేవిదంగా వుంటాయి. ఒక పెద్ద కార్డు లేదా వివిధచిన్న కార్డులు గా తయారుచేయచ్చు. ఇటువంటి కార్డు అతి తక్కువ ఖర్చు పద్ధతిలో తయారు అవుతుంది.

Photo Greeting Cards: మనకు నచ్చిన ఫోటోమీద విషెస్ తెలియచేసి. మనకు నచినవారికి ఇవ్వంటం.
Personalized Greeting Cards: ఇవి ప్రత్యేకంగా మనకు నచ్చినవిధంగా తయారుచేసి మనకునచ్చిన మెసేజ్ రాసి ఇచ్చే కార్డు.
Musical Greeting Cards: ఈ మ్యూజికల్ కార్డ్స్ కార్డ్ కే మ్యూజిక్ ఏర్పాటు చేసి పంపే కార్డు ఇది కార్డు 3d  ఎఫ్ఫెక్ట్స్ తో తయారు చేస్తారు.
తరువాత చాలా మార్పులు చేర్పులు చేసి వచ్చినవే E-Cards .  వీటిలో కూడా చాలా రకాలువున్నాయి.
Electronic Greeting Cards : E-card టెక్నాలజీ  సుమారు 1984  సంవత్సరములో వచ్చాయి.  వీటిలో కుడా చాలా రకాలు వున్నాయి.

Printed e-Cards : ఈ కార్డు మనకు నచ్చినది సెలెక్ట్ చేసుకొని ప్రింట్ చేసి పంపేవి.

Postcards and Greeting Cards : ఈ కార్డ్స్ పోస్ట్ కార్డ్స్ లానే వుంటాయి online లో ఈమెయిలు ద్వారా పంపేవి. 

Flash animation: ఈ కార్డ్స్ మ్యూజిక్ తో కూడి ప్లే చేస్తే మంచి గా movements తో వుంటాయి.  

Video E-Cards : ఈ కార్డ్స్ వీడియో తరహాలో విషెస్ చెప్పేవిధంగా వుంటాయి.

Mobile E-Cards: ఈ కార్డ్స్ యూజర్లు ఒక వెబ్సైట్ ఆన్లైన్ వెళ్లి చేయవచ్చు, ఒక కార్డ్ గ్రహీత యొక్క మొబైల్ సంఖ్యను టైప్ఎంచుకుని,  కార్డు ఒక ఎంఎంఎస్ గా గ్రహీత యొక్క మొబైల్ ఫోన్ పంపబడుతుంది.
Web based multi-media E-Cards :ఈ కార్డ్స్ slide show  లాగ వుంటాయి. ఇవిమనకు నచ్చినవి అన్ని slide చేసి కావాలంటే మ్యూజిక్ పెట్టి పంపేవి.
Face Upload E-Cards :  ఈ కార్డ్స్ లో మనకు నచ్చిన ఫస్ ఫోటోను అప్లోడ్ చేసి పంపే కార్డు ఇది. ఇది funny  గా కూడా తయారు చేయాచ్చు.
E-cards games:  ఈ కార్డులో మంచి సరదా అయిన ఆటలును కార్డు రూపంలో పంపచ్చు.
Pop up Cards: పాప్ అప్ లేదా యాంత్రిక గ్రీటింగ్లు కార్డులు బాగా ప్రాచుర్యం పొందాయి. కింది షీట్లను మాములుగా అనిపించేవి. ఓపెన్ చెసాగా చాలా బాగుంటాయి. ఇవి మాలాంటి పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు.  
ఇది గ్రీటింగ్ కార్డ్స్ గురించి.  ఇవి మంచిగా మనకు మన ఫ్రెండ్స్ మద్య మరియు కుటుంబసబ్యుల మద్య మంచి బందాలను పెంచుతాయి అనటంలో  అతిశయోక్తి ఎంతమాత్రం లేదు అంటే నమ్మండి.
మీరు కూడా మీకు నచ్చినవారికి నచ్చిన గ్రీటింగ్ కార్డ్స్ పంపి విషెస్ చెప్పేయండి ఇంకెందుకు ఆలస్యం.
ok  మరి ఇక.  నా తరపున విషెస్ అందుకోండి.    

ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. 

ఆదివారం, డిసెంబర్ 27, 2015

ఆతడెవ్వాడు చూపరే అమ్మలాల

ఆదివారం, డిసెంబర్ 27, 2015


ఆతడెవ్వాడు చూపరే అమ్మలాల
ఏతుల నాడేటిక్రిష్ణుడీతడే కాడుగదా

కందువ దేవకి బిడ్డగనెనట నడురేయి
అంది యశోదకుకొడుకైనాడట
సందడించి పూతకిచంటిపాలు తాగెనట
మందల ఆవులగాచి మలసెనట

మంచిబండి దన్నెనట మద్దులు విరిచెనట –
ఇంచుకంతవేల కొండయెత్తినాడట
మంచాలపై గొల్లెతలమానాలు చేకొనెనట –
మించుల పిల్లగోవివట్టి మెరసెనటా

కాళింగుని మెట్టెనట కంసు( బొరిగొనెనట –
పాలించి సురల చేపట్టెనట
యీలీల శ్రీవేంకటాద్రి నిరవైనదేవుడట –
యేలెనట పదారువేల ఇంతుల నిందరిని

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)