Blogger Widgets

గురువారం, మార్చి 22, 2012

2012 ప్రపంచ జలదినము

గురువారం, మార్చి 22, 2012

హాయ్ ఫ్రెండ్స్. నేడు 22 వ మార్చి 2012 ప్రపంచ జలదినము గా జరుపుకుంటున్నాం.  ఈనాటి జలదినోత్సవం జలము మరియు ఆహార భద్రాత అన్న థీమ్ తో జరుపుకుంటున్నాం.  ఆరోగ్యకరమైన ప్రపంచం కొరకు నీరు శుభ్రంగా వుంచుకోవాలి. అన్న ముఖ్య ఉద్దేశముతో జలదినము జరుపుకుంటున్నాం.

మనకు నీరు చాలా విలువైనది.  నీరు మనము బ్రతకటానికి ఎంతో ఉపయోగకరమైనది.  ఇది మనకు ప్రకృతి ఇచ్చిన వరప్రసాదంగా భావించాలి అని నా అభిప్రాయం.  నిత్యావసరాలు అన్నీ నీటితోనే నిండి వుంది.  మనము దాహం వేసినప్పుడు నీరు దొరకపోతే. మన ప్రాణాలు నీటికోసము కొట్టుకు పోతాయి.  ఆ క్షణములో గ్రుక్కెడు నీళ్ళు దొరికితే మన ప్రాణాలు నిలబడినట్టు వుంటుంది.  అటువంటి నీటిని మనము చాలా జాగ్రత్తగా వాడుకోవాలి కదండి.  

అంతర్జాతీయ ప్రపంచ జల దినోత్సవం మంచినీటి యొక్క ప్రాముఖ్యతపై దృష్టి సారించవచ్చు మరియు మంచినీటి వనరులకు  స్థిరమైన నిర్వహణ కోసం ఒక ఆలోచనకోసం మార్చి 22 న ప్రతి సంవత్సరం నిర్వహింస్తున్నారు. మంచినీటి జరుపుకునేందుకు ఒక అంతర్జాతీయ రోజు ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ (UNCED) 1992 వ సంవత్సరములో యునైటెడ్ నేషన్స్ సమావేశం వద్ద సిఫార్సు జరిగినది. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ మొదటి ప్రపంచ జల దినోత్సవం గా మార్చి 1993 , 22  న  కేటాయించడం ద్వారా ప్రతిస్పందించారు. ప్రతి సంవత్సరం, ప్రపంచ జల దినోత్సవం మంచినీటి ఒక ప్రత్యేకముగా హైలెట్ చేసారు. 


ఈరోజు జలదినోత్సవ సందర్భముగా మనము నీటిని వృదా చేయద్దు అన్నవుద్దేసము తో ఇవిధంగా చెప్తున్నాను.  జనరల్ గా మనము నీటిని చాలా విదాలుగా వృదాచేస్తున్నాము.  ఉదాహరణకి మనలో చాలా మంది  దినచర్యలో  వారి దంతాలు బ్రష్ చేస్తూ tap విప్పి బ్రష్ కంప్లేట్ అయ్యేవరకు వదిలేస్తాము.   షవర్ ద్వారా బాత్రూమ్ లలో  ట్యాప్ ఉచితంగా నడుస్తున్న వదిలి యొక్క అలవాటు ఉంటుంది.ఇటువంటి imprudence అనవసరముగా నీరు వ్యర్థం అవటానికి కారణమవుతుంది.  

ఆరోగ్యకరమైన ప్రపంచము కోసము పరిశుద్ధ నీరును పొదుపుగా మనము వాడుకుందాం.  దీనికోసము మనము అనావసరముగా నీటిని వృదా చేయద్దు.  మరియు పరిశుద్ధ నీటిని కలుషితము చెయ్యద్దు అని ప్రామిస్ చేద్దాం.

సోమవారం, మార్చి 19, 2012

"అప్పని వరప్రసాది అన్నమయ్య"

సోమవారం, మార్చి 19, 2012

భగవంతుని చేరటానికి అనేక పద్ధతులున్నాయి. అందులో కీర్తనా పద్దతి ఒకటి.  ఆకీర్తనా పద్దతితో భగవంతుని  లోని లీనమైనమైయ్యారు అన్నమయ్య.  నేడు అన్నమయ్య ఆ ఏడుకొండల కోనేటి రాయుడును చేరిన పుణ్య తిది.  అన్నమయ్య తన జోలపాటలతో స్వామిని నిద్రపుచ్చాడు.  అన్నమయ్య రాసిన జోలపాటలు ప్రతీ ఇండ్లలో పసిపిల్లలు ఉన్న తల్లి ఖచ్చితంగా పాడుతుంటారు.  ఇది మనం మచ్చుకు చెప్పుకున్నాం.  అన్నమయ్య రచించిన ప్రతీ పాటలోని ఆద్యత్మకత ఒకటే కాకుండా ఆయన సంకీర్తన ద్వారా లోకనీతిని, జీవన నీతిని భోదిస్తున్నాయి. అప్పట్లోనే సమాజములోని కట్లుబాట్లను, కులమత బేధాలను నిరసించాడు.  అలసిన వారికి జాజర పాటలు రచించారు. ఇలా మంచి తెలుగు పదాలు ఉపయోగించి రచనలు చేసారు.  అనంతమైన భక్తి బావంతో, పదపుష్పాలతో భగవంతుని ఆరాధించిన మహాభక్తశిఖామణి మన అన్నమయ్య "అప్పని వరప్రసాది అన్నమయ్య".

అప్పని వరప్రసాది అన్నమయ్య
అప్పసము మాకే కలడన్నమయ్య ||

అంతటికి ఏలికైన ఆదినారాయణు తన
అంతరంగాన నిలిపిన(పెను) అన్నమయ్య
సంతసాన చెలువొందే సనకసనందనాదు-
లంతటివాడు తాళ్ళాపాక అన్నమయ్య ||

బిరుదు టెక్కెములుగా పెక్కుసంకీర్తనములు
హరిమీద విన్నవించె అన్నమయ్య
విరివిగలిగినట్టి వేదముల అర్ఠమెల్ల
అరసి తెలిపినాడు అన్నమయ్య ||

అందమైన రామానుజ ఆచార్యమతమును
అందుకొని నిలచినాడు అన్నమయ్య
విందువలె మాకును శ్రీవేంకటనాఠునినిచ్చె
అందరిలో తాళ్ళపాక అన్నమయ్య ||

ఆదివారం, మార్చి 18, 2012

Tongue Twisters Day

ఆదివారం, మార్చి 18, 2012


Hi, friends today is Tongue Twisters Day.  So try these try twister words.  

  • If you understand, say "understand" . If you don't understand, say " don't understand". But if you understand and say "don't understand". How do I understand that you understand? Understand! 
  • The owner of the inside inn was inside his inside inn with his inside outside his inside inn. 
  • "When a doctor falls ill another doctor doctor's the doctor. Does the doctor doctoring the doctor doctor the doctor in his own way or does the doctor doctoring the doctor doctors the doctor in the doctor's way".

I wish you all Happy Tongue Twisters Day.

శనివారం, మార్చి 17, 2012

ఘన వైకుంఠము

శనివారం, మార్చి 17, 2012

అన్నమయ్య వారి రచనలలో ఈ పాటలలో  గొప్పది.  కన్నులెదిటిదే ఘన వైకుంఠము.  ఈ పాట వింటుంటే నాకు అమ్మమ్మ చెప్పిన ఒక విషయము గుర్తువస్తోంది.  అది ఏమిటంటే.  ఒక వ్యక్తికి వైకుంఠము  ఎక్కడుంటుంది అన్న డౌట్ వచ్చింది.  అతని దగ్గరకు ఒక ఋషి వచ్చినప్పుడు ఆవ్యక్తి వైకుంఠము ఎక్కడుంది అని అడిగాడు.  అప్పుడు ఆ ఋషి నీవు గజేంద్రమోక్షము చదవలేదా అని అడిగాడట.  పోనీ ప్రహ్లాదచరిత్ర చదివావా అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి చదివాను అన్నాడు.  అయితే ఆకదలలో భగవంతుడు ఎలావచ్చాడు. భక్తుడు  పిలవగానే భగవంతుడు వచ్చాడు కదా!  కావునా మనకు తెలుస్తూనే వుంది కదా పిలిస్తే పలికేటంత దూరంలోనే  వైకుంఠము వుంది అని.  అప్పుడు ఆవ్యక్తి ఆసమాదానానికి తృప్తి చెందాడు.  ఈ కధ నాకు బాగా ఇష్టము అందుకే ఈ సందర్భములో మీతో పంచుకున్నాను.  ఈ పాట అన్నమయ్య రచించారు.  ఇక్కడ MS సుబ్బలక్ష్మి గారు పాడారు. 
   


కన్నులెదిటిదే ఘన వైకుంఠము | వెన్నుని గొలిచిన విజ్ఞానికిని ||

తలచిన దెల్లా తత్త్వ రహశ్యమె | తెలిసిన యోగికి దిన దినము |
పలికిన దెల్లా పరమ మంత్రములె | ఫలియించిన హరి భక్తునికి ||

పట్టిన దెల్లా బ్రహ్మాత్మకమే | పుట్టును గెలిచిన పుణ్యునికి |
మెట్టిన దెల్లా మిన్నేటి నిధులె | రట్టడి తెగువ మెరయు వానికిని ||

వినినవి యెల్లా వేదాంతములే | ఘనుడగు శరణాగతునికిని |
యెనసిన శ్రీ వేంకటేశుడె యింతా | కొనకెక్కిన నిజకోవిదునికిని ||

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)