అన్నమయ్య వారి రచనలలో ఈ పాటలలో గొప్పది. కన్నులెదిటిదే ఘన వైకుంఠము. ఈ పాట వింటుంటే నాకు అమ్మమ్మ చెప్పిన ఒక విషయము గుర్తువస్తోంది. అది ఏమిటంటే. ఒక వ్యక్తికి వైకుంఠము ఎక్కడుంటుంది అన్న డౌట్ వచ్చింది. అతని దగ్గరకు ఒక ఋషి వచ్చినప్పుడు ఆవ్యక్తి వైకుంఠము ఎక్కడుంది అని అడిగాడు. అప్పుడు ఆ ఋషి నీవు గజేంద్రమోక్షము చదవలేదా అని అడిగాడట. పోనీ ప్రహ్లాదచరిత్ర చదివావా అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి చదివాను అన్నాడు. అయితే ఆకదలలో భగవంతుడు ఎలావచ్చాడు. భక్తుడు పిలవగానే భగవంతుడు వచ్చాడు కదా! కావునా మనకు తెలుస్తూనే వుంది కదా పిలిస్తే పలికేటంత దూరంలోనే వైకుంఠము వుంది అని. అప్పుడు ఆవ్యక్తి ఆసమాదానానికి తృప్తి చెందాడు. ఈ కధ నాకు బాగా ఇష్టము అందుకే ఈ సందర్భములో మీతో పంచుకున్నాను. ఈ పాట అన్నమయ్య రచించారు. ఇక్కడ MS సుబ్బలక్ష్మి గారు పాడారు.
కన్నులెదిటిదే ఘన వైకుంఠము | వెన్నుని గొలిచిన విజ్ఞానికిని ||
తలచిన దెల్లా తత్త్వ రహశ్యమె | తెలిసిన యోగికి దిన దినము |
పలికిన దెల్లా పరమ మంత్రములె | ఫలియించిన హరి భక్తునికి ||
పట్టిన దెల్లా బ్రహ్మాత్మకమే | పుట్టును గెలిచిన పుణ్యునికి |
మెట్టిన దెల్లా మిన్నేటి నిధులె | రట్టడి తెగువ మెరయు వానికిని ||
వినినవి యెల్లా వేదాంతములే | ఘనుడగు శరణాగతునికిని |
యెనసిన శ్రీ వేంకటేశుడె యింతా | కొనకెక్కిన నిజకోవిదునికిని ||
వైష్ణవీ, చక్కని పాట. అన్నమయ్య పాటలనుండి ఇంకా చాలా నేర్చుకోవచ్చు.నేను పండితుణ్ణి కాను, అయినా కొన్ని విషయాలు చెబుతాను.
రిప్లయితొలగించండివిష్ణువు (తత్సమం)- వెన్నుడు (తద్భవం)
మెట్టిన దెల్లా మిన్నేటి నిధులె - మిన్నేరు అంటే గంగ అనుకుంటాను. తాతయ్యను అడిగి కనుక్కోగలవు.
రట్టడి తెగువ మెరయు వానికిని - రట్టడి అంటే రాష్ట్రకూటవంశజుడు అని, వాళ్ళే నేటి రెడ్లు అని వ్యవహారం.
కొనకెక్కిన నిజకోవిదునికిని - కొనకెక్కిన అంటే పదును తేలిన అనుకుంటాను.
తెలుగు బాగా రావాలంటే అన్నమయ్య పాట
manchi kirtana.
రిప్లయితొలగించండిbtw, ivala annamayya vardhanti :
listen to this kirtana :
http://annamacharya-lyrics.blogspot.in/2006/12/105dinamu-dwaadasi-nedu.html
రవి,శ్రావణ్ అన్నయ్య చాలా మంచిగా వివరణ ఇచ్చినందుకు మీకు నా ధన్యవాదములు.
రిప్లయితొలగించండి