భగవంతుని చేరటానికి అనేక పద్ధతులున్నాయి. అందులో కీర్తనా పద్దతి ఒకటి. ఆకీర్తనా పద్దతితో భగవంతుని లోని లీనమైనమైయ్యారు అన్నమయ్య. నేడు అన్నమయ్య ఆ ఏడుకొండల కోనేటి రాయుడును చేరిన పుణ్య తిది. అన్నమయ్య తన జోలపాటలతో స్వామిని నిద్రపుచ్చాడు. అన్నమయ్య రాసిన జోలపాటలు ప్రతీ ఇండ్లలో పసిపిల్లలు ఉన్న తల్లి ఖచ్చితంగా పాడుతుంటారు. ఇది మనం మచ్చుకు చెప్పుకున్నాం. అన్నమయ్య రచించిన ప్రతీ పాటలోని ఆద్యత్మకత ఒకటే కాకుండా ఆయన సంకీర్తన ద్వారా లోకనీతిని, జీవన నీతిని భోదిస్తున్నాయి. అప్పట్లోనే సమాజములోని కట్లుబాట్లను, కులమత బేధాలను నిరసించాడు. అలసిన వారికి జాజర పాటలు రచించారు. ఇలా మంచి తెలుగు పదాలు ఉపయోగించి రచనలు చేసారు. అనంతమైన భక్తి బావంతో, పదపుష్పాలతో భగవంతుని ఆరాధించిన మహాభక్తశిఖామణి మన అన్నమయ్య "అప్పని వరప్రసాది అన్నమయ్య". |
అప్పని వరప్రసాది అన్నమయ్య
అప్పసము మాకే కలడన్నమయ్య ||
అంతటికి ఏలికైన ఆదినారాయణు తన
అంతరంగాన నిలిపిన(పెను) అన్నమయ్య
సంతసాన చెలువొందే సనకసనందనాదు-
లంతటివాడు తాళ్ళాపాక అన్నమయ్య ||
బిరుదు టెక్కెములుగా పెక్కుసంకీర్తనములు
హరిమీద విన్నవించె అన్నమయ్య
విరివిగలిగినట్టి వేదముల అర్ఠమెల్ల
అరసి తెలిపినాడు అన్నమయ్య ||
అందమైన రామానుజ ఆచార్యమతమును
అందుకొని నిలచినాడు అన్నమయ్య
విందువలె మాకును శ్రీవేంకటనాఠునినిచ్చె
అందరిలో తాళ్ళపాక అన్నమయ్య ||
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.