Blogger Widgets

ఆదివారం, మార్చి 24, 2013

ముత్తుస్వామి దీక్షితులు

ఆదివారం, మార్చి 24, 2013

అత్యద్భుతమైన కృతులను రచించిన ముత్తుస్వామి దీక్షితులు సంగీతత్రయంలోత్యాగరాజు తర్వాత రెండవవారిగా పరిగణింపబడతారు. ముత్తుస్వామి దీక్షితర్ కర్ణాటక సంగీతత్రయంలో ఒకరైన వాగ్గేయకారుడు . 
వాతాపి గణపతిం భజే అన్న కీర్తన విననివారుండరంటే అది అతిశయోక్తి కాదేమో. అది ఆయన రచించినదే. రామ స్వామి దీక్షితర్, సుబ్బలక్ష్మి అంబాళ్ పుణ్యదంపతుల సంతానంగా 1775లో పుట్టాడు. నేడే ముత్తుస్వామి దీక్షితులు వారి జయంతి.  
ఈయన భక్తిశ్రద్ధలుగల వ్యక్తి గుణగణాలను తన బాల్యంలోనే ఇతడు ప్రదర్శించాడు. సంగీతంపై వెలువడిన "వెంకటాముఖి" సుప్రసిద్ధ గ్రంధం "చతుర్‌దండి ప్రకాశికై"ను అధ్యయనం చేశాడు. కావలసినమేరకు మన ధర్మ గ్రంధాల పరమైన జ్ఞానాన్ని కూడా సంపాదించగలిగాడు.రామస్వామి దీక్షితులు వీరి తండ్రి. వీరు సంగీత, వ్యాకరణ, జ్యోతిష, వాస్తు, మాంత్రిక, వైద్య విద్యలలో ఆరితేరిన వ్యక్తి. గురుగుహ ముద్రతో వున్న వీరి కృతులన్నీ సంస్కృతంలోనే వున్నవి. హిందూస్థానీ సంగీతంనుండి వీరు కర్ణాటక సంప్రదాయానికి వీరు తెచ్చిన రాగాలు సారంగద్విజావంతిమొదలైనవి. వీరు అనేక క్షేత్రములు తిరిగి ఆయా ప్రదేశములలో వున్నట్టి దేవస్థానములను సందర్శించి దేవతలపై కృతులు జేసారు. ఆయన రచించిన కృతులలోకమలాంబా నవావర్ణ కృతులునవగ్రహ కీర్తనలు ప్రత్యేక స్థానాన్ని కలిగి వున్నాయి. వీరి యితర ప్రముఖ రచనలు: వాతాపి గణపతిం భజే, మహా గణపతిం, శ్రీనాథాది గురుగుహో, అక్షయలింగ విభో, బాలగోపాల, అఖిలాండేశ్వరి, రామచంద్రం భావయామి, చేత: శ్రీబాలకృష్ణం, శ్రీ వరలక్ష్మి, సిద్ధి వినాయకం, త్యాగరాజ యోగవైభవం, హిరణ్మయీం, అన్నపూర్ణే, అరుణాచలనాథం, ఆనందామృతకర్షిణి, మామవ మీనాక్షి, మీనాక్షి మే ముదం దేహి, నీలకంఠం భజే, స్వామినాథ, శ్రీ సుబ్రహ్మణ్యాయ, పరిమళ రంగనాథం, మొదలైనవి.

నాతో మాట్లాడాలి అని అనుకుంటున్నారా

హాయ్! 
ఎన్నో అద్భుతమైన ప్రశ్నలతో , సరదా సరదా మాటలతో , కధలు - పద్యాలు- ఆటలతో, మీరు కోరిన పాటలతో , మీతో సరదాగా మాట్లాడేస్తూ మిమ్మల్ని నవ్వుకునేలా, రోజు అంతా సంతోషంగా వుంచటానికి మీ ముందుకు వచ్చేస్తున్నాను మీ చిన్ని RJ Sree Vaishnavi ని . ఎలా అంటే 
ప్రతీ ఆదివారము 10:00 am to 11:00 am వరకు 
మీ అభిమాన online రేడియో RadioJoshLive Masth Maza Masth Music :) (http://www.radiojosh.com/) లో నాతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు కదా!
మరి నాతో మాట్లాడాలి అంటే ఈ నంబర్స్ కి కాల్ చేయండి నాతో సరదాగా మాట్లాడే యండి . 
INDIA= +91 04042410008
USA = +19142147475
Skype Me™!
Skype id : radiojoshlive
Gtalk id : radiojoshlive@gmail.com
ధన్యవాదములు

శనివారం, మార్చి 23, 2013

గొప్ప భారతీయుడిగా భగత్ సింగ్

శనివారం, మార్చి 23, 2013

1931 మార్చి నెల 23వ తేదీ. ఈ రోజునే భగత్ సింగ్ ను ఉరితీశారు. భారత స్వాతంత్ర్యోద్యమంలో కృషి చేసిన భగత్ సింగ్,రాజ్‌గురు మరియు సుఖ్‌దేవ్ లు ఉరి తీయబడ్డారు. అంతకు ముందు జైల్ సూపరింటెండెంట్ ఉరి ఉత్తర్వును అధికారికంగా విడుదలచేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నది అదే. ఉరితీశాక ఓ గంటసేపు శరీరం గాలిలోనే తేలియాడుతూ ఉండాలని కూడా ఈ ఉత్తర్వుద్వారా ఆదేశించారు. భగత్ సింగ్ మరణించారని వైద్యాధికారి ధ్రువీకరించేవరకు శరీరాన్ని కిందకు దింపకూడదు. ఇదంతా కచ్చితంగా అమలవ్వాలన్నదే జైలు అధికారి ఉత్తర్వులోని సారాంశం.   దేశం కోసం భగత్ సింగ్ అలా ప్రాణత్యాగం చేశారు.  

నేటికీ భారత యువత భగత్ సింగ్ నుండీ ఎంతో స్పూర్తిని పొందుతున్నారు.  ఇండియాటుడే 2008లో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం అత్యంత గొప్ప భారతీయుడిగా భగత్ సింగ్ ఎన్నుకోబడ్డాడు. పోటీలో సుభాష్ చంద్రబోస్ ఇంకా గాంధీ వెనుకంజలో ఉండిపోయారు.శతజయంతి సందర్భంలో మేధావుల ఒక సమూహం భగత్ సింగ్ సంస్థాన్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి భగత్ సింగ్ ఆలోచనలను ఇంకా ఆదర్శాలను అమలు చేయటానికి కృషి చేసింది. 2001 మార్చ్ 23న పార్లమెంటులో భగత్ సింగ్ కు నివాళులర్పించారు.2005 లో కూడా ఈ సంప్రదాయాన్ని పాటించారు.పాకిస్తాన్ లోని లాహోర్ లో భగత్ సింగ్ ను ఉరి తీసిన షద్మన్ చౌక్ ను భగత్ సింగ్ చౌక్ గా పేరు మార్చాలని భగత్ సింగ్ ఫౌండేషన్ ఆఫ్ పాకిస్తాన్ అభ్యర్థన చేసింది, న్యాయపరమయిన సమస్యల వల్ల ఇది ఇంకా అమలు కాలేదు.  ఇంత గొప్ప స్వాతంత్ర్య సమరయోదులకు   మన బ్లాగ్ ద్వారా నివాల్లు అర్పిస్తున్నాను.

ఆదివారం, మార్చి 17, 2013

మీ చిన్ని RJ ని

ఆదివారం, మార్చి 17, 2013


హాయ్! 
ఎన్నో అద్భుతమైన ప్రశ్నలతో  , సరదా సరదా మాటలతో ,  కధలు - పద్యాలు- ఆటలతో, మీరు కోరిన పాటలతో ,  మీతో సరదాగా మాట్లాడేస్తూ మిమ్మల్ని నవ్వుకునేలా,  రోజు అంతా సంతోషంగా వుంచటానికి  మీ ముందుకు వచ్చేస్తున్నాను మీ చిన్ని  RJ Sree Vaishnavi ని .  ఎలా అంటే 
ప్రతీ ఆదివారము    10:00 am to 12:00 pm వరకు  
మీ అభిమాన online రేడియో RadioJoshLive  Masth Maza Masth Music :) (http://www.radiojosh.com/)  లో  నాతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు కదా!
మరి నాతో మాట్లాడాలి అంటే   ఈ నంబర్స్ కి కాల్ చేయండి నాతో సరదాగా మాట్లాడే యండి .  
INDIA= +91 04042410008
USA = +19142147475

Skype Me™!
Skype id : radiojoshlive
Gtalk id : radiojoshlive@gmail.com
ధన్యవాదములు 

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)