శనివారం, సెప్టెంబర్ 20, 2008
- అన్నదమ్ములు ముగ్గురు. అయితేవారి బుద్దులు వేరు .నీళ్ళో వేస్తె మునిగేది ఒక్కడు ,తెలేది ఒకడు ,కరిగి పోయేదిఒకడు.ఇంతకీ వారు ఎవరు?
తాంబూలం ( మునిగేది వక్క, తేలేది ఆకు, కరిగేది సున్నం)
- ఈగముసరని పండు, ఎర్రన్గానుండు?
నిప్పు.
- వుదయం నడక నాలుక్కాలతో, మధ్యాన్నం రెండుకాళ్ళతో, సాయంత్రం ముడుకాళ్ళతో...................?
బాల్యం , మధ్య వయస్సు , వృద్దాప్యం
- ఎన్నిసార్లు చచ్చినా, ఎప్పుడూ బ్రతికే వుండేది ఏమిటది?
ఆశ
- ఐదుగుర్లో చిన్నోడు, పెళ్ళికి మాత్రం పెద్దోడు ఏమిటది?
చిటికిన వేలు
శుక్రవారం, సెప్టెంబర్ 19, 2008
- అన్నదమ్ములు ముగ్గురు. అయితేవారి బుద్దులు వేరు .నీళ్ళో వేస్తె మునిగేది ఒక్కడు ,తెలేది ఒకడు ,కరిగి పోయేదిఒకడు.ఇంతకీ వారు ఎవరు?
- ఈగముసరని పండు, ఎర్రన్గానుండు?
- వుదయం నడక నాలుక్కాలతో, మధ్యాన్నం రెండుకాళ్ళతో, సాయంత్రం ముడుకాళ్ళతో...................?
- ఎన్నిసార్లు చచ్చినా, ఎప్పుడూ బ్రతికే వుండేది ఏమిటది?
- ఐదుగుర్లో చిన్నోడు, పెళ్ళికి మాత్రం పెద్దోడు ఏమిటది?
సమాధానాలు రేపే ...........అమ్మా .........ఆశ ........ ఇప్పుడు చెప్పేస్తాననే. ఇప్పుడు మీరు ట్రై చేసి చెప్పండి.
బుధవారం, సెప్టెంబర్ 17, 2008
దేవుని కి అరటి పండు ఎందుకు సమర్పిస్తారు?
అరటి చెట్టు జీవిత కాలంలో ఒకే ఒక్క సారి అరటి గెలను ఇస్తుంది. అలా వచ్చిన అరటి పండును దేవుడికి మనం సంర్పిస్తాము. జన్మలల్లో మనిషి జన్మ ఒకసారే వస్తుంది. అరటి పండును ఆదర్శంగా తీసుకొని మనలను మనం దేవుడికి సమర్పించుకొంటామన్నమాట.
అరటి సంస్కృతంలో "కడలి" అనీ వన లక్ష్మి అనీ అంటారు. అరటి లో ప్రతీ భాగం ఉపయోగమే అరటి వేరు అరటి కాండం(దూట) దాని పువ్వు, అరటి అక్కులు, అరటి కాయ, అరటి పండు, అరటి పీచు. అరటిలో ప్రతీదీ మనం వాడుకోనేదే.
దీన్ని మనం ఆహారం లో ఆరోగ్యం గావున్నప్పుడే కాదు. కొన్ని రోగాల సమస్యలు పరిష్కరించుకోడానికి వుపయోగిస్తారు.
అయుర్వేధమ్ లో అరటి పండు గునగనలూ బాగావివరించారు.
"మౌచం స్వాదురసం ప్రోక్తం కషాయం నాతి శీతలం !
రక్త పిత్త హారం వృ షయం రుచ్యం శ్లేష్మకరం గురు||
అరటి పళ్ళు మధుర, కషాయం రసం కలిగి వుంటాయి . గుణం -గురుగుణం అంటే కడుపునిండిన భావం కలిగి వుంటుంది. శరీరంలో ధాతువులని పెంచుతుంది. బరువులను పెంచుతుంది. మరీ చలవ కాదు. రక్త దోషాన్ని నివారిస్తుంది. రుచిని పుట్టిస్తాయి.
అరటి పండు: ప్రపంచమంతా దొరికే పండు. అన్ని సీజన్స్ లో దొరుకుతుంది. అరటి పండు వెంటనే శక్తీని ఇస్తుంది. దీన్ని సంపూర్ణ ఆహారంగా తేసుకోవచ్చు.
మంగళవారం, సెప్టెంబర్ 16, 2008
- ఆకులెయ్యదు , నీరు తాగదు, నేలని ప్రాకదు. ఏమిటా తీగ ? ----కరంటు తీగలు
- ఆమడ దూరం నుంచి అల్లుడుగారు వస్తే గోడమూల ఒకరు , మంచం కింద ఇద్దరు దాక్కుంటారు?----చేతి కర్రా,చెప్పుల జత.
- ఆకులాడు కాదు అకులువుంటాయి , పోకలవాడు కాదు పోకలు వుంటాయి, అసలు మనిషి కాదు జాడలు వుంటాయి ,బాలింత కాదమ్మ పాలు వుంటాయి. ఏమిటది? ---- మర్రి చెట్టు.
- ఇల్లు లేని పట్నాలు, నీళ్లు లేని సముద్రాలు ఎక్కడ వుంటాయి? -----మెప్స్
- ఇంటిలో మొగ్గ వీధిలో పువ్వు ఏమిటది?------గొడుగు.
బాగున్నాయా . రేపు మరి కొన్ని చూద్దాం. బాయ్ ................
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ