Blogger Widgets

సోమవారం, సెప్టెంబర్ 15, 2008

THE RIVER

సోమవారం, సెప్టెంబర్ 15, 2008

ఈ రోజు నాకు స్కూల్లో ఈ రైం నేర్పించారు నాకు చాలా నచ్చింది. నా లాగే మీకునచ్చుతుందేమో చూడండి . నాకు వచ్చేసింది కుడా.

Waves lap lap
Fish fins clap clap
Brown sails flap flap
Chop-sticks tap tap

Chop-sticks tap tap
Brown sails flap flap
Fish fins clap clap
Waves lap lap.

శ్రీ వైష్ణవి.

చెప్పుకోండి చూద్దాం? పొడిస్తే నవ్వులు -విడిస్తే నవ్వులు.

  1. ఆకులెయ్యదు , నీరు తాగదు, నేలని ప్రాకదు. ఏమిటా తీగ ?
  2. ఆమడ దూరం నుంచి అల్లుడుగారు వస్తే గోడమూల ఒకరు , మంచం కింద ఇద్దరు దాక్కుంటారు?
  3. ఆకులాడు కాదు అకులువుంటాయి , పోకలవాడు కాదు పోకలు వుంటాయి, అసలు మనిషి కాదు జాడలు వుంటాయి ,బాలింత కాదమ్మ పాలు వుంటాయి. ఏమిటది?
  4. ఇల్లు లేని పట్నాలు, నీళ్లు లేని సముద్రాలు ఎక్కడ వుంటాయి?
  5. ఇంటిలో మొగ్గ వీధిలో పువ్వు ఏమిటది?

    సమాధానాలు పంపండి. నేనైతే రేపుచేప్తా. అప్పటి దాకా వేచి వుండాలి మరి.
శ్రీ వైష్ణవి.

ఆదివారం, సెప్టెంబర్ 14, 2008

"తమ దగ్గర ఉన్నదే ఇస్తారు "

ఆదివారం, సెప్టెంబర్ 14, 2008

జీసస్ కొందరితో కలసి ఒకసారి దారిన వెడుతుండగా కొంతమంది ఆయనగురించి చెడ్డగా చెప్పుకుమ్టుండడం వినిపించింది. జీసస్ ముఖమ్లో ఎటువంటి బాధా లేదు. పైగా ప్రేమపురకమైన దరహాసం చిందిస్తూ వారి గురించి తనతో వున్న వారితో కొన్ని మంచి మాటలు చెప్పారు.
జీసస్ వికారి వారికి అర్ధం కాలేదు . `అదేమిటి పభు ! వాళ్ళు మీ గురించి చెడ్డగా మాట్లాడుతుంటే మీరు వారి గురించి ఇలా మీరు మంచిగా మాటలాడుతున్నారు ?' అని అడిగారు.
` దానికీముంది ? ఎవరైనా తమ దగ్గర వున్నదే ఇతరులకు ఇస్తారు' అని అన్నారు జీసస్.

శనివారం, సెప్టెంబర్ 13, 2008

Believe In Your-shell-f!, Positive Thinking Day Egreeting

శనివారం, సెప్టెంబర్ 13, 2008

Believe In Your-shell-f!, Positive Thinking Day Egreeting

శుక్రవారం, సెప్టెంబర్ 12, 2008

Use it.

శుక్రవారం, సెప్టెంబర్ 12, 2008

Yester day is cancelled cheque.
Tomorrow is promissory note.
To day is ready cash.
Use it. ...... ఇది పెద్దల మాట. బాగుంది కదా. చాలామంది జరిగిపోయినదానిని తలచుకొని బాధ పడతారు. దాని వల్ల వుపయోగం లేదు. రేపు అన్నది ప్రోమిస్సోరీ నోట్ లాంటిది. ఈ రోజు మనదే ఇదే నిజం . ఈరోజు బంగారం లాంటిది దానిని వుపయోగించు కోవాలి. పాతవి తలచు కొని బాద పడి టైం వేస్ట్ చెసుకొకూడదు. మన పెద్దల మాట బాగుంది కదా.

ఆయన్ని ఎందుకు వెతకటం?

రామ్ ఒక పెద్ద ధనవంతుడు .రామ్ కొంత కాలం తీర్ధ యాత్ర చేద్దామని అన్ని పుణ్యక్షేత్రాలు తిరుగు తున్నాడు. ఒక చోట ఒక మనిషి పరిచయం అయ్యాడు. ఆతను దొంగతనాలు చేస్తూ బతుకుతున్నాడు. ఆరోజు రామ్ తో ఫ్రెండ్షిప్ చేసి రామ్ ను నమ్మించడానికి ప్రయత్నిచాడు . ఇద్దరూ కలసి ఒక చోట బసచేశారు. రామ్ నిద్రపోతున్నపుడు అతని వస్తువులు అన్ని వెతికాడు. ఏమిదొరకలేదు. విసిగిపోయి ఆమనిషి నిద్రపోయాడు. మార్నింగ్ లేచిన వెంటనే రామ్ తో ఇక్కడ దొంగతెనాలు ఎక్కువ మీ డబ్బూ, దస్కమ్ ఎక్కడైనా జాగ్రత్తగా వుంచారా అని అడిగాడు.
రామ్ చిన్ననవ్వు నవ్వి "నాకు ఆ సంగతి తెలుసు". అన్దుకే నీ దిండు గలేబు లో నా సొమ్ము దాచిపెట్టాను.
అని ఆ సొమ్ము మొత్తాన్ని చూపించాడు రామ్. దొంగ ఫస్ట్ ఆశ్చర్య పోయాడు తరువాత ఏడుపుతో కలిసిన నవ్వు నవ్వాడు. దొంగ మెల్లిగా తప్పుకొని వెళ్ళిపోయాడు .
భగవంతుడు ఆత్మ రూపంలో మనలోనే వున్నా మనం ఆయన్ని వెతుకుతాము.
ఆయన్ని ఎందుకు వెతకడం ????????????????????.

బుధవారం, సెప్టెంబర్ 10, 2008

బుధవారం, సెప్టెంబర్ 10, 2008

ఒకరోజు మహావిష్ణువు నారదుల మధ్యసంభాషణ.
విష్ణువు :-నారదా ! పంచ భుతాలలో ఎవరు గొప్పా?
నారదుడు:- భూమి గొప్పది.
విష్ణువు:- భూమండలం లో భూమి ఒక వంటే కదా. మూడు వంతులు నీరే కదా భూమి ఎఅలా గొప్పది.నారదుడు:- అయితే జలం గొప్పది.
విష్ణువు:- అంతటి జలాన్ని అగస్యుడు తాగాడు కదా.
నారదుడు:- అయితే అగస్యుడు గొప్పవాడు.
విష్ణువు:- అంత పెద్ద ఆకాశం లో అగస్యుడు నక్షత్రమే కదా.
నారదుడు:- అయితే ఆకాశమే గొప్పది.
విష్ణువు:- అంత ఆకాశాన్ని భగవంతుడు వామన రుఉపం లో తన పాదం తో కప్పెసాడు కదా.
నారదుడు:- అయితే భగవంతుని పాదం గొప్పది.
విష్ణువు:- భగవంతుని పాదమే గొప్పది అయితే ,మొత్తం భగవంతుని రూపాన్నే భక్తుడు తన హృదయము లో బంధిస్తున్నాడు కదా .
నారదుడు:- అయితే భక్తుఢే గొప్పవాడు.

సోమవారం, సెప్టెంబర్ 08, 2008

చదువు - సంస్కారం - అందం .

సోమవారం, సెప్టెంబర్ 08, 2008

ఈ రోజు ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం కదా ! అందుకే అందరికీ అక్షరాస్యతా ధినోత్సవ శుభాకాంక్షలు . అందరు చదువుకోవాలని , చదువు విసిస్టత ను గుర్తించడానికి. ఒక రోజు స్పెషల్ గా వుండటానికి సెప్టెంబర్ ౮వ తేదిని పెట్టారు. విద్య లేని వాడు వింత పసువు గా సామెత వుంది . అది మీకు అందరికీ తెలుసు కదా. చదువు రాని వాడు పసువులకన్నా అర్ధానం. మన విశ్వం లో అతి తెలివైన జీవ మనిషి . అదే మనిషి చదువు కుంటే ఇంకా చాలా తెలివిగా నడుచుకుంటాడు. మనిషి కి కానిదంటూ లేధు. అలాంటి మనిషి వింత పశువుగా వుండటం బాగాలేధు కదా. చదువురాని మొద్దు కదలలేని ఎద్దు అన్నారు . చదువు రాక పొతే కధలలేని ఎద్దు లా ఎటువంటి డెవలప్ మెంట్ వుండదు. తినడం పడుకోడం, తప్ప ఇన్కేమి మార్పు వుండదు. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నారు అది నిజం. ఒక ఇంటిలో ఆడది చదువు కొంటె ఇంట్లో అందరికీ చదువు వస్తుంది .
ప్రతీ మనిషి చదువు కోవాలి . చదువు వల్ల ఉద్యొగాలే చెయక్కరలేధు చేసీ వ్యవసాయమైనా సరైన పద్దతి లో
చేయవచ్చు . దాని వల్ల మనదేశాన్ని సస్యశ్యామలం చేసి మన దేశాన్ని సంపన్న దేశం గా మార్చవచ్చు.
చదువు వల్ల చదువే కాదు సంస్కారం , దాని తరువాత అందం వాటిఅంతట అవే వస్తాయి . మనం రంగులు పూసుకొటం వల్ల రాదూ. అది కేవలమ్ చదువు వల్లే సాధ్యం ఒప్పుకుంటారా.......................

ఆదివారం, సెప్టెంబర్ 07, 2008

ఓలనుకుంటున్నారు

ఆదివారం, సెప్టెంబర్ 07, 2008


ఆయ్ ! నేనే ఓలను కుంటున్నారు .అయ్య బాబోయ్ మర్సిన్నారా. ఆపాలి నాను సెప్పాను కాదానేనే మీరు ఒక సీమా చూసార అదే జీన్స్ అని ఒక సిమా వచ్చింది. అన్ధులో
ఐష్ వుందా ఆపేరే నా పేరు వైష్ణవి .ఆ సీమా లోలా తయారుఅవ్వుదామని ఈపూలు కోసి కొప్పులో ముడుసుకుంధంని వచ్చా. నాకు ఐశ్వర్య రాయి అంటే నాకు శానా ఇష్టం అందుకే ఐషు లాతయారు అవుతున్నాను . అయ్యో నా కండ్లజోడు మర్సినా. తెచ్చుకుంటా మరి . ఈపాళీ నేను గుర్తు చేయను మరి ఒకే నా .................... బాయ్ .

లీఫ్ బటర్ ఫ్లయ్


అరే అన్ధరూ బాగున్నారా. నేను స్కూల్ కి వెళ్లి ఇంటకి వచ్చి హోం వర్క్స్ తో బిజి అయ్యానండి అందు కే ఈ మద్య పోస్ట్ చేయటం లేధు . అయినా నాకు కోపం వచ్చింది. మీరు ఎవరూ నాతో మాటలాడటం లేధు కదా అందుకే. సరే నేను వేసిన బొమ్మ ఎలావుంది. లీఫ్స్ తో కలర్స్ తో బటర్ ఫ్లయ్ వేసానండి అయితే బాగారాలేదు కాని ఫస్ట్ టైం వేసాను అది మీఅందరి కీ చూపిన్చుదామని పించి పోస్ట్ చేశాను. చూడండి . అన్నట్టు నా బ్లాగ్ లో గేమ్ కుడా వుంది ఆడుకుందామా. ఓకే మరి వుంటా.
శ్రీ వైష్ణవి

శుక్రవారం, సెప్టెంబర్ 05, 2008

నవ్వండి

శుక్రవారం, సెప్టెంబర్ 05, 2008

ఒక టీచర్ స్టూడెంట్స్ తో ............
హలో స్టూడెంట్స్. "నేను చెరువు గట్టు దగ్గర ఒక పామును చుసాను. కొట్టేవాడినే కాని నా చేత దుడ్డు కర్ర లేదు "
ఇంగ్లీష్ లో చెప్పండి.
రాజు లేచి : టక్కున లేచి నేను చెప్పనా సార్ అని.
టీచర్ : గుడ్ బాయ్ చెప్పు.
రాజు : "ఐ సా ఏ స్నేక్ నియర్ ది చెరువు గట్టు. అయితే కొట్టేవాడినే బట్ మీరా హాత్ మే నో దుడ్డుకర్ర".
టీచర్ : ఆ ...........................................?

ఎందుకు చెప్పండి ????????

నేను ఈమధ్య గొంగలి పురుగును చూసాను. అది ఇల్లు కట్టుకొని అన్ధులో ఉంది. నాకు చాలా డౌట్లు వచ్చాయి.
మా అమ్మమ్మ ని అడిగా. అవేకాదు కప్పలు, పురుగులు, కీటకాలు. అలా గూడు కట్టుకొని కొన్ని రోజులు వుండి బయటకు వస్తాయని. గొంగళి పురుగు అయితే బటర్ ఫ్లయ్ గా మారుతుందని చెప్పింది.
నేను అడిగాను : మరి లోపల ఆకలి వెయ్యదా అని అవిలోపల ఇన్నాళ్ళు తిన్న ఆహారం తో భతుకుతాయని చెప్పింది . అవి గూడు లో వున్నన్ని రోజులూ వాటిలో వున్నా కొవ్వును కరిగించుకొని జీవిస్తాయని చెప్పింది.
అయితే నాకు రాత్రి నాకు కొన్ని డౌట్లు వచ్చాయి. అవి ఏంటంటే ..................
మరి అవి కప్పలూ,కీటకాలలాగా మనమెందుకు అలా నిద్రపోము, అలా ఆహారం తినకుండా వుండగలమా. వుంటే అంతరిక్షంలో వుడటానికి యూజ్ అవుతుందా. అన్నట్టు ఇంకోటి అవి గాలి లేకుండా ఎలా వుంటున్నాయి మనకు కూడా అలా అయితే మనం అంతరిక్షంలో కి తీసుకు వెళ్లక్కరలేదు కదా. మీరూ నా ఫ్రెండ్స్ కదా అందుకే మీరు చెప్పండి . ఒకే మరి మీ ఆన్సర్ కోసమ్ ఎదురు చూస్థూ శ్రీ వైష్ణవి. బాయ్ బాయ్.

గురువారం, సెప్టెంబర్ 04, 2008

గురువులకే గురువు

గురువారం, సెప్టెంబర్ 04, 2008

హలో నేనే శ్రీ వైష్ణవి ని . మా స్కూల్ లూ టీచర్స్ డే జరుపుకుంటున్నాము . మా అమ్మమ్మను నేను అడిగాను అసలు టీచర్స్ డే అంటే ఏమిటి? అప్పుడు మా అమ్మమ్మ చెప్పింది. గువులకేగురువు ఐన సర్వేపల్లి రాధాకృష్ణ గారి బర్త్ డే ని టీచర్స్ డే గా జరుపుకుంటామని చెప్పింది. ఉపాద్యాయవృతి నుండి భారత రాష్ట్రపతిగా నియమితులై అపదవికే వన్నె తెచ్చిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ అందుకే గురువులకే గురువు అయ్యారుఅని చెప్పింది.
అంతటి మహోన్నతమైన వ్యక్తిత్వం వున్నా సర్వేపల్లి ౧౮౮౮ సెప్టెంబర్ ౫ తేదిన మద్రాస్ రాష్ట్రంలో తిరుత్తని వీరస్వామి సీతమ్మ రెండో సంతానం. వీరస్వామి ఊరు నెల్లూరు లో సర్వేపల్లి. ఇంటి పేరు సర్వేపల్లి అని వచ్చింది. సర్వేపల్లికి చిన్నప్పుడే రామాయణం,భగవత్గీత శ్లోకాలు పలికేవాడట. ఏకసంథాగ్రాహి గా పేరు వచ్చింది త. అయన మంచి గురువుగా పేరు తెచుకున్నారు అందుకే గురువులకే గురువు.

సోమవారం, సెప్టెంబర్ 01, 2008

హ్యాపీ వినాయక చవితి & టీచర్స్ డే

సోమవారం, సెప్టెంబర్ 01, 2008



ఈబొమ్మ నేను వేసాను టీచర్ వినాయకుడు బాగున్నాడా.
అందరి కీ ముందు గానే వినాయక చవితి కీ మరియు టీచర్స్ డే కు శుభాకాంక్షలు. ఓకే బాయ్........ బాయ్................సి యూ .



సాదు శ్రీ vaishnavi

వినాయక చవితి కదా .......అందుకే

అందరికీ వందనములు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు . మనమందరం ప్లాన్ చేద్ధామ్ ముందుగా వినాయకుడి బొమ్మ ను కొనకుండా మనమే తయారు చేద్దాం ఇప్పుడు బయటదోరికే బోమ్మలు లు rasaayanala తో తయారు అయ్యేనవి అవి మంచిది కాదు . నిమర్జనం చేసాక అవి నీటిలో జీవులకు అపకారం చేస్తాయట మా అమ్మమ్మ చెప్పింది . పార్వతీదేవి నలుగుపిడితో వినాయకుడిని చేసిందిట చాలారోజులుక్రితం మన్నుతో చేసేవారట ఇప్పుడు మన్ను
దొరకదు అందుకే ఇలా చేద్దాం :
ముందుగా నలుగు పిండిని తీసుకొని దానికి నీరుకలిపి ముద్దలా చేసి వినాయకుడిని చేద్దాం .దానికి నగలు కావాలి కదా అందుకు మన ఇంటిలో వున్న గింజలు, పప్పులూ ,ఆవాలు , మిరియాలు, కుంకుమకలిపిన బియ్యం తో అలంకరించవచ్చు మనవినాయకుడు రెడీ ఈవిగ్రహానికి పూజ చేసాకా నిమర్జనం చేస్తి పర్యావరణం కు మనవంతు హెల్ప్ చేసినట్టు అవుతుంది .ఎలా అంటే నీటి లో జీవులకు మనపిండి వినాయకుని వల్ల ఆహారం దొరుకుతుంది + రసాయనాలతో కలుషితం నుండి కాపాడినవారం అవుతాము . ప్లీజ్ పర్యావరణం మన అందరిది మన దాన్ని మనం కాపాడుదాం .
సరే ఇక పూజ వినాయకునికి పత్రాలతో పూజ చెయ్యాలి వాటివల్ల మనకు వర్షాకాలం లో వచ్చే రోగాలనుడి రక్షించే గుణాలు వున్నయిట. ఆపత్రాల గాలి మంచిదట .
ఇక నివేద్యం: వర్షాకాలంలో చాలా జగ్రతగావుందాలిట్ అందుకే ఆవిరిమీద వండిన వంటలు దేవుడికి పెట్టి
అవీ మనం తింటాం. మా అమ్మమ్మ ఇలాంటివి చాలా చెప్పింది. మీకు కొన్ని వంటలు చెప్పనా. ఒకే మరి................
ముందు రోజు పనసాకులు తెచ్చుకొని వాటిని చీపురు పుల్లలతో బుట్టల కుట్టాలి వాటిని పండుగరోజు కడిగి రుబ్బిపెట్టుకొని వున్న ఇడ్లీ పిండితో నింపి ఆవిరిమీద వుడికించాలి ఇడ్లిలే కాని పత్రహరితంతోకుడిన ఇడ్లీ అన్నమాట. ఇది ఆరోగ్యానికి మంచిదట.ఐతే దీనికి కొబ్బరి చెట్నీ,కాని పల్లి చట్ని కాని చాలాబాగుంటుంది. ఇలా చాలావున్నయట్ తరవాత ఎప్పుడుఅయేనా చెప్తా. ఒకే నా వినాయక చవితి బాగాజరుపుకోండి.
పర్యావరణాన్ని. ఆరోగ్యాన్ని పరిసరాలని కాపాడుదాం ఇది మన అందరి బాద్యత.
మరి వుంటా బాయ్..........బై.....................

ఆదివారం, ఆగస్టు 31, 2008

నేనూ రోదసి యాత్ర చేస్తాను

ఆదివారం, ఆగస్టు 31, 2008


నేనేనండి శ్రీ వైష్ణవి ని బాగున్నారా. నేను ఎలా వున్నాను భాగున్ననా ? సరే నాకోరిక ఇదే నేను ఎప్పటి కైనా రోదసీ యాత్ర చెయ్యాలని నేనూ రోదసి యాత్ర చేస్తాను .సరే మరి బాయ్
సాదు శ్రీ వైష్ణవి .

హాయ్ హాయ్ .............

హలో నా పేరు శ్రీ వైష్ణవి . నేనూ మా అమ్మమ్మ కలసి ఈ బ్లాగ్ తయారు చేసాము . అయ్యో మా అమ్మమ్మ పేరు చెప్పటం మరిచి పోయానండి సరే మా అమ్మమ్మ పేరు విజయ లక్ష్మి. మా అమ్మమ్మకి చాలా మంచి విషయాలు , కధలు , వంటలు,పూజలు, పురాణాలు ,జి.కే,చిటికాలూ చాలా తెలుసు అందుకే అవ్వన్నీ మీ అందరి తో పంచుకుందామని పించిది అలా పుట్టింది ఈ లహరి.కం . నేను చోడవరం లో లిటిల్ ఏంజెల్స్ school లో ౧ స్ట్ స్తన్దేరేడ్ చదువు తున్నను. ఐతే ఈ బ్లాగ్ లో మాకు తేలిసినవి ఈ బ్లాగ్ లో పొందు పరుస్తాను సరే నా మీరు చూడండి మీ మీ అభిప్రాయాలను కామెంట్స్ తెలపగలరు. ఓకే ఓకే నా బాయ్ బాయ్ సి యూ .
శ్రీ వైష్ణవి .

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)