Blogger Widgets

గురువారం, ఫిబ్రవరి 15, 2024

అర్గ్యమిస్తే అష్టైశ్వర్యాలు ప్రసాదించే ఆదిదేవుడు సూర్యనారాయణ మూర్తి

గురువారం, ఫిబ్రవరి 15, 2024

 నమస్కారిస్తే ఆయురారోగ్యాలుఅర్గ్యమిస్తే అష్టైశ్వర్యాలు ప్రసాదించే ప్రత్యక్ష భగవానుడు సూర్యడు.  


ఆదిదేవ ! నమస్తుభ్యం – ప్రసీద మమ భాస్కర |

దివాకర ! నమస్తుభ్యం – ప్రభాకర నమోస్తుతే

2. సప్తాశ్వరథ మారూఢం – ప్రచండం కశ్యపాత్మజం |

శ్వేతపద్మధరం దేవం – తం సూర్యం ప్రణమామ్యహమ్‌

3. లోహితం రథమారూఢం – సర్వలోకపితామహం |

మహాపాపహరం దేవం – తం సూర్యం ప్రణమామ్యహమ్‌.

4. త్రైగుణ్యం చ మహాశూరం – బ్రహ్మ విష్ణుమహేశ్వరమ్‌ |

మహాపాపహరం దేవం – తం సూర్యం ప్రణమామ్యహమ్‌

5. బృంహితం తేజసాంపుంజం – వాయు రాకాశ మేవ చ |

ప్రియంచ సర్వలోకానాం – తం సూర్యం ప్రణమామ్యహమ్‌.

6. బంధూకపుష్పసంకాశం – హారకుండభూషితం |

ఏకచక్ర దరం దేవం – తం సూర్యం ప్రణమామ్యహమ్‌.

7. తం సూర్యం లోకకర్తారం – మహాతేజ: ప్రదీపనమ్‌|

మహాపాపహరం దేవం- తం సూర్యం ప్రణమామ్యహమ్‌.

8. తం సూర్యం జగతాం నాథం – జ్ఞానప్రకాశ్యమోక్షదమ్‌ |

మహాపాపహారం దేవం – తం సూర్యం ప్రణ మామ్యహమ్‌.

9. సూర్యాష్టకం పఠేన్నిత్యం – గ్రహపీడా ప్రణాశనం |

అపుత్రో లభతే పుత్రం – దరిద్రో ధనవా న్భవేత్‌ |

10. ఆమిషం మధుపానం చ య: కరోతి రవేర్ధినే|

సప్త జన్మ భవేద్రోగి – జన్మ జన్మ దరిద్రతా |

స్త్రీ తైలమధుమాంసాని – యే త్యజంతిరవేర్దినే |

న వ్యాధి: శోకదారిద్య్రం – సూర్యలోకనం చ గచ్ఛతి.

ఆదిదేవ ! నమస్తుభ్యం – ప్రసీద మమ భాస్కర |

దివాకర ! నమస్తుభ్యం – ప్రభాకర నమోస్తుతే

ఓ ఆది దేవా ! నీకు నమస్కారము. భాస్కరా! నన్ను కరుణించు  . ప్రభాకరా నీకు ప్రణామములు అంటు సూర్యునికి ప్రతినిత్యము నమస్కారములు చేస్తే ఆయురారోగ్యాలు, అర్ఘ్యమిసే చాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించే ప్రత్యక్షభగావానుడు సూర్యుడు.

మాఘమాసములో వచ్చే శుద్ధ సప్తమి తిధి కి రధసప్తమి అను పేరు. ఇది సూర్యునికి సంబందించిన రోజు . ఇది ముఖ్యముగా సూర్యభగవానుని ఆరాధించు పండుగ. ఈ రోజు సూర్యడు తన రధమును ఉత్తరం దిక్కునకు మళ్ళించే రోజు.
ఈ పర్వదినము రోజు కుటుంబములోని వారందరూ తెల్లవారుజామున నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకొని జిల్లేడు ఆకుల్ని భుజాలమీద , తలమీద పెట్టుకొని

"జనని త్వంహి లోకానాం సప్తమీ సప్తసప్తికే, సప్తమ్యా హ్యదితే దేవి నమస్తే సుర్యమాతృకే "
అనే మంత్రముతో స్నానము చేయాలి, సూర్యునికి అర్ఘ్యమివ్వాలి. సూర్యుడికి  అర్గ్యమిస్తే అష్టైశ్వర్యాలు ఇస్తాడు . 
జిల్లేడు పత్రమునే అర్కపత్రమంటారు. ఈ పత్రము సూర్యునికి ఇష్టము.
తులసి కోటని పసుపు, కుంకుమ లతో అలంకరించి, తులసికోట ముందు ముగ్గులు పెట్టాలి. సూర్యబింబం, ఏడు గుర్రాలు, ఏకచక్రము తో బొమ్మ ముగ్గు పెట్టాలి . ముగ్గుమీద ఆవు పిడకలతో కుంపటి ఏర్పరచి దానిమీద గిన్నెలో అన్నం పాయసము వండాలి. కొత్త గిన్నెకి పసుపురాసి, కుంకుమ బొట్టు పెట్టి, ఆవుపాలను మూడుసార్లు పొంగించి , కొత్త బియ్యము, పటికబెల్లము, యాలకులపొడి చేర్చి , నెయ్యి వేసి చక్కగా వుడికించి పాయసముచేయ్యాలి.
పాలు మూడు సార్లు పొంగటమువల్ల ఇంట్లో సిరిసంపదలు పోంగిపోర్లుతాయని నమ్మకము వుంది.
చిక్కుడు కాయలకి చీపురుపుల్లలు గుచ్చి చేసిన రధమును ముగ్గులో పెట్టి, పదిహేను చిక్కుడు ఆకులు పరచి అందులో ఉడికించిన పాయసమును వడ్డించాలి. వాటిలో అగ్నిహోత్రునికి ఐదు ఆకులు అర్పించాలి. తులసి అమ్మవారికి ఐదు , మిగతా ఐదు సుర్యభాగావానునికి నివేదించాలి. సూర్యునికి గంధ , పుష్ప, అక్షతల, షోడపోచార అష్టోత్తర శతనామాలతో పూజించాలి. ఆయనికి ప్రదక్షణాలు చేసి నమస్కారము చేస్తే ఎంతో పుణ్యము వస్తుంది.
సాయమ్త్రము సూర్యుని గుడికి వెళ్లి నమస్కరించాలి.
రధ సప్తమి రోజునుండి వేసవి కాలము ప్రారంబమవుతుంది . అందుకే రధసప్తమిరోజు తప్పకుండా సూర్య నమస్కారములు చేయాలి. మనకు ప్రతినిత్యము ప్రత్యక్షముగా కనిపించే దైవం సూర్యభగవానుడు. ప్రపంచములో అన్ని జీవరాసులకు వేడి, వెచ్చదనము, పాడిపంటలను, వెలుగును ఇచ్చేవాడు భాస్కరుడు. సుర్యారాధన మనకు వేద కాలమునుండి ఉంది. సూర్యుని పేరు సప్తిమ. ఏడు గుర్రాలను, పంచిన రధము కలిగినవాడు. సప్తలోకములకు తన శక్తిని ప్రసాదించువాడు సూర్య కిరణాలు ఏ డురంగులకు నిదర్శనమని, రధసప్తమినాడు ఆకాసములో గ్రహ నక్షిత్ర సన్నివేసం రధమును పోలి ఉంటుంది కనుకనే ఈ తిధిని రధసప్తమి అని పేరు వచ్చింది.
అనంతసక్తితో కూడుకొన్న కిరణాలు, తేజస్సు, శుద్ధమైన వాడు , భక్తులకు అభయము ఇచ్చేవాడు. జగతికి వెలుగుకారకుడు, జ్యోతిర్మయుడు, శుభానిచ్చే ఆదిత్యుడు, చీకటి పారద్రోలేవాడు, భక్తుల కోరికలు తీర్చేవాడు ఆదిత్యుడు , మార్తాండుడు,శుభంకరుడు, భాస్కరుడు అయిన సూర్యనారాయణమూర్తికి నమస్కారములు అంటూ ధ్యానించాలి.
సుర్యుడు ఆరోగ్య ప్రదాత. అది సైన్స్ ద్వారా కూడానిరూపించబడినది. సూర్య కిరణాలలో డి విటమిన్ కలదు.
అన్నట్టు రధసప్తమి రొజు స్త్రీలు ఎన్నో నోములు చెయటానికి ప్రారంబధినముగా చెయుదురు. అక్షింతలు వేసుకొని నోములకు నాంది పలుకుదురు.

శనివారం, ఫిబ్రవరి 03, 2024

Solution from Bhagavad gita @Ammammathonenu

శనివారం, ఫిబ్రవరి 03, 2024

నేను ఏమీ చేయలేను అనుకునేవారికి భగవద్గీత నుండి సమాధానం

 మనం జీవితంలో ఎన్నో అనుకుంటూ వుంటాం.  కొన్ని పనులు అనుకోగానే అవుతాయి కొన్ని పనులైతే ఎన్నిసార్లు చేపట్టినా అవ్వదు.  అలాంటప్పుడు మనకి నిరాశా నిస్పృహ వస్తాయి.  కొంతమంది అయితే డిప్రషన్లోకి వెళ్ళిపోతారు.  అంతలా చేస్తాయి  నిరాశా నిస్పృహ .   మనం వింటు వుంటాం ప్రతీ సమస్యకి ఒక పరిష్కారం వుంటుంది అని.  మనం ప్రయత్నిస్తూ వుండాలి అంతే. 

కృష్ణుడు భగవద్గీతను అర్జునికి ఒకనికే చెప్పలేదు.  మనకోసం చెప్పివుంటాడేమో .  ఇప్పుడు అందరు ఏదన్న సమస్య వస్తే మానసిక వైద్యునిదగ్గరికి వెల్తూన్నారు. వాళ్లు కౌన్సిలింగ్స్ ఇస్తారు.  అలాగే యుద్దభూమిలో అర్జునుడు తనవారిని చూసి యుద్దం చేయను, చేయలేను అంటూ అర్జుని విషాధం దానితరువాత శ్రీ కృష్ణులువారు భగవద్గీత చెప్పారు.  అయితే మనజీవితంలో అన్వయించుకుంటే    ప్రతీ సమస్యకి భగవత్గీతలో సమాధానం దొరుకుతుంది.  చూసే దృక్కోణం బట్టి సమాధానం వుంటుంది. 

ఈరోజు ఒకసమస్యని చూసి గీతలో కృష్ణుడు ఏమి చెప్పారో చూద్దాంరండి. 

సమస్య ఏమిటంటే :  

ఒకపని తలపెట్టాను. ఆపని ఎన్నిసార్లు చేసినా పూర్తీ అవ్వటంలేదు.. ఏ పని చేసినా మంచి ఫలితాలు రావటంలేదు. కష్టం వృధా అవుతొంది తప్పా మంచి ఫలితం రావటంలేదు.  మనస్సులో ధైర్యంలేదు. నేను ఏమి చేసినా ఇంతే .  ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉంటుంది . ఏమి చేయాలన్నా భయం నేను చేయగలనా లేదా. ఒకవేళ చేస్తే పర్ఫెక్ట్ అవుతుందో లేదో .  మనసునిండా tension .  మనసు కృంగిపోతుంది.  

ఈ సమస్య సర్వసాధారణంగా మనలో చాలామంది అంటూ ఉంటారు. మనం వింటూనే వున్నాం కదా మరి ఈ సమస్యకి గీత ఏమి చెప్తోందో చుద్దాం.  

నేను ఏమీ చేయలేను అనుకునేవారికి భగవద్గీత నుండి సమాధానం. 


 గీతలో సాంఖ్య యోగము, భగవద్గీతలో రెండవ అధ్యాయంలో మూడవ శ్లోకం చూడండి. 

||శ్లోకము 2-3||

క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే |
క్షుద్రం హృదయ దౌర్బల్యం త్వక్యోత్తిష్ట పరన్తప ||3||

చూడండి. దీని అర్ధం ఏమిటంటే 

“  పార్థా ! పిరికితనాన్ని తెచ్చుకోవద్దు ; అది నీకు ఎంత మాత్రమూ తగదు ; తుచ్ఛమైన హృదయదౌర్బల్యాన్ని విడిచిపెట్టి యుద్ధానికి సంసిద్ధుడవు కా ! ”

హృదయ దౌర్భల్యం, పిరికితనం, అధైర్యం వంటివి మన మనసున చేరిన బుద్ది నశిస్తుంది. విచక్షణ జ్ఞానము ఉండదు. 

అందువల్లే ఎంతో గొప్ప సాటిలేని వీరుడు అయిన అర్జునుడు కూడా తనలోని అంతఃశత్రువులైన హృదయ దౌర్బల్యానికి పిరికితనానికి లోనై యుద్ధం చేయకూడదు అనుకున్నాడు. ఒకానొక బుద్ధిశాలి ఎప్పుడూ వర్తమాన పరిస్థితుల వైపు కాక,అంతిమలక్ష్యం వైపు దృష్టిపెట్టాలి.  విజ్ఞతయే ధర్మయుద్ధానికి మూలం . ధర్మయుద్ధమే అంతిమ విజయానికి మార్గం.జీవన సమరంలో వెనుకడుగు వేసే ప్రతి సందర్భంలోనూ మన అడుగులు ముందుకు వేస్తూంటేగమ్యం చేరువ అవుతూ ఉంటుందిచివరికి లక్ష్యాన్ని చేరుతాం . 

పరిష్కారం : ఎప్పుడు నిరుత్సాహ పడకూడదు. నీశక్తి నీలోనే ఉంది . అది నువ్వు గ్రహించాలి. నువ్వు ఇప్పటికే చాలా విజయాలు సాధించావు అలాంటి నువ్వా ఇలా క్రుంగిపోతున్నావా ? లే  దైర్యం తెచ్చుకో .  నీచమైన పిరికితనం వదిలిపెట్టు . ఉత్సాహంతో దైవంమీద భారం వేసి పని మొదలు పెట్టు. తప్పకుండా విజయం సాధిస్తావు. 

ఇదండీ భగవద్గీతలో మన సమస్యకి సాంఖ్యా శాస్త్రంలో సమాధానం దొరికింది.  మీకు నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను. ధన్యవాదములు. 

శనివారం, జనవరి 27, 2024

చిన్నకథ పెద్దనీతి Story Telling

శనివారం, జనవరి 27, 2024

గురువారం, జనవరి 11, 2024

మార్ఘశిర లక్ష్మి పూజ కధ

గురువారం, జనవరి 11, 2024

మార్ఘశిర లక్ష్మి పూజ కథ

బుధవారం, జనవరి 10, 2024

అమ్మమ్మ చేసిన అరిసెలు ఇవే మాకు మధురానుభూతులు

బుధవారం, జనవరి 10, 2024

గురువారం, డిసెంబర్ 07, 2023

అమ్మమ్మతో నేను లో మా అమ్మమ్మగారి చివరి వీడియో(Last video with ammamma)

గురువారం, డిసెంబర్ 07, 2023

శనివారం, నవంబర్ 18, 2023

కార్తీకపురాణం 5వ అధ్యాయం (Kartika Puranam Adhyayam 5)

శనివారం, నవంబర్ 18, 2023

శుక్రవారం, నవంబర్ 17, 2023

కార్తీక పురాణం 4 వ అధ్యాయం(Kartika puranam adhyayam 4)

శుక్రవారం, నవంబర్ 17, 2023

గురువారం, నవంబర్ 16, 2023

అమ్మమ్మగారు మా సందేహాలు తీరుస్తారా? కార్తీకమాసంలో ఉల్లీ, వెల్లుల్లి, ఉస...

గురువారం, నవంబర్ 16, 2023

నాగులచవితి రోజు పుట్టలో పాలు ఎందుకు ఎలా పొయ్యాలి.(All about Nagula Chavi...

బుధవారం, నవంబర్ 15, 2023

కార్తీక స్నాన మహిమ, బ్రహ్మరాక్షసులకు ముక్తి (Kartika puranam Day-3)

బుధవారం, నవంబర్ 15, 2023

మంగళవారం, నవంబర్ 14, 2023

కార్తీక సోమవార వ్రతం విశిష్టత(Karthika puranam Day 2)

మంగళవారం, నవంబర్ 14, 2023

సోమవారం, నవంబర్ 13, 2023

కార్తీక పురాణం 1 వ అధ్యాయం(Kartika puranam adhyayam 1)

సోమవారం, నవంబర్ 13, 2023

ఆదివారం, నవంబర్ 12, 2023

వత్తులు, దీపం ఎందుకు వెలిగించాలి? ఎలా వెలిగించాలి?(Diwali Spl All about ...

ఆదివారం, నవంబర్ 12, 2023

గురువారం, నవంబర్ 09, 2023

5 రోజుల దీపావళి పండగ ఎలా చేసుకోవాలి?(How to celebrate diwali)

గురువారం, నవంబర్ 09, 2023

ఆదివారం, నవంబర్ 05, 2023

బూడిద గుమ్మడికాయ ఒడియాలు సాంప్రదాయ పద్దతిలో పెట్టుకుందాం రండి

ఆదివారం, నవంబర్ 05, 2023

బూడిద గుమ్మడికాయ ఒడియాలు సాంప్రదాయ పద్దతిలో పెట్టుకుందాం రండి

శనివారం, నవంబర్ 04, 2023

ఒక మంచి కొత్త సినిమా కృష్ణ ఘట్టం review అమ్మమ్మ తో నేను(Movie review)

శనివారం, నవంబర్ 04, 2023

ఒక మంచి కొత్త సినిమా కృష్ణ ఘట్టం review అమ్మమ్మ తో నేను(Movie review)

ఒక మంచి కొత్త సినిమా కృష్ణ ఘట్టం రివ్యూ అమ్మమ్మ తో నేను

శుక్రవారం, నవంబర్ 03, 2023

నీలం శంఖం పూతో స్కై లడ్డు ఆరోగ్యానికి బరువు తగ్గటానికి చాలా వుపయోగపడుతుం...

శుక్రవారం, నవంబర్ 03, 2023

పాకం గారెలు రిసిపి నా ట్విస్ట్ తో మలైవడ(Old traditional pakam garelu wit...

మంగళవారం, అక్టోబర్ 31, 2023

అట్లతద్ది రోజు స్పెషల్ అట్లు తిమ్మనం ప్రత్యేకమైన రుచితో అధిరిపోయే కాంబి...

మంగళవారం, అక్టోబర్ 31, 2023

ఆదివారం, అక్టోబర్ 29, 2023

అచ్చతెలుగు ఆడపిల్లల పండగ అట్లతద్ది ఎలా చేసుకోవాలి. అట్లతద్ది వ్రత కధ ఉద...

ఆదివారం, అక్టోబర్ 29, 2023

శనివారం, అక్టోబర్ 28, 2023

శరత్ కాలపు పూర్ణిమనాటి చివరి చంద్ర గ్రహణం వేళ ...చంద్రదర్శనం

శనివారం, అక్టోబర్ 28, 2023

శరత్ కాలపు పూర్ణిమనాటి చివరి చంద్ర గ్రహణం వేళ ...చంద్రదర్శనం

దెయ్యాల పండగ ఏంటి ? దెయ్యం మేకప్ లో నేను .(Halloween Special makeup)

శుక్రవారం, అక్టోబర్ 27, 2023

అమ్మమ్మ స్టైల్ చామదుంపల పులుసు చాలా బాగుంటుంది(Ammamma Style Chamadumpal...

శుక్రవారం, అక్టోబర్ 27, 2023

గురువారం, అక్టోబర్ 26, 2023

My Style Spicy Mushroom Ghee Roast అతి సులువుగా చేసుకోవచ్చు మీరు కూడా ట్...

గురువారం, అక్టోబర్ 26, 2023

బుధవారం, అక్టోబర్ 18, 2023

వావ్ అనిపించే డ్రాగన్ మంచూరియన్ వెజ్ బిర్యాని (Unique Chinese+Hyderabadi...

బుధవారం, అక్టోబర్ 18, 2023

మంగళవారం, అక్టోబర్ 17, 2023

అరటికాయతో కారప్పూస ఎప్పుడైన తిన్నారా లేదా ఐతే ఈ పండక్కి ట్రై చేయండి.(Uni...

మంగళవారం, అక్టోబర్ 17, 2023

సోమవారం, అక్టోబర్ 16, 2023

మరమరాలతో జ్యూసీ గులాబ్ జామూన్ రిసిపీ చాలా ఇజీ(Simple Murmura Gulabjamun)

సోమవారం, అక్టోబర్ 16, 2023

శనివారం, అక్టోబర్ 14, 2023

అరుదుగా దొరికే ఆవు ముర్రుపాలుతో అద్భుతమైన జున్ను మనం ఇంటిదగ్గరే చేసుకుంద...

శనివారం, అక్టోబర్ 14, 2023

మంగళవారం, అక్టోబర్ 10, 2023

పండగ ఆఫర్ లో కొత్తమిక్సీ లో మంచిగా మనకి రక్తపుష్టిని ఇచ్చే old recipe మీ...

మంగళవారం, అక్టోబర్ 10, 2023

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)