Blogger Widgets

సోమవారం, సెప్టెంబర్ 21, 2009

చంద్రఘంటాదేవి ( నవదుర్గా స్థోత్ర)

సోమవారం, సెప్టెంబర్ 21, 2009

చంద్రఘంటాదేవి
ఈ తల్లి తన శిరమున దాల్చిన అర్ధచంద్రుడు ఘంటాకృతిలో ఉండుటచే ఈమెకు 'చంద్రఘంట' యను పేరు స్థిరపడెను. ఈమె శరీరము బంగారు కాంతి మయము. ఈమె తన పది చేతులలో ఖడ్గము మొదలగు శస్త్రములను, బాణము మున్నగు అస్త్రములను ధరించియుండును. ఈమె సింహ వాహన. ఈమె సర్వదా సన్నాహయై యుద్ధముద్రలోనుండును. ఈమె గంటనుండి వెలువడు భయంకరధ్వనులను విన్నంతనే క్రూరులై దైత్య దానవ రాక్షసులు ఎల్లప్పుడు వడగడలాడుచుందురు. కాని భక్తులకును, ఉపాసకులకును ఈమె మిక్కిలి సౌమ్యముగను, ప్రశాంతముగను కన్పట్టుచుండును.
ఈ దేవి ఆరాధన సద్యఃఫలదాయకము. భక్తుల కష్టములను ఈమె అతి శీఘ్రముగా నివారించుచుండును. ఈ సింహవాహనను ఉపాసించువారు సింహ సదృశులై పరాక్రమశాలురుగా నిర్భయులుగా ఉందురు. ఏవిధమైన భయములును వారిని బాధింపజాలవు.

ఆదివారం, సెప్టెంబర్ 20, 2009

దసరా వచ్చింది ఈరోజు బాలా త్రిపుర సుందరి అవతారం(Bala Kavacham)

ఆదివారం, సెప్టెంబర్ 20, 2009

దసరా ఒక హిందువుల ముఖ్యమైన పండుగ . ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది.

ఈ పండుగకు ఈ పది రోజులు పది అవతారాలుగా అమ్మవారిని అలంకరించుకొని పూజ చేస్తారు. రోజు ప్రతి ఇంట్లోను లలితా సహస్త్రమ్ చదువుతారు. బొమ్మలకొలువులు పెడతారు. బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతల్తో ఘోరమైన యుద్ధమి చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొర పెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది .త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీరూపమై జన్మించింది.

ఈ దసరా రోజులలో అమ్మవారి అవతారాలు:


మొదటి రోజు -శైలపుత్రి అవతారం
రెండవ రోజు- బ్రహ్మచారిణి (బాలా త్రిపురసుందరి)
మూడవ రోజు-చంద్రఘంటాదేవి
నాల్గవ రోజు-కూష్మాండాదేవి
ఐదవ రోజు-స్కందమాత
ఆరవ రోజు-కాత్యాయినీదేవి
ఏడవ రోజు-కాళరాత్రీదేవి
ఎనిమిదవ రోజు-మహాగౌరీదేవి
తొమ్మిదవ రోజు-సిధ్ధిదాత్రీదేవి
గానవరాత్రులు అమ్మవారు దర్సనం ఇస్తారు . ఒక్కొక్కప్రదేశంలోను ఒక్కొక్క పేరుతో అమ్మవారిని కొలుస్తారు.కొన్ని ప్రదేశాలలో పార్వతిదేవిని కనకదుర్గగాను,మహాలక్ష్మిగాను, అన్నపూర్ణగాను,బాలాత్రిపుర సుందరిగాను,రాజరాజేస్వరీ దేవిగాను,మహిషాసుర మర్ధినిగాను కొలుస్తారు.
నిన్నటి రోజును శైలపుత్రిగా పూజించారు.

శైలపుత్రి

సతీదేవి యోగాగ్నిలో తనువును త్యజించి, పిదప పర్వతరాజైన హిమవంతుని యింట పుత్రికయై అవతరించినందున ఆమెకు శైలపుత్రి అను నామము. వృషభవాహనారూఢయైన ఈ మాతకు కుడిచేతిలో త్రిశూలము, ఎడమచేతిలో కమలము విరాజిల్లుచుండును. తలపై చంద్రవంకను ధరించియుండును. పార్వతి, హైమవతి అనునవియు ఆమె పేర్లే. శైలపుత్రి మహిమలు, శక్తులు అనంతములు. వాంఛితములను ప్రసాదించు తల్లి.

నేటిదినమును బాలాత్రిపురసుందరి అవతారములో అమ్మవారిని పూజించవచ్చు.ఈరోజు చిన్నపిల్లలకు పసుపురాసి పూజచేసి వారిలో అమ్మవారిని చిన్నపిల్లగా చూస్తారు. ఈమెను బ్రహ్మచారిణి అని అందురు.

బ్రహ్మచారిణి

'బ్రహ్మచారిణి' యనగా తపమాచరించు తల్లి. బ్రహ్మమునందు చరించునది.కుడి చేతియందు జపమాలను, ఎడమచేతియందు కమండలువును ధరించును. పరమేశ్వరుని పతిగా బడయుటకు తీవ్రమైన తపమొనర్చి ఉమ యని ప్రసిద్ధి వహించెను. ఈ దేవి స్వరూపము జ్యోతిర్మయము. మిక్కిలి శుభంకరము. భక్తులకును, సిద్ధులకును అనంత ఫలప్రదము. బ్రహ్మచారిణీ దేవి కృపవలన ఉపాసకులకు నిశ్చలమగు దీక్ష, సర్వత్ర సిద్ధి, విజయము ప్రాప్తించును.

గురువారం, సెప్టెంబర్ 17, 2009

విశ్వకర్మ పుట్టినరోజు.

గురువారం, సెప్టెంబర్ 17, 2009


విశ్వకర్మ పుట్టిన రోజును ఈరోజు పెద్దపెద్ద కంపెనీలలోను పరిస్రమలలోను జరుపుకుంటారు.

అసలు విశ్వకర్మ అంటే ఎవరో తెలుసా? మన భూమిని తయారుచేసింది విశ్వకర్మ.అతను దేవతల శిల్పి, బ్రహ్మ ఆదేశించటం తో అతను భూమిని విశ్వాన్ని తయారు చేసారు.
విశ్వకర్మ హిందూ పురాణాల ప్రకారం ఎన్నో పట్టణాలను నాలుగు యుగాలలో నిర్మించాడు.
సత్యయుగంలో దేవతల నివాసం కోసం స్వర్గలోకం నిర్మించాడు.
త్రేతాయుగంలో సువర్ణ లంకను శివుని కోసం నిర్మించాడు.
ద్వాపర యుగంలో ద్వారక నగరాన్ని మరియు కలియుగంలో హస్తినాపురం మరియు ఇంద్రప్రస్థం నిర్మించాడు.

మంగళవారం, సెప్టెంబర్ 15, 2009

Animated cats

మంగళవారం, సెప్టెంబర్ 15, 2009

నాకు animation అంటే చాలా ఇష్టము అందులో పిల్లులు నాకు బాగా నచ్చాయి. మీరు చూడండి.





My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)