Blogger Widgets

గురువారం, జనవరి 05, 2012

ఎగిరిపోతే ఎంత బాగుంటుంది

గురువారం, జనవరి 05, 2012

 
                                          ఈ రోజు National Birds Day .
ఆకాశములోని కనిపించిన పక్షులును చూసి పంజరములో వున్నా ఈ పక్షి ఏమనుకుంటోంది అంటే ....ఎగిరిపోతే ఎంత బాగుంటుంది .
ఈ మనుషులు మనసులో కష్టము కలికినప్పుడు ఆకాశములోఉన్న మా పక్షులును చూసి నాకు రెక్కలు వచ్చి ఎగిరిపోతే ఎంతబాగుంటుంది అని పాడుకుంటారు. అవి హాయిగా ఆకాశం అంతా నాదే అని ఎగురుతూ వుంటే చూడటానికి ఎంతబాగుంది అనుకుంటారు.  మా శబ్దాలను (కిలకిల రవాలు) హాయిగా విని ఎంతో ఎంజాయ్ చేస్తారు.  పక్షులులో చాలా అందముగా అనేకానేక రంగుల్లో వుంటాయి.  ఇప్పుడు మాకు  కాలం బాలేదు అనిపిస్తోంది.  మాకు మనిషి అధికముగా అనేకరకాలుగా కష్టాన్ని కలిగిస్తున్నాడు.  చేట్లు నరికేసి మాకు నిలువు నీడలేకుండా చేస్తున్నాడు.  సెల్ ఫోన్ టవర్స్ కట్టి ఒకరకంగా మాఉనికినే పూర్తిగా తీసేస్తున్నాడు.  విపరీతమైన వాతావరణ కాలుష్యము చేసేస్తున్నాడు, ఇంకా దొరికితే తినేస్తున్నారు.  మరి కొందరు మాతో circus చేయించి డబ్బు సంపాదిస్తారు. కొందరు మాలో మాకు యుద్దాలు (కోడిపందాలు) పెట్టి మమ్ములను మేమే చంపుకునేటట్టు చేసి మమ్ములను తినేస్తున్నారు. అంతే కాదు భారతీయులు అయితే తమ జాతీయ పక్షిగా పెట్టుకున్న నెమలిని రెక్కలు పీకి నేమలీకలు అని చెప్పి అమ్మేస్తున్నారు.  రాజకీయనాయకులు, ధనవంతులు నెమలిని తింటున్నారు.  ఇంకా చెప్పాలి అంటే మా బాధలు చాలా వున్నాయి.  నాకు ఇలా చెప్తుంటే కళ్ళు నీళ్ళు కారుతున్నాయి.  పక్షులును చూసి ఆనందిచేవారు వాటిని cage  లో బంధించి మా స్వేచ్చను తొలగిస్తున్నారు.  మరలా మమ్ములను ఆకాశములో చూసి మేము రెక్కలు వచ్చి ఎగిరితే ఎంత బాగుంటుంది అని పాడుకుంటారు ఇదెక్కడి న్యాయం.  మాకు కష్టం కలిగించినా సరే కష్టంలో కూడా మాకు ఇల్లు మేమే కట్టుకొని వుంటే గూళ్ళు పీకేసి సంతోషిస్తున్నారు. మేము వంశమును పెంచుకోటానికి గుడ్లు పెట్టుకుంటే అవికూడా లాగేసుకొని తినేస్తున్నారు.  నాకే కనుక భగవంతుడు ఒక న్యాయస్తానం చూపిస్తే  న్యాయస్థానంలో  మనిషి మీద వారు చేస్తున్న ఆకృత్యాలమీద కేసుపెట్టాలని వుంది.  మాకు జరుగుతున్నా అన్యాయానికి గొంతెత్తి అరిచి మాకు న్యాయం చేయమని న్యాయపోరాటం చేయాలని వుంది.  మనుషులమని చెప్పుకుని జీవిస్తున్న జీవులకి మానవత్వం ఎక్కడుంది అని అడగాలని వుందిమాకు స్వేచ్చ స్వాతంత్రాలు కావాలని అడగాలని వుంది.  నన్ను నావారినుండి విడదీసే హక్కు మనుషులకు ఎవరిచ్చారని అడగాలని వుంది.   నాకు  పంజరము నుండి ఎగిరిపోవాలని వుంది. మా పక్షిజాతిని కాపాడండి.  దయచేసి నన్ను, మా జాతిని స్వేచ్చగా బ్రతకనీయండి. మానవులారా మేము మీలానే ప్రాణం కలవారమే.  దయచేసి మాకు హాయిగా బ్రతికే అవకాసము ఇవ్వండి.  ఇక మిమ్ములను మేము ఏమీ అడుగము.     దయ చేసి నన్ను వదిలేయండి.  మీకు మీ పెద్దలికి నా నమస్సులు . 

బుధవారం, జనవరి 04, 2012

తిరుప్పావై ఏకవింశతి పాశురము

బుధవారం, జనవరి 04, 2012

గోపికలు పురుష అహంకార భుతురాలగు నీలాదేవిని మేలుకోలిపిరి. ఆమె మేలుకొని "నేను మీలో ఒక్కదానినికదా! నన్ను ఆశ్రయించిన మీకేనాడు లోపముండదు. రండి!  మనమందరమూ కలసి శ్రీ కృష్ణుని మేల్కొల్పి అర్దింతము . " అని తానూ వచ్చి గోపికలతో శ్రీకృష్ణ భగవానుని సమీపమునకు వారిని తోడ్కొనిపోయి మేలుకొలుపు జొచ్చెను.

ఈ విధముగా శ్రీ కృష్ణుని మేలుకోల్పుతున్నారు. 

ఏత్త కలంగళ్ ఎదిర్ పొంగి మీదళిప్ప
మాత్తాదే పాల్ శొరియుం వళ్ళల్ పెరుం పశుక్కళ్
ఆత్త ప్పడైత్తాన్ మగనే! అఱివుఱాయ్     

ఊత్త ముడైయాయ్! పెరియాయ్! ఉలగినిల్
తోత్తమాయ్ నిర్ఱ శుడరే! తుయిల్ ఎరాయ్

మాత్త్తార్ ఉనక్కు వలి తొలైందు ఉన్-వాశఱ్కణ్
ఆత్తాదు వందు ఉన్-అడిపణియుమా పోలే
పోత్తియాం వందోం పుగరందు-ఏలోర్ ఎంబావాయ్

తాత్పర్యము:
పొదుగు క్రిందనుండి కడవలు చరాచర నిండి, పొంగిపొరలి నట్లు ఆగక, పాలు స్రవించు అసంఖ్యకములగు, ఉదారములగు, బలసిన ఆవులుగల నందగోపుని కుమారుడా! మేల్కొనుము. ప్రమాణదార్ఢ్యముగల పరబ్రహ్మస్వరూపా ! ఆశ్రితరక్షణ పృతిజ్ఞాధార్ఢ్యముగల మహామహిమ సంపన్నా! ఈ లోకములో ఆవిర్భవించిన జ్యోతిస్స్వరూపా ! నిద్ర నుండి లెమ్ము. శత్రువులు నీపరాక్రమమునకు లోకి నీవాకిటికి వచ్చి నీ దాసులై నీపాదారవిందముల నాశ్రయించినట్లు మేముకూడా నిన్ను వీడి యుండలేక నీ పాదములనే స్తుతించి మంగళాశాసనము చేయుటకై వచ్చితిమి. 
గోపికలు వారి పరిస్తితిని శ్రీ క్రిష్ణునికి నివేధించినారు.

ఉత్తరద్వార దర్శనము

ఉత్తరద్వార దర్శనము
ఒక సంవత్సరములో 24 ఏకాదశులు వస్తాయి. ప్రత్యక్ష దైవం సూర్యనారాయణమూర్తి  ఉత్తరాయణానికి మారే ముందు వచ్చేది పుష్య శుద్ధ ఏకాదశి దీనినే మనం  వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠములోని తలుపులు తెరుచుకొని ఉంటాయి.   వైష్ణవాలయాలలో గల ఉత్తరద్వారం దర్శనమునకు భగవద్ భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు.  

ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు.  ఈ ఏకాదశి చాలా విశిష్టమైనది.  

దేవతలు రాక్షస కృత్యాలకు భరించలేక బ్రహ్మ తో కూడి  
వైకుంఠము చేరి ఉత్తరద్వారములోనుండి లోపలి ప్రవేసించి శ్రీ మహావిష్ణువును దర్శించుకొని వారి బాధలు వివరించి స్వామివారి అనుగ్రహము  పొంది  రాక్షస పీడ వదిలించుకున్నారు.   నాటి నుండి 

వైకుంఠ ఏకాదశి విశేషము కలిగివుంది.  ఆరోజు ఉపవాసము వుంటే మంచిది. రాక్షస పీడ మనకు చేరదు అంటారు.  


మనము కూడా ఉత్తర ద్వారా దర్శనము చేసుకుందాం.  స్వామివారిని దర్శించుకుందాం.  కనులార్పకుండా దర్సిమ్చుకోవాలి.  స్వామివారి అందము చెప్పలేము మన దిష్టి తగులుతుందేమో.  ఆ దిష్టిని  హారతి ఇచ్చి  తీస్తారు.  మనము ఆ హారతిని మళ్ళీ కళ్ళకు అద్దుకొని మళ్ళీ దిష్టి పెట్టేస్తాం. అందుకే స్వామివారి హారితికి నమస్తే చేయాలి కాని కళ్ళకు అద్దుకోవద్దు అని మనవి.

మరి ఉత్తర ద్వార దర్శనము చేసుకోలేనివారు ఏమిచెయ్యాలి అంటే! మనదేహమే దేవాలయము అని  మన పెద్దలు చెప్పారు కదా.  మన తలపైన ఉత్తరము కదా.  so  కళ్ళు మూసుకొని మనము 

ఙ్ఞానదృష్టి తో స్వామీ దర్శనము చేసుకోవాలి అని అంటారు.  మానసికంగా భగవంతుని దర్శనము చేసుకోవచ్చు.  తప్పకుండా ఉత్తర ద్వారదర్శనము చేసుకోండి మరి.
జై శ్రీమన్నారాయణ్

లూయీ బ్రెయిలీ

లూయి బ్రెయిలీ

Breyili  keybord 



Alphabet bord
ప్రపంచ అంధులకు చదువుకొనే వీలు కలిగించిన మహనీయుడు లూయీ బ్రెయిలీ 1809 సం. జనవరి 4న పారిస్ దగ్గరలోని “క్రూవే” గ్రామంలో జన్మించాడు.  ఈ రోజు ఆయన పుట్టినరోజు.
లూయి బ్రెయిలీ కి చిన్నవయసులో ప్రమాదవశాత్తు రెండు కళ్ళను కోల్పోయి తన 4వ ఏట పూర్తిగా గుడ్డి వాడయ్యాడు. చదువుపై కొడుకు ఆసక్తిని గుర్తించి , పారిస్ లోని అంధుల పాఠశాలలో చేర్చాడు అతని తండ్రి. అప్పటికి అమలులో ఉన్న “లైన్ టైపు” పద్ధతిలో చదువుకుని,  తన ప్రతిభతో చివరికి అదే పాఠశాలలో టీచర్ గా  ఎదిగాడు బ్రెయిలీ.  పగలు విద్యార్ధులకు బోధిస్తూ, రాత్రులు అంధులు తేలికగా చదవగలిగే, రాయగలిగే లిపి తయారీకై  చాలా చాలా కృషిచేసాడు. 
1821 లో ఛార్లెస్ బార్బియర్ అనే సైనికాధికారి తన సైనికులు చీకటిలో కూడా తాను పంపిన సమాచారం గుర్తించేందుకు 12 ఉబ్బెత్తు చుక్కలతో సంకేత లిపిని తయారు చేసాడు.  ఆ సైనికాదికారి చుక్కలులిపి ఆయనకీ స్ఫూర్తి గా అనిపించింది.  అప్పుడు బ్రెయిలీ 12 చుక్కలను ఆరు చుక్కలగా  తగ్గించి అవసరమైన రీతిలో వాటిని పేర్చుతూ అక్షరాలను, పదాలను అంకెలను, సంగీత చిహ్నాలను రూపొందించాడు.బ్రెయిలీ తన కోసం తనలాంటి వారికోసం నిరంతర శ్రమచేసి చివరకు విజయం సాదించారు.  బ్రెయిలీ 1851 లో క్షయ వ్యాధికి గురై 1852 జనవరి 6న మరణించాడు.
బ్రెయిలీ శిష్యులు తమ గురువు గారు రూపొందించిన లిపికి గుర్తింపునివ్వాలని  పోరాటం చేయగా అతని లిపికి అధికార గుర్తింపునిచ్చినది ప్రాన్స్.
ఈనాడు ప్రపంచ అంధులుకోసం అన్ని రకాల పుస్తకాలు, పత్రికలు ఆ లిపిలోనే వస్తున్నాయి. వారందరూ చదువుతున్నారు అంటే అదంతా బ్రెయిలీ వల్లే అని చెప్పుకోవాటం లో ఎటువంటి సందేహం లేదుకదా.
మనం ఈ సందర్బములో ఇంకో విషయం కూడా చెప్పాలి అనుకుంటున్నాను.  గ్రుడ్డివారికోసం నేత్రదానం చేసి వారికి మన అందమైన సృష్టి అందాలు చూపించండి. ఒక మనషి తన కళ్ళు దానం చేస్తే అది ఇద్దరికీ కంటి చూపు వస్తుంది.  వారు మనలాగా అందమైన రంగుల ప్రపంచాన్ని చూడగలరు.  దయచేసి మీ తదనంతరం కళ్ళను బూడిదపాలు చేయకుండా గ్రుడ్డివారికి చూపును ప్రసాదించి ఆ కళ్ళద్వారా మీరూ జీవించండి.
 

నేత్రదానం (Donate Eyes) 

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)