ఈ రోజు National Birds Day . ఆకాశములోని కనిపించిన పక్షులును చూసి పంజరములో వున్నా ఈ పక్షి ఏమనుకుంటోంది అంటే ....ఎగిరిపోతే ఎంత బాగుంటుంది . |
ఈ మనుషులు మనసులో కష్టము కలికినప్పుడు ఆకాశములోఉన్న మా పక్షులును చూసి నాకు రెక్కలు వచ్చి ఎగిరిపోతే ఎంతబాగుంటుంది అని పాడుకుంటారు. అవి హాయిగా ఆకాశం అంతా నాదే అని ఎగురుతూ వుంటే చూడటానికి ఎంతబాగుంది అనుకుంటారు. మా శబ్దాలను (కిలకిల రవాలు) హాయిగా విని ఎంతో ఎంజాయ్ చేస్తారు. పక్షులులో చాలా అందముగా అనేకానేక రంగుల్లో వుంటాయి. ఇప్పుడు మాకు కాలం బాలేదు అనిపిస్తోంది. మాకు ఈ మనిషి అధికముగా అనేకరకాలుగా కష్టాన్ని కలిగిస్తున్నాడు. చేట్లు నరికేసి మాకు నిలువు నీడలేకుండా చేస్తున్నాడు. సెల్ ఫోన్ టవర్స్ కట్టి ఒకరకంగా మాఉనికినే పూర్తిగా తీసేస్తున్నాడు. విపరీతమైన వాతావరణ కాలుష్యము చేసేస్తున్నాడు, ఇంకా దొరికితే తినేస్తున్నారు. మరి కొందరు మాతో circus చేయించి డబ్బు సంపాదిస్తారు. కొందరు మాలో మాకు యుద్దాలు (కోడిపందాలు) పెట్టి మమ్ములను మేమే చంపుకునేటట్టు చేసి మమ్ములను తినేస్తున్నారు. అంతే కాదు ఈ భారతీయులు అయితే తమ జాతీయ పక్షిగా పెట్టుకున్న నెమలిని రెక్కలు పీకి నేమలీకలు అని చెప్పి అమ్మేస్తున్నారు. రాజకీయనాయకులు, ధనవంతులు నెమలిని తింటున్నారు. ఇంకా చెప్పాలి అంటే మా బాధలు చాలా వున్నాయి. నాకు ఇలా చెప్తుంటే కళ్ళు నీళ్ళు కారుతున్నాయి. పక్షులును చూసి ఆనందిచేవారు వాటిని cage లో బంధించి మా స్వేచ్చను తొలగిస్తున్నారు. మరలా మమ్ములను ఆకాశములో చూసి మేము రెక్కలు వచ్చి ఎగిరితే ఎంత బాగుంటుంది అని పాడుకుంటారు ఇదెక్కడి న్యాయం. మాకు కష్టం కలిగించినా సరే కష్టంలో కూడా మాకు ఇల్లు మేమే కట్టుకొని వుంటే గూళ్ళు పీకేసి సంతోషిస్తున్నారు. మేము వంశమును పెంచుకోటానికి గుడ్లు పెట్టుకుంటే అవికూడా లాగేసుకొని తినేస్తున్నారు. నాకే కనుక ఆ భగవంతుడు ఒక న్యాయస్తానం చూపిస్తే ఆ న్యాయస్థానంలో ఈ మనిషి మీద వారు చేస్తున్న ఆకృత్యాలమీద కేసుపెట్టాలని వుంది. మాకు జరుగుతున్నా అన్యాయానికి గొంతెత్తి అరిచి మాకు న్యాయం చేయమని న్యాయపోరాటం చేయాలని వుంది. మనుషులమని చెప్పుకుని జీవిస్తున్న ఈ జీవులకి మానవత్వం ఎక్కడుంది అని అడగాలని వుంది. మాకు స్వేచ్చ స్వాతంత్రాలు కావాలని అడగాలని వుంది. నన్ను నావారినుండి విడదీసే హక్కు ఈ మనుషులకు ఎవరిచ్చారని అడగాలని వుంది. నాకు ఈ పంజరము నుండి ఎగిరిపోవాలని వుంది. మా పక్షిజాతిని కాపాడండి. దయచేసి నన్ను, మా జాతిని స్వేచ్చగా బ్రతకనీయండి. మానవులారా మేము మీలానే ప్రాణం కలవారమే. దయచేసి మాకు హాయిగా బ్రతికే అవకాసము ఇవ్వండి. ఇక మిమ్ములను మేము ఏమీ అడుగము. దయ చేసి నన్ను వదిలేయండి. మీకు మీ పెద్దలికి నా నమస్సులు .
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.