Blogger Widgets

గురువారం, ఏప్రిల్ 05, 2012

Which syllabus is best? SSC, or CBSE?

గురువారం, ఏప్రిల్ 05, 2012

My mom is planing to change me a school.   You know at present I am studying  5th Class with SSC syllabus. My mom planning to join me in 6th in one of the good school, but the thing is we are in confusion about to join me  in SSC or CBSE? Our actual requirement is I  should be well and good in communication and also everything should be very good in presenting the information? Could you please suggest which is the good SSC syllabus  or CBSE syllabus ? Please suggest us.

ఉప్పుపై పన్ను


 మహాత్మా గాంధీగారు  బ్రిటిష్ వారు మన భారతదేశంలో ఉప్పు పన్నువిధించినందుకు సవాలు చేస్తూ61సంవత్సరాల వయస్సులో  మహాత్మా గాంధీగారుతో పాటు 78 అనుచరులు తో కలసి 23 రోజుల్లో 240 మైళ్ళ దూరం దండి మార్చ్ చేసారు.  ఈ దండి యాత్ర ముఖ్య ఉద్దేశము మనము ఎంతైనా తెలుసుకోవాలి. ఈ ఉప్పు సత్యాగ్రహము మొదట గాంధి గారిచే ప్రారంభించబడిన అహింసా ప్రచార ఉద్యమంగా మన చెప్పుకోవచ్చు.  ఇది బ్రిటిష్ వారికి వ్యతిరేకముగా జరిగింది.  ఉప్పుపై పన్ను కట్టుటకు నిరసనగా మార్చ్ 12 ,1930  న  మొదలు పెట్టారు ఈ దండి యాత్ర .  ఈ దండి యాత్రనే ఉప్పు సత్యాగ్రహముగా చెప్తారు. ఈ ఉద్యమము వెనకాల ప్రధానమైన  ఉద్దేశము వుంది బ్రిటిష్ వారిని మనదేశము నుండి తరిమి కొట్టి మనదేశానికి సంపూర్ణ స్వాతంత్రము సాధించుట  అనేది ముఖ్యమైన ఉద్దేశము.  ఈ  దండి యాత్ర సబర్మతి ఆశ్రమము నుండి ప్రారంభించి దండి వరకు కొనసాగించారు.  ఈ యాత్రలో కొన్ని వేలమంది భారతీయులు పాల్గొన్నారు.  ఈ దండి యాత్ర  పూర్తిగా విజయవంతము అయినట్టుగా చెప్పచ్చు.  ఈ దండి యాత్ర  5 వ ఏప్రిల్ 1930 న దండి ప్రదేశానికి  చేరుకుంది.  లక్షలకొద్దీ భారతీయులు స్వాతంత్రోద్యమం పట్ల ఆకర్షితులయ్యారు.కోట్ల భారతీయులపై బ్రిటిష్ వారు  వేసేన  ఉప్పు పన్నుకు వ్యతిరేకంగా మౌనముగానే  (సత్యాగ్రముతో) ప్రారంభించి చిట్టచివరికి ఆ మౌనముతోనే భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రము సాధించారు . ఇది చాలా గర్వించదగ్గ సంగతిగా చెప్పచ్చు.  హింసతో సాధించలేనిది ఆహింసతో సాధించవచ్చు అని గాంధిగారు నిరూపించారు.

బుధవారం, ఏప్రిల్ 04, 2012

మొట్టమొదటి మొత్తం కృత్రిమ గుండె మార్పిడి

బుధవారం, ఏప్రిల్ 04, 2012

image

డాక్టర్ డెంటన్ A  కూలే ఒక మానవ శరీరములో మొట్టమొదటగా ఒక కృత్రిమ గుండె ఇంప్లాంట్ చేసిన  మొదటి అమెరికన్ సర్జన్ మరియు గుండె-మార్పిడి అను దానికి మార్గదర్శకుడు గా వున్నవాడు. మొట్ట మొదట 1960 లో ఆయన పుట్టుకతో వచ్చిన గుండె వ్యాధి తో శిశువుల హృదయాలలో న సున్నితమైన శస్త్రచికిత్స చేసారు  తరువాత విజయవంతంగా pulmonary embolism (ఒక గడ్డకట్టిన రక్తము యొక్క భాగము ద్వారా పుపుస ధమని యొక్క ప్రతిష్టంభన) ను తొలగించటము చేసిన  మొదటి సర్జన్ ఈయన. 3 మే 1968, కూలీ తన మొదటి మానవ గుండె మార్పిడి ప్రదర్శించారు.   

మానవవుని లో అమర్చిన మొదటి మొత్తం కృత్రిమ గుండెను, ఈ పరికరం Liotta చాలా కృషి చేసి అభివృద్ధి చేశారు మరియు హౌస్టన్ లోని సెయింట్ లూకా యొక్క ఎపిస్కోపల్ హాస్పిటల్ వద్ద, ఏప్రిల్ 4, 1969 న సర్జన్ డెంటన్ కూలే ద్వారా అమర్చారు. కార్ప్ అను రోగికి ఈ కృత్రిమ గుండెను ఏర్పాటు చేసారు.  

సంఖ్య దాత గుండె వ్యాధి గుండె కండరాల తో మరణిస్తున్న 47 ఏళ్ల రోగి అందుబాటులో ఎందుకంటే 4 న April 1969,, అతను ఒక తాత్కాలిక చర్యగా సిలికాన్ తయారు చేసిన యాంత్రిక గుండె అమర్చిన. ప్రయోగాత్మక కృత్రిమ గుండె 65 గంటల ఉపయోగించారు, ఈయనకు ఒక దాత గుండె దొరికేవరకు తాత్కాలికంగా వుంచుటకు ఉపయోగించారు. మరియు ఒక మానవ గుండె అందుబాటులోకి వచ్చినపుడు తొలగించారు..  
కార్ప్ నిజమైన గుండె పొందిన తరువాత వెంటనే మరణించారు అయినప్పటికీ ఈ విధానం ద్వారా గుండె రోగులలో కృత్రిమ గుండె మార్చవచ్చు అని ప్రయోగాత్మకంగా చూపించి. గుండెమీద కొత్త ప్రయోగాలు చేయటానికి నాంది వేసారు.  చాలా మంది ఈ శాస్త్ర చికిత్సని  అనైతిక శస్త్రచికిత్స  గా విమర్శించారు.  నేటి రోజున కృత్రిమ హృదయ మార్పిడికి పునాది వేసినది  కూలే. 

మంగళవారం, ఏప్రిల్ 03, 2012

ఛత్రపతి

మంగళవారం, ఏప్రిల్ 03, 2012


షాహాజీ-జిజాబాయ్ దంపతులకు పూణేకు దగ్గర ఉన్న జున్నార్ పట్టణమందు శివాజీ ఫిబ్రవరి 19, 1627 న జన్మించాడు. జిజాబాయ్‌కి శంభాజీ తర్వాత పుట్టిన కొడుకులు అందరూ చనిపోతూవుండగా జిజాబాయ్ ఎప్పుడూ పూజించే దేవత అయిన పార్వతిదేవి పేరును శివై పేరు శివాజీకు పెట్టింది.  శివాజిని పార్వతిదేవి ప్రసాదంగా భావించింది. 
షాహాజీ పూణేలో తన జాగీరు వ్యవహారాలను తన భార్యఅయిన జిజాబాయ్ కి  అప్పగించి యువకుడయిన శివాజీకి రాజనీతి వ్యవహారాలు నేర్పడానికి కొందరు ముఖ్య అనుచరులతో కలసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి తాను బెంగుళూరు జాగీరుకు వెళ్ళాడు. శివాజీ తల్లి అతనికి పుట్టిన భూమి పైన, ప్రజల పైన ప్రేమ కలుగునట్లు విద్యాబుద్దులు నేర్పింది. చిన్నప్పటినుండి భారత రామాయణ గాథలు చెప్పి వీర లక్షణాలు కలిగేలా చేసింది. పరమత సహనం, స్త్రీల పట్ల గౌరవం తన తల్లివద్దనే నేర్చుకున్నాడు శివాజి. తన తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలో శివాజీ యుద్ద తంత్రాలలో గొప్ప నేర్పరిగా మారాడు. సకల విద్యలు నేరుచుకున్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే తన ప్రధాన కర్తవ్యముగా అనుకోని  ఆ దిశగానే తన ప్రయత్నము మొదలు పెట్టాడు . మరాఠా  సామ్రాజ్య స్థాపనకు చాలా కృషి చేసాడు శివాజి.చిన్నవయసులోనే అంటే 17 సవత్సరాల వయసులోనే శివాజీ మొట్టమొదటి యుద్దం చేసి బిజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు. మరో మూడేళ్ళలో కొండన, రాజ్‌ఘడ్ కోటలను సొంతం చేసుకొని పూణే ప్రాంతాన్నంతా తన తన ఆధీనములో తెచ్చుకున్నాడు. శివాజీ తమ కోటలను సొంత చేసుకోవడం చూసి ఆదిల్షా మోసపూరితంగా శివాజీ తండ్రి అయిన షాహాజీని బందీ చేసాడు. తర్వాత శివాజీని, బెంగుళూరులో ఉన్న శివాజి అన్న అయిన శంభాజీని పట్టుకోవడానికి రెండు సైన్యాలను పంపగా అన్నదమ్ములిరువురు ఆ సైన్యాలను ఓడించి తమ తండ్రిని బంధ విముక్తుడిని చేయించుకున్నారు. తరువాత వారు చాలా యుద్ధాలు చేసారు.  వాటిలో ప్రధానముగా ప్రతాప్‌ఘడ్ యుద్దం, కొల్హాపూర్ యుద్దం,  పవన్‌ఖిండ్ యుద్దం, షైస్తా ఖాన్ తో యుద్దం, సూరత్ యుద్దం మొదలగున్నవి.  తరువాత 1666లో ఔరంగజేబు తన యాభయ్యవ పుట్టినరోజు సందర్భంగా శివాజీని, అతని ఆరేళ్ళ కొడుకు శంభాజీని ఆగ్రాకు పుట్టినరోజు వేడుకలకు అహ్వానించాడు. ఇది శివాజీని అలా ఆహ్వానించటం వెనుక  మోసపూరితమైన ఆలోచన ఔరంగజేబు కలిగివుండటమే.  మొదట శివాజీని చంపాలనుకున్నాడు దానివల్ల మరాఠాలు ఒక్కసారిగా చెలరేగుతారని తెలుసుకొని శివాజీని బందీగా ఉంచాలని నిశ్చయించాడు. తన కొడుకుతో బందీగా ఉన్న శివాజీ ఎలాగయినా తప్పించుకోవాలని ప్రయత్నించసాగాడు. ప్రతిరోజు తాను ఏరికోరి సమకూర్చిన పళ్ళను ఆగ్రాలోని సాధువులకు, గుడులకు, ఫకీర్లకు పంపించేలా అనుమతి తీసుకున్నాడు. కొన్ని నెలలపాటు పళ్ళ బుట్టలు పంపించిన తర్వాత తాను పనిమనిషిగా మారువేషం వేసుకొని కొడుకును బుట్టలో పెట్టుకొని తప్పించుకున్నాడు. శివాజీ, శంభాజీ ఇద్దరూ పళ్ళబుట్టల్లో దాక్కుని తప్పించుకొన్నారని అంటారు. అప్పటికే శివాజీ ప్రాబల్యం తగ్గడం వల్ల, మొఘలులు మరిన్ని యుద్దాలలో పాల్గొంటూ ఉండడంవల్ల ఔరంగజేబు శివాజీ నుండి ముప్పు ఉండదని భావించినా సరే పెద్దగా పట్టించుకోలేదు. శివాజీ ఎక్కువ ప్రాచుర్యంపోందేలా కాకుండా రహస్యంగా తన కార్యకలాపాలు నిర్వహించడం మొదలుపెట్టాడు. 1674 నాటికి లక్ష మంది సుశిక్షితులయిన సైన్యాన్ని, ఆయుధాలు, అశ్వాలు, నౌకా వ్యవస్థను సమకూర్చుకున్నాడు. 1670 జనవరి నుండి మొఘల్ కోటల పైన దాడులు చేసి సొంతం చేసుకోవడం మొదలు పెట్టాడు. అలుపెరగని యుద్దాలతో అలసిపోవడం, సరి అయిన సైన్యం లేకపోవడం, ఖజానా ఖాళీ కావడంతో మొఘల్ సైన్యం శివాజీని ఎదుర్కొనలేకపోయింది.  తరువాత కొన్నాళ్ళకు సింహగఢ్ యుద్ధం చేసి తానాజీ తన అనుచరులతో రహస్యంగా ఆ కోటను కొద్దిరోజులపాటు క్షుణ్ణంగా అధ్యయనం చేసాడు. అన్ని ప్రధాన ద్వారాల్లో కట్టుదిట్టమయిన సైన్యం ఉంది. చివరగా కోటకు ఒకవైపు ఉన్న ఒక కొండ తానాజీని ఆకర్షించింది. ఆ కొండ చాలా ఏటవాలుగా ఉండడంతో సైన్యం ఆ కొండ ఎక్కడం అసాధ్యం. అప్పుడు తానాజీ 'యశ్వంతి ' అనే పేరుకల ఉడుముకు తాడు కట్టి కొండ పైకి విసిరాడు. తాడు సహాయంతో పైకి వెళ్ళినవారు అందించిన తాళ్ళను పట్టుకొని సైన్యం కోటలోకి చేరుకొంది. చరిత్రలో యుద్దంలో ఉడుమును ఉపయోగించడం ఇదే ఫస్ట్  కావచ్చు అని చారిత్రకుల విశ్లేషణ ప్రకారం తెలుస్తోంది .
యుద్దతంత్రాలలో మాత్రమే కాకుండా పరిపాలనా విధానంలో కూడా శివాజీ భారతదేశ రాజులలో అగ్రగణ్యుడు. మంత్రిమండలి, విదేశాంగ విధానం,పటిష్టమయిన గూఢచారి వ్యవస్థ ఏర్పాటు చేసాడు. ప్రజలకోసమే ప్రభువు అన్న సూత్రం పాటించి, వ్యక్తిగత విలాసాలకు ఎటువంటి వ్యయం చేయక ప్రజల సంక్షేమం కోసమే పాటు పడ్డాడు. జూన్ 6, 1674న రాయఘడ్ కోటలో వేద పఠనాల మధ్య శివాజీని క్షత్రియరాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ 'ఛత్రపతి ' అని బిరుదును ప్రదానం చేసారు.కొన్నాళ్ళకు 50,000 బలగంతో దక్షిణ రాష్ట్రాల దండయాత్రచేసి వెల్లూరు, గింగీలను సొంతం చేసుకున్నాడు.27 ఏళ్ళపాటు యుద్దాలలో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజి మూడు వారాలు తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ 3, 1680  రాయఘడ్ కోటలో మరణించాడు.  మరణించేనాటికి 300 కోటలు శివాజీ ఆధీనంలో ఉండేవి. కొండలపైన ఉన్నత సాంకేతిక విలువలతో దుర్భేధ్యమయిన కోటలను నిర్మింపచేయడంలో శివాజీ ప్రపంచ ఖ్యాతి పొందాడు. నాసిక్ నుండి మద్రాసు దగ్గర ఉన్న జింగీ వరకు 1200 కిలోమీటర్ల మధ్య ఈ 300 కోటలు నిర్మించబడ్డాయి.


My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)