ఈ మహావిశ్వాన్నీ, ఈ భూగోళం మీద
కోటాను కోట్ల జీవరాశుల్ని ఎవరూ సృష్టించలేదనీ, వాటి కవే ఏర్పడ్డాయనీ, డార్విన్ చెప్పారు. మన పాఠాల్లో చదువుకుంటున్నాం కదా!. మరి ఈ డార్విన్ ఎవరు ఆయన సంగతి తెలుసుకోవాలని వుంది కదా! చాలా క్లుప్తముగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఛార్లెస్ డార్విన్ ష్రుబర్రీ లో ఫిబ్రవరి 12, 1809 న జన్మించాడు. వీరి తండ్రిగారు , తాతగారు డాక్టర్లు. డార్విన్ తన చిన్నతనము లోనుండి ప్రకృతిని చాలా బాగా పరిశీలనా తత్వం కలవారు. అదే ప్రకృతి పరిశీలనాశక్తి వారసత్వంగా సంక్రమించిందని మనకు తెలుస్తున్నది. ప్రకృతి పరిశీలనపట్ల డార్విన్ కున్న ఇష్టం వల్లన డాక్టర్ కాలేకపోయాడు. తన తండ్రి కోరిక మేరకు మతాచార్యుడిగా మారాడు. తన పరిశీలనలకు ఎక్కువ సమయం దొరకడమే దీనికి కారణం. 175 ఏళ్ల
క్రితమే భూమ్మీదే లేవంటే చాలా ఆశర్యంగా ఉంటుంది. చార్లెస్ డార్విన్
అనే శాస్త్రవేత్త జీవ జాతుల పుట్టుక
అనే తన గ్రంథంలో జీవులన్నీ
తమ కంటే సరళమైన ప్రాథమిక
జీవుల నుండి ఆవిర్భవించాయని ప్రకటించి
మత వాదుల సృష్టి వాద సిద్ధాంతాన్ని దెబ్బతీశారు. అప్పట్లో డార్విన్ చెప్పిన సిద్దాంతాలు ఎవరు నమ్మలేదు. అప్పట్లో డార్విన్ పై అనేకమైన వ్యతిరేక ప్రచారాలు వుండేవి. మనుషులు కోతులునుండి పరిణామం చెందాడు అని డార్విన్ అన్నదానికి. డార్విన్ గేలిచేస్తూ ఇలా అనేవారు "మనుషులంతా కోతుల నుండి పరిణామం
చెందలేదు డార్విన్ మాత్రమే కోతి నుండి వచ్చాడని".
లండన్
కు చెందిన నావికాదళం దక్షిణ అమెరికా సముద్ర తీరాన్ని సర్వే చేయడానికి బీగల్
అనే ఓడలో బయలుదేరింది. ప్రకృతి
శాస్త్రజ్ఞుడైన డార్విన్ కు ఆ బృందంతో
ప్రయాణించే అవకాశం దొరికింది. డార్విన్ డిసెంబర్ 27,1831 బీగల్ ఓడలో బయలుదేరి
నాలుగు సంవత్సరాల పాటు ప్రకృతి పరిశీలనలో
గడిపాడు. అప్పుడు ఆ యాత్రలో డార్విన్
అనేక జీవ జాతులను, శిలాజాలాలను నిశితంగా పరిశీలించాడు. ప్రతి జీవజాతి వేరువేరుగా
సృష్టించబడినదా అవి ఒకదానినొకటి
ఒకానొక సామాన్య జీవజాతితో సంబంధం కలిగే వున్నాయా. అనే
ప్రశ్నలకు సమాధానాలు వెదకసాగాడు. 1859 లో జాతుల పుట్టుక
అనే గ్రంథాన్ని రచించాడు. డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని
మొదట ఏ కొద్ది మంది
శాస్త్రవేత్తలు మాత్రమే అంగీకరించారు. క్రమక్రమంగా ఆ తర్వాత వచ్చిన
ఉత్పరివర్తన సిద్దాంతాలు కూడా పరిణామ వాదాన్నే
బలపరిచాయి. దీంతో అన్ని చోట్ల డార్వాన్ సిద్దాంతానికి బలం వచ్చింది. ఆరోగ్యం
క్షీణించడంతో 1881 ఏప్రిల్ 19న డార్విన్ మరణించాడు.
ప్రపంచ ప్రజలలో ఆలోచనలకు శాస్త్రీయత
వైపు మళ్ళించిన మహా గొప్పమేథావిగా జీవశాస్త్ర చరిత్రలో నిలిపోయాడు.