Blogger Widgets

సోమవారం, జులై 16, 2012

హరి నీ మయమే అంతాను

సోమవారం, జులై 16, 2012

హరి నీ మయమే అంతాను
అరసి నీకు శరణనియెద నేను

యెదుట నెవ్వరిక నే మాటాడిన
అది నీ ఘన నామాంకితమే
అదివో సకల శబ్దాఖ్యుడవని నిన్ను
పొదలి చదువులు పొగడీగాన

యెవ్వరి పొగడాని యెక్కడ నుండిన
నివ్వటిల్లనది నీ రూపే
నెవ్వదీర నిదె నిను విశ్వరూపుడు
యెవ్వల నని శ్రుతులెంచీగాన

భావన యిది నీ బ్రహ్మాత్మకమే
శ్రీవేంకటేశ నాచింతయిదే
ఆవల నిను సర్వాంతర్యామెని
దేవ శాస్త్రములు తెలిపీగాన

ఆదివారం, జులై 08, 2012

Hey friends catch me live today

ఆదివారం, జులై 08, 2012


Hey friends catch me live today (Sunday) show

with your little RJ Sree Vaishnavi

from 9:30 am to 11:30 am

only on RadioJoshLive

Masth Maza Masth Music :) 

My show Name is Harivillu

Fun with me

If you want to talk with me plz call these numbers  

Skype idradiojoshlive

US: 914-214-7574

UK: 20-3286-9594

AUS: 28003-4546

Local Number: 040-4200-2003

Stay Tune RadioJosh 

Thank You Very Much.

బుధవారం, జులై 04, 2012

త్రివర్ణపతాక రూపకర్త

బుధవారం, జులై 04, 2012

తెలుగు జాతి గౌరవం నిలబెట్టి .ప్రపంచ చరిత్రలో  మన జాతీయ జండాను  ఎగురేలా చేసాడు .  మన త్రివర్ణపతాక రూపకర్త 
జాతీయ పతాకం రెపరెపలాడే వరకు ఒక్క తెలుగు వారే కాకుండా.. జాతియావత్తూ స్మరించుకోదగిన మహాపురుషుల్లో పింగళి వెంకయ్య ఒకరు. కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని భట్లపెనుమర్రు గ్రామంలో హనుమంతరాయుడు-వెంకటరత్నమ్మ దంపతులకు ఆగష్టు 2, 1878 న జన్మించారు. వెంకయ్య చిన్నప్పటి నుండే చాలా చురుకైన విద్యార్ధి. ఈయన ప్రాధమిక విద్య చల్లపల్లిలో మరియు మచిలీపట్నములోని హిందూ ఉన్నత పాఠశాలలో జరిగినది. దక్షిణాఫ్రికాలోనే మహాత్మా గాంధీని కలిసిన తెలుగు యువనేత. వీరిమధ్య ఏర్పడిన సాన్నిహిత్యం అర్ధ శతాబ్దం పాటు సాగింది. 1913 నుంచి ప్రతి కాంగ్రెస్ సమావేశానికి హాజరై నాయకులందరితోనూ జాతీయ పతాక ప్రతిష్ఠాపన గురించి చర్చలు జరిపారు. 1916లో "భారతదేశానికొక జాతీయ జెండా" అనే పుస్తకాన్ని ఇంగ్లీషులో రాసి ప్రచురించారు.  మన తెలుగువారు తమ వారిని గౌరవించటంలో ఏనాడూ ముందంజవేయలేదు.  జీవితాంతం దేశం కొరకు స్వాతంత్ర్యం కొరకు పోరాడిన వెంకయ్య చివరి రోజుల్లో తిండికి కూడా మొహం వాచి నానా అగచాట్లు పడినట్లు ' త్రివేణి ' సంపాదకులు డా. భావరాజు నరసింహారావుగారు పేర్కొన్నారు. అంతిమదశలో విజయవాడలో డా. కె.ఎల్.రావు, డా.టి.విఎస్.చలపతిరావు, కాట్రగడ్డ శ్రీనివాసరావు మున్నగు పెద్దలు 15-1-1963 న వెంకయ్య గారిని సత్కరించి వారికి కొంత నిధిని అందించారు. ఆ సత్కారం తరువాత ఆరు నెలలకే 1963, జూలై 4న వెంకయ్య దివంగతుడయ్యాడు.
కన్నుమూసేముందు వారి చివరి కోరికను వెల్లడిస్తూ

" నా అంత్య దశ సమీపించింది. నేను చనిపోయిన తర్వాత త్రివర్ణ పతాకాన్ని నాభౌతిక కాయంపై కప్పండి. శ్మశానానికి చేరిన తర్వాత ఆ పతాకం తీసి అక్కడ ఉన్న రావి చెట్టుకు కట్టండి. ఇది నా తుది కోరిక " అన్నారు.
ఇది నాకు తెలిసినప్పుడు నా కళ్ళు నీళ్ళు  వచ్చాయి అంటే నమ్మండి.

జాతీయ పతాకం ఎగిరే వరకు స్మరించుకోదగిన ధన్యజీవి పింగళి వెంకయ్య. నిరాడంబరమైన, నిస్వార్థమైన జీవితం గడిపిన మహామనీషి పింగళి వెంకయ్య. ఈయన వర్ధం నేడు.  ఈ మహానీయునికి నివాళు అర్పిద్దాం.

అల్లూరి సీతారామ రాజు

అల్లూరి సీతారామ రాజు మన ఆంద్రప్రదేశంలో జన్మించిన స్వాతంత్ర సమరయోధుడు.  ఈయన దారిలోనే తూర్పుగోదావరి, విశాఖపట్టణం జిల్లాలో అడవుల ప్రదేశంలో మన్యం ప్రజలు విప్లవ దారిలో నడిచాయి.    అల్లూరి సీతామరాజు  4 జూలై 1897 లో పాండ్రంగి అనే ఉరిలో విజయనగరం జిల్లా దగ్గర  వెంకట రామరాజు మరియు సూర్యనారాయణమ్మ లకు జన్మించారు.  వీరికి ఒక తమ్ముడు సత్యనారాయణరాజు మరియు చెల్లి సీతమ్మ కలరు.  మనకు చరిత్రనుండి చూస్తే రక్తపాతం జరగకుండా ఉన్న ఉద్యమాల్లేవు. అంతే కాదు రక్తపాతం జరక్కుండా ఉద్యమాన్ని నడిపించాలని ప్రయత్నించిన ఉద్యమ నాయకులు కూడా వున్నారు.  వారిలో గాంధీజీ మన జాతీయ కథానాయకుడు అని మనకు తెలుసు కదా.  అల్లూరి సీతారామరాజు మన ఊరి విప్లవ నాయకుడు! మన్యంలో కొండదళానికి, తెల్లదండుకి మధ్య అరవెరైండు సార్లు కాల్పులు జరిగినా, అనవసరమైన రక్తపాతం జరగా కూడదు అని మన మన్యం వీరుడు అనేకసార్లు ఆపుచేసాడు. అల్లూరి సీతారామ రాజును  మనము ఆదర్శంగా తీసుకోవాలి. శత్రువుపై నిప్పులు కురిపించిన మన్యం అగ్నికణం అల్లూరి సీతారామరాజు,  ఈయన విప్లవ పోరాట సమయం మొత్తం జీవితకాలం గా మనం చెప్పుకోవచ్చు లెక్కకు వస్తే  అల్లూరి సీతారామరాజు 22 ఆగస్టు 1922 నుంచి 1924 వరకు అని చెప్పుకుంటారు.  అసలు అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారికి ఒకలేఖ రాసారు నేను మీకు లొంగిపోతున్నాను అని.  కానీ బ్రిటిష్ వారు రుదర్ ఫర్డ్ అద్యక్షణ తో కాల్చి చంపేశారు.  ఈ వీరుని కద ముగించేసారు .

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)