హరి నీ మయమే అంతాను
అరసి నీకు శరణనియెద నేను
యెదుట నెవ్వరిక నే మాటాడిన
అది నీ ఘన నామాంకితమే
అదివో సకల శబ్దాఖ్యుడవని నిన్ను
పొదలి చదువులు పొగడీగాన
యెవ్వరి పొగడాని యెక్కడ నుండిన
నివ్వటిల్లనది నీ రూపే
నెవ్వదీర నిదె నిను విశ్వరూపుడు
యెవ్వల నని శ్రుతులెంచీగాన
భావన యిది నీ బ్రహ్మాత్మకమే
శ్రీవేంకటేశ నాచింతయిదే
ఆవల నిను సర్వాంతర్యామెని
దేవ శాస్త్రములు తెలిపీగాన
అరసి నీకు శరణనియెద నేను
యెదుట నెవ్వరిక నే మాటాడిన
అది నీ ఘన నామాంకితమే
అదివో సకల శబ్దాఖ్యుడవని నిన్ను
పొదలి చదువులు పొగడీగాన
యెవ్వరి పొగడాని యెక్కడ నుండిన
నివ్వటిల్లనది నీ రూపే
నెవ్వదీర నిదె నిను విశ్వరూపుడు
యెవ్వల నని శ్రుతులెంచీగాన
భావన యిది నీ బ్రహ్మాత్మకమే
శ్రీవేంకటేశ నాచింతయిదే
ఆవల నిను సర్వాంతర్యామెని
దేవ శాస్త్రములు తెలిపీగాన
నాకు ఇష్టమైన కీర్తన ఇది.. ధ్యాంక్యూ శ్రీ వైష్ణవి...
రిప్లయితొలగించండిచాలా బాగుంది. గాయకులు కూడా చక్కగా పాడారు. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి