శనివారం, ఆగస్టు 04, 2012
అద్భుతమైన భావన స్నేహం
ప్రతి సంవత్సరం ఆగష్టు యొక్క మొదటి ఆదివారం నాడు స్నేహితులు, ప్రేమికులు మరియు కుటుంబ సభ్యుల మధ్య 'ఫ్రెండ్షిప్ డే 'ని సెలబ్రేట్ చేసుకొనే ఒక ప్రత్యేక రోజు పరిగణిస్తారు.
కానీ మీరు స్నేహితుల రోజు ఎందుకు, ఎప్పటినుండి చేసుకుంటున్నారో తెలుసుకున్నారా.
స్నేహితుల రోజును మొట్టమొదట అమెరికా సంయుక్త కాంగ్రెస్ ఫ్రెండ్స్ యొక్క గౌరవార్ధం ఒక రోజును అంకితం చేయాలని నిర్ణయించుకుంది. అలా అంకితము చేసిన రోజునే ఫ్రెండ్షిప్ డే జరుపుకొనే సంప్రదాయం సంవత్సరం 1935 సంవత్సరంలో ప్రారంభమైంది ఈ సంవత్సరం 77 వ స్నేహితుల రోజుగా జరుపుకుంటున్నాము.
ఎందుకు ఫ్రెండ్షిప్ డే ఆ కాలంలో అవసరం.
ఆ కాలంలోని ప్రజలు మొదటి ప్రపంచ యుద్ధం వినాశకరమైన ప్రభావాలు అనుభవించారు . వారుమద్య పెరుగుతున్న విరోధాలు, అవిశ్వాసం మరియు మరొక యుద్ధం పరిస్థితులు ఏర్పడి వివిధ దేశాల మధ్య ద్వేషం ఏర్పడింది . అందువలన దేశాల మధ్య అలాగే వ్యక్తులు మధ్య స్నేహంబందం యొక్క అవసరం ఉంది. దీని ఫలితంగా ఫ్రెండ్షిప్ డే సంయుక్త కాంగ్రెస్ ఆ సంవత్సరం 1935 లో తీసుకోవడం జరిగింది .
నేషన్స్ అంతటా ఫ్రెండ్షిప్ డే ఏర్పడింది.
ఈ అద్భుతమైన భావన విజయం స్నేహం కారణం ఒక రోజు అంకితము చేసి ఆ యొక్క సంప్రదాయం అలవరచుకోవటానికి అనేక ఇతర దేశాలును కూడా ఆకర్షించింది. ఫ్రెండ్స్ గౌరవార్ధం ఒక రోజు జరుపుకొనే ఈ అందమైన ఆలోచన మనస్పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా అనేక ఇతర దేశాలు అంగీకరించాయి జరిగినది.
మన చరిత్రలో కూడా స్నేహం గురించి చెప్పే కదలు చాలా వున్నాయి.
మనకు బాగా తెలిసిన రామాయణంలో రాముడు సుగ్రీవునితో స్నేహం చేసి రాక్షస సంహారం చేసాడు. స్నేహితుడు తోడూ వుంటే ప్రతీది విజయమే పొందవచ్చు అని నిరూపించే కధలు చాలా వున్నాయి. మహాభారతం లో స్నేహం యొక్క ప్రాముఖ్యత ను శ్రీ కృష్ణుడు తన ఆప్యాయతను, ప్రేమను, సోదర, రక్షణ, మార్గదర్శకత్వం, సాన్నిహిత్యం కూడా అల్లరిద్వారా శ్రీ కృష్ణ స్నేహం అనేక రంగులుగా ప్రదర్శించాడు.
స్నేహితులు అందరికి ప్రపంచ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు
Nicolas-Jacques Conté పేరు విన్నారా? వింటే సరే వినకపోతే ఇప్పుడు తెలుసుకోండి ఈయన గురించి. మనం చిన్నప్పటినుండి స్కూల్కి వెళ్ళేప్పుడు మన చేతిలో వుండే పెన్సిల్ను మొట్టమొదట కనుక్కున్నారు . ఈరోజు 4 August 1755 Nicolas-Jacques Conté న పుట్టిన రోజు. ఈయన ఫ్రెంచ్ పైంటర్, balloonist, army officer, మరియు ఈయన మనం వాడుకొనే ఆధునిక పెన్సిల్ ను కనుక్కొన్నారు.
|
NICOLAS-JACQUES CONTÉ |
ఇక్కడ ఒక పక్షి వుంది చూసారా! ఈ పక్షిగారు మనలను బయపెట్టతానికి ఎంత ప్రయత్నము చేస్తోందో చూడండి. దానిని సంతృప్తి పరచటానికి వీలయితే భయపడండి మరి.
శుక్రవారం, ఆగస్టు 03, 2012
కరుణశ్రీ గారి శతజయంతి నేడు. ఈయన ఆగస్టు 4 న 1912 జన్మించారు. ఈయన అసలు పేరు జంద్యాల పాపయ్య శాస్త్రి. కరుణశ్రీగా ప్రసిద్ధులైన జంధ్యాల పాపయ్య శాస్త్రి రచించిన ఖండకావ్యంలోని ఒక కవితా ఖండంపేరు పుష్పవిలాపం. కవి ఇందులోని చక్కని పద్యశైలి, భావుకత, కరుణారసాల వల్ల ఈ పద్యాలు జనప్రియమైనాయి. అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు పాడిన కుంతి విలాపము మరియు పుష్పవిలాపం మంచి పేరు వచ్చింది. జంధ్యాల వారికి గుర్తింపు వచ్చింది. పువ్వులు గురించి కవులు అనేక కావ్యాలు, కవిత్వాలు రాసారు. వాటి అన్నిటికంటే పుష్పవిలాపంకు పేరు బాగా వచ్చింది. పుష్పవిలాపం విన్న తరువాత పువ్వులను ఎవరు మొక్కనుండి పువ్వులను తుమ్చలేరు అనటంలో సందేహం లేదు. కరుణరసంతో సాగుతున్న ఈ కావ్యం వల్లే జంధ్యాల వారికి కరుణశ్రీ అన్నపేరు వచ్చిందేమో కదా! జంద్యాల పాపయ్య శాస్త్రి గారి కలం పేరు కరుణశ్రీ. ఈయన కరుణశ్రీ, ఉదయశ్రీ, విజయశ్రీ, కళ్యాణకల్పవల్లి అనే రచనలు పేరు వచ్చింది . వీరు కదాగాయిత్రి అనే శీర్షికతో 12 సంపుటాలను రచించారు. తెలుగు బాల శతకాన్ని బొమ్మలతో కూడిన ముద్దు బాలశిక్షను, పద్మావతీ శ్రేనివాసం పేరుతో వెంకటేశ్వర స్వామి చరిత్రను రచించారు. సాంప్రదాయాన్ని, అభ్యుదయాన్ని మేళవించిన కవిగా సాహిత్యములో స్థానం పొందారు. ఇక్కడనేను పాడిన పుష్పవిలాపము మరియు ఘంటసాల వారి కుంతివిలాపము పొందుపరిచాను. విని ఆనందిమ్చండి . సాహిత్య ప్రియులందరికీ జంద్యాల వారి శతజయంతి శుభాకాంక్షలు.
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ