శుక్రవారం, ఆగస్టు 03, 2012
కరుణశ్రీ గారి శతజయంతి నేడు. ఈయన ఆగస్టు 4 న 1912 జన్మించారు. ఈయన అసలు పేరు జంద్యాల పాపయ్య శాస్త్రి. కరుణశ్రీగా ప్రసిద్ధులైన జంధ్యాల పాపయ్య శాస్త్రి రచించిన ఖండకావ్యంలోని ఒక కవితా ఖండంపేరు పుష్పవిలాపం. కవి ఇందులోని చక్కని పద్యశైలి, భావుకత, కరుణారసాల వల్ల ఈ పద్యాలు జనప్రియమైనాయి. అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు పాడిన కుంతి విలాపము మరియు పుష్పవిలాపం మంచి పేరు వచ్చింది. జంధ్యాల వారికి గుర్తింపు వచ్చింది. పువ్వులు గురించి కవులు అనేక కావ్యాలు, కవిత్వాలు రాసారు. వాటి అన్నిటికంటే పుష్పవిలాపంకు పేరు బాగా వచ్చింది. పుష్పవిలాపం విన్న తరువాత పువ్వులను ఎవరు మొక్కనుండి పువ్వులను తుమ్చలేరు అనటంలో సందేహం లేదు. కరుణరసంతో సాగుతున్న ఈ కావ్యం వల్లే జంధ్యాల వారికి కరుణశ్రీ అన్నపేరు వచ్చిందేమో కదా! జంద్యాల పాపయ్య శాస్త్రి గారి కలం పేరు కరుణశ్రీ. ఈయన కరుణశ్రీ, ఉదయశ్రీ, విజయశ్రీ, కళ్యాణకల్పవల్లి అనే రచనలు పేరు వచ్చింది . వీరు కదాగాయిత్రి అనే శీర్షికతో 12 సంపుటాలను రచించారు. తెలుగు బాల శతకాన్ని బొమ్మలతో కూడిన ముద్దు బాలశిక్షను, పద్మావతీ శ్రేనివాసం పేరుతో వెంకటేశ్వర స్వామి చరిత్రను రచించారు. సాంప్రదాయాన్ని, అభ్యుదయాన్ని మేళవించిన కవిగా సాహిత్యములో స్థానం పొందారు. ఇక్కడనేను పాడిన పుష్పవిలాపము మరియు ఘంటసాల వారి కుంతివిలాపము పొందుపరిచాను. విని ఆనందిమ్చండి . సాహిత్య ప్రియులందరికీ జంద్యాల వారి శతజయంతి శుభాకాంక్షలు.
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.