గురువారం, అక్టోబర్ 11, 2012
ఒహో డిం డిం వోగి బ్రహ్మమిదియని l
సాహసమున శ్రుతి దాటేడిని ll
పరమున నరము బ్రకృతియు ననగా
వేరవుదేలియుటే వివేకము l
పరము దేవుడును అపరము జీవుడు
తీరమైన ప్రకృతియే దేహము ll
జ్ఞానము జ్ఞేయము జ్ఞానగమ్యమును
పూని తెలియుటె యోగము l
జ్ఞానము దేహాత్మ, జ్ఞేయము పరమాత్మ
జ్ఞానగమ్యమే సాధించుమనసు ll
క్షరము నక్షరము సాక్షి పురుషుడని
సరవి దేలియుటే సాత్వికము l
క్షరము ప్రపంచం అక్షరము కూటస్థుడు
సిరిపురుషోత్తముడే శ్రీ వేంకటేశురుడు ll
బుధవారం, అక్టోబర్ 10, 2012
|
Answer my Riddles :)
|
What does a cat have that no other animal has?
- Kittens.
What two keys can't open any doors?
- A Donkey, and a Monkey.
What is the greatest worldwide use of cowhide?
- To cover cows.
What ship has two mates, but no captain?
- A Relationship.
What kind of dress can never be worn?
- An address.
మంగళవారం, అక్టోబర్ 09, 2012
పూర్వము ఒక ప్రదేశములోవార్తలు ఇంకో ప్రదేశానికి చేర్చటానికి గుర్రాలు మీద వార్తాహరుడు గమ్యానికి చేర్చి వార్తలు చేర్చేవారు. కొంతకాలం తరువాత పావురాలును పెంచుకొని వాటి ద్వారా వార్తలు ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి వార్తలు చేర్చేవారు. ఈజిప్ట్ లో మొట్టమొదటి పోస్టల్ పత్రం, 255 BC నుండి మొదలు అయ్యింది. అయితే ఆ సమయంలో ముందు పోస్టల్ సేవలు రాజులు మరియు చక్రవర్తులు అందిస్తున్న దూతలు రూపంలో దాదాపు ప్రతి ఖండంలోని ఉనికిలో. కాలక్రమేణా, మతపరమైన ఆజ్ఞలను మరియు విశ్వవిద్యాలయాలు వార్తలు మార్పిడి మరియు సమాచారం వారి స్వంత సందేశం పంపిణీ వ్యవస్థలును చేర్చారు. రిలే కేంద్రాలు ఎక్కువ దూరాలకు వేగవంతంగా వార్తలు చేర్చటానికి దూతలును 'మార్గాల్లో ఏర్పాటు చేశారు. చివరికి, ప్రైవేటు వ్యక్తులు మరొక సంభాషించడానికి దూతలు ఉపయోగించడానికి అనుమతి లభించింది. ఆ తరువాత మెల్లి మెల్లిగా తపాల వ్యవస్థ వచ్చింది.
"తోకలేని పిట్ట తొంభై ఆమడలు దూరం పోతుంది."
ఐక్యరాజ్య సమితి చేపట్టిన తీర్మానాన్ని అనుసరించి ప్రతి సంవత్సరం అక్టోబర్ 9వ తేదీని అంతర్జాతీయ తపాలా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. "తోకలేని పిట్ట తొంభై ఆమడలు దూరం పోతుంది" అన్న పోడుపుకధకు నిజం చేస్తూన్నది కేవలము ఒక ఉత్తరము మాత్రమె అనటంలో ఎటువంటి సందేహము అక్కరలేదు. అందుబాటు ధరకే సేవలందిస్తున్న తపాలాకు, గ్రామీణ ప్రజల మధ్య ఆత్మీయానుబంధం ను పెంచుతూ వుండేది.
భారతీయ తపాలా లేదా భారతీయ తపాలా వ్యవస్థ ఒక భారత ప్రభుత్వ సంస్థ. ఇది 155,333 పోస్టాఫీసులతో ప్రపంచంలో కెల్లా అతి పెద్ద తపాలా వ్యవస్థ చైనా 57,000 రెండవ స్థానం. దీని విస్తృతమైన శాఖలతో తపాలా సర్వీసులే కాకుండా బ్యాంకుల మాదిరి సర్వీసులు కూడా అందిస్తుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో మొదటగా ముంబై, చెన్నై మరియు కలకత్తా 1764-1766 మధ్య పోస్టాఫీసులు ప్రారంభించింది. వారెన్ హేస్టింగ్స్ గవర్నరుగా ఈ తపాలా సర్వీసులను ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చారు. 1839లో, North West Province సర్కిల్ ఏర్పాటయింది. 1860లో పంజాబ్ సర్కిల్, 1861లో బర్మా సర్కిల్, 1866లో సెంట్రల్ సర్కిల్ మరియు 1869లో సింద్ సర్కిల్ ఏర్పాటయినవి. తరువాత సర్కిల్స్ అవధ్ (1870), రాజ్ పుట్ (1871), అస్సాం (1873), బీహార్ (1877), తూర్పు బెంబాల్ (1878) and Central India (1879)లో ఏర్పడ్డాయి. 1914 సంవత్సరం కల్లా మొత్తం పోస్టల్ సర్కిల్స్ ఉన్నాయి.
తపాలా బిళ్ళలు (Postal stamps) తపాలా వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగము. తపాలా బిళ్ళను మొట్టమొదటి సారిగా గ్రేట్ బ్రిటన్ మరియు ఐర్లాండ్ లలో మొట్టమొదటి సారిగా వాడినట్లు తెలుస్తోంది.
తపాలా బిళ్ళలు 1 జూలై 1852లో సింధ్ జిల్లాలో మొదలయ్యాయి. వీటిని ఈస్ట్ ఇండియా కంపెనీ ముద్రించేది; కానీ అమ్మేవారు కాదు. అన్ని తపాలా బిళ్ళలుకలకత్తాలో ముద్రించబడేవి; అన్నీ కూడా విక్టోరియా మహారాణి బొమ్మతోనే విడుదల అయేవి. తపాలా వ్యవస్థ భారత ప్రభుత్వంలో సమాచార మంత్రిత్వ శాఖలోని భాగము. దీని నియంత్రణ' తపాలా సర్వీస్ బోర్డు' అధినంలో ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం 22 తపాలా సర్కిల్స్ ఉన్నాయి. ప్రతీ సర్కిల్ కు ప్రధాన తపాలా జనరల్ అధికారి. ఇవి కాకుండా భారత రక్షణ వ్యవస్థ కోసం ప్రత్యేకమైన సర్కిల్ ఏర్పాటు చేయబడింది. ఇప్పటికి పెద్దవాళ్ళు ఉత్తరంలు రాయటానికి వాటిని వాటిని చదవటానికి ఇష్టపడతారు. నాకు తెలుగు పాటము లో చదువురాని ఒక ముసలి తండ్రి తన పిల్లలుకు ఎంతో ఆప్యాయంగా ఉత్తరం రాయిస్తాడు. భారతీయ తపాలా వ్యవస్థలో అతి ముఖ్యమైన విభాగము. ప్రజలకు సంబంధించిన సర్వీసులు అన్నీ వీటి ద్వారానే నడుస్తున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వుంది ఈ తపాల గురించి. ఇంకోసారి ఎప్పుడైనా చెప్పుకుందాం. ప్రతీ సంవత్సరం అక్టోబర్ 9 న ప్రపంచ పోస్ట్ డే గా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే రోజు గా బెర్న్ ఒప్పందం, జనరల్ పోస్టల్ యూనియన్ ఏర్పాటు, సంతకం చేశారు. యూనియన్ లో సభ్యత్వం దాని పేరు 1878 లో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ మార్చబడింది. బెర్న్ 1874 ఒప్పందం అక్షరాల పరస్పర మార్పిడి కోసం ఒక తపాల భూభాగంలో పోస్టల్ సేవలు నిబంధనల సంఘటిత ఒక గందరగోళ అంతర్జాతీయ మేజ్ విజయం సాధించింది. అంతర్జాతీయ మెయిల్ నిరంతరాయంగా మరియు అభివృద్ధి సంకటంలో అడ్డంకులను మరియు సరిహద్దుల చివరకు కొల్లగొట్టాడు జరిగింది. అప్పటినుండి ఈ రోజు నాడు మనం ప్రపంచ తపాల దినోత్సవదినోత్సవంగా జరుపుకుంటున్నాము.
సోమవారం, అక్టోబర్ 08, 2012
చిప్కో ఉద్యమం గురించి
ఒక్కమాటలో చెప్పాలంటే పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెట్ల నరికివేతను అడ్డుకునే ఉద్యమమే ఈ చిప్కో ఉద్యమం. చెట్లను కౌగిలించుకొని వాటిమీద పూర్తి హక్కులు మావేనని వ్యాపారస్తుల నుంచి వాటిని కాపాడే ఉద్యమమే చిప్కో ఉద్యమం. దీని గురించి చరిత్రలో చూస్తే క్రీస్తుశకం 1730 లో జోధ్‌పూర్ రాజు అభయ్‌సింగ్ పెద్ద
నిర్మాణం చేపట్టదలచి బికనీర్‌కు సమీపంలో ఉన్న బిష్ణోయి ప్రాంతంలో ఖేజర్లీ
అనే చెట్లు నరుక్కొని తీసుకురమ్మన తన మనుషులకు ఆదేశించాడు.
బిష్ణోయి అనేది రాజస్థాన్ లోని జోధ్పూర్ దగ్గర వున్నా ఒక చిన్న పల్లెటూరి ప్రాంతం. ఆ ప్రాంతవాసులు అనుసరించేది మతం పేరు బిష్ణోయి మతం. ఈ
మతాన్ని స్థాపించినవాడు గురు జాంబేశ్వర్. ఈయన అనుచరులు ఆయనను విష్ణు అవతారంగా భావిస్తారు. బిష్ణోయి మతస్తులకు ఆయన
29 నియమాలు పెట్టాడు. అందులో చెట్టు, పశుపక్ష్యాదులను కాపాడటం ఒకటి.
రాజస్థాన్‌తో పాటు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానాలలో చాలామంది
జాట్ కులస్తులు ఈ మతాన్ని అనుసరిస్తూ వుంటారు . జోధ్‌పూర్ రాజు కొట్టుకురమ్మన్న
ఖేజర్లీ చెట్టు వీరికి దైవసమానం.
అభయ్‌సింగ్ మనుషులు వచ్చారని
తెలిసి అమృతాదేవి అనే సాధారణ గృహిణి మరియు ఆమె పిల్లలు చెట్లను గట్టిగా హత్తుకొని వారు వచ్చిన వారు చెట్లు నరకకుండా ఆపగలిగింది. వారు లంచం ఇవ్వటానికి ప్రయత్నించారు. ఆమె అప్పుడు గట్టిగా వారితో తిరగబడింది. ఆమెకు తోడు వచ్చిన 363 మంది ఆ చెట్లను కౌగిలించుకుని
ఉండిపోయారు. చెట్లని రాజు మనుషులు వాటిని కౌగిలించుకుని ఉన్న బిష్ణోయిలతో
సహా నరికేశారు. రెండువందల మందికి పైగా చనిపోయారు. దీనికే ‘ఖేజర్లీ విషాదం’
అని పేరు. ఆ దుర్ఘటన జరిగిన స్థలంలో ఇప్పటికీ యేటా ఆ త్యాగమూర్తులకు నివాళి
ఘటించే ఆచారం ఉంది. వీళ్లు ఖేజర్లీ చెట్టుతో పాటు కృష్ణజింకను, కొన్ని
పక్షులను పవిత్రంగా చూస్తారు.
మనకు తెలిసిన హింది సినిమా హీరో సల్మాన్‌ఖాన్, మన్సూర్ అలీఖాన్ ఆ జింకలను వేటాడినప్పుడు మూడు చెరువుల
నీళ్లు తాగారు. అలా తాగించినవారు ఈ బిష్ణోయిలే. ఇది నా పుస్తకంలో చదివాను నాకు చాలా బాగా నచ్చింది. అప్పట్లో ప్రజలు అందరు ప్రకృతి లో పశు , పక్షులను, చెట్లను కాపాడటానికి వారు వారి ప్రాణాలను సైతం లెక్కచేయక వాటిని రక్షించారు. అప్పటి ప్రజలను మనం ఆదర్శంగా తెసుకోవాలి.
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ