కర్మవల్ల ఆత్మకు దేహదారణము సంభవించుచున్నది. కావునా శరీరోత్పత్తికి కర్మే కారణము అగుచున్నది. శరీరదారణ వలనే ఆత్మ కర్మ చేయుచున్నది. కావున కర్మ చేయుటకు శరీరమే కారణము అగుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబందమువలన ఆత్మకు కర్మసంభందము కలుగునని మొదట శివుడు పార్వతికి వివరించాడు. దానిని మీకు వివరించుచున్నాను. "ఆత్మ" అనగా ఈ శరీరమున అహంకారముగా ఆవహించి వున్నది అని అంగీరసుడు చెప్పగా.
" ఓ మునీంద్రా! నేనింతవరకు శరీరమే ఆత్మ అని భావించుచున్నాను. కనుక ఇంకావివరముగా చెప్పబడిన వ్యాక్యార్ధజ్ఞానంకు పాదార్ధజ్ఞానం కారణము అగుచున్నాడు. కావున "అహంబ్రహ్మ" అను వాక్యార్ధమును గురించి నాకు చెప్పండి" అని ధనలోబుడు కోరాడు.
అప్పుడు ధనలోభునితో అంగీరసుడు ఇలా అన్నాడు ఈ దేహము అంతఃకరణవృత్తికి సాక్షియే . నేను -నాది అని చెప్పబడు జీవాత్మే అహం అను శబ్దము . సర్వాంతర్యామే సచ్చితానందరూపమైన పరమాత్మ "నః " అను శబ్దము,ఆత్మకు ఘటాదుల వాలే శరీరమునాకు అర్ధములేదు. ఆ ఆత్మ సచ్చితానంద స్వరూపము. బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగువానిని వ్యాపారమునందు ప్రవర్తింపచేసి వానికంటె వేరుగా ఉన్నదైఎల్లప్పుడు ఒకేరీతిని ప్రకాశించించునదే ఆత్మ . నేను అనునది శారీరేంద్రియాదులలో ఒకటి కాదు అని తెలుసుకో. దేహేంద్రియాదులు నన్నింటిని ఏది ప్రకాసింపచేయునో అదే నేను. అందుచే అస్థిరమైన శరీరాదులు కూడా నామరూపము లతో ఉండి నసించునుగాక, నేను నాది అనునది కేవలము యాత్మ మాత్రమే .
ఇనుము సూదంటు రాయిని అంటిపెట్టుకొని తిరుగునటులు శరీర, ఇంద్రియాలు దేని నాశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ, ఆత్మవల్లే పనిచేయును. నిద్రలో శారీరేంద్రియముల సంబంధము లేక గాఢనిద్రపోయి, మేల్కొన్న తరువాత నేను సుఖనిద్ర పోతిని సుఖముగా వున్నది అనుకోనునది ఆత్మ. ఆత్మదేహ లక్షణం, వుండుట, జనించుట, పెరుగుట, క్షిణించుట, మరణించుట వంటి భాగాలు ఆత్మకు వుండవు. జీవమే పరమాత్మ అని తెలుసుకో.
జీవులచే కర్మఫల మనుభావింపచేసేవాడు పరమాత్మే అతనే పరమేశ్వరుడు. జీవులా కర్మఫలమనుభవింతురు అని తెలుసుకో. మానవుడు గుణసంపద కలవాడై గురుశుశ్రూష కలిగి సంసార సంబంధమగు ఆశలన్నీ విడిచి విముక్తి పోందవలెను. మంచి పనులు తలచిన చిత్తశుద్ధి, దానివలనే భక్తిజ్ఞాన వైరాగ్యములు గలిగి ముక్తి పొందును. అందువల్ల సత్కర్మనుష్టానం చేయాలి. మంచిపనులు చేసినగాని ముక్తి లభించదు. అని అంగీరసుడు చెప్పగా ధనలోబుడు నమస్కరించినాడు.