ఆదివారం, డిసెంబర్ 09, 2012
దూర్వాసుడు శ్రీహరిని శరణువేడుట - శ్రీహరి బోధ
ఈవిధముగా అత్రిమహముని అగస్త్యునితో - దుర్వాసుని కోపమువల్ల కలిగిన ప్రమాదమును తెలిపి, మిగిలన వృత్తంతమును ఇట్లు తెలియజేసేను. ఆవిధముగా ముక్కోపియైన దూర్వాసుడు భూలోకము, భువర్లోకము, పాతాళలోకము, సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములలోను తనను రక్షించువారు లేకపోవుటచె వైకుంఠ ముందున మహావిష్ణువు కడకు వెళ్లి " వాసుదేవా! జగన్నాధా! శరణాగత రక్షణ బిరుదాంకితా! రక్షింపుము. నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుడనుగాను. ముక్కో పినై మహాపరాధము చేసితిని. నీవు బ్రాహ్మణ ప్రియుడవు . బ్రాహ్మణుడైన భగుమహర్షినీ యురముపైత నిన్నను సహించితివి. అకాలిగురుతు నేటికినీ నీవక్ష స్దలమందున్నది. ప్రశాంత మనస్యుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము. శ్రీహరి! నీ చక్రాయుధము నన్ను జమ్పవచ్చుచున్న" దని దూర్వాసుడు శ్రీ మన్నారాయణుని పరి పరి విధముల ప్రార్దించెను. ఆవిధముగా దూర్వాసుడు అహంకారమును వదలి తనను ప్రార్దుంచుట చూచి - శ్రీహరి చిరునవ్వు నవ్వి " దూర్వాసా! నీ మాటలు యదార్ధములు. నీ వంటి తపోధనులు నాకత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమున బుట్టిన రుద్రడవు. నిన్ను జూచిన వారు మూడు లోకములందు భయపడకుందురా! నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము యెట్టి హింసా కలిగించను. ప్రతియుగ ముందునగో, దేవ, బ్రాహ్మణ, సాధుజనంబులకు సంభవించే యాపాదలను పోగొట్టుటకు ఆయా పరిస్ధితలకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావింతును. నీవకారణముగా అంబరీషుని శపించితివి. నేను శత్రువుకైనను మనో వాక్కయులందు కూడా కీడుతలపెట్టేను. ఈ ప్రపంచ మందుగల ప్రాణి సమూహము నా రూపముగానే జూతును. అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను. కాని, అటువంటి నాభక్తుని నీవు అనేక విధములు దూషించితివి. నీ యెడమ పాదముతో తన్నితివి. అతని యింటికి నీవు అతిధి వైవచ్చికుడ, నేను వేళకు రానియెడల ద్వాదశి షుడియలు దాటకుండ భుజింపుమని అంబరీషునకు చెప్పా వైతివి. అతడు వ్రతభంగమునుకు భయపడి, నీ రాకకై చూచి జలపాన మును మాత్రమే జేసెను. అంతకంటే అతడు అపరాధము యేమి చెసెను! చాతుర్వర్ణ ములవారికి భోజన నిషిద్దది ములందు కూడా జలపానము దాహశాంతికిని, పవిత్రతకును చేయదగినదే కదా? జలపాన మొనరించిన మాత్రమున నాభక్తుని దూషించి శపించితివి.
అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కాని నిన్నువ మానించుటకు చేయాలేదె? నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపచేయజూచెను. ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడెను. నేనుపుడు రాజ హృదయములో ప్రవేశించినాను. నీ శాపఫలము పది జన్మలలో అనుభ వించుదునని పలికిన వాడిని నేనే. అతడు నీవలన భయముచే నన్ను శరణు వేడుచుండెను. కాని, తన దేహము తానూ తెలుసుకోనె స్దితిలో లేదు. నీ శాపమును అతడు వినలేదు. అంబరీషుడు నాభక్త కోటిలో శ్రేష్టుడు. నిరపరాధి, దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటి వానిని అకారణముగా దూషించితివి. అతనిని నిష్కరణముగా శపించితివి. విచారించవలదు. ఆ శాపమును లోకోపకారమునకై నేనె అనుభవింతును . అదెటులనిన నీశాపములో నిది మొదటి జన్మ మత్స్యజన్మ . నేనీ కల్పమును మనువును రక్షించు నిమిత్తము, సోమకుడను రాక్షసుని జంపుటకు మత్స్య రూపమెత్తుదును. మరికొంత కాలమునకు దేవదానవులు క్షిరసాగరమును మదుంచుటకు మందర పర్వత మును కవ్వముగాచే యుదురు. అ పర్వత మును నీటిలో మునగకుండ కూర్మరూపమున నావిపున మోయుదును. వరాహజన్మ మెత్తి హిరణ్యాక్లుని వదంతును. నరసింహ జన్మమెత్తి హిరణ్యకశిపునిజంపి, ప్రహ్లాదుని రక్షింతును. బలిచే స్వర్గమునుండి పారద్రోలబడిన ఇంద్రనకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తి ని పాతాళలోకమునకు త్రొక్కి వేతును. భూభారమును తగ్గి౦తున. లోక కంటకుఢయిన రావణుని జంపిలోకో పకారము చేయుటకు రఘువంశమున రాముడనై జన్మింతును. పిదప, యదువంశమున శ్రీ కృష్ణునిగను, కలియుగమున బుద్దుడుగను , కలియుగాంత మున విష్ణు చి త్తుఢను విప్రునియింట " కల్కి" యన పేరున జన్మించి, అ శ్వారూడు౦డనై పరిభ్ర మించుచు బ్రహ్మదేషులనందరను ముట్టు బెట్టుదును. నీవు అంబరీ షునకు శాపరు పమున నిచ్చిన పది జన్మలను యీ విధ ముగా పూర్తి చేయుదును. ఇట్లు నా దశవతార ములను సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజే సి వైకుంఠ ప్రాప్తి నో సంగుదును. ఇది ముమ్మాటికి తథ్యము.
శనివారం, డిసెంబర్ 08, 2012
దుర్వాసుడు అంబరిషుని శపించుట:
" అంబరిషా! పూర్వజన్మలో కించిత్ పాపవిశేషమువలన నీకీ యనర్ధము వచ్చినది. నీ బుద్దిచే దీర్ఘముగా అలోచించి నీ కెటుల అనుకూలించునో అటులనే చేయుము. ఇక మాకు సెలవిప్పించుము " అని పండితులు పలికిరి. అంత అంబరీషుడు
"ఓ పండితోత్తములారా! నానిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలుడు. ద్వాదశీ నిష్టను విడచుట కన్న, విప్రశాపము అధీకమయినది కాదు. జలపానము చేయుట వలన బ్రాహణుని అవమాన పరచుటగాదు. ద్వాదశిని విడచుటయుగాదు. అప్పుడు దుర్వాసుడు నన్నేలనిందించును? నిందింపడు. నా తొల్లి పుణ్యఫలము నశింపదు. గాన, జలపాన మొనరించి వూరకుందును" అని వారియెదుటనె జలపానము నోనరించెను. అంబరిషుడు జలపాన మొనరించిన మరుక్షణముచే దుర్వాసుడు స్నానజపాదులు పూర్తిచెసుకొని అక్కడకు వచ్చెను. వచ్చిన వెంటనే ఆముని మహారౌద్రాకారుడై క౦డ్ల వెంట నిప్పులు గ్రక్కుచూ" ఓరీ మదాంధా! నన్ను భోజనానికి రమ్మని, నేను రాకనే నీవేల భాజించితివి? ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము? ఎంతటి ధర్మ పరిత్యాగివి? అతిధి కి అన్నము పెట్టెదనని ఆశ జూపి పెట్టకుండా తాను తినినవాడు మాలభక్షకుడగును. అట్టి అధముడు మరుజన్మలో పురుగై పుట్టును. నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి. అది భోజనముతో సమానమైనదే. నీవు అతిధిని విడిఛి భుజించినావు కాన, నీవు నమ్మక ద్రోహివగుదువె గాని హరిభక్తుడవెట్లు కాగలవు ? శ్రీహరి బ్రాహణావమానమును సహింపడు. మమ్మే యావమానించుట యనిన శ్రీ హరినీ అవమానించుటయే. నీవంటి హరినిందాపరుడు మరి యొకడులేడు. నీవు మహాభక్తుడనని అతిగర్వము కలవాడవై వున్నావు. ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వనించి అవమానపరచి నిర్లక్ష్యముగా జలపాన మొనరించితివి. అబరిషా! నీవెట్లు పవిత్ర రాజకుటుంబములో బుట్టినావురా! నీవంశము కళంకము కాలేదా?" అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అ౦బరిషుడు, మునికోపమునకు గడగడ వణుకుచు, ముకుళిత హస్త ములతో " మహానుభావా! నేను ధర్మహీనుడను, నాయజ్ఞానముచేనే నీ కార్యము చేసితిని. నన్ను రక్షింపుడు. బ్రాహణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులూ, దయాదాక్షిణ్యములు గలవారు కాన, నన్ను కాపాడు" డని అతని పాదములపైపడెను. దయాశూన్య డైన దూర్వసుడు అంబరిషుని తలను తన యెడమ కాలితోతన్ని"దోషికీ శాపమీయకుండా వుండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగానూ, మూడవ జన్మలో పంది గాను, నాలుగవ జన్మలో సింహముగాను, యైదవ జన్మలో వామనుడుగాను, ఆరవ జన్మలో క్రూరుడవగు బ్రాహణుడవుగాను, యేడవ జన్మలో ముధుడవైన రాజుగాను యెనిమిదవ జన్మలో రాజ్యముగాని సింహాసనముగానిలేనట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషండమతస్తునిగాను, పదవ జన్మలో పాప బుద్ధిగలదయలేని బ్రాహణుడవుగాను పుట్టెదవుగాక " అని వెనుక ముందులాలోచించక శపించెను. ఇంకను కోపము తగ్గనందున మరలశ పించుటకు ఉద్యుక్తడగుచుండగా, శ్రీ మహావిష్ణువు బ్రాహణుశాపము వృధాకాకూడదని, తన భక్తునికి ఏ అపాయము కలుగకుండుటకు - అంబరీ షుని హృదయములో ప్రవేశించి " మునివర్యా! అటులనే - మీశాపమనుభవింతు" నని ప్రాధేయపడెను. కాని దూర్వసుడింకనూ కోపము పెంచుకొని శపించుబోగా, శ్రీ మన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను. ఆ సుదర్శనము కోటిసూర్య ప్రభలతో అగ్ని జ్వాలలు గ్రక్కుచూ దూర్వసునిపై పడబోయెను అంత దుర్వాసుడు ఆ చక్రము తనని మసి చేయునని తలంచి ప్రాణముపై ఆశకలిగి అచటినుండి " బ్రతుకుజీవుడా" యని పరుగిడేను. మహాతేజుస్సుతో చక్రాయుధము దూర్వసుని తరుముచుండెను. దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను, దేవలోకమున కరిగి దేవేంద్రుని, బ్రహలోకానికి వెళ్లి బ్రహదేవుని, కైలాసమునకు వెళ్లి పర మేశ్వరునీ యెంత ప్రార్దంచినను వారుసైతము చక్రాయుధము నుండి దుర్వాసుని కాపాడలేకపోయిరి.
శుక్రవారం, డిసెంబర్ 07, 2012
వైకుంఠపాళి లేదా దశపద ప్రాచీన భారతీయ ఆట. క్రీ.పూ 2వ శతాబ్దములో నుండి ఈ ఆట భారతదేశములో ఉన్నదని చారిత్రీకులు భావిస్తున్నారు. సాధారణంగా ఇద్దరు మనుషులు ఆడే ఈ ఆట ఒక నలు చదరము పై ఆడతారు. ఈ చదరములో సాధారణంగా 10 అడ్డవరుసలు, 10 నిలువువరుసలతో మొత్తం 100 గడులుంటాయి. అయితే కొన్ని రూపాంతరాలలో 8 అడ్డ నిలువు వరసలు, 12 అడ్డ నిలువు వరుసల చదరాలు కూడా ఉంటాయి. చదరంపై చిత్రించబడి ఉన్న పాములు మరియు నిచ్చెనల(సోపానాలు) అమరిక చదరాన్నిచదరాన్ని బట్టి మారుతుంటుంది. పాములు, సోపానాలు నిర్ధిష్టమైన గడులలో ఉండనవసరం లేదు. చదరంలో యొక్క పరిమాణము, చదరంలో పాములు మరియు సోపానాల అమరికపై ఆట యొక్క నిడివి ఆధారపడిఉంటుంది. జీవితాన్ని కూడా వైకుంఠపాళీ ఆటతోనే పోలుస్తారు. గెలుపు ఓటమిలు సహజము అని నేర్పే మంచి ఆట. ఈ ఆటను మీరు కూడా అది సంతోషించండి మరి .
అంబరిషుని ద్వాదశి వ్రతము
అత్రి మహాముని మరల అగస్త్యునితో " ఓ కుంభసంభవా! కార్తీక వ్రత ప్రభావము నెంతివిచారించిననూ, యెంత వినిననూ తనివి తీరదు. నాకు తెలిసినంత వరకు వివరింతును. అలకింపుము. " గంగా, గోదావరి మొదలగు నదులలో స్నానము చేసిన౦దు వలన ను, సూర్యచంద్రగ్రహణ సమయములందు స్నానాదులోనరించినను యెంత ఫలము కలుగునో శ్రీమన్నారయణుని నిజతత్వమును తెలిపెడి కార్తీకవ్రతమందు శుద్ధద్వాదశినాడు భక్తి శ్రద్దలతో దనధర్మములుచేయు వారికీని అంతఫలమే కలుగును. ఆద్వాదశి నాడు చేసిన సత్కార్యఫలము యితర దినములలో చేసిన ఫలము కంటె వేయిరెట్లు అధికముకా గలదు. ఆ ద్వాదశి వ్రతము చేయు విధానమెట్లో చెప్పెదను. వినుము. కార్తీక శుద్ధ దశమి రోజున, పగటి పూట మాత్రమే భుజించి ఆమరునాడు అనగా యెకాదశి రోజున వ్రతమూ చేయక శుష్కో పవాస ముండి ద్వాదశి ఘడియలు వచ్చిన తరువాతనే భుజింప వలయును. దీనికొక యితిహాసము కాలదు. దానిని కూడా వివరించెదను. సావదనుడవై అలకింపుము"మని యిట్లు చెప్పుచున్నాడు.
పూర్వము అంబరీషుడనురాజు కాలదు. అతడు పరమ భగవతోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండ వ్రతము చేయుచుండెడివాడు. ఒక ద్వాదశినాడు, ద్వాదశి ఘడియలు స్వల్ప ముగా నుండెను. అందుచే ఆ రోజు పెందల కడనె వ్రతమును ముగించి బ్రాహ్మణా సమారాధన చేయదలచి సిద్దముగా నుండెను. అదే సమయమున కచ్చటకు కోపస్వభావుడగు దుర్వాసుడు వచ్చెను. అంబరీషుడు ఆ మునిని గౌరవించి, ద్వాదశి ఘడియలలో పారాయణము చేయవలయునుగాన, తొందరగా స్నానమునకై రమ్మనమని కోరెను. దుర్వాసుడ౦దుల క౦గీకరించి సమీపమున గల నదికి స్నానమున కైవెడలెను. అంబరీషుడు యెంతసేపు వేచి యున్ననూ దుర్వాసుడు రాలేదు. ద్వాదశి ఘడియలు దాటిపోవు చున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తానిట్లునుకొనెను. " ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనము నాకు రమ్మంటిని . ఆముని నదికి స్నానముకు వెళ్లి యింతవరకు రాలేదు. బ్రాహ్మణునకతిధ్యమిత్తునని మాటయిచ్చి భోజనం పెట్టక పోవుట మహాపాపము. అది గృహస్తునకు ధర్మముగాదు. అయన వచ్చు వరకు ఆగితినా ద్వాదశి ఘడియలు దాటిపొవూ. వ్రతభంగమగును. ఈ ముని మహాకోప స్వభావము గలవాడు. ఆయన రాకుండగా నేను భుజించిన నన్నుశపించును. నాకేమియు తోచకున్నది. బ్రాహ్మణా భోజనమతిక్రమించరాదు. ద్వాదశి ఘడియలు మించిపోకూడదు. ఘడియలు దాటి పోయిన పిదప భుజించిన యెడల, హరిభక్తిని వదలిన వాడనగుదను. ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్పలమగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు, భోజనము చేసిన ద్వార్వసునకు కోపము వచ్చును. అదియుగాక, యీ నియమమునునెను అతిక్రమించిన యెడల వెనుకటి జన్మయందు జేసినా పుణ్యములు నశించును. దానికి ప్రాయశ్చితము లేదు.
" అని అలోచించి " బ్రాహ్మణా శాపమునకు భయములేదు. ఆ భయమును శ్రీ మహావిష్ణువేబోగట్ట గలదు. కావుననెను ద్వాదశి ఘడియలలో భోజనము చేయుటయే వుత్తమము. అయినను పెద్దలతో ఆలోచించుటమంచి"దని, సర్వ జ్ఞులైన కొందరు పండితులను గాంచి వారితో యిట్లుచెప్పెను. ఓపండిత శ్రేష్టులారా! నిన్నటి దినమున యేకాదశియగుటం జేసి నేను కటిక వుపవాసము వుంటిని. ఈ దినమున స్వల్పముగా మత్రమే ద్వాదశి ఘదియలున్నవి. ద్వాదశి ఘడియలలోనే భుజించవలసి యున్నది. ఇంతలో నాయింటికి దుర్వాస మహాముని విచ్చేసిరి. అమహామునిని నేను భోజనమునకు ఆహ్వాని౦చితిని. అంధులకాయన అంగీకరించి నదికి స్నానర్ధ మై వెళ్లి ఇంత వరకు రాకుండెను. ఇప్పుడు ద్వాదశిఘడియలు దాటిపోవుచున్నవి. బ్రాహ్మణుని వదిలి ద్వాదశిఘడియలలో భుజింపవచ్చునా? లేక, వ్రతభ౦గమును సమ్మతించి ముని వెచ్చే వరకూ వేచి యుండవలెనా? ఈ రెండిటిలోయేది ముఖ్య మైనదో తెలుపవలసిన"దాని కోరెను. అంతట యా ధర్మజ్ఞులైన పండితులు, ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శప్రతి విమర్శలు చేసికొని, దిర్ఘముగా అలోచించి " మహారాజా! సమస్త ప్రాణి కోటి గర్భకుహరములందు జటరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును పచనముగావించి దేహే౦ద్రియలకు శక్తి నొసంగుచున్నాడు. ప్రాణ వాయువు సహాయముతో జటరాగ్ని ప్రజ్వరిల్లును. అది చెలరేగిన క్షుద్భాధ- దప్పిక కలుగును. అ తపము చల్లార్చ వలెనన్న అన్నము, నిరు పుచ్చుకొని శాంత పరచవలెను. శరీరమునకు శక్తకలుగ చేయువాడు అగ్నిదేవుడు, దేవతలందరి కంటే అధికుడై దేవ పుజ్యు డైనాడు. ఆయగ్ని దేవునందరు సదా పూజింపవలెను. గృహస్తు, యింటికి వచ్చిన అతిధి కడ జాతి వాడైనాను 'భోజనమిడుదు' నని చెప్పి వనికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేద వేదాంగ విద్యవిశారదుడును, మహతపశ్శలియు, సదాచార సంపన్నుడును అయిన దుర్వాస మహామునిని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపమూ కలుగును. అందువలన ఆయుక్షిణము కలుగును. దుర్వాసునంతటి వానిని అవమానమొనరించిన పాపము సంప్రాప్త మగను" అని విషాదపరచిరి.
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ