Blogger Widgets

శనివారం, డిసెంబర్ 08, 2012

కార్తీక పురాణం 25వ రోజు

శనివారం, డిసెంబర్ 08, 2012

దుర్వాసుడు అంబరిషుని శపించుట:
" అంబరిషా! పూర్వజన్మలో కించిత్ పాపవిశేషమువలన నీకీ యనర్ధము వచ్చినది. నీ బుద్దిచే దీర్ఘముగా అలోచించి నీ కెటుల అనుకూలించునో అటులనే చేయుము. ఇక మాకు సెలవిప్పించుము " అని పండితులు పలికిరి. అంత అంబరీషుడు
"ఓ పండితోత్తములారా! నానిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలుడు. ద్వాదశీ నిష్టను విడచుట కన్న, విప్రశాపము అధీకమయినది కాదు. జలపానము చేయుట వలన బ్రాహణుని అవమాన పరచుటగాదు. ద్వాదశిని విడచుటయుగాదు. అప్పుడు దుర్వాసుడు నన్నేలనిందించును? నిందింపడు. నా తొల్లి పుణ్యఫలము నశింపదు. గాన, జలపాన మొనరించి వూరకుందును" అని వారియెదుటనె జలపానము నోనరించెను. అంబరిషుడు జలపాన మొనరించిన మరుక్షణముచే దుర్వాసుడు స్నానజపాదులు పూర్తిచెసుకొని అక్కడకు వచ్చెను. వచ్చిన వెంటనే ఆముని మహారౌద్రాకారుడై క౦డ్ల వెంట నిప్పులు గ్రక్కుచూ" ఓరీ మదాంధా! నన్ను భోజనానికి రమ్మని, నేను రాకనే నీవేల భాజించితివి? ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము? ఎంతటి ధర్మ పరిత్యాగివి? అతిధి కి అన్నము పెట్టెదనని ఆశ జూపి పెట్టకుండా తాను తినినవాడు మాలభక్షకుడగును. అట్టి అధముడు మరుజన్మలో పురుగై పుట్టును. నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి. అది భోజనముతో సమానమైనదే. నీవు అతిధిని విడిఛి భుజించినావు కాన, నీవు నమ్మక ద్రోహివగుదువె గాని హరిభక్తుడవెట్లు కాగలవు ? శ్రీహరి బ్రాహణావమానమును సహింపడు. మమ్మే యావమానించుట యనిన శ్రీ హరినీ అవమానించుటయే. నీవంటి హరినిందాపరుడు మరి యొకడులేడు. నీవు మహాభక్తుడనని అతిగర్వము కలవాడవై వున్నావు. ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వనించి అవమానపరచి నిర్లక్ష్యముగా జలపాన మొనరించితివి. అబరిషా! నీవెట్లు పవిత్ర రాజకుటుంబములో బుట్టినావురా! నీవంశము కళంకము కాలేదా?" అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అ౦బరిషుడు, మునికోపమునకు గడగడ వణుకుచు, ముకుళిత హస్త ములతో " మహానుభావా! నేను ధర్మహీనుడను, నాయజ్ఞానముచేనే నీ కార్యము చేసితిని. నన్ను రక్షింపుడు. బ్రాహణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులూ, దయాదాక్షిణ్యములు గలవారు కాన, నన్ను కాపాడు" డని అతని పాదములపైపడెను. దయాశూన్య డైన దూర్వసుడు అంబరిషుని తలను తన యెడమ కాలితోతన్ని"దోషికీ శాపమీయకుండా వుండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగానూ, మూడవ జన్మలో పంది గాను, నాలుగవ జన్మలో సింహముగాను, యైదవ జన్మలో వామనుడుగాను, ఆరవ జన్మలో క్రూరుడవగు బ్రాహణుడవుగాను, యేడవ జన్మలో ముధుడవైన రాజుగాను యెనిమిదవ జన్మలో రాజ్యముగాని సింహాసనముగానిలేనట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషండమతస్తునిగాను, పదవ జన్మలో పాప బుద్ధిగలదయలేని బ్రాహణుడవుగాను పుట్టెదవుగాక " అని వెనుక ముందులాలోచించక శపించెను. ఇంకను కోపము తగ్గనందున మరలశ పించుటకు ఉద్యుక్తడగుచుండగా, శ్రీ మహావిష్ణువు బ్రాహణుశాపము వృధాకాకూడదని, తన భక్తునికి ఏ అపాయము కలుగకుండుటకు - అంబరీ షుని హృదయములో ప్రవేశించి " మునివర్యా! అటులనే - మీశాపమనుభవింతు" నని ప్రాధేయపడెను. కాని దూర్వసుడింకనూ కోపము పెంచుకొని శపించుబోగా, శ్రీ మన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను. ఆ సుదర్శనము కోటిసూర్య ప్రభలతో అగ్ని జ్వాలలు గ్రక్కుచూ దూర్వసునిపై పడబోయెను అంత దుర్వాసుడు ఆ చక్రము తనని మసి చేయునని తలంచి ప్రాణముపై ఆశకలిగి అచటినుండి " బ్రతుకుజీవుడా" యని పరుగిడేను. మహాతేజుస్సుతో చక్రాయుధము దూర్వసుని తరుముచుండెను. దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను, దేవలోకమున కరిగి దేవేంద్రుని, బ్రహలోకానికి వెళ్లి బ్రహదేవుని, కైలాసమునకు వెళ్లి పర మేశ్వరునీ యెంత ప్రార్దంచినను వారుసైతము చక్రాయుధము నుండి దుర్వాసుని కాపాడలేకపోయిరి.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)