శుక్రవారం, జులై 19, 2013
ఏ మంచిపని ప్రారంభించినా దశమి ఏకాదశులకోసం ఎదురుచూడటం అందరికీ అలవాటు కదండి . మొత్తం సంవత్సరం పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో, ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు.
పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు. వానకారు మొదలైతే అనారోగ్యాలు తలెత్తడం సహజం. శరదృతువు యముడి కోర. ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండుగలూ పబ్బాలూ ఎక్కువ గా జరుపుకున్నేవారు. ఆనాడు ఉపవాస తొలి ఏకాదశి దీక్ష చేస్తారు.
ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్బాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. విష్ణువు పాలకడలి పై శేష తల్పమున పవళిస్తాడు. అదే రోజును తొలి ఏకాదశి గా భావిస్తారు.
సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. ఇంత ప్రాముఖ్యము కల శయన ఏకాదశి రోజు విష్ణు సహస్రము పారాయణ చేసెదరు.
అందరికీ ఈ తొలి ఏకాదశి శుభాకాంక్షలు.
గురువారం, జులై 04, 2013
అల్లూరి సీతారామ రాజు మన ఆంద్రప్రదేశంలో జన్మించిన స్వాతంత్ర సమరయోధుడు. ఈయన దారిలోనే తూర్పుగోదావరి, విశాఖపట్టణం జిల్లాలో అడవుల ప్రదేశంలో మన్యం ప్రజలు విప్లవ దారిలో నడిచాయి. అల్లూరి సీతామరాజు 4 జూలై 1897 లో పాండ్రంగి అనే ఉరిలో విజయనగరం జిల్లా దగ్గర వెంకట రామరాజు మరియు సూర్యనారాయణమ్మ లకు జన్మించారు. వీరికి ఒక తమ్ముడు సత్యనారాయణరాజు మరియు చెల్లి సీతమ్మ కలరు. మనకు చరిత్రనుండి చూస్తే
రక్తపాతం జరగకుండా ఉన్న ఉద్యమాల్లేవు. అంతేకాదు రక్తపాతం జరక్కుండా ఉద్యమాన్ని నడిపించాలని ప్రయత్నించిన ఉద్యమ నాయకులు కూడా వున్నారు. వారిలో గాంధీజీ మన జాతీయ కథానాయకుడు అని మనకు తెలుసు కదా. అల్లూరి సీతారామరాజు మన ఊరి విప్లవ నాయకుడు! మన్యంలో కొండదళానికి, తెల్లదండుకి మధ్య అరవెరైండు సార్లు కాల్పులు జరిగినా, అనవసరమైన రక్తపాతం జరగా కూడదు అని మన మన్యం వీరుడు అనేకసార్లు ఆపుచేసాడు. అల్లూరి సీతారామ రాజును మనము ఆదర్శంగా తీసుకోవాలి. శత్రువుపై నిప్పులు కురిపించిన మన్యం అగ్నికణం అల్లూరి సీతారామరాజు, ఈయన విప్లవ పోరాట సమయం మొత్తం జీవితకాలం గా మనం చెప్పుకోవచ్చు లెక్కకు వస్తే అల్లూరి సీతారామరాజు 22 ఆగస్టు 1922 నుంచి 1924 వరకు అని చెప్పుకుంటారు. అసలు అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారికి ఒకలేఖ రాసారు నేను మీకు లొంగిపోతున్నాను అని. కానీ బ్రిటిష్ వారు రుదర్ ఫర్డ్ అద్యక్షణ తో కాల్చి చంపేశారు. ఈ వీరుని కద ముగించేసారు . ఈరోజు విప్లవజ్యోతి అయిన శ్రీ అల్లూరి సీతారామ రాజు గారి 116 వ జయంతి సందర్బముగా ఆయని గుర్తుచేసుకొని హృదయపూర్వక నివాళి అందిద్దాం.
స్వామీ వివేకానంద (జనవరి 12, 1863 - జూలై 4, 1902) ప్రసిద్ధి గాంచిన గొప్ప హిందూ మత యోగి. పూర్తి పేరు నరేంద్ర నాథ్ దత్తా. రామకృష్ణ పరమహంసగారి అత్యంత ప్రియమైన శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు.
భారతదేశాన్ని మాత్రమే జాగృతము చెయ్యడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండుల లో యోగ, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయము చేసిన ఖ్యాతి వివేకానందునికి కలదు. గురువు గారి కోరిక మేరకు అమెరికాకు వెళ్ళి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశాడు. అతని వాగ్ధాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానీకం బ్రహ్మరధం పట్టింది. ఎంతో మంది అతనికి శిష్యులయ్యారు. పాశ్చాత్య దేశాలలోకి అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి ఈయనే. తూర్పు దేశాల తత్త్వమును షికాగో లో జరిగిన ప్రపంచ మత జాతరలో 1893 లో ప్రవేశపెట్టాడు. అక్కడే షికాగోలోను, అమెరికాలోని ఇతర ప్రాంతాలలోను ప్రజల అభిమానాన్ని పొందారు. ఈయన తిరిగి భారత దేశం వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశానిర్దేశం చేశాడు. ముప్పై తొమ్మిధి ఏళ్ళ వయసు లోనే మరణించాడు.
ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన జన్మ దినాన్ని "జాతీయ యువజన దినోత్సవం" గా ప్రకటించింది.అవిశ్రాంతంగా పని చేయడం వలన స్వామి ఆరోగ్యం దెబ్బతిన్నది. అమెరికాలోని ఆయన శిష్యుల అభ్యర్థన మేరకు మరల అక్కడికి వెళ్ళాడు. ప్యారిస్ లోని సర్వమత సమావేశాలలో పాల్గొని తిరిగి స్వదేశానికి వచ్చాడు. రానూరానూ అంతర్ముఖుడయ్యాడు. శరీరమైతే బలహీనంగా తయారయ్యింది కానీ ఆయన ఆత్మ,మనసు మాత్రం చాలా చురుగ్గా వ్యవహరించేవి. జులై 4, 1902న యధావిధిగా ఆయన రోజూవారీ కార్యక్రమాలు నిర్వర్తించుకున్నాడు. శిష్యులకు బోధనలు చేశాడు. భోంచేసిన తరువాత కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్నాడు. కొద్ది సేపటి తరువాత ఆయనకు చిన్న వణుకు లాంటిదేదో కలిగింది. తనను చూడడానికి వచ్చిన వారితోనూ, శిష్యులతోనూ చాలా ఉల్లసంగా నవ్విస్తూ గడిపాడు. రాత్రి 9 గంటల సమయంలో ఆయనఅలసిపోయినట్లుగా కనిపించాడు. చేతులలో సన్నగా వణుకు ప్రారంభమైంది.చిన్నగా అరిచి లేచి కూర్చున్నాడు. దీర్ఘంగా శ్వాస పీల్చి నెమ్మదిగా శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. ఆయన శిష్యులు తల్లితండ్రులను కోల్పోయిన అనాథలవలే చాలా భాద పడ్డారు . అస్సలు వివేకానందుని గురించి తెలియని వారు వుండరు. ఇంతవరకు చదవని వారు కనీసం శ్రీ స్వామివారు 'వివేక సూర్యోదయం' పుస్తకంతో మొదలు పెట్టండి. అద్భుతమైన చిన్న పుస్తకం.
వివేకానందుడు హిందూమతాభివృద్దికి చేసిన కృషిని గురించి మనం చెప్పలేమేమో. కదా. ఈ రోజు వివేకానంద స్వామి వర్ధంతి రోజు ఆయన గురించి కొంచెం తెలుసుకున్నందుకు చాలా సంతోషంగా అనిపించింది. ఈ బ్లాగ్ ద్వారా ఆయనకు నివాళి అర్పిద్దాం మరి.
ఆదివారం, జూన్ 30, 2013
ఏ దేశమేగినా ఎందుకాలిడినాఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినపొగడరా నీ తల్లి భూమి భారతినినిలుపరా నీ జాతి నిండు గౌరవము
ఈ కవితను వినగానే అందరికి గుర్తువచ్చే మహానుభావుడు రచయిత శ్రీ రాయప్రోలు సుబ్బారావు గారు . ఈయన నవ కవితా పితామహుడు అని అంటారు. మన సమాజానికి అనుగుణంగా భావుకతను అల్లి తెలుగు కవితకు క్రొత్త సొగసులు అద్దాడు. రాయప్రోలు గొప్ప జాతీయవాది. తెలుగు జాతి అభిమాని. ఆయన దేశభక్తి గేయాలు ఎంతో ఉత్తేజకరంగా ఉంటాయి. ఈరోజు శ్రీ రాయప్రోలు సుబ్బారావు గారి వర్ధంతి . అందువల్ల ఈ బ్లాగ్ ద్వారా వారికి నివాళి అర్పిద్దాం. శ్రీ రాయప్రోలు సుబ్బారావు గారు రాసిన ఒక మంచి గేయము మా తెలుగు పుస్తకంలో వుంది అది నాకు చాలా బాగా నచ్చింది. ఆ గేయం సారాంశం ఏమిటి అంటే. పాచీన కాలం నుండి భారతదేశం అనేక సంస్కృతీ సామ్ప్రదాయంలకు నిలయం. సిరిసంపదలకు, పాడిపంటలకు ప్రసిద్ది పొందింది. ఎందరో మహానీయులకు ఇది పుట్టినిల్లు. భిన్నత్వంలో ఏకత్వంని సాధించిన సమైక్య దేశం మన భారతదేశం. మన దేశగౌరవంను దశదిశలా చాటడం మన కర్తవ్యం . మన దేశ పౌరుషాన్ని నిలబెట్టడం మన భాద్యత. ఈ భావాలను ప్రజలలో ఎలా ప్రేరేపించిందో ఈ గేయం చదివి తెలుసుకుందాం.
శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై
వరలినది ఈ భరత ఖండము భక్తి పాడర తమ్ముడా !
వేద శాఖలు వెలసెనిచ్చట ఆదికావ్యం బలరె నిచ్చట |
బాదరాయణ పరమఋషులకు పాదు సుమ్మిది తమ్ముడా ||
విపిన బంధుర వృక్ష వాటిక ఉపనిషన్మధువొలికెనిచ్చట |
విపుల తత్వము విస్తరించిన విమల తలమిది తమ్ముడా ||
సూత్ర యుగముల శుద్ధ వాసన క్షాత్ర యుగముల శౌర్య చండిమ
చిత్ర దాస్యము చే చరిత్రల చెరిగిపోయెర తమ్ముడా ||
మేలి కిన్నెర మేళవించీ రాలు కరుగగ రాగమెత్తి
పాలతీయని బాలభారత పథము పాడర తమ్ముడా||
దేశగర్వము దీప్తి చెందగ దేశచరితము తేజరిల్లగ |
దేశమరసిన ధీరపురుషుల తెలిసి పాడర తమ్ముడా ||
పాండవేయుల పదునుకత్తులు మండి మెరిసిన మహితరణ కధ |
కండగల చిక్కని పదంబుల కలిపి పాడర తమ్ముడా||
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ