Blogger Widgets

శుక్రవారం, నవంబర్ 01, 2013

"ఆంధ్రా షెల్లీ" జయంతి శుభాకాంక్షలు.

శుక్రవారం, నవంబర్ 01, 2013

దేవులపల్లి వేంకట కృష్ణశాస్ర్తి గారు జయంతి నేడే తెలుగు సాహితీ ప్రియులందరికీ శుభాకాంక్షలు. 
 మావి చిగురు తినగానే కోయిల పలికేనా,   ఆకులో ఆకునై, పూవులో పూవునై, గోరింట పూచింది కొమ్మ లేకుండా, ఆరనీకుమా ఈ దీపం,  ప్రతి రాత్రి వసంత రాత్రి , పాడనా తెనుగు పాట, ఇది మల్లెల వేళయనీ,  ఎవరు నేర్పేరమ్మ... ఈ కొమ్మకు  ఈ పాటలు అన్నీ శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కవితా ప్రస్థానంలోనూ, తెలుగు సాహితీ చరిత్రలోనూ ఒక ముఖ్యమైన పాటలు . దేవులపల్లి కృష్ణశాస్త్రి తూర్పు గోదావరి జిల్లాపిఠాపురం దగ్గరలోని రామచంద్రపాలెం అనే గ్రామంలో ఒక పండిత కుటుంబంలో1897 నవంబరు 1న జన్మించాడు. అతని తండ్రి, పెదతండ్రి గొప్ప పండితులు. వారింట్లో నిరంతరం ఏదో సాహిత్యగోష్టి జరుగుతూ ఉండేది. కృష్ణశాస్త్రి చిన్న వయసునుండే రచనలు ఆరంభించాడు. ఒకసారి ఆయన బెజవాడ నుండి బళ్ళారికి రైలులో వెళుతుండగా చుట్టూ ఉన్న పొలాల సౌందర్యానికీ, రైలు లయకూ పరవశించి "ఆకులో ఆకునై, పూవులో పూవునై" అని పలవరించారట. అది తెలుగు భావకవితా యుగంలో ఒక ముఖ్య క్షణం.   కృష్ణశాస్త్రి గారి పాటలు అన్ని అమృత గుళికలే.  ఈయన ఆధునికాంద్ర సాహిత్యంలో అసాధారణ ప్రతిబావంతుడైన రచయిత.  భావకవిత్వపు, ప్రచారకుడు క్రుష్ణపక్షానికి వెలలేని వెన్నెల వెలుగులు అందించిన చంద్రుడు.   తెలుగుకు వెలుగులు తెచ్చి సూటిదనాన్ని, సున్నితత్వాన్ని సాహిత్యపు కమ్మని రుచిని అందించిన ఆధునిక బావకవి దేవులపల్లి వారు. శ్రీ  దేవులపల్లి కృష్ణశాస్త్రి ప్రసిద్ధ తెలుగు కవి. తెలుగు భావ కవితారంగంలో కృష్ణశాస్త్రి ఒక ప్రముఖ అధ్యాయం. చిన్న వయసునుండే రచనలు ఆరంభించాడు. 1929 లో రవీంద్రనాధ టాగూరును కలసిన తరువాత ఆయన కవిత్వంలో భావుకత వెల్లివిరిసింది. 1945లో ఆకాశవాణిలో చేరి అనేక పాటలు, నాటికలు రచించాడు.
భావ కవిగా, ‘ఆంధ్రా షెల్లీ ’గా ప్రసిద్ధులైన దేవులపల్లి వేంకట కృష్ణశాస్ర్తి గారు రచించిన మంచి దేశభక్తి గీతం  

పల్లవి :
జయ జయ జయ ప్రియ భారత
జనయిత్రీ దివ్యధాత్రి
జయ జయ జయ శత సహస్త్ర
నరనారీ హృదయనేత్రి ||| జయ జయ జయ |||


చరణం 1 :

జయ జయ సశ్యామల
సుశ్యామల చలచ్ఛేలాంచల
జయ వసంత కుసుమ లతా
చలిత లలిత చూర్ణకుంతల
జయ మదీయ హృదయశయ
లక్షారుణ పద యుగళ ||| జయ జయ జయ |||


చరణం 2 :

జయ దిశాంత గత శకుంత
దివ్యగాన పరిశోధన
జయ గాయక వైతాళిక
కల విశాల పద విహరిణి
జయ మదీయ మధుర గేయ
చుంబిత సుందర చరణ ||| జయ జయ జయ |||

"ధన్వంతరి"

ఈరోజు ధన్వంతరి జయంతి.   ఈరోజును ఆయుర్వేద వైద్యులు ధన్వంతరి జయంతిని ఘనంగా జరుపుకుంటారు.  ధన్వంతరి జయంతి శుభాకాంక్షలు. 
ధన్వంతరి అన్న పేరు మన భారతదేశ సంస్కృతీ సాంప్రదాయాలు తెలిసిన ప్రతీ ఒక్కరికి తెలుసు . ధన్వంతరి అవతారం గురించి నాలుగు రకాలుగా చెప్తారు.  ఒకటేమో భాగవతంలో క్షీరసాగర మధనం సమయంలో అమృత కలశాన్ని చేబట్టుకొని అవతరించిన శ్రీమహావిష్ణువు అవతారం. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం సూర్యభగవానుని వద్ద ఆయుర్వేదం నేర్చుకొన్న విద్యార్ధులలో ధన్వంతరి ఒక్కరు. సూర్యుని 16 మంది శిష్యులలో ఒకడు.  కాశీరాజు దేవదాసు ధన్వంతరి (అంటే "ధన్వంతరి" అన్న బిరుదు కలిగిన కాశీరాజు "దేవదాసు") ఇతడు శుశ్రుతునికి ఆయుర్వేదం, శస్త్ర చికిత్స నేర్పాడు. ఇతడు పురాణాలలో చెప్పబడిన ధన్వంతరి అవతారమన్న విశ్వాసం ఉంది.  విక్రమాదిత్యుని ఆస్థానంలో "నవరత్నాలు"గా ప్రసిద్ధులైన పండితప్రతిభామూర్తులలో ఒకడు. ఇతడే "ధన్వంతరి నిఘంటువు" అనే వైద్య పరిభాషిక పదకోశ గ్రంధాన్ని రచించాడని ఒక అభిప్రాయం కూడా వుంది.  పూర్వకాలంలో గొప్ప గొప్ప ఆయుర్వేద వైద్యులను "ధన్వంతరి" అనే బిరుదుతో సత్కరించేవారు. ధన్వన్తరి శబ్దానికి "ధనుఃశల్యం, తస్య అంతం పారం ఇయర్తి, గచ్ఛతీతి, ధన్వన్తరిః" అని వ్యుత్పత్తి  చెప్పబడింది. మనస్సు మరియు శరీరానికి బాధను కలిగించే శల్యములను అనగా దోషాలు, రోగాలు, శరీరంలోపల వికృతులు, అఘాతాలు, వ్రణాలు మొదలైన వాటిని నివారించే వానిగా చెప్పవచ్చును. పురాతనకాలం నుంచి భారతదేశంలో శస్త్ర చికిత్సా కుశలులైన వారికి "ధాన్వన్తరీయులు" అని వ్యవహరించడం వాడుకలో ఉన్నది.భాగవతం అష్టమ స్కంధంలో క్షీరసాగర మధనం సమయాన ముందుగా హాలాహలం ఉద్భవించింది. దానిని మహాదేవుడు హరించాడు. కామధేనువు, ఉచ్ఛైశ్రవం, ఐరావతం, పారిజాతం, అప్సరసలు అవతరించారు. లక్ష్మీదేవి  అవతరించి విష్ణువును చేరింది. తరువాత ధన్వంతరి అవతరించాడు. 
"అప్పుడు సాగర గర్భంనుండి ఒక పురుషుడు, పీనాయుత బాహు దండాలను, కంబుకంఠాన్ని, పద్మారుణ లోచనాలను, విశాల వక్షఃప్రదేశాన్ని, సుస్నిగ్ధ కేశజాలాన్ని, నీల గాత్ర తేజాన్ని కలిగి, పీతాంబరం కట్టి, మణికుండలాలు ధరించి, పుష్పమాలా సమలంకృతుడై, హస్తతలాన అమృత కలశాన్ని దాల్చినవాడు ఆవిర్భవించాడు. అతని విష్ణుదేవుని అంశాంశ వలన పుట్టినవాడని, యజ్ఞభాగ భోజనుడు, ఆయుర్వేదజ్ఞుడు, మహనీయుడని బ్రహ్మాదులు గ్రహించి అతనికి "ధన్వంతరి" అని పేరు పెట్టినారు.

లక్ష్మీ కటాక్షం సిద్ధి


 ఈరోజు అక్షయతృతియ చాలామంది బంగారం కొనుక్కొని దేవుని దగ్గర పెట్టి పూజ చేస్తారు. ఈరోజు బంగారం కొంటే మంచిది అంటారు. ముందుగా అందరకు ధనతేరాస్ శుభాకాంక్షలు. 
సాదారణంగా ప్రతిఒక్కరు కోరుకునేది మహా లక్ష్మి దేవి కరుణనే కోరుకుంటారు.  అలాంటి దేవి యొక్క కరుణ కొందరికి చాలా ఎక్కువగాను మరి కొందరికి ఆమె కరుణ తక్కువగాను వుంటుంది .  మరికొందరికి ఆమె కరుణ దొరికనట్టే దొరికి చేజారిపోతుంది అసలు ఎందుకు అలా జరుగుతుంది. దానికి కారణం ఏమిటి?  ఆమె కరుణ ఎలా వుంటుంది? ఆమె యొక్క చల్లని చూపులు మనకు దొరకాలి అంటే ఎలా వుండాలి ?  అనే ప్రశ్నలు మనలో కలుగుతు వుంటాయి. మొట్ట మొదట శ్రీ మహాలక్ష్మి దేవి చూపులు ఎలా వుంటాయి అంటే మంచి వారిపైన పరమ కరుణ కలిగి వుంటుంది.  అదే దుర్మార్గుల పట్ల పరమ కౄరముగా వుంటాయి.  నిర్భాగ్యుల పట్ల ఎంతో ఉదార దృష్టి కలిగివుంటుంది. 

సంపద అంటే అనేక రకాలుగా వుంటుంది . చీకటి నుంచి వెలుగులోకి ప్రయాణించడమే జ్ఞానం , అదే సంపద, జ్ఞానము, సంపద బిన్నమైనవి కావు. ఒకటి వుంటే రెండోది ఉన్నట్టే. ఇతరులను వంచించినచో, అవినీతి మార్గాలలోనో ఐశ్వర్యాన్ని సంపాదిస్తేచాలను కుంటారు చాలామంది. అలాంటివారిని లక్ష్మి వరించినట్టు కనిపించినా అది చంచలం . దయా, సేవాబావం, శ్రమ, వినయం, వివేకం ఉన్నచోట లక్ష్మి స్థిరంగా ఉంటుంది. 
లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఇదే  అసలు రహస్యం. 


ధిమిధిమి ధింధిమి ధింధిమి ధింధిమి! దుందుభినాదసుపార్ణమయే!!
ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ! శంఖ నినాద సువాద్యనుతే!1
వేదపురాణేతిహాససుపూజిత! వైదిక మార్గ ప్రదర్శయుతే!!

జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి రూపేణ పాలయమాం!!
లక్ష్మీదేవి అష్టరూపాలలో కనిపిస్తుంది అవి ఆదిలక్ష్మీ, దైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి విద్యాలక్ష్మి, ధనలక్ష్మి దేవిలా ఉంటుందని మనకు తెలుసు. వీటిలో `విద్యాలక్ష్మి' అంటే, జ్ఞానం వివేకం వంటి సద్గుణ సంపద అని కుడా అర్ధం చేసుకోవాలి. అటువంటి లక్ష్మితత్వాన్ని అందరు సంపాదించాలి.మంచి మనసే లక్ష్మిదేవికి కచ్చితమైన సేఫ్టీ లాకరుగా చెప్పవచ్చు .
లక్ష్మి దేవి ఎక్కడ వుంటుంది అని నారదుడు శ్రీ మహావిష్ణువుని అడుగగా  అప్పుడు 
శ్రీ మహావిష్ణువు లక్ష్మి దేవి ఎక్కడెక్కడ ఉంటుందో చెప్పారు అవి ఏమిటంటే 
"అఖిల విశ్వం సమస్త ప్రాణులు నా అదీనంలో ఉంటే , నేను నా భక్తుల అదీనంలో ఉంటాను . మీరు నా భక్తులు, కనుక మీకు పరమైస్వర్యాన్ని అందించే ఆచలలక్ష్మిని ప్రసాదిస్తాను. అయితే దానికి ముందుగా నేను చెప్పబోయే మాటలు వినండి - అంటూ లక్ష్మి ఎవరెవరి వద్ద ఉంటుందో, ఎవరివద్దవుండదో , వివరించాడు.
 లక్ష్మిని కోరుకునే వారందరూ తప్పకుండా దృష్టిలో ఉంచుకోవలసిన విషయాలివి.
లక్ష్మి దేవి ఎక్కడ ఎక్కడ వుండదు అంటే:
  1. భగవద్భాక్తులపై కోపగించే వారి గృహంలో లక్ష్మిదేవే కాదు.శ్రీ హరి కుడా ఉండదు. 
  2. శంఖద్వని వినిపించని చోటా. 
  3. తులసిని పూజించని చోట.
  4. శంఖరుని అర్చించని చోట.
  5. బ్రహ్మవేత్తలకు , అతిధులకు భోజన సత్కారాలు జరగని చోట.  లక్ష్మి దేవి నివసించదు. 
  6. ఇల్లు కళ కళ లాడుతూ ఉండని  చోట.
  7. ఇల్లాలు ఎల్లవేళలా కంటతడి పెట్టిన చోట.
  8. విష్ణువును ఆరాధించకుండ.
  9. ఏకాదశి మరియు జన్మాష్టమి రోజులలో భోజనం చేసేవారి ఇంట లక్ష్మి నివసించదు.
  10. హృదయములో పవిత్రత లోపించిన, ఇతరులను హింసింస్తున్న. ఉత్తములను నిందిస్తున్న లక్ష్మి ఆ ఇంటిలోనుంచి పారిపోతుంది. 
  11. అనవసరం గా గడ్డిపరకలను తెంచిన.
  12. చెట్లను కులగొట్టినా లక్ష్మి కటాక్షం లోపిస్తుంది. 
  13. నిరాసావాధులను, సుర్యోదయ సమయంలో భోజనం చేసే వాని, తడి పాదాలతో నిద్రపోయేవారిని , వివస్త్రులై నిద్రపోయేవారిని, తలక్రిందులుగా మాట్లాడేవారిని, తమ తలకు రాసుకున్న నూనెను ఇతరులకు అంటించే వారిని కుడా లక్ష్మి వరించదు.
  14. పసుపక్షులను హింసించే చోట వుందనే వుండదు. 
  15. సంపద మీద దురాస ఎక్కువగా కలవారి ఇంట వుండదు. 

మరి లక్ష్మి దేవి ఎక్కడ ఎక్కడ వుంటుంది అంటే :



శ్రీహరి దివ్యచరిత్ర, గుణగానం జరిగే చోట, సాలగ్రామం, తులసి, శంఖద్వని ఉన్నచోట , లక్ష్మి విరజిల్లుతుంది.

ఇలా శ్రీ హరి లక్ష్మీకటాక్షం ఎలా కలుగుతుందో, ఎలాకలగాదో చెప్పారు. అన్నిటి కంటే సంతృప్తి కి మించిన ధనం  ఎక్కువలేదు. దానితోనే సంతోషము కలుగుతుంది.  అప్పుడు ఎల్లవేళ  శ్రీ మహా లక్ష్మి కరుణ మనతోనే వుంటుంది.
సంపద మన ఆదీనం లో ఉండాలి కాని, మనం సంపద ఆదీనం లో ఉండకూడదు . ఏకాస్త గర్వించిన, అహంకరము చూపిన  ఐశ్వర్యం జారిపోతుంది. సద్వినియోగమే సంపద పరమార్ధము. అది విస్మరించినా లక్ష్మి వీడిపోతుంది. ఇదే శ్రీ మహాలక్ష్మి కటాక్ష రహస్యం.  ఈరోజు ధనత్రయోదశి.  అందరకు ఇష్టమైన ధనలక్ష్మి కరుణ,  అనుగ్రహము కలగాలని కోరుకుంటున్నాను. 

గురువారం, అక్టోబర్ 31, 2013

ఒక్కొక్క బిందువు కలిస్తేనే పెద్ద మహా సముద్రం

గురువారం, అక్టోబర్ 31, 2013

'బూంద్‌ బూంద్‌ బనేగా సముందర్‌, పైసా పైసా పైదాకరేగా' అనేది హిందీ సామెతలో ఒకటి తెలుగులో ఒక్కొక్క బిందువు కలిస్తేనే పెద్ద మహా సముద్రం తయారు అవుతుంది అని .  ఒక్క రూపాయి అంటుంది నన్ను వంద వరకు పెంచు తరువాత నిన్ను నేను పెంచుతాను అని ఇవన్నీ మీకు తెలిసినవే,  ఇవన్ని పోడుపుగురించి చెప్పటానికే పుట్టినవి. కాలు వంకర పోకుండానే, కంటిచూపు తగ్గిపోకుండానే వీలైనంత కూడబెట్టు అనేదే మన పెద్దలు మనకి వుగ్గుపాలతో నేర్పే మొట్టమొదటి ప్రాథమిక ఆర్థిక సూత్రం. 'సేవ్‌ ఫర్‌ ఎ రెయినీ డే, టు మేక్‌ ఇట్‌ ఆల్‌సో ఎ సన్ని డే' అన్న ఇంగ్లిష్‌ సామెతలో కూడా, పొదుపు యొక్క  ప్రాముఖ్యత తెలుస్తోంది .  ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే  ఈరోజు ప్రపంచ పొదుపు దినోత్సవంగా జరుపుకుంటున్నాం కదా అందుకే మరి .  ఈ పొదుపు దినోత్సవం గురించి చెప్పాలనుకుంటున్నాను.  1924, అక్టోబర్‌ 31వ తేదీన, ప్రప్రథమ ‘ఇంటర్నేషల్‌ థ్రిఫ్ట్‌ కాంగ్రెస్‌’ సమావేశం ముగి సిన వెంటనే, ప్రొఫెసర్‌ ఫిలిప్పో రవిజ్జా ఆరోజుని, ‘వరల్‌‌డ థ్రిఫ్ట్‌ డే’గా సాధికారంగా ప్రకటించారు. సామాన్య పౌరులకి ‘పొదుపు’లోని ముఖ్యత్వాన్ని వివరించడం ఈ ‘వరల్‌‌డ థ్రిఫ్ట్‌ డే’ ముఖ్యోద్దేశం. అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా వున్న సేవింగ్స్‌ బ్యాంక్స్‌ అన్నీ ‘వరల్డ్ సేవింగ్స్‌ డే’ని వైభవోపేతంగా జరుపుకోవడం ఆరంభించాయి. ఇప్పుడు ప్రపంచమంతటా ‘ఇంటర్నేషనల్‌ సేవింగ్స్‌ బ్యాంక్స్‌ ఇన్‌స్టిట్యూట్‌’ కి చెందిన 940 సేవింగ్స్‌ బ్యాంక్స్‌ క్రియాశీల కంగా,నిర్మాణాత్మకంగా పని చేస్తున్నాయి.ఏటేటా, అక్టోబర్‌ 31వ తేదీనాడు, ‘వరల్‌‌డ సే వింగ్స్‌ డే’ / ‘వరల్డ్‌ థ్రిఫ్ట్‌ డే’ జరుపుకునే సందర్భంలో, ప్రపంచమంతటా కొన్ని రిటేల్‌ బ్యాంక్స్‌ వారం రోజుల పాటు, వైభవంగా వు త్సవాలు నిర్వహిస్తూ, ‘పొదుపు’ ప్రాముఖ్య త విషయంలో, ప్రజలలో చైతన్య స్ఫూర్తి కలిగిం చడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అలా, చిన్న చిన్న మొత్తాలతో ‘పొదుపు’ చేసుకోవడ మనే అలవాటుని ప్రజలలో కలిగించాలనే సదాశయం ఈనాటికి ఒక మహోద్యమంగా రూపొంది, ప్రపంచ వ్యాప్తమైపోయింది.  అయితే పొదుపు అనేది అన్ని విషయాలకు వర్తిస్తుంది. విధ్యుత్ ను పోదుపు చేయటం, నీటిని, ఆహారాన్ని,  అనావసరంగా వృదా చేయకుండా పొదుపుగా వాడుకోవాలి. చిన్న పిల్లలకు  పొదుపు యొక్క విశిష్టత చిన్న తనము నుండే అలవారచాలి . ప్రతిమనిషి తను సంపాదించిన దానిలో పూర్తిగా 20% పొదుపు చేసుకోవాలిట.  మరి మీరుకూడా పోడుపుచేయటం మొదలుపెట్టండి మరి .  అందరికి ప్రపంచ పొదుపు దినోత్సవము సందర్భముగా శుభాకాంక్షలు

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)