ఈ రోజు హిందువులకు మరియు జైనులకు ప్రత్యకమైన రోజు, అదే అక్షయ తృతీయ . వైశాఖ శుద్ధ తదియనే అక్షయ తృతీయ గా పిలుస్తారు. సంస్కృతం లో ' అక్షయ ' అనగా క్షయం కానిది , తరిగి పోనిది అని అర్థం. హిందూ పంచాంగం ప్రకారం అక్షయ తృతీయ రోజంతా అత్యంత శుభ కరమైన ముహూర్త కాలంగా భావిస్తారు. అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే సంపద అక్షయమవుతుందని భారతీయుల నమ్మకము. ఈ రోజు నాడే రైతులు విత్తనాలుకు పూజ చేసి నాటుతారు. ఎందుకంటే విత్తులు మంచిగా వ్యవసాయం వృద్ది చెందుతుంది. ఇంకా "అక్షయ తృతీయ" నాడే మహావిష్ణువు ఆరో అవతారమైన పరుశురాముడు జన్మించాడని పురాణాలు చెబుతున్నారు.భగీరధుడు తపస్సు ఫలితంగా గంగానది భూమి తరలి వచ్చిన రోజు. యజ్ఞ యాగాదులు చేయటానికి మంచి కాలం. శ్రీ కృష్ణులవారి బాల్య స్నేహితుడు కటిక దరిద్రుడైన సుదాముడు కృష్ణుని దగ్గరకు వెళ్లి అటుకులు సమర్పించి అత్యంత దనవంతుడైనాడు. ధర్మరాజు సూర్యనారాయణ మూర్తి నుండి అక్షయ పాత్రను పొందినాడు. వ్యాసుడు మహాభారతాన్ని చెప్తున్నప్పుడు విఘ్ననాయకుడు అయిన గణపతి భారతాన్ని రాయటం మొదలు పెట్టినరోజు. శంకరాచార్యులు వారు కనకదరా స్తోత్రాన్ని పాడితే కనకం వర్షంలాగ పడిన రోజు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు నిండు సభలో ద్రౌపది కి వస్త్రాపహరణ చేసి అవమానించదలిచారు , అప్పుడు ఆమెకి శ్రీ కృష్ణులు వస్త్రాలు ఇచ్చి ద్రౌపదిని కాపాడిన రోజు. అక్షయ తృతీయ నాడు శ్రీ నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజేనని పురాణాలు చెబుతున్నాయి. కుబేరుడు, దేవతల కోశాధికారి, ధనానికి దేవత అనీ. లక్ష్మీ దేవి మరియు కుబేరుడు అక్షయ్ తృతీయ నాడు పూజిస్తే, సంపద కలగ చేస్తుంది. అంతే కాదు ఈరోజు నాడే అన్నపూర్ణాదేవి జన్మించినది. ఈరోజు కి ఇన్ని విశేషాలు వున్నాయి కాబట్టే అందుకే ఈ పర్వదినాన పుష్పమో, ఫలమో భగవంతుడికి సమర్పించినా, దైవనామస్మరణ చేసినా, చివరికి నమస్కారం చేసిన సంపద, పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి.ఈ క్రమంలో అక్షయ తృతీయ నాడు బంగారం కొనడంతో పాటు అనేక శుభకార్యాలను చేపట్టవచ్చును. ఇందులో పిల్లలను పాఠశాలలో చేర్చడం, పుస్తకావిష్కరణ, పుణ్యస్థలాలను సందర్శించడం వంటి మంచి కార్యాలను చేయవచ్చునని పురోహితులు సూచిస్తున్నారు.
పద్మం వంటి తన పదాన్ని,పద్మంవంటి చేతితో, పద్మంవంటి నోటిలో చోప్పిస్తూ మర్రి ఆకుదొన్నెలో శయనించియున్న బాలముకుందునికి మనసా నమస్కరిస్తున్నాను.
మర్రి ఆకు మీద శయినించిన భగవానుడు శ్రీ కృష్ణులు. పద్మము వంటి పదాన్ని పద్మం వంటి చేతితో నోటిలో పెట్టుకొని మధువును చప్పరిస్తూ కనిపిస్తారు. ఈ వృత్తాంతం మనకు మార్కండేయ మహర్షి చరిత్ర లో కనిపిస్తుంది. మార్కండేయుడు 6 మన్వంతరములు మహా విష్ణువుకోరకు ఘోరమైన తపస్సు చేస్తాడు. మార్కండేయుని తపస్సు తన ఉనికికే సమస్యగా మారుతుందనుకొని మహేంద్రుడు అప్సరసలును పంపి తపస్సు భగ్నం చెయ్యటానికి ప్రయత్నించాడు. కానీ ప్రయత్నాలన్నీ వృదాయ్యాయి. మార్కండేయుడు ఈ మాత్రం చలించకుండా తపస్సు చేస్తూనే వున్నాడు. మహావిష్ణువు ప్రత్యక్షం అయ్యి మార్కండేయ నీ తపస్సుకు కారణం ఏమిటి. నీకు ఏమి వరం కావాలి అని ప్రశ్నించాడు మహా విష్ణువు. అప్పుడు మార్కండేయుడు దేవా నీ మాయని చూడాలని వుంది అన్నాడు. కొన్నాళ్ళకు మహా ప్రళయం వచ్చింది. ప్రచండమైన గాలి, వర్షం. నదులు, సముద్రాలు పొంగి పొర్లుతున్నాయి. భూమితో పాటు సమస్తం నీటిలో మునిగిపోయాయి. మార్కండేయుడు విష్ణుమాయవల్ల నీటిలో తేలియాడుతూ తిరుగుతుండగా ఒకప్రదేశంలో మర్రి ఆకుమీద శయనించి వున్న చిన్న శిశువు నోటిలో కాలివేలు పెట్టుకొని చీకుతూ కనిపించాడు. అతనే వటపత్ర శాయి.
మహా విష్ణువు ఆదేశంతో మర్రి ఆకు పై వున్నా వటపత్ర శాయి కడుపులోకి వెళ్లి చూస్తాడు. నీట మునిగిన సమస్త భూమి, ప్రాణి కోటి కానిపిస్తుంది. మహావిష్ణువు మరలా ఇంకొకచోట సమస్త ప్రాణులను సృస్తిస్తాడని మార్కండేయుడు తెలుసుకుంటాడు. ఈ విధంగా మహా విష్ణువు మాయను తెలుసుకున్నాడు మార్కండేయుడు.
మొట్టమొదటి వితంతు వివాహం జరిపించిన వ్యక్తి, మొట్టమొదటి సహవిద్యా పాఠశాలను ప్రారంభించిన వారు , తెలుగులో మొదటి స్వీయ చరిత్ర ఆయనదే, తెలుగులో తొలి నవల రాసింది ఆయనే, తెలుగులో తొలి ప్రహసనం రాసింది అతనే , ఆయనకున్న ఇతర విశిష్టతలు పద్య కావ్యాలు, నాటకాలు, నవలలు, ప్రహసనాలు, కధలు, వ్యాసాలు,చరిత్రలు ఇంకా ఎన్నో రచనలు రాసారు . చాలా పత్రికలు కూడా నడిపారు. అతనెవరో తెలుసా కందుకూరి వీరేశలింగం పంతులు గారు . కందుకూరివారు ఎంతోమందికి ఆదర్సవంతముగా నిలిచారు అనటంలో సందేహం లేదంటే నమ్మండి . గొప్ప సంఘ సంస్కర్త, తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు. సంఘ సంస్కరణకు, సామాజిక దురాచారాల నిర్మూలనకు నిరుపమానమైన కృషి చేసిన మహానుభావుడు ఆయన. సాహితీ వ్యాసంగంలోనూ అంతటి కృషి చేసిన కందుకూరి బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు.
వీరేశలింగం పంతులు 1848ఏప్రిల్ 16న రాజమండ్రిలో పున్నమ్మ, సుబ్బారాయుడు దంపతులకు జన్మించారు. వీరి పూర్వీకులు ఇప్పటి ప్రకాశం జిల్లాలోనికందుకూరు గ్రామం నుండి రాజమండ్రికి వలస వెళ్ళడం వలన వారికి ఈ ఇంటి పేరు స్థిరపడిపోయింది. వీరేశలింగంకు నాలుగేళ్ళ వయసులో తండ్రి చనిపోయారు. పెదతండ్రి, నాయనమ్మల పెంపకంలో అల్లారుముద్దుగా పెరిగారు. ఐదో యేట బడిలో చేరి, బాలరామాయణం,ఆంధ్ర నామ సంగ్రహం,అమరం,రుక్మిణీ కళ్యాణం,సుమతీ శతకం,కృష్ణ శతకంమొదలైనవి నేర్చుకున్నారు. పన్నెండో యేట రాజమండ్రి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు చదువులో చేరారు. చిన్నప్పటినుండీ, అన్ని తరగతులలోనూ, ప్రథమ శ్రేణిలోనే ఉండేవారు. తన పదమూడో యేట బాపమ్మ అనే ఎనిమిదేళ్ళ అమ్మాయితో బాల్యవివాహమయింది. పెరిగి పెద్దయ్యాక వీరేశలింగం ఇటువంటి దురాచారాల నిర్మూలనకే కృషి చేసారు.
ఒక వ్యక్తిగా, సంఘసంస్కర్తగా, రచయితగా వీరేశలింగంకు అనేక విశిష్టతలు ఉన్నాయి. అనేక విషయాలలో ఆంధ్రులకు ఆయన ఆద్యుడు, ఆరాధ్యుడు. ఆధునికాంధ్ర సమాజ పితామహుడిగా కీర్తి గడించిన వ్యక్తి కందుకూరి.
ఆంధ్ర దేశంలో బ్రహ్మ సమాజం స్థాపించారు. యువజన సంఘాల స్థాపన కూడా వీరేశలింగంతోనే మొదలయింది. సమాజ సేవ కొరకు హితకారిణి అనే ధర్మ సంస్థను స్థాపించి, తన యావదాస్తిని దానికి ఇచ్చేసారు. 25 సంవత్సరాల పాటు రాజమండ్రిలో తెలుగు పండితుడిగా పనిచేసి, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితుడిగా ఐదేళ్ళు పని చేసారు. తాను నమ్మిన సత్యాన్ని, సిద్దాంతాన్ని తు.చ. తప్పక్కుండా పాటించిన వ్యక్తి ఆయన.యుగకర్త గా ప్రసిద్ధి పొందిన ఆయనకు గద్య తిక్కన అనే బిరుదు ఉంది. ఆంధ్ర సమాజాన్ని సంస్కరణాల బాట పట్టించిన సంస్కర్త, వీరేశలింగం 1919 మే 27న మరణించారు.