త్యాగరాజు కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకడు. త్యాగయ్య, త్యాగబ్రహ్మ అనే పేర్లతో కూడా ప్రసిద్ధుడు. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు. ఆయన కీర్తనలు శ్రీరాముని పై ఆయనకుగల విశేష భక్తిని, వేదాలపై, ఉపనిషత్తులపై ఆయనకున్న జ్ఞానాన్ని తెలియపరుస్తాయి. ఉపనయనం తరువాత తండ్రిగారి బోధలు, 18వ ఏట రామకృష్ణానంద పరబ్రహ్మం ఉపదేశం చేసిన రామ షడక్షరీ మంత్ర ప్రభావం, తల్లి అలవర్చిన భక్తి సంగీతాలు బాల్యంలోనే బీజాంకురాలై త్యాగ రాజస్వామి వారిలో మూర్తీభవించాయి. ఈ రోజు త్యాగరాజ వారి 248 వ జయంతి సందర్బంగా
నాద బ్రహ్మ త్యాగరాజు రచించిన ఎందరో మహానుభావులు అందరికీ వందనములు, మరియు తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర పాదపద్మాలను చేరుకోవాలన్న కోరికతో దర్శన సమయం కాని వేళ త్యాగరాజ స్వామి స్వామి దగ్గర నిలుచొని పాడిన పాట త్యాగరాజు @ తెరతీయగరాదా … బహుళ జనాదరణ పొందిన కీర్తన. త్యాగయ్య దాదాపు 800 కీర్తనలను రచించాడు. వీటిలో చాలావరకు ఆయన మాతృభాష ఐనటువంటి తెలుగులో రచించినవే. కొన్ని సంస్కృతంలో రచించబడినవి. కానీ ఈ కీర్తనలు మాత్రం ఆంధ్రదేశంలోకన్ననూ కర్ణాటక సంగీతం బాగా ప్రాచుర్యంలో ఉన్న తమిళనాట బాగా ప్రాచుర్యం పొందాయి. సంస్కృతంలో రచించబడిన జగదానందకారక అనే కీర్తన శ్రీరామునికున్న 108 పేర్లను ప్రస్తావిస్తుంది. 'ప్రహ్లాద భక్తి విజయం', కృష్ణ లీలలే ప్రధాన ఇతివృత్తం గా తీసుకొని ’నౌకా చరితం ‘’ తెలుగు లోనే నాట్యరూపకాలను కూడా రచించాడు.
పల్లవి:
ఓడను జరిపే ముచ్చట
గనరే వనితలారా నేడూ
అనుపల్లవి :
ఆడవారు యమున కాడ కృష్ణుని కూడి
ఆడుచు పాడుచునందరూజూడగ
చరణములు :
కొందరు హరికీర్తనములు పాడ
కొందరానందమున ముద్దులాడ
కొందరు యమునా దేవిని వేడ
కొందరి ముత్యపు సరులసియాడ
కొందరు తడబడ పాలిండ్లు కదల
కొందరి బంగరు వల్వలు వదల
కొందరి కుతిలాలకములు మెదల
కొందరు పల్కుచు కృష్ణుని కథల
కొందరు త్యాగరాజ సఖుడేయనగ
కొందరి కస్తూరి బొట్తు కరగగ
కొందరి కొప్పుల విరులు జరగ
కొందరి కంకణములు ఘల్లనగ
ఓడను జరిపే ముచ్చట
గనరే వనితలారా నేడూ
అనుపల్లవి :
ఆడవారు యమున కాడ కృష్ణుని కూడి
ఆడుచు పాడుచునందరూజూడగ
చరణములు :
కొందరు హరికీర్తనములు పాడ
కొందరానందమున ముద్దులాడ
కొందరు యమునా దేవిని వేడ
కొందరి ముత్యపు సరులసియాడ
కొందరు తడబడ పాలిండ్లు కదల
కొందరి బంగరు వల్వలు వదల
కొందరి కుతిలాలకములు మెదల
కొందరు పల్కుచు కృష్ణుని కథల
కొందరు త్యాగరాజ సఖుడేయనగ
కొందరి కస్తూరి బొట్తు కరగగ
కొందరి కొప్పుల విరులు జరగ
కొందరి కంకణములు ఘల్లనగ