Blogger Widgets

మంగళవారం, అక్టోబర్ 06, 2015

IPC ఇండియన్ పీనల్ కోడ్

మంగళవారం, అక్టోబర్ 06, 2015

మనం చాలా సార్లు  I P C  section ప్రకారం అని ఏదో  కొన్ని సందర్బాలలో మూవీస్, మరియు టీవీలలో, వార్తలలోను వినే వుంటాము.   అసలు I P C  section అంటే ఏమిటి ? దాని చరిత్ర ఏమిటి ?
భారతీయ శిక్షాస్మృతి (Indian Penal Code: IPC) భారత ప్రభుత్వ ధర్మశాస్త్రం. భారతదేశంలో నేరాలు చేసిన వారికి దీనిని అనుసరించే శిక్ష వేస్తారు.
ఇండియన్ పీనల్ కోడ్ వెనుక  చరిత్ర:-
ఇండియన్ పీనల్ కోడ్ (భారతీయ శిక్షాస్మృతి) 1860 - 6 అక్టోబర్ 1860 నాడు (1860 లో చేసిన 45 వ చట్టం) మొదలైంది.  ఇండియన్ పీనల్ కోడ్ జమ్ము కాశ్మీర్ లో కూడా అమలు లో ఉంది. కానీ, కానీ ఈ  రాష్ట్రంలో ఇండియన్ పీనల్ కోడ్ అనరు. రన్‌బీర్ పీనల్ కోడ్ (ఆర్.పి.సి) అని అంటారు .  ఇండియన్ పీనల్ కోడ్ మొదలు   1860 నాటి ఆంగ్లేయుల పాలనలో (బ్రిటిష్ ఇండియా) ఉన్నాయి. 1860 నాటి బ్రిటిష్ ఇండియా చేసిన చట్టం ప్రకారము  ఇండియన్ పీనల్ కోడ్ మనకు అమలులోకి వచ్చింది. మొట్టమొదటి ఇండియన్ పీనల్ కోడ్ డాక్యుమెంట్ ను  1860 లో, మొదటి లా కమిషన్ ఆధ్వర్యములో జరిగింది.  మొదటి లా కమిషన్ ఛైర్మన్ లార్డ్ మెకాలే . ఇతనే మన  భారత దేశంలో ఆంగ్ల విద్యాబోధనకు పునాది వేసిన వాడు. మొదటి ఇండియన్ పీనల్ కోడ్ 1862 సంవత్సరంలో, అమలులోకి వచ్చింది. నాటినుంచి ప్రపంచంలోను, భారతదేశంలోను,  సమాజములోను, విద్య, వైజ్ఞానిక, సముద్రాలలో, సముద్ర గర్భాలలో, రోదసీ లోను, ప్రయాణ వాహనాలలోను,న్యాయపరంగా, వైద్యరంగంలోను, ఉద్యోగ రంగంలోను, బాంక్ లావాదేవీలు , సెల్ ఫోన్లు, సైబర్ నేరాలు, కంప్యూటర్ రంగాలలో జరిగిన సమస్తమైన మార్పులను, మన భారతీయ శిక్షాస్మృతి అనేకమైన మార్పులు , చేర్పులు అవుతునేవున్నాయి ,  కొత్తగా అనేక అనేక మార్పులు  పొందింది. గృహ హింస సెక్షన్ 498-ఎ  దానికి ఒక ఉదాహరణ. మన భారతీయ శిక్షాస్మృతి లో 511 సెక్షన్లు ఉన్నాయి. వరకట్నం ఛట్టాలు మరో ఉదాహరణ. వరకట్న సమస్య, యూరప్, అమెరికా దేశాలలో లేదు కాబట్టి , వరకట్న చట్టాలు, శిక్షలు వారి శిక్షా స్మృతి లో లేవు.  లార్డ్ మెకాలే, నాటి ఫ్రెంచి పీనల్ కోడ్ ను , లివింగ్‌స్టోన్స్ కోడ్ ఆఫ్ లూసియానా అనే రెండు ప్రామాణిక గ్రంధాలను ఆదర్శంగా తీసుకుని, మన ఇండియన్ పీనల్ కోడ్ 'డాక్యుమెంట్ ' ని తయారుచేసాడు.  భారతీయుల ప్రామాణిక గ్రంధాలైన మనుస్మృతి ని, యాజ్ఞవల్క్య స్మృతి ని , నాటి వైదిక పండితుల సలహా, సహాయం కూడా తీసుకున్నాడు. శిక్షల విషయంలో, ఆనాటి పెద్దలు, పండితులు, రాజులు అభిప్రాయాలను కూడా లెక్కలోకి తీసుకున్నాడు.  లార్డ్ మెకాలే మహా మేధావి అయినా, తన అభిప్రాయాలకంటే, నాటి భారత దేశమత, సాంఘిక , సామాజిక వ్యవస్థలకు, ఆఛార వ్యవహారాలకు విలువను  ఇచ్చి, వారి అభిప్రాయాలను గౌరవించి, తన మేధస్స్తు తో 'ఇండియన్ పీనల్ కోడ్' డాక్యుమెంట్ ను  తయారు చేశాడు. 1860 నాటి ఇండియన్ పీనల్ కోడ్ చిత్తుప్రతి, మూల రూపం,  నేటికీ చెక్కు చెదరలేదు.  దీనిమీద కొన్ని విమర్శలు ఉన్నప్పటీకీ, ఈనాటికీ, న్యాయశాస్త్రంలో, దీనికి తిరుగు లేదు.
పాకిస్తాన్ స్వాతంత్ర్యం పొందిన తర్వాత, ఇండియన్ పీనల్ కోడ్ ని యధాతధంగా పాకిస్తాన్ తన దేశంలో అమలు చేసింది.  దాని పేరు పాకిస్తాన్ పీనల్ కోడ్ (పి.పి.సి).  బంగ్లాదేశ్ కూడా బంగ్లాదేస్ పీనల్ కోడ్ పేరుతో అమలు చేసింది. బ్రిటిష్ వలస దేశాలైన, మియన్మార్ (నాటి బర్మా), శ్రీలంక (నాటి సిలోన్, మలేసియా, సింగపూర్, బ్రూనీ దేశాలు కూడా మన ఇండియన్ పీనల్ కోడ్ ని యధాతధంగా అమలు చేస్తున్నాయి.
లార్డ్ మెకాలే తయారుచేసిన ' డాక్యుమెంట్ ' ని,  నాటి ఛీఫ్ జస్టిస్ సర్ బార్నెస్ పీకాక్, కలకత్తా సుప్రీమ్ కోర్టు న్యాయాధిపతి అయిన ఇతను నాటి లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడుగా కూడావున్నారు. ఇతను ఈ డాక్యుమెంట్ ని  సునిశితంగా, సుదీర్ఘంగా, పరిశీలించి, పరీక్షించాడు. వారి పరిశీలన తర్వాత ఇండియన్ పీనల్ కోడ్ 6 అక్టోబర్ 1860 నాడు చట్టసభ ఆమోదం పొందింది. దురదృష్టవశాత్తు, ఇండియన్ పీనల్ కోడ్ సృష్టికర్త లార్డ్ మెకాలే తన కృషి, చట్టమై , అమలు జరగటం ఛూడలేకపోయారు . కారణం మెకాలే 28 డిసెంబరు 1859 న, తన 59వ ఏట, మరణింఛాడు.  ఇండియన్ పీనల్ కోడ్ 1837 లోనే నాటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇన్ - కౌన్సిల్ కి నివేదించినా, 1860 సంవత్సరం వరకూ అది వెలుగు చూడలేదు. 1830 కి ముందు, భారత దేశంలో, 'ది ఇంగ్లీష్ క్రిమినల్ లా', అనేక చట్ట సవరణలతో, నాటి ప్రెసిడెన్సీ టౌన్ లలో (బొంబాయి, కలకత్తా, మద్రాసు అమలు జరిగేది.
ఈ ఇండియన్ పీనల్ కోడ్ ప్రపంచము మొత్తం  కుగ్రామంగా మారినా, జీవితం వేగవంతమైనా, సమాజాలు మారుతున్నా, ప్రపంచమే మారిపోతున్నా కూడా, 150 సంవత్సరాల నుంచి చెక్కు చెదరకుండా, ఉన్నది అంటే, మెకాలే దూరదృష్టి. అతని మేధస్సు అనితర సాధ్యం. మరో పది దేశాలకు కూడా తన గ్రంథం ఆయా దేశాలకు వేదం, బైబిల్, ఖురాను,జెండ్ అవెస్తా అయ్యింది.  ఇది విశేషమే కదా.  ఇండియన్ పీనల్ కోడ్ చరిత్ర వెనకాల చాలా మంచి విషయాలు వున్నాయి కదా. 

శనివారం, అక్టోబర్ 03, 2015

బెర్లిన్ గోడ

శనివారం, అక్టోబర్ 03, 2015

 ఈ రోజు జర్మనీ చరిత్రలో .అసలు ప్రపంచ చరిత్రలోనే మరిచిపోలేని రోజు. జర్మనీని తూర్పు, పశ్చిమ జర్మనీలుగా విడగొడుతూ మధ్యలో నిర్మించిన గోడను కూల్చేసిన సంఘటనకు నేటితో సరిగ్గా 26 సంవత్సరాలు పూర్తైయ్యాయి.  
బెర్లిన్ గోడ జర్మనీ రాజధాని బెర్లిన్ లో ప్రసిద్ధిగాంచిన గోడ. ఇది రెండవ ప్రపంచ యుద్ధం తరువాత తూర్పు మరియు పశ్చిమ జర్మనీలను వేరుచేస్తూ నిర్మించబడింది. దీనిని ఐరన్ కర్టన్ అని కూడా పిలుస్తారు. యుద్ధంలో జర్మనీ ఓడిపోయిన తర్వాత అమెరికా, రష్యాలు దాన్ని రెండు భాగాలు చేశాయి. రష్యా ఆధిపత్యంలో తూర్పు జర్మనీ, అమెరికా ఆధిపత్యంలో పశ్చిమ జర్మనీ ఉండేవి.  తూర్పు జర్మనీనుంచి పశ్చిమ జర్మనీలోకి జనం వలసలు వెళ్ళకుండా కట్టుదిట్టం చేయడం కోసం తూర్పు జర్మనీ కమ్యూనిస్టు పాలకులు సరిహద్దుల్ని మూసివేయ నిర్ణయించి రెండింటికీ అడ్డుగా ఈ గోడ నిర్మాణం ఆగష్టు 13, 1961 ప్రారంభమైనది. 
ఈ చర్య తూర్పు పశ్చిమ జర్మనీలలోని ప్రజల్లో గొప్ప వేదన కలిగించింది. కొంతకాలం గడిచిన తర్వాత తూర్పునుంచి ఆ గోడను దాటడానికి యత్నించిన 136మందిని తూర్పు జర్మనీ భద్రతా దళాలు కాల్చిచంపాయి. వేలమందిని అదుపులోకి తీసుకొని జైలు పాలుజేశాయి. జర్మనీ దేశాలు రెండూ ఏకమైతున్నాయని తీర్మానించిన రోజు నవంబరు 9, 1989, ఒక పండుగ రోజులాగా జరుపుకున్నారు. తరువాత కాలంలో ఈ గోడను నెమ్మదిగా చిన్న చిన్న భాగాలు ప్రజలే తొలగించడం మొదలుపెట్టారు. మిగిలిన భాగాన్ని ప్రభుత్వ యంత్రాంగం తొలగించింది.  ప్రచ్చన్న యుద్ధానంతరము, బెర్లిన్ గోడ కూల్చివేయడం వలన, ఈ నగరము తిరిగి ఒక నగరము ఆయెను. బెర్లిన్ నగర జనాభా సుమారు 35 లక్షలు మంది.
బెర్లిన్ గోడ తొలగింపుతో జర్మని విలీనం అక్టోబర్ 3, 1990 లో పూర్తయింది.

శుక్రవారం, అక్టోబర్ 02, 2015

"జై జవాన్ - జై కిసాన్ - జై భారత్"

శుక్రవారం, అక్టోబర్ 02, 2015

ఈ రోజు గాంధి గారి పుట్టినరోజు అని మాత్రమే కాదు ఈ రోజు న భారత రెండవ ప్రధాని లాల్ బహదుర్ శాస్త్రి గారి పుట్టిన రోజు .   ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొగల్ సరాయ్ గ్రామంలో లాల్ బహదూర్ 1904 అక్టోబర్ 2న శారదా ప్రసాద్, రామ్‌దులారీ దేవీలకు జన్మించాడు. తండ్రి శారదాప్రసాద్ రాయ్ ఒక నిరుపేద. బతకలేక బడిపంతులు అని అనుకుంటున్న ఆ రోజుల్లో ఆయన బడిపంతులు వృత్తిని చేపట్టి అతికష్టంగా తన కుటుంబాన్ని పోషిస్తూ కాలం గడిపేవాడు. ఇద్దరు ఆడపిల్లల తరువాత జన్మించిన లాల్ బహదూర్ ను చూసుకొని ఆ తల్లిదండ్రులెంతో మురిసిపోయారు.  ఈయన నినాదం "జై జవాన్ - జై కిసాన్ - జై భారత్".  శాస్తిగారు మంచి మనసుతో దేశాభివృద్ది కోసం పోరాడిన మహామనీషి, అంతేకాదు గొప్ప స్వాతంత్ర్య సమరయోదుడు,  అస్సలు గర్వంలేకుండా అందరి మనస్శులు గెలిచిన మహనీయుడు లాల్ బహదూర్ శాస్తిగారు. గాంధిగారు ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమంలోను , సత్యాగ్రహము లోను పాల్గొనుటకు ఉత్సాహంగా వుండెవారు . అప్పుడు జైల్లోకూడా స్వాతంత్ర్యము తర్వాత, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ మంత్రివర్గములో గృహ మంత్రిగా పనిచేశాడు.
స్వాతంత్ర భరత దేశానికి నెహ్రు మొదటి ప్రదాని , నెహ్రు తరువాత లాలబహదుర్ శాస్త్రిగారు రెండవ ప్రదాని గా ప్రమాణ స్వీకరము చేసారు.
ఆయన. 1965 యుద్ధంలో పాకిస్తానును కాళ్ళబేరానికి తీసుకువచ్చాడు. తాష్కెంటు లో పాకిస్తానుతో సంధి చర్చలకు వెళ్ళినపుడు 1966 జనవరి 11 న గుండెపోటుతో మరణించాడు. మరణానంతరం ఆయనకు భారతరత్న పురస్కారం లభించింది. 
లాల్ బహదుర్ శాస్త్రి గారి జన్మదినము సందర్బముగా నివాళి అర్పిద్దాం మరి. 

అంతర్జాతీయ సత్యాగ్రహ దినోత్సవం.

ప్రపంచ అహింసా దినోత్సవం (లేదా అంతర్జాతీయ అహింసా దినోత్సవం, ఆంగ్లం: International Day of Non-Violence) గా మహాత్మా గాంధీ పుట్టిన రోజైన అక్టోబరు 2వ తేదీని పాఠిస్తారు. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ (అక్టోబరు 21869 - జనవరి 301948) భారతీయులందరిచే ఆదరింపబడే ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ప్రజలు ఆయనను జాతిపిత గా గౌరవిస్తారు. సత్యముఅహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు.  20వ శతాబ్దిలోని రాజకీయనాయకులలో అత్యధికముగా మానవాళిని ప్రభావితము చేసిన రాజకీయ నాయకునిగా ఆయనను కేబుల్ న్యూస్ నెట్వర్క్(CNN) జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారు. కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటి, ఆ మహాత్ముడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. సత్యాగ్రహమూ, అహింస పాటించడానికి ఎంతో ధైర్యము కావాలని బోధించాడు. మహాత్ముడనీ, జాతిపిత అనీ పేరెన్నికగన్న ఆయన ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యము సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. ఈ రోజుని ప్రపంచ అహింసా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి జూన్ 15, 2007న అమోదించింది. గాంధీ అహింసా మార్గాన్ని అనుసరించి అనేక ఉద్యమాలను నడిపాడు సత్యాగ్రహము పాటించాడు. గాంధీ అహింసా మార్గాన్ని అనుసరించి అనేక ఉద్యమాలను నడిపాడు సత్యాగ్రహం అంటే సత్యం కోసం జరిపే పోరాటం. అహింస మూలధర్మంగా, సహాయ నిరాకరణ మరియు ఉపవాసదీక్ష ఆయుధాలుగా చేసే ధర్మపోరాటమే ఈ సత్యాగ్రహం. గౌతమ బుద్ధుడు ప్రవచించిన "అహింసా పరమోధర్మ:" అన్న సూత్రం, యేసు క్రీస్తు అన్నట్టు, "ఒక చెంప పై కొడితే మరో చెంప చూపమన్న" ఆలోచనా ధృక్పథం దీనిలో కనిపిస్తాయి. సత్యం కోసం రాజీ లేని పోరాటమే సత్యాగ్రహం. సాంప్రదాయ పద్దతిలో జరిగే హింసాయుత లేదా అహింసాయుత పోరాటంలో ప్రత్యర్థిని ఓడించడం, లేదా ప్రత్యర్థి తన లక్ష్యాన్ని చేరుకోకుండా నిరోధించడం, లేదా ప్రత్యర్థులు ఎన్ని ఆటంకాలు కల్పించినా తాము కోరుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం అన్నవి ముఖ్యాంశాలు. కానీ సత్యాగ్రహ విధానంలో తప్పు చేసే వారిని బలవంతంగా ఆపకుండా వారిలో మార్పును తీసుకురావడం ముఖ్య లక్షణం.
బాపూజీ చూపిన సత్యం, అహింస మార్గాలు భావితరాలకు బంగారు బాటగానిలచాయి. సత్యాగ్రహ్నా ఆయుధంగా చేసుకొని  బాపూజీ బ్రిటిష్ ప్రభుత్వాన్ని  గడగడలాడించడంతో భారత దేశాకి స్వాతంత్య్రం లభించింది. కాగా ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే రక్తపాత రహితంగా ఒక సుదీర్ఘ పోరాటం ఫలితంగా స్వాతంత్ర్యాన్ని పొందిన ఘనత కేవలం భారతదేశాకి మాత్రమే దక్కుతుంది. ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన గాంది  తాను నమ్మిన సిద్ధాంతాలను ఆచరించి భారత దేశంలోనే కాకుండా ప్రపంచ చరిత్రలోనే ఒక అరుదైన స్ధానాన్ని సంపాదించుకున్న మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ. ఐక్యరాజ్య సమితి కూడా మహాత్మడి జన్మదినోత్సవ్నా అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించడం భారతీయులకు ఎంతో గర్వ కారణం.  
అహింసా అంటే ఒక జీవిని చంపడం, ఒకరికి ఇష్టము లేని కార్యాన్ని బలవంతంగా చేయించి, తద్వారా దుఃఖాన్ని కలిగించడం, మనోవాక్కాయ కర్మలచేత బాధ కలిగించడం హింస. సర్వకల సర్వావస్థలలో ఇతర ప్రాణికి ఏ రకమైన కష్టాన్ని కలిగించకుండా ఉండడం అహింస. 
హింస మూడు రకాలు: మానసిక హింస, వాచిక హింస మరియు కాయిక హింస. 
పరులకు హాని తలపెట్టడం, మనో నిగ్రహం లేకపోవడం, పాపభీతి లేకుండా ప్రవర్తించడం అనేవి మానసిక హింస. అసత్యాన్ని పలకడం, అహితముగా లేదా కఠినంగా మాట్లాడడం వాచిక హింస. 
ఒక జీవిని చంపడం, గాయపరచడం, దుష్క్రియలచేత పీడించడం, పరస్త్రీ సహవాసం, పరధనాపహరణం, మాంస భక్షణ కాయిక హింస అనబడతాయి.

అహింసా పరమో ధర్మః అహింసా పరమం తపః
దయా సమం నాస్తి పుణ్యం పాపం హింసా సమం నహి.

"జీవో జీవస్య జీవనమ్" - అనగా ఒక జీవి మరొక జీవిని చంపి తనడం జంతు ప్రవృత్తి.

అహింస, సత్యం, కోపము లేకపోవడం, మృదుస్వభావం, సిగ్గు, చాపల్యం లేకపోవడం,తేజస్సు, ఓర్మి, పట్టుదల, శుచిత్వం, ద్రోహచింతన లేకపోవడం, అభిమాన రాహిత్యం దైవ గుణ సంపద, అహింస, సమత్వము, తృప్తి, తపస్సు, దానము, యశస్సు మొదలైన భావాలు దైవం వల్లనే కలుగుతాయి.ధర్మాలు అన్నింటిలో అహింస శ్రేష్ఠమైన ధర్మం. భూతదయను మించిన పుణ్యం, హింసను మించిన పాపం లేదని వేదోపనిషత్తులు చెబుతున్నాయి.
అహింస మహావిష్ణువునకు ప్రీతికరమైన ఎనిమిది పుష్పాలలో మొట్టమొదటిది. అహింస, ఇంద్రియ నిగ్రహం, భూతదయ, సహనం, శాంతం, తపస్సు, ధ్యానం,సత్యం అనేవి ఈ ఎనిమిది పుష్పాలు.  ఈ ఎనిమిది కలిగినవారు చాలా గోప్పవారవుతారు.  ఏది అయినా సరే సాధించగలరు. అలా సాధించి చూపినవాడు మహాత్మా గాంది.  గాంధీగారి జన్మదినము సందర్బంగా ఆయనకు మనస్పూర్తిగా నివాళి అందిస్తూ.  అంతర్జాతీయ సత్యాగ్రహ మరియు అహింసాదినోత్సవ శుభాకాంక్షలు. 
జై హింద్ 

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)