Blogger Widgets

సోమవారం, ఫిబ్రవరి 12, 2018

రామచరిత మానస, 20 శ్రీరామునిపాదకమలములకు శిరసా ప్రణమిల్లి గుణగానమొనర్చెదను .

సోమవారం, ఫిబ్రవరి 12, 2018

దో - సారద సేస మహేస బిధి , ఆగమ నిగమ పురాన |
        నేతి నేతి కహి జాసు గున , కరహిC నిరంతర గాన || 12 ||
వాగ్దేవియు , శేషుడు , పరమశివుడు పరమేష్ఠియు , వేదశాస్త్రపురాణములు శ్రీరామచంద్రుని గుణములను నిరంతరము గానముచేయుచు పూర్తిగా వర్ణింపబడును, కానీ అతని అనంతగుణములను వర్ణింపజాలక నేతి నేతి ( న + ఇతి , న + ఇతి ) అనుచు గానము చేయుచుండెను .  
చౌ - సబ జానత ప్రభు ప్రభుతా సోఈ | తదపి కహేC బిను రహా న కోఈ ||
తహాC భేద అస కారన రాఖా | భజన ప్రభాఉ భాCతి బహు భాషా || 1 ||
ఏక అనీహ అరూప అనామా | అజ సచ్చితానంద పర ధామా ||
బ్యాపక బిస్వరూప భగవానా | తెహిC ధరి దేహ చరిత కృత నానా || 2 ||
సో కేవల భగతన హిత లాగీ | పరమ కృపాల ప్రనత అనురాగీ ||
జెహి జన పర మమతా అతి ఛోహో | జెహిC కరునా కరి కీన్హీన కోహూ || 3 ||
గఈ బహోర గరీబ నెవాజూ | సరల సబల సాహీబ రాఘురాజు ||
బుధ బరనహిC హరి జస అస జానీ | కరహిC పునీత సుఫల నిజ బానీ || 4 ||
తెహిC బల మైC రఘుపతి గున గాథా | కహిహఉC  నాఇ రామ పద మాధా ||
మునిస్హ ప్రథమ హరి కీరతి గాఇ | తెహిC మగ చలత సుగమ మొహి భాఈ || 5 ||
శ్రీరాముని వైభవమును వర్ణింపనలవికానిదని ఎఱింగియు ఎవ్వరును వర్ణించుట మానలేదు  ఆయనభజనప్రభావమును వేదములు అనేకవిధములుగా తెల్సినవి .  ఏ కొద్దిపాటి గుణగానమైనను మానవులను భవసాగరమునుండి తరింపచేయును .  పరమేశ్వరుడొక్కడే . అతడు నిష్కాముడు , నిరాకారుడు , జన్మనామములేనివాడు , సచ్చితానంద స్వరూపుడు , పరంధాముడు , విశ్వవ్యాప్తి , విశ్వరూపుడు . అయినను దివ్యశరీరము ధరించి , పెక్కుఅవతారము ద్వారా తనలీలలను ప్రకటించును .  భగవంతుడు పరామకృపాళువు, శరణాగతివత్సలుడు , కావున భక్త సంరక్షణమునకై వారి శ్రేయస్సుముకొరకై  తన ఈలీలలును ప్రదర్శించుచుండును .  తన కరుణాదృష్టిని అయాచితముగానే  భక్తులపై ఆయనకు కల కృపావాత్సల్యము అపారము .  ఒక్కోసారి కృపజూపినవారిపై ఎన్నడును ఆయన కోపగింపడు .  భక్తులు నష్టపోయినదానిని లభ్యమగునట్లు చేయును .  అనగా భక్తులయోగక్షేమములను వహించుచుండువాడతడే .  అతడు దీనబందువు , సరళస్వభావుడు ,  సర్వశక్తిమంతుడు , అందరికిప్రభువు .  దీనిని ఎరింగియే బుద్ధిమంతులు శ్రీహరియసమును కీర్తించుచు తమవాక్కులను పునీత మొనర్చుకొనుచు జీవితములను సఫలముచేసికొనుచుందురు .  ఈకారణమునే శ్రీరామునిపాదకమలములకు శిరసా ప్రణమిల్లి ,ఆయన గుణగానమొనర్చెదను .  పూర్వము వ్యాస వాల్మీకాది మహర్షులు , శ్రీహరివైభవములను వర్ణించిరి .  వారిమార్గమును అనుసరించుటయే నాకును సులభము.      

ఆదివారం, ఫిబ్రవరి 11, 2018

రామచరిత మానస, 19, ఈ కథను చెప్పుటకు నాకు ధైర్యము చాలదు .

ఆదివారం, ఫిబ్రవరి 11, 2018

దో - జుగుతి బేధి పుని పోహిఅహిC , రామచరిత బర తాగ | 
        పహిరహిC సజ్జన బిమల ఉర , సోభా అతి అనురాగ || 11 ||
ఈ కవితా ముక్తామణులను యుక్తితో భేదించి , రామకధాసూత్రమున గూర్చి , సజ్జనుల తమ నిర్మల హృదయములయందు ధరించినచో అవి మిక్కిలి అనురాగశోభితములగును , భక్తి భరితములగును . ( దో || 11|| )
చౌ - జే జనమే కలికాల  కరాలా | కరతబ బాయస బేష మరాలా  ||
        చలత కుంపథ భేద మగ ఛాCడే | కపట కలేవర కలిమల భాCడే || 1 ||
        బంచక  భగత కహాఇ రామ కే  | కింకర కంచన కోహ కామ కే ||
        తిన్హ మహC ప్రథమ రేఖ జగ మోరీ | ధీంగ ధరమధ్వజ ధందక ధోరీ || 2 ||
        జౌC అపనే అవగున సబ కహఊC | బాఢఇ కథా సార నహిC లహఊC ||
        తాతే మైC అతి అలప బఖానే | ధోరే మహుC జానిహహిC సయానే || 3 ||
        సముఝి బిబిథి బిధి బినతీ మోరీ | కొఉ న కథా సుని దేఇహి ఖోరీ ||
        ఏతెహు  పర కరిహహిC  జె అసంకా|  మొహి తే  అధిక తె జడ మతి రంకా ||4||
        కబి న హోఉC నహిC చతుర కహావఉC | మతి అనురూప రామ గున గావఉC ||
        కహC రఘుపతి కే చరిత అపారా | కహC మతి మోరి నిరత సంసారా || 5 ||
        జేహిC మారుత గిరి మేరు ఉడాహీC | కహాహు తూల కెహి లేఖే మాహీC ||
        సముఝత అమిత రామ ప్రభుతాఈ | కరత కథా మన అతి కదరాఈ || 6 ||
పాప పంకిలమైన ఈ కలియుగమున పుట్టి , హంసవేషము ధరించి , కాకులవలె ప్రవర్తించువారును , వైదిక మార్గము విడిచి , దుర్మార్గములో సాగిపోయెడి వారును, పాపాత్ములును , రామభక్తులమని చెప్పుకొనుచు లోకులను మోసగించెడివంచకులును , కామక్రోధలోభములనకు దాసులను , పాషండులును , ధర్మధ్వజులను అయినవారిలో నేను ప్రధముడును , నాదుర్గుణములకు లెక్కలేనేలేదు , వాటిని వివరింప సాగినచో ఆ కథయే విస్తృతమగును .  వాటిలో కొన్నిటిని మాత్రమే తెలిపితిని .  సహృదయాలు ఈమాత్రము వివరములుతో అంతయు అర్ధంచేసుకుందురు.  నా ఈ మానవుని గ్రహించి , నా ఈకథను విన్నవారెవరు నన్ను దోషిగాతలంపరు. అయినప్పటికీ శంకించిన వారు నాకంటే మిక్కిలి మూర్ఖులు , మందబుద్ధులు , నేను కవిని కాను , చతురుడను కాను , శ్రీరాముని కథావైభవమును నా బుద్ధికి తోచినట్లుగా వర్ణించుచున్నాను .  శ్రీరాముని అపారమైన చరిత్ర ఎక్కడ ? సంసార వ్యామోహములో కూరుకుపోయిన నా బుద్ది ఎక్కడ ? మేరు పర్వతమును కూడా కదలించు శక్తి కలిగిన వాయువుముందు దూది ఎట్లా నిలువగలదు .  శ్రీరాముని అనంతవైభవములను తలచినప్పుడు ఈ కథను చెప్పుటకు నాకు ధైర్యము చాలదు .  

శనివారం, ఫిబ్రవరి 10, 2018

రామచరిత మానస, 18, సరస్వతీదేవి రాక.

శనివారం, ఫిబ్రవరి 10, 2018

చౌ - మని మానిక ముకుతా ఛబి జైసీ | అహి గిరి గజ సిర సోహ న తైసీ ||
         నృప కిరీట తరునీ తను పాఈ  | లహహిC సకల సోభా అధికాఈ || 1 ||
         తైసెహిC సుకబి కబిత బుధ కహహీC | ఉపజహిC అనత అనత ఛబి లహహీC ||
         భగతి హేతు బిధి భవన బిహాఈ | సుమిరత సారత ఆవతి ధాఈ || 2 || 
         రామ చరిత సర బిను అన్హవాఏC | సో శ్రమ జాఇ  న కోటి ఉపాఏC || 
         కబి కోబిత  అస హృదయC బిచారీ | గావహిC హరి జస కలిమల హారీ || 3 ||
         కీన్హేC ప్రాకృత జన గున గానా | సిర ధుని గిరా లగత పఛితానా ||
         హృదయ సింధు మతి సీప సమానా | స్వాతి సారద కహహిC సుజానా || 4 ||
         జౌC బరసఇ బర బారి బిచారూ | హోహిC కబిత ముకుతామని చారూ || 5 ||
పాములపడగలపైగలమణులును పర్వతములపైగల మాణిక్యములును , గజములమస్తకముల యందుండు ముత్యములను అంతగాశోభింపవు .  అవియే రాజులకిరీటములయందును, తరుణీమణులతనువులపైనను చేరి , వింతకాంతులను వెదజల్లును .  " కవిః కరోతి కావ్యాని , రసం జానాతి పండితః " అని ప్రాజ్ఞులు పల్కుచుందురు .  కావ్య నిర్మాణమునకు పూనుకొనిన కవి స్మరించినంతమాత్రముననే శ్రీరామభక్తి పారవశ్యమున సరస్వతీదేవి బ్రహ్మలోకమునుండి భూమికి పరుగులుదీయుచు వచ్చును.  ఆమెచే కవి శ్రీరామచరితమనెడి సరోవరమునందు స్నానము చేయించినప్పుడే ఆమె యొక్క దూరప్రయాణపుబడలిక తొలగిపోవును.  ఇది తప్ప వేఱుగా కోటి ఉపాయములు చేసినను ఆ బడలిక తీరదు .  ఈ విషయమును గ్రహించియే కవులును, పండితులను, కలిపాపములనురూపుమాపు రామచరిత యశోగానమును చేయుదురు.  కవులు సామాన్యమానవుల చరిత్రమును పొగడినచో సరస్వతీదేవి తనరాకకు పశ్చాత్తాపబడును .  పండితులు కవిహృదయమును సముద్రముతోడను అతని బుద్దిని ముత్యపు తోడను సరస్వతీదేవిని స్వాతివానతోడను పోల్చెదరు. ఇందులో సుందరభావములనెడి వర్షపుచినుకులు పడినచో అందమైన కవితాముక్తాముణులరూపములలో అది భాసించును .        

శుక్రవారం, ఫిబ్రవరి 09, 2018

రామచరిత మానస, 17, సజ్జనులు గానము చేయుదురు

శుక్రవారం, ఫిబ్రవరి 09, 2018

ఛం - మంగల కరని కలిమల హరని తులసీ కథా రఘునాధ కీ |
          గతి కూర కబితా సరిత కీ జ్యోC సరిత పావన పాథ కీ ||
          ప్రభు సుజన సంగతి భనితి భలి హోఇహి సుజన మన భావనీ |
          భవ అంగ భూతి మసాన కీ సుమిరత సుహావని పావనీ ||
తులసీదాసు పలుకుచున్నాడు .  శ్రీరఘునాధునిచరితము కలియుగపాపములను కడిగి వేయును ,  కళ్యాణపరంపరను గూర్చును.  శోభరహితమైన నా కవితాస్రవంతి పావనగంగానదివలె ఎన్నిమలుపు తిరిగినను .  శ్రీహరి వైభవ సాంగత్యముచే సుజనులుకు మనోహరముగా ఉండును .  స్మశానములోని అపవిత్రమైన భస్మముకూడా శంభుని శరీరస్పర్శ చేత సుశోభితమై , స్మరణమాత్రముననే పవిత్రమొనర్చును .  (చంద్)
దో - ప్రియ లాగిహి అతి సబహి మమ , భనితి రామ జస సంగ |
         దారు బిచారు కి కరఇ కొఉ , బందిఅ మలయ ప్రసంగ || 10 క ||
         స్యామ సురభి పయ బిసద అతి , గునద కారేహిC సబ పాన |
         గిరా గ్రామ్య సియ రామ జస , గావహిC సునహిC  సుజాన || 10 ఖ ||
మలయాపర్వతమునందలి చందనవృక్షసమీపమునకుగల ఏ వృక్షమైనను అది చందన వృక్షముగానే మాఱును . అందరూ దానిని ఆదరించుదురు .  అట్లే శ్రీరామ వైభవ సాహచర్య ప్రభావమున నా కవిత ఎల్లరురకు అత్యంత ప్రీతికరమేయగును .  నల్లని ఆవుపాలు కూడా తెల్లగాను , పుష్టికరముగాను ఉండును .  అందరును దానిని సేవింతురు.  అట్లే నా భాష గ్రామ్యమేయైనను సీతారాములకథను వర్ణించుటవలన సజ్జనులు దానిని గానము చేయుదురు, చెవులప్పగించి విందురు .   
     

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)