Blogger Widgets

మంగళవారం, జనవరి 31, 2012

జాతీయ పక్షి

మంగళవారం, జనవరి 31, 2012

మన భారత ప్రభుత్వం వారు 1963వ సంవత్సరం జనవరి 31 న నెమలి ని మన జాతీయ పక్షి గా గుర్తించారు.  

The Scientific Classification 
Phylum: Chordata
Sub-phylum: Vertebrata (Vertebrates)
Class: Aves (Birds)
Order: Galliformes
Family: Phasianidae
Sub-family: Phasianinae
Genus: Pavo ¡
Species: Pavo cristatus (blues) and Pavo muticus (Java greens)
Subspecies for P. muticus: P.m. muticus  |  P.m. spicifer  |  P.m. imperator

నెమలి చాలా అందమైన ఈకలు కలిగి వుంటుంది. శ్రీ కృష్ణుడు తన శిరస్సు మీద నెమలి ఈకను అలంకరిమ్చుకునేవారు.  సుబ్రహ్మణ్య స్వామి వాహనంగా నెమలి వుంటుంది కదా నేను ఫొటోస్ లో చూసాను. మగ నెమల్లకు అందమయిన మెరిసే నీలం-ఆకుపచ్చ లేదా ఆకుపచ్చ రంగు పించం ఉంటుంది. మగ నెమలికి వెనుక బాగంలో తోకలాగా కనిపించేది, దాని పొడావాటి ఈకలు. ఆ ఈకలకు కళ్ళు ఉంటాయి, వాటి అందమంతా అవి పురివిప్పి నాట్య మాడుతున్నప్పుడే కనిపిస్తాయి.
మగ నెమల్లకు అందమయిన మెరిసే నీలం-ఆకుపచ్చ లేదా ఆకుపచ్చ రంగు పించం ఉంటుంది. మగ నెమలికి వెనుక బాగంలో తోకలాగా కనిపించేది, దాని పొడావాటి ఈకలు. ఆ ఈకలకు కళ్ళు ఉంటాయి, వాటి అందమంతా అవి పురివిప్పి నాట్య మాడుతున్నప్పుడే కనిపిస్తాయి.
ఆడ నెమలి ఆకుపచ్చ, గోధుమ మరియు బూడిద రంగులలో ఉండే పించం ఉంటుంది. మగ నెమల్ల వలె ఆడనెమలికి పొడావాటి తోక లాంటి ఈకలు ఉండవు, కానీ వీటికి ఒక కొప్పూంటుంది.
నెమలి పించాలలోని ఆ అత్బుత రంగులకు కారణం, వాటి ఈకలమీద పేర్చినట్లు ఉండే సన్నని పీచు లాంటి పదార్దాలే. అక్కడ కనిపించే వివిధ రంగులకు వాటి అమరికలోని నిడివి తేడాలే కారణం. గోధుమ రంగు ఈకలకు, ఎరుపు మరియు నీలం రంగులు అవసరం - వీటిలో ఒక రంగు అమరిక వలన సృస్టింపబడగా, రెండొవది హద్దులలో ఉండే ఇంకో అమరిక వలన వచ్చే కాంతి పరావర్తనం వలన ఏర్పడుతుంది. ఇటువంటి పరావర్తనం వలనే నెమలి నాట్యమాడుతున్నప్పుడు వాటి పించాలు మనకు వివిద కోణాలలో వివిద రంగులుగా కనిపిస్తాయి.
దాదాపు 2000 సంవత్సరాల కాలం నుండి మనుషుల పోషణలో నెమలి ఉన్నదని భావిస్తున్నారు.నెమలిలో పెంపుడు జంతువులలో కనిపించే లక్షణాలు చాలా తక్కువగా వున్నాయి.వీటి నుండీ ఇతర కొత్త జాతులు సృష్టింపబడ్డాయి.
ఇతర జాతులతో అంటకట్టించటం వలన వేరు వేరు రంగుల ఈకలున్న నెమల్లు మనకు కనిపిస్తాయి. అటువంటి వాటిలో తెల్ల శరీరం కలవి చెప్పుకోతగ్గవి.
మబ్బులు పట్టాగానే నెమలి తన అందాన్ని మరింత బాగా చూపి నాట్యం ఆడుతుంది.  ఇంత అందామయిన పక్షికి ఈనాడు నివాస స్తలాలేలేవు. నెమలి తుప్పలు, గడ్డి ప్రదేసాలాల్లో నివసిస్తుంది.  ఇప్పుడు ఆకు రాలే కాలం కదా గడ్డి తుప్పాలను నిప్పుపెట్టేసారు వాటికి సరి ఐన ప్రదేశం లేక కొత్త ప్రదేసాలకోసం అన్వేషిస్తున్నాయి.  ఆ ప్రయత్నంలో కొన్ని మనుషులకు దొరికిపోయి చంపబడుతున్నాయి.  మా ఇంటిదగ్గర గడ్డి కాల్చేసారు.  అప్పుడు అవి దగ్గరలో వున్నా వాటర్ ట్యాంక్ మీద ఎలా కుర్చున్నవి అప్పుడు నేను తీసిన ఫోటో చూడండి. అంత అందంగా వున్నా మన జాతీయ పక్షి అయిన నెమలి జాతి అంతరించి పోకుండా కాపాడ వలసిన బాధ్యతా మనందరికీ వుంది.   దయచేసి నెమలి ని చంపవద్దు దాని అందాన్ని చూసి ఆనందిచుదాం.  
Please Save Our National Bird 

మంగళవారం, జనవరి 24, 2012

How many squares are there?

మంగళవారం, జనవరి 24, 2012

 How many squares are there on a chessboard or checkerboard?


మొత్తకురే అమ్మలాల

చిన్ని కృష్ణుని అల్లరి మితిబారినది.  వాని అల్లరి వారి భరించలేక పోతున్నారు.  ఒక గోపెమ్మ చిన్ని కృష్ణుని కొట్టబోయినది. మరో గోపెమ్మ వారించెను.  రేపల్లె వెన్న దొంగ కృష్ణుడు ను యశోదమ్మ కొట్టబోయినది.  అప్పుడు అమ్మ కాలమీద పడినాడు చిన్నివాడు.   అందితే జుట్టు  అందకపోతే కాళ్ళు కృష్ణునకిది వెన్నతో బెట్టిన విద్య. ఇంకేమున్నది ? గోపెమ్మ కోపము మటు మాయమైనది. కృష్ణునకు అలుసుగా తీసుకున్నాడు. తన స్నేహితులతో ఊరిమీదికి బోయి, గొల్లల వాడలలో ఇళ్ళను కొల్లగొట్టినాడు. వెన్న ముద్దలు మాపుదాకా ముక్కున కారునట్లు బుక్కినాడు.  
గోప కృష్ణుని అల్లరి మితిమీరినది. యశోదమ్మ బాలుని దండింపదలచినది. చిన్ని కృష్ణుని రోటికి గట్టినది. అది అంత తేలికా ? అప్పుడు శ్రీ కృష్ణునికి కోపమే వచ్చినది. తన్ను రోటికి కట్టిన తల్లిపై రాళ్ళు రువ్వినాడు. తన చిన్ని చేతులకు అందినంత వరకు విసిరినాడు. చిదిమిన పాలు గారు చిన్ని బుగ్గలతో, చిలికిన నవ్వులతో, మొల చిరు మువ్వలతో గోకులమంతా కలియ దిరిగే నందకిశోరుడు బాలుడా ! పరబ్రహ్మ స్వరూపుడు. త్రిమూర్తులలో మేటియైనవాడు. 
బాలకృష్ణ కేళీవిలాసాలు చిలికి చిలికి పెద్దవైనవి. యశోదతో ఫిర్యాదు చేయుటకు వ్రజ భామలు కదలి వచ్చినారు. గోకుల మిల్లిల్లు కదలినది. అక్కడి దృశ్యమును చూచి పల్లీబిబ్బోకవతులు ఆశ్చర్యచకితలైనారు. కృష్ణుడు పసిబాలుని వలె ఒక మూలకు ఒదిగి, యశోదాదేవి యొడిలో చేరి పాలు త్రాగుతున్నాడు. ఆ తల్లి కన్నులతో వాత్సల్యాన్ని కురిపిస్తూ, తన తనయుని తల నిమురుతున్నది. ముద్దుగుమ్మలు ఆ ముద్దుల బాలుని చూచి ముసి ముసి నగవులతొ వెనుకకు మరలినారు. 
ఆ లీలామానుష విగ్రహుడే నేడు వేంకటగిరిమీద మూలభూతియై నిలచినవాడు.  అంత గొప్ప సన్నివేశానికి చూడటానికి రెండు కళ్ళు అయినా సరోపోవు కదా.  ఇదంతా కృష్ణమాయ .
మొత్తకురే అమ్మలాల -ముద్దులాడు వీడె
ముత్తెము వలె నున్నాడు - ముద్దులాడు 

చక్కని యశోద తన్ను సలిగతో మొత్త రాగా 
మొక్క బోయీ గాళ్ళకు - ముద్దులాడు 
వెక్కసాన రేపల్లె - వెన్నలెల్ల మాపుదాక 
ముక్కున వయ్యగ దిన్న - ముద్దు లాడు 

రువ్వెడి రాళ్ళ దల్లి - రోలదన్ను గట్టెనంట 
మువ్వల గంటల తోడి ముద్దు లాడు 
నవ్వెడి జెక్కులనిండ - నమ్మిక బాలుని వలె 
మువ్వురిలో - నెక్కుడైన ముద్దులాడు 

వేలసంఖ్యల సతుల - వెంటబెట్టుకొనిరాగా ! 
మూల జన్ను గుడిచీని ముద్దులాడు 
మేలిమి వెంకటగిరి మీద నున్నాడిదె వచ్చి 
మూలభూతి దానైన ముద్దులాడు 


'జన గణ మన' @ 100 సంవత్సరాలు

'జన గణ మన' 
'జన గణ మన' నేటికి 100  సంవత్సరాలు నిండింది.
ఏ ఇతర దేశభక్తి గీతము కూడా మన భారత పాటలా వుండదు అనటంలో అతిశయోక్తి లేనేలేదు.  ఈ పాట do or  die అన్నట్టు మంచి పట్టులాగ వుంటుంది.  ఈ గీతము మనము  క్రీడా రంగంలోను సరిహద్దులవద్ద, అది మనకు ఒక మార్గం  జన గణ మన.
డిసెంబర్ 27, 1911 న భారత జాతీయ కాంగ్రెస్ కలకత్తా సమావేశంలో మొదటి సారిగా నోబెల్ గ్రహీతరవీంద్రనాథ్ ఠాగూర్ మరియు పాడిన కూర్చాడు జన గణ మన గీతాన్ని.  భారత జాతీయ గీతం జనగణమనను ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గీతంగా యునెస్కో గుర్తించింది. ఎన్నో ప్రశంసలు పొందిన ఈ గీతంపై వివాదాలు కూడా లేకపోలేదు. ఇందులోని సింధు పదాన్ని తొలగించాలని కొందరు కోర్టు కెక్కగా దానిని కోర్టు తిరస్కరించింది. అలాగే తెల్లదొరలను ఈ గీతం రాశారనే వివాదం కూడా ఉంది. తెల్లదొరలను కీర్తిస్తూ రాసిన గీతం కాబట్టి దానిని ఎలా ఆమోదించాలని ప్రశ్నించే వారూ ఉన్నారు. అంతేకాకుండా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆదేశాల మేరకే రవీంద్రుడు ఈ గీతాన్ని రాశారని, ఆయన స్వతహాగా రాయలేదని అంతేకాకుండా గీతానికి బాణీలు కట్టింది తానేనని నేతాజీ అనుచరుడు ఒకరు తెరపైకి వచ్చారు.
ఈగీతానికి 100 ఏళ్ల చరిత్రలో జాతీయ గీతం ఒక రక్తపాత విభజన, జాతీయవాద ఉద్యమం మరియు ప్రముఖ ఉద్యమాలు ప్రారంభమై మంచిగా ఉద్యమాన్ని బలోపేతం చేయటానికి బాగా దోహదపడింది. ఇది జాతీయ జెండా మరియు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ప్రజా సందర్భాల్లో ఎగుర వెయ్యటానికి, క్రీడా విజయాలు సాధించే  సమయంలో ఈ గీతం వారికి తోడుగా వుంటుంది.
ఒక బ్రహ్మ గీత రాసిన శైలి లో రాసిన ఈ జన గణ మన అధికారికంగా జనవరి 24, 1950 న భారత జాతీయ గీతం గా రాజ్యాంగ సభ స్వీకరించారు. జన గణ మన గీతం మరింత జాతీయ ఐకమత్యాన్ని పెంచేవిధంగా వుంటుంది.  ఇది నేతాజీ బోస్ యొక్క ఇండియన్ నేషనల్ ఆర్మీ 1946 లో జాతీయ గీతంగాను  మరియు మహాత్మా మహాత్మా గాంధీ గారు కూడా జన గణ మన ను వాడటం.  గాంధి గారు ఇలా అన్నారుట  "పాట మా జాతీయ జీవితంలో ఉత్తమ స్థానాన్ని పొందింది" అని చెప్పాడు. 'జన గణ మన',  భారతదేశం యొక్క 1947 రిపబ్లిక్ జాతీయ గీతంగా గుర్తించారు.
రవీంద్రుడు ఈ జనగణమనను చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో రాశారు. బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని రాసింది కూడా రవీంద్రుడే. జనగణమనను మన భారత రాజ్యాంగం 1950 జనవరి 24న జాతీయ గీతంగా స్వీకరించింది. ఆయన మొదటిసారి బెంగాళీలో ఈ గీతాన్ని ఆలపించారు. ఈ గీతానికి బాణీలు కట్టింది కూడా విశ్వకవే. ఆ తర్వాత ఇంగ్లీషులోకి అనువదించారు.
AR రెహమాన్ మరియు లతా మంగేష్కర్  భారతదేశం యొక్క మ్యూజిక్ ప్రపంచం ద్వారా జాతీయ గీతం  హృదయపూర్వక కూర్పు కొత్త వయసు, కొత్త సంగీతం కట్టిపడేశాయి. 
భారతదేశం 2011 క్రికెట్ ప్రపంచ కప్ ఒక ఉప్పొంగే దేశంగా ఈ గీతము పైకి ఎత్తి వేసింది.  ఈ గీతము అప్పుడు అందరి ఇళ్ళలోనూ. ప్రతీ ప్రదేసములోను, ప్రభుత్వ కార్యాలయలోను ఉన్నప్పుడు ఖచ్చితమైన సమయంలోను, టీ దుకాణాల్లో మరియు రోడ్డు పక్కన ఈ గీతము మారుమోగింది.
ఆసక్తికరంగా  ఠాగూర్ మాత్రమే సంగీతకారుడుగా పంకజ్ కుమార్ ముల్లిక్ తన పద్యాల వరకు ట్యూన్ సెట్ కూడా అతన్ని 'రాబింద్రసంగీత్' యొక్క భావాలు మార్చే వీలు లేదు స్వయంగా వచ్చింది. ముల్లిక్ ఒకసారి కూడా 'జన గణ మన' కోసం గాన శైలిని తయారు చేసారు. ఇది  ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ కోరాడు.
అయితే ఈగీతానికి నియమాలు వున్నాయి.  ఆ నియమాలు ఏమిటి?
జాతీయ గీతం యొక్క  కూర్పు 52 సెకన్లు పడుతుంది. మొదటి మరియు చివరి పంక్తులు (మరియు ప్లే 20 సెకన్లు  తీసుకొని)కలిగి ఉన్న ఒక చిన్నదైన వెర్షన్ కూడా అప్పుడప్పుడు ప్రదర్శించారు.
Text మాత్రము బెంగాలీ లో వుంది కొంత సంస్కృతంలో ఉంది (పాక్షిక-సంస్కృతం టెక్స్ట్). అది అనేక ఆధునిక భారతీయ భాషల్లో ఆమోదయోగ్యంగా వుంది, కానీ ఉచ్చారణ గీతం యొక్క singing సంబంధించిన నియమాలు మరియు నియంత్రణలు  చూపించారు.  ప్రభుత్వం యొక్క అధికారిక వెబ్సైట్ ప్రకారం, భారతదేశం అంతటా గణనీయంగా మారుతూ ఉంటుంది.
గీతం పాడిన లేదా ఆడతారు ఉన్నా ప్రభుత్వం రూల్బుక్, ప్రకారం, ప్రేక్షకులు నిలబడే వుండాలి. అయితే, ఒక రీల్ లేదా డాక్యుమెంటరీ కోర్సులో గీతం చిత్రం భాగంగా ఆడాడు ఉన్నప్పుడు, మాత్రము ప్రేక్షకుల నిలబడుట అన్నదాని గురించి ఒక  అంచనా లేదు. నిలబడుట  చిత్రం ప్రదర్శన అంతరాయం కలిగి ఉంటుంది.  మరియు అంతేకాకుండా గీతం యొక్క గౌరవం చేయటం అంత కంఫోర్ట్ గా వుండదు.
వందేళ్లు పూర్తి చేసుకున్న జనగణమనకు ప్రపంచ రికార్డును ఈనాడు తీసుకు వచ్చే దిశలో గీతాలాపన జరుగుతోంది. ఈ గీతాలాపన మంగళవారం ఉదయం ఏడు గంటలకు పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలోని మహతి కళామందిరంలో ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన జనగణమన గీతాలాపన సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుంది.  ఇందుకోసం ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు హాజరయ్యారు.   ఈ గీతాన్నికి కచ్చితంగా గిన్నిస్ రికార్డు రావాలని కోరుకుంటు జాతీయ గీతానికి 100 నిండిన సందర్బముగా అందరికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.
జయ్ హింద్ 

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)