Blogger Widgets

మంగళవారం, జనవరి 31, 2012

జాతీయ పక్షి

మంగళవారం, జనవరి 31, 2012

మన భారత ప్రభుత్వం వారు 1963వ సంవత్సరం జనవరి 31 న నెమలి ని మన జాతీయ పక్షి గా గుర్తించారు.  

The Scientific Classification 
Phylum: Chordata
Sub-phylum: Vertebrata (Vertebrates)
Class: Aves (Birds)
Order: Galliformes
Family: Phasianidae
Sub-family: Phasianinae
Genus: Pavo ¡
Species: Pavo cristatus (blues) and Pavo muticus (Java greens)
Subspecies for P. muticus: P.m. muticus  |  P.m. spicifer  |  P.m. imperator

నెమలి చాలా అందమైన ఈకలు కలిగి వుంటుంది. శ్రీ కృష్ణుడు తన శిరస్సు మీద నెమలి ఈకను అలంకరిమ్చుకునేవారు.  సుబ్రహ్మణ్య స్వామి వాహనంగా నెమలి వుంటుంది కదా నేను ఫొటోస్ లో చూసాను. మగ నెమల్లకు అందమయిన మెరిసే నీలం-ఆకుపచ్చ లేదా ఆకుపచ్చ రంగు పించం ఉంటుంది. మగ నెమలికి వెనుక బాగంలో తోకలాగా కనిపించేది, దాని పొడావాటి ఈకలు. ఆ ఈకలకు కళ్ళు ఉంటాయి, వాటి అందమంతా అవి పురివిప్పి నాట్య మాడుతున్నప్పుడే కనిపిస్తాయి.
మగ నెమల్లకు అందమయిన మెరిసే నీలం-ఆకుపచ్చ లేదా ఆకుపచ్చ రంగు పించం ఉంటుంది. మగ నెమలికి వెనుక బాగంలో తోకలాగా కనిపించేది, దాని పొడావాటి ఈకలు. ఆ ఈకలకు కళ్ళు ఉంటాయి, వాటి అందమంతా అవి పురివిప్పి నాట్య మాడుతున్నప్పుడే కనిపిస్తాయి.
ఆడ నెమలి ఆకుపచ్చ, గోధుమ మరియు బూడిద రంగులలో ఉండే పించం ఉంటుంది. మగ నెమల్ల వలె ఆడనెమలికి పొడావాటి తోక లాంటి ఈకలు ఉండవు, కానీ వీటికి ఒక కొప్పూంటుంది.
నెమలి పించాలలోని ఆ అత్బుత రంగులకు కారణం, వాటి ఈకలమీద పేర్చినట్లు ఉండే సన్నని పీచు లాంటి పదార్దాలే. అక్కడ కనిపించే వివిధ రంగులకు వాటి అమరికలోని నిడివి తేడాలే కారణం. గోధుమ రంగు ఈకలకు, ఎరుపు మరియు నీలం రంగులు అవసరం - వీటిలో ఒక రంగు అమరిక వలన సృస్టింపబడగా, రెండొవది హద్దులలో ఉండే ఇంకో అమరిక వలన వచ్చే కాంతి పరావర్తనం వలన ఏర్పడుతుంది. ఇటువంటి పరావర్తనం వలనే నెమలి నాట్యమాడుతున్నప్పుడు వాటి పించాలు మనకు వివిద కోణాలలో వివిద రంగులుగా కనిపిస్తాయి.
దాదాపు 2000 సంవత్సరాల కాలం నుండి మనుషుల పోషణలో నెమలి ఉన్నదని భావిస్తున్నారు.నెమలిలో పెంపుడు జంతువులలో కనిపించే లక్షణాలు చాలా తక్కువగా వున్నాయి.వీటి నుండీ ఇతర కొత్త జాతులు సృష్టింపబడ్డాయి.
ఇతర జాతులతో అంటకట్టించటం వలన వేరు వేరు రంగుల ఈకలున్న నెమల్లు మనకు కనిపిస్తాయి. అటువంటి వాటిలో తెల్ల శరీరం కలవి చెప్పుకోతగ్గవి.
మబ్బులు పట్టాగానే నెమలి తన అందాన్ని మరింత బాగా చూపి నాట్యం ఆడుతుంది.  ఇంత అందామయిన పక్షికి ఈనాడు నివాస స్తలాలేలేవు. నెమలి తుప్పలు, గడ్డి ప్రదేసాలాల్లో నివసిస్తుంది.  ఇప్పుడు ఆకు రాలే కాలం కదా గడ్డి తుప్పాలను నిప్పుపెట్టేసారు వాటికి సరి ఐన ప్రదేశం లేక కొత్త ప్రదేసాలకోసం అన్వేషిస్తున్నాయి.  ఆ ప్రయత్నంలో కొన్ని మనుషులకు దొరికిపోయి చంపబడుతున్నాయి.  మా ఇంటిదగ్గర గడ్డి కాల్చేసారు.  అప్పుడు అవి దగ్గరలో వున్నా వాటర్ ట్యాంక్ మీద ఎలా కుర్చున్నవి అప్పుడు నేను తీసిన ఫోటో చూడండి. అంత అందంగా వున్నా మన జాతీయ పక్షి అయిన నెమలి జాతి అంతరించి పోకుండా కాపాడ వలసిన బాధ్యతా మనందరికీ వుంది.   దయచేసి నెమలి ని చంపవద్దు దాని అందాన్ని చూసి ఆనందిచుదాం.  
Please Save Our National Bird 

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)