చిన్ని కృష్ణుని అల్లరి మితిబారినది. వాని అల్లరి వారి భరించలేక పోతున్నారు. ఒక గోపెమ్మ చిన్ని కృష్ణుని కొట్టబోయినది. మరో గోపెమ్మ వారించెను. రేపల్లె వెన్న దొంగ కృష్ణుడు ను యశోదమ్మ కొట్టబోయినది. అప్పుడు అమ్మ కాలమీద పడినాడు చిన్నివాడు. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు కృష్ణునకిది వెన్నతో బెట్టిన విద్య. ఇంకేమున్నది ? గోపెమ్మ కోపము మటు మాయమైనది. కృష్ణునకు అలుసుగా తీసుకున్నాడు. తన స్నేహితులతో ఊరిమీదికి బోయి, గొల్లల వాడలలో ఇళ్ళను కొల్లగొట్టినాడు. వెన్న ముద్దలు మాపుదాకా ముక్కున కారునట్లు బుక్కినాడు.
గోప కృష్ణుని అల్లరి మితిమీరినది. యశోదమ్మ బాలుని దండింపదలచినది. చిన్ని కృష్ణుని రోటికి గట్టినది. అది అంత తేలికా ? అప్పుడు శ్రీ కృష్ణునికి కోపమే వచ్చినది. తన్ను రోటికి కట్టిన తల్లిపై రాళ్ళు రువ్వినాడు. తన చిన్ని చేతులకు అందినంత వరకు విసిరినాడు. చిదిమిన పాలు గారు చిన్ని బుగ్గలతో, చిలికిన నవ్వులతో, మొల చిరు మువ్వలతో గోకులమంతా కలియ దిరిగే నందకిశోరుడు బాలుడా ! పరబ్రహ్మ స్వరూపుడు. త్రిమూర్తులలో మేటియైనవాడు.
బాలకృష్ణ కేళీవిలాసాలు చిలికి చిలికి పెద్దవైనవి. యశోదతో ఫిర్యాదు చేయుటకు వ్రజ భామలు కదలి వచ్చినారు. గోకుల మిల్లిల్లు కదలినది. అక్కడి దృశ్యమును చూచి పల్లీబిబ్బోకవతులు ఆశ్చర్యచకితలైనారు. కృష్ణుడు పసిబాలుని వలె ఒక మూలకు ఒదిగి, యశోదాదేవి యొడిలో చేరి పాలు త్రాగుతున్నాడు. ఆ తల్లి కన్నులతో వాత్సల్యాన్ని కురిపిస్తూ, తన తనయుని తల నిమురుతున్నది. ముద్దుగుమ్మలు ఆ ముద్దుల బాలుని చూచి ముసి ముసి నగవులతొ వెనుకకు మరలినారు.
ఆ లీలామానుష విగ్రహుడే నేడు వేంకటగిరిమీద మూలభూతియై నిలచినవాడు. అంత గొప్ప సన్నివేశానికి చూడటానికి రెండు కళ్ళు అయినా సరోపోవు కదా. ఇదంతా కృష్ణమాయ .
మొత్తకురే అమ్మలాల -ముద్దులాడు వీడె
ముత్తెము వలె నున్నాడు - ముద్దులాడు
చక్కని యశోద తన్ను సలిగతో మొత్త రాగా
మొక్క బోయీ గాళ్ళకు - ముద్దులాడు
వెక్కసాన రేపల్లె - వెన్నలెల్ల మాపుదాక
ముక్కున వయ్యగ దిన్న - ముద్దు లాడు
రువ్వెడి రాళ్ళ దల్లి - రోలదన్ను గట్టెనంట
మువ్వల గంటల తోడి ముద్దు లాడు
నవ్వెడి జెక్కులనిండ - నమ్మిక బాలుని వలె
మువ్వురిలో - నెక్కుడైన ముద్దులాడు
వేలసంఖ్యల సతుల - వెంటబెట్టుకొనిరాగా !
మూల జన్ను గుడిచీని ముద్దులాడు
మేలిమి వెంకటగిరి మీద నున్నాడిదె వచ్చి
మూలభూతి దానైన ముద్దులాడు
naku vedavati prabhakar gari version chala istham :
రిప్లయితొలగించండిhttp://www.esnips.com/displayimage.php?album=&cat=0&pid=378866