Blogger Widgets

మంగళవారం, మార్చి 27, 2012

సీతమ్మ మాయమ్మ

మంగళవారం, మార్చి 27, 2012





                                        లలిత రాగం - రూపక తాళం

గాయకులు:  శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ

పల్లవి : సీతమ్మ మాయమ్మ - శ్రీరాముడు మా తండ్రి

అనుపల్లవి : వాతాత్మజ సౌమిత్రి - వైనతేయ రిపు మర్దన
ధాత భరతాదులు సో - దరులు మాకు; ఓ మనస !


చరణము:  పరమేశ వసిష్ఠ పరా - శర నారద శౌనక శుక
సురపతి గౌతమ లంబో - దర గుహ సనకాదులు
ధర నిజ భాగవతా గ్రే - సరు లెవరో వారెల్లను
వర త్యాగరాజునికి - పరమ బాంధవులు; మనస !

సోమవారం, మార్చి 26, 2012

నమో నమో దశరథనందన రామ

సోమవారం, మార్చి 26, 2012


నమో నమో దశరథనందన రామ
కమనీయయాగభాగకర్త రామ

కాకుత్థ్సకుల రామ కౌసల్యాసుత రామ
శ్రీకరగుణోన్నత శ్రీరామ
కాకాసురవైరి రామ కౌశికవత్సల రామ
భీకర తాటకాంతకబిరుద రామ

వారిధిబంధన రామ వాలిహరణ రామ
చారుహరకోదండభంజన రామ
ధారుణీజపతి రామ దశకంఠహర రామ
సారవిభీషణాభీషేచన రామ

అమరపాలిత రామ అయోధ్యాపతి రామ
సమరకోవిద రామ సర్వజ్ఞ రామ
విమల రామ శ్రీవేంకటగిరి రామ
రమణ శరణాగతరక్షక రామ

శనివారం, మార్చి 24, 2012

వాతాపి గణపతిం భజే

శనివారం, మార్చి 24, 2012

ముత్తుస్వామి దిక్షితార్, అందరికీ తెలుసోలేదో నాకు అంతగా తెలియదు కానీ,  అందరికీ వాతాపి గణపతిం భజే అన్న కీర్తన విననివారు వుండరు.  ఈ కీర్తనను ముత్తుస్వామి దీక్షితార్ రచించారు.  ఈయన తంజావూరు, తమిళనాడు నందు మార్చి 24, 1774 న రామస్వామి దీక్షితార్, సుబ్బలక్ష్మి ఆండాళ్ అను పుణ్యదంపతుల వారాల ఫలముగా జన్మించినాడు. ముత్తుస్వామి వారి కలం పేరు గురుగుహ. ముత్తు, చిన్నతనం లోనే తన తండ్రి గారి గురువు అయిన గొప్పవారు చిదంబరనాథ యోగి దగ్గర తన విద్యాభ్యాసము ప్రారంభించారు. ఆయనలో గొప్ప అంతర్గత శక్తీ వుంది.  అదీ మానవాతీతమైనది.  ముత్తుస్వామి కోసం గురువుగారు కాశి వెళ్లి జీవితసత్యాలు భోధించారు.  యోగి ఆరు సంవత్సరాలు కోసం అతనుఅక్కడే నివసించారు.  మాస్టరింగ్సంస్కృతం, సాహిత్యం మరియు వ్యాకరణం, తత్వశాస్త్రం మరియు తంత్ర యోగ తో నేర్చుకున్నాడు.వారు ఇద్దరు అనేక ఆలయాలు సందర్శించారు. అతను దీవించిన ప్రకారము  తద్వారా బయలుదేరడానికి ముందు చివరిగా తన నిష్క్రమణ సందర్భంగా, మాస్టర్, హోలీ గంగా లో స్నానము చేసి,  రమ్మని అతనికి చెప్పాడు. దీని ప్రకారం, దిక్షితార్ గురువు చెప్పినట్టే నది లోకి వెళ్లి  కొన్ని దశలను అవరోహణ, నీటి లోకిమునిగిన తరువాత ఒ అద్భుతం జరిగింది. పదాలు 'రామ' లిఖించబడిన ఒక వీణ జలాల నుండిఅతనికి దగ్గరకు వచ్చింది. అతని సంగీత శిక్షణ అంతా తన తండ్రి రామస్వామి దీక్షితార్ వద్ద  కింద ప్రధానంగామరియు అతను కూడా బాల్యంలో అది లో అత్యంత పెద్దగా తెలీదు మారింది. అతను 'బ్రిందవని సారంగ్', 'Hamiu కళ్యాణి' (ఉత్తర యొక్క కేదర్ కు సమానమైన) వంటి రాగంలో కృతి కూర్చారు . ముత్తుస్వామి దీక్షితర్ కర్ణాటక సంగీతత్రయంలో ఒకరైన వాగ్గేయకారుడు .ముత్తుస్వామి ఉత్తరదేశపు సంగీతమైన హిందూస్తానీ కూడా నేర్చుకున్నాడు. "శ్రీనాధాధి గరుగుహోజయతి" అనే మాటలతో ప్రారంభమయ్యే తొలి కీర్తనను ఇతడు రచించి రాగం కూర్చాడు. అతను 1835 లో మరణించాడు. 
ఈక్రింద ముత్తుస్వామి రచించిన వాతాపి గణపతిం భజే, ఈ కీర్తన అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గాత్రముతో వినండి తరించండి.

గురువారం, మార్చి 22, 2012

శ్రీ నందన నామ సంవత్సర శుభాకాంక్షాలు.

గురువారం, మార్చి 22, 2012


యుగయుగాలు మారుతూ వచ్చింది యుగాది 
ఐదు వేల నూట పదమూడవ యుగాదిగా  
కలియుగమందు వచ్చింది.
కొత్త రోజుకు కొత్త కొత్తగా వచ్చేసింది.
కొత్తదనము మనసును కొత్తకొత్తగా 
సరికొత్తగా నింపుటకు వచ్చింది.
ఖరను విడిచి నందనములోన అడుగిడుతూ 
మంచినే మనచెంతకు చేర్చుటకు వచ్​చింది. 
కోటి ఆశలుతో వున్నమనకు 
నందన మన జీవితాన్ని నందనవనం చేయుటకు 
మన ముంగిట నిలిచి వున్నది 
సంతోషంతో ఆహ్లాదముతో, ఉత్సాహంగా ఉల్లాసము​గా ,
గతాలు మరచి, ఖరలోని ఓటమిని మరచి.
నందనంలోకి ఆనందగా ప్రవేసించి 
ఈ యుగాదికి స్వాగతము పలుకుదాం
అందరమూ సంతోషముగా 
నవనందనలో జీవిద్దాం
ఆనందాన్ని అనుభవించుదాం. 

బ్లాగ్ మిత్రులందరకు, నా కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు ఈ ఉగాది సుఖసంతోషాలను పంచాలని కోరుకుంటూ..... శ్రీ నందన నామ సంవత్సర శుభాకాంక్షాలు.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)