లలిత రాగం - రూపక తాళం
గాయకులు: శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ
|
పల్లవి : సీతమ్మ మాయమ్మ - శ్రీరాముడు మా తండ్రి
- అనుపల్లవి : వాతాత్మజ సౌమిత్రి - వైనతేయ రిపు మర్దన
ధాత భరతాదులు సో - దరులు మాకు; ఓ మనస !
చరణము: పరమేశ వసిష్ఠ పరా - శర నారద శౌనక శుక
చరణము: పరమేశ వసిష్ఠ పరా - శర నారద శౌనక శుక
సురపతి గౌతమ లంబో - దర గుహ సనకాదులు
ధర నిజ భాగవతా గ్రే - సరు లెవరో వారెల్లను
వర త్యాగరాజునికి - పరమ బాంధవులు; మనస !
ఎందరో ఈ కీర్తనను పాడినా, బాలమురళీకృష్ణగారి పాటలో మాత్రమే సాహిత్యం అర్థవంతంగా ఉందని నా ఉద్దేశ్యం. మీరు సాహిత్యం రాయడంలో పదాలను పాడటానికి వీలుగా విడగొట్టారు కానీ విన్నప్పుడు అంత సులభంగా అర్థమవ్వదని నా భావన.
రిప్లయితొలగించండి