యుగయుగాలు మారుతూ వచ్చింది ఈయుగాది
ఐదు వేల నూట పదమూడవ యుగాదిగా
కలియుగమందు వచ్చింది.
కొత్త రోజుకు కొత్త కొత్తగా వచ్చేసింది.
కొత్తదనము మనసును కొత్తకొత్తగా
సరికొత్తగా నింపుటకు వచ్చింది.
ఖరను విడిచి నందనములోన అడుగిడుతూ
మంచినే మనచెంతకు చేర్చుటకు వచ్చింది.
కోటి ఆశలుతో వున్నమనకు
నందన మన జీవితాన్ని నందనవనం చేయుటకు
మన ముంగిట నిలిచి వున్నది
సంతోషంతో ఆహ్లాదముతో, ఉత్సాహంగా ఉల్లాసముగా ,
గతాలు మరచి, ఖరలోని ఓటమిని మరచి.
నందనంలోకి ఆనందగా ప్రవేసించి
ఈ యుగాదికి స్వాగతము పలుకుదాం
అందరమూ సంతోషముగా
నవనందనలో జీవిద్దాం
ఆనందాన్ని అనుభవించుదాం.
బ్లాగ్ మిత్రులందరకు, నా కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు ఈ ఉగాది సుఖసంతోషాలను పంచాలని కోరుకుంటూ..... శ్రీ నందన నామ సంవత్సర శుభాకాంక్షాలు.
మీకూ, మీ కుటుంబసభ్యులకూ నందననామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండినందన నామ సంవత్సరంలో నందనందనుని కృపాకటాక్ష వీక్షణాలు మనందరిపైనా మిక్కిలి ప్రసరించాలని కోరుకుంటున్నాను.
రిప్లయితొలగించండిమీకూ మా "చిన్ని ఆశ" ఉగాది శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండిమీకు నా ధన్యవాదములు. పరిమళం గారికి , చిలమకూరు విజయమోహన్ గారికి, మరియు చిన్ని ఆశ గారికి ప్రత్యేక ధన్యవాదములు.
రిప్లయితొలగించండి