Blogger Widgets

శుక్రవారం, మార్చి 29, 2013

మొదటి భారత స్వాతంత్ర్య పోరాటానికి నాంది

శుక్రవారం, మార్చి 29, 2013


కోల్కతా దగ్గర బారక్ పూర్ వద్ద మార్చి 29, 1857 న  ఆవు కొవ్వుతో తయారుచేసిన తూటాను వాడేందుకు నిరాకరించి మంగళ్ పాండే అనే సైనికుడు ల్యూటినెంట్ బాగ్ వద్ద, ఒక బ్రిటిషు అధికారిని కాల్చి చంపాడు. మొదటి భారత స్వాతంత్ర్య పోరాటానికి నాంది ఇది. చంపటానికి మూల కారణం ఏమిటి అంటే  బ్రిటిషు వారు సిపాయిలకు తుపాకులకు ఆవు కొవ్వు మరియు పంది కొవ్వును పూసిన తయారు చేసిన తూటాలు (cartridges) ఇచ్చేవారు. ఆ తూటాలని నోటితో కొరికి తొక్క తొలిగిస్తేనే పేలుతాయి. హిందూ ముస్లిం ఇద్దరికీ ఇవి నచ్చలేదు. ఇదే మొదటి భారత స్వాతంత్ర్య ఉద్యమానికి పోరాటానికి నాంది పలికిన రోజుగా చెప్పుకోవచ్చు.
మంగళ్ పాండే ఈస్ట్ ఇండియా కంపెనీ లో  34వ బెంగాల్ రెజిమెంట్ యందు ఒక సిపాయి గా పని చేసారు.  సిపాయిల తిరుగుబాటు ప్రధాన కారణం సరళి 1853 లో enfield rifle భుజాన వేసుకోని వెళ్ళే తుపాకిఉండేది. ఒక కొత్త rifle లోడ్ చేయడానికి, సైనికులు గుళిక కొరుకి మరియు రైఫిల్ యొక్క లోపలకి తుపాకీమందు పోసుకోవడం వల్ల పనిచేస్తుంది.  గుళికలు పంది క్రోవ్వు తోgrease చేయబడ్డాయి.  అని పుకారు ఉంది. పంది క్రోవ్వు ముస్లింలు అపరిశుభ్రమైనదిగా  చెప్పబడుతుంది. హిందువులు పవిత్రముగా భావించే ఆవు మాంసము కొవ్వు మరియు పంది కొవ్వు ఈ బుల్లెట్స్ల లో ఉపయోగిస్తారు. బ్రిటిష్ సైన్యంలో భారతీయులు 96% గా మరియు కాబట్టి హిందువులు మరియు ముస్లింలు రెండు  గుళికలును అంగీకరించలేదుఅందరూ కలసి ఒక సంస్థ నమ్మకం కలిగి మరియు  అసంతృప్తి ఒక ప్రధానముగా తిరుగుబాటుగా మారినది.  
ఇక్కడ ఎక్కువ  మతవిశ్వాసంగల హిందూమతం మరియు ఖచ్చితంగా తనమతం సాధన కలవాడు ఎవరు మంగళ్ పాండే, ఈయన జీవితం చరిత్ర గురించి తెలుసుకుంటే మరింత బాగుంటుంది. ఇది భారత సిపాయులు ఉపయోగించే ఎన్ఫీల్డ్ P-53 రైఫిల్ ఉపయోగించే గుళిక పంది మరియు ఆవు కొవ్వు కొవ్వు తో greased పుకారు వచ్చింది.  గుళికలు కవర్ ముందు ఉపయోగం తొలగించేందుకు సగం కరిచి వాడాల్సి వచ్చింది మరియు ముస్లింలు మరియు హిందువులు మత విశ్వాస వ్యతిరేకంగా వుంది . సాధారణ ఈ అభిప్రాయం బ్రిటీష్వారు ఉద్దేశపూర్వకంగా భారతీయుల మనోభావాలు బాధించింపదలచి ఈ ప్రయోగం చేసారు. మరియు  పాండే కు కోపం అత్యంత స్తాయికి చేరటానికి మూల కారణం ఇదే.  మన భారతీయులను బ్రిటిష్వారు ఎన్నిరకాలుగా భాధపెట్టారో తెలుసుకుంటే చాలా భాదాకరంగా వుంది.   అంత కష్టపడి సంపాదించిన భారత దేశాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి.  
జైయాహో భారత్.

మంగళవారం, మార్చి 26, 2013

మదన పూర్ణిమ - హోళీ ప౦డుగ

మంగళవారం, మార్చి 26, 2013


మదన పూర్ణిమ - హోళీ ప౦డుగ

ఫాల్గుణ శుధ్ధ పూర్ణిమ విశేష శక్తితో కూడినది. ఈ దినాన రాక్షస పీడ పోయే౦దుకు "హోళికా" అనే ఒక విధమైన శక్తిని ఆరాధిస్తారు. ఆమె ప్రీతి కోస౦ అ౦దరూ కలిసి గానాలు చేయడ౦, పరిహాసాలాడడ౦ చేస్తారు. హోలికాగ్నిని రగిల్చి ఆరాధి౦చే స౦ప్రదాయ౦ ఇప్పుడు తగ్గిపోయి పరిహాసాది క్రియలే మిగిలాయి.

శ్రీమహాలక్ష్మి క్షీరసాగర౦ ను౦డి ఆవిర్భవి౦చి౦దని పురాణ కథ. ఈ ఏడాది పూర్ణిమ, ఉత్తర ఫల్గుణి కలిసి వచ్చాయి. కనుక ఈ దినాన భక్తి శ్రధ్ధలతో మహాలక్ష్మిని షోడశోపచారములతో చక్కగా ఆరాధి౦చి లక్ష్మీ అష్టోత్తర శతనామాలు, కనకధారాస్తోత్ర౦, వ౦టివి పారాయణ చేయడ౦ మ౦చిది. ఈరోజున లక్ష్మిని శ్రద్ధగా అర్చి౦చే వారికి సమస్త ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.

ఈరోజుననే శ్రీకృష్ణుని ఉయ్యాలలో వేసి ఆరాధి౦చాలి. దీని ’డోలోత్సవ౦’ అని అ౦టారు. ఒరిస్సావ౦టి ప్రా౦తాలలో డోలా పూర్ణిమ పేరుతో ఇప్పటికీ దీనిని ఆచరిస్తారు.

నరాడోలాగత౦ దృష్ట్వా గోవి౦ద౦ పురుషోత్తమ౦!
ఫాల్గుణ్యా౦ ప్రయతో భూత్వా గోవి౦దస్య పుర౦వ్రజేత్!!

ఉయ్యాలలో అర్చి౦పబడిన పురుషోత్తముడైన గోవి౦దుని ఈరోజున దర్శి౦చిన వారికి వైకు౦ఠలోక౦ ప్రాప్తిస్తు౦దని ధర్మశాస్త్రాల వాక్య౦.



హోలీ విశ్వ వ్యాప్తంగా ప్రకాశించే రంగుల పండుగ. ఈ పండుగ రోజున, తేజం యొక్క వివిధ తరంగాలు విశ్వవ్యాప్తంగా ప్రకాసిస్తాయి, అక్కడ వివిధ రకాల రంగులు ఉత్పత్తి అయ్యి వృద్ది పొంది మరియు వాతావరణంలో ధాతువు పూర్తి సంపూర్ణ ధర్మాన్ని కలిగి ఉంటాయి. ఇదే ఈ పండుగ విశేషము.  
 హిరణ్యకశ్యపుడి పుత్రుడైన ప్రహ్లాదుడు, భగవంతుడైన విష్ణువుకు భక్తుడు. హిరణ్యకశ్యపుడు పలు మార్లు బెదిరించినప్పటికి, ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుని ప్రార్థించేవాడు. ఇతడి నోటిలో విషం పోస్తే, అది అమృతంగా మారింది. ఏనుగులచే తొక్కించమని ఆదేశించినా అతనికి ఎటువంటి హాని జరగలేదు. ఆకలితో ఉన్న విష సర్పాలున్న గదిలో ఉంచినప్పటికీ జీవించ గలిగాడు. హిరణ్యకశ్యపుడు తన కొడుకును చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరిగా, ప్రహ్లాదుడిని హిరణ్యకశ్యపుడి యొక్క సోదరి అయిన హోలిక ఒడిలో చితిలో కూర్చోవాలని ఆజ్ఞాపించాడు, ఎందుకంటే మంటల నుండి రక్షించే శాలువాను ఆమె ధరించడం వలన ఆమెకి ఎలాంటి హాని జరగదు. ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి, తనను రక్షించమని విష్ణువును వేడుకుంటాడు. మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోలిక శాలువా ఎగిరి పోవడం వలన ఆమె దహనం అవుతుంది ఆ శాలువా ప్రహ్లాదుడిని కప్పడం వలన అతడికి ఎటువంటి హాని జరగదు. హోలిక మంటల్లో కాలిపోవటం వల్ల మనం హోలీను జరుపుకుంటున్నాము.

ప్రాథమిక పరిశోధనల ప్రకారం 7వ శతాబ్దంలో రత్నావళి అనే సంస్కృత నాటకం వలన హోలీ పండుగ ఉత్సవాలు జరుపుకొన్నారని తెలిసింది. వాస్తవంగా హోలీ పండుగకు సంవత్సరం పొడవునా ఆచారాలు ఉంటాయి, మొదటగా రంగు పొడిని ఒకరికొకరు పూసుకుంటారు మరియు పొడవైన చిమ్మే గొట్టాలు లేదా చిమ్మే తుపాకుల నుండి రంగు నీటిని జల్లుకుంటారు. సంగీత కచేరీల ద్వారా అనగా పండుగకు సంబంధించిన పాటలను మరియు రాధా మరియు కృష్ణ పురాణ ప్రేమ కథ గురించి పాటలు పాడేవారు; ముఖ్యంగా జానపద పాటలు అనగా "హోరి" పాటలను పాడేవారు. కొన్ని సంప్రదాయక జానపద పాటలు ఆజ్ బిరాజ్ మే హోలీ రే రాసియా కొన్ని తరాల నుండి ఇప్పటి వరకు కూడా ఉన్నాయి.
సంవత్సరాలు గడుస్తున్నకొద్ది, ప్రవాసభారతీయులు ఉంటున్న చాలా ప్రాంతాలలో అనగా ఆఫ్రికా, ఉత్తర అమెరికాలో, యూరప్ మరియు దక్షిణ ఆసియాకు దగ్గర ఉన్న ప్రాంతాలలో హోలీ పండుగను ఘనంగా జరపుకుంటారు.
వసంత కాలంలో వాతవరణములో మార్పూలు జరగటం వల్ల వైరల్ జ్వరం మరియు జలుబు వస్తాయని ప్రజలు విశ్వసిస్తారు. అందుకని, సహజమైన రంగు పొడులను చల్లుకోవడం వల్ల ఔషధముగా పనిచేస్తుందని అర్థం: సంప్రదాయముగా రంగులను నిమ్మ , కుంకుమ, పసుపు, బిల్వ లను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారు.
తడి రంగుల కొరకు, మోదుగ పుష్పములు రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు, అది ఔషధ లక్షణాలు కలగి ఉంటుంది.  రసాయన రంగుల ఉపయోగం హానికరంగా తయారయ్యింది. వీటి వల్ల అంతుచిక్కని వ్యాధులు వస్తున్నాయి.  అలాంటి వ్యాధులు రాకుండా వుండాలి అంటే రసాయన రంగులను ఉపయోగించకుండా వుంటే మంచిది.
ఇది వసంతోత్సవ పండుగ.  హోలీ పండుగ కృష్ణుడు కూడా జరుపుకున్నాడు అంటారు.  ఈ పండుగ గురించి నేను కొంచెమే తెలుసుకున్నాను అని నాకు అనిపిస్తోంది. 
హోలీ పండుగను అందరు సంతోషము గా జరుపుకోవాలని అనుకుంటున్నాను.  అందరికి 
హోలీ పండుగ శుభాకాంక్షలు.

సోమవారం, మార్చి 25, 2013

Tomorrow is too late.

సోమవారం, మార్చి 25, 2013

Tomorrow is too late
శనివారం నాడు నాకు హోంవర్క్ కొంచెమే చెయ్యవలసి వుంది .  అయితే నేను అనుకున్నాను వర్క్ కొంచెమే కదా వుంది ఆదివారం చేసుకుందాం అని. ఆదివారం నాడు నాకు వర్క్ చేసుకోటానికి time  కుదరలేదు.  రాత్రి నిద్ర వచ్చేసి పడుకుని రేపు అంటే సోమవారం early morning లేచి వర్క్ చేసుకుందాం అనుకున్నా.  అనుకున్నట్టే లేచాను కానీ పవర్ లేదు హోం వర్క్ చెయ్యలేక పోయా అప్పుడు నాకు అమ్మమ్మ నాకు ఒకసారి కద చెప్పింది కదా tomorrow is too late అనే విషయం మీద.  ఆకధ మీరు కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. 
అనగనగా ఒకసారి ఒక బ్రాహ్మణుడు యజ్ఞము చెయ్యాలని అనుకుని ధర్మరాజు ను సహాయం అడిగాడు.  ధర్మరాజు ఆ బ్రాహ్మణుని మరుసటి రోజు రమ్మన్ని పంపివేసాడు. ధర్మరాజు మాటలును విన్న భీముడు నగరమంతా తోరణాలు కట్టించి అలంకరించి , గొప్పగా పండుగ చెయ్యాలని తన పరివారమునకు ఆనతిని ఇచ్చాడు.
ధర్మరాజు భీమసేనునితో "భీమా ! ఈ రోజు ఏమి విశేషము ? ఈ ఏర్పాటులు అన్నీ దేని గురించి?" అని అడిగాడు.
దానికి భీముడు, " అన్నా! మీరు రేపటివరకు జీవించి ఉంఢగలననీ , మీ మాటను మీ మాటను నేరవేర్చుకోగాలరని దృఢ నమ్మకం వున్నది. మీరు ఆడిన మాటను తప్పరని నాకు తెలుసు. ఈ ప్రపంచములో రేపటివరకు జీవించి వుండగలను అన్నా ధీమాగా చెప్పగల వ్యక్తి మీరు తప్ప ఎవరు ఉండగలరు? అందుకనే ఈ పండుగ జరుపుకోదలిచాను. " అని సమాధానము ఇచ్చాడు భీముడు.
ధర్మరాజు తన తమ్ముడు ఇంత సుక్షంగా తన కర్తవ్యమును గుర్తు చేసాడని ఆనందించాడు. ఏ మంచి కార్యమును తలపెట్టిన వెంటనే చెయ్యాలి. ఆలస్యము చేయకూడదు.
గతించిన కాలము మనది కాదు. రేపు మనచేతిలో లేదు. వర్తమానంలో జీవించాలి.
అమ్మమ్మ చెప్పింది tomorrow is too late అని.  మీరు కూడా గుర్తు పెట్టుకొండి  ఈవిషయాన్ని అనుకున్న పని వెంటనే చేసేయండి.  మీకు డౌట్ వుంది కదా ఇంతకీ  నా వర్క్ కంప్లీట్ అయ్యిందో లేదో అని నా వర్క్ కంప్లీట్ చేసేసి ఈ స్టొరీ మీకు కూడా షేర్ చేస్తున్నా.  వర్క్ కంప్లీట్ అయ్యింది కానీ అంతకు ముందు చాలా టెన్షన్ పడ్డాను కదా . అలా అంత టెన్షన్ పడకుండా అనుకున్న పని వెంటనే చెయ్యాలి అని తెలుసుకున్నాను. 

ఆదివారం, మార్చి 24, 2013

ముత్తుస్వామి దీక్షితులు

ఆదివారం, మార్చి 24, 2013

అత్యద్భుతమైన కృతులను రచించిన ముత్తుస్వామి దీక్షితులు సంగీతత్రయంలోత్యాగరాజు తర్వాత రెండవవారిగా పరిగణింపబడతారు. ముత్తుస్వామి దీక్షితర్ కర్ణాటక సంగీతత్రయంలో ఒకరైన వాగ్గేయకారుడు . 
వాతాపి గణపతిం భజే అన్న కీర్తన విననివారుండరంటే అది అతిశయోక్తి కాదేమో. అది ఆయన రచించినదే. రామ స్వామి దీక్షితర్, సుబ్బలక్ష్మి అంబాళ్ పుణ్యదంపతుల సంతానంగా 1775లో పుట్టాడు. నేడే ముత్తుస్వామి దీక్షితులు వారి జయంతి.  
ఈయన భక్తిశ్రద్ధలుగల వ్యక్తి గుణగణాలను తన బాల్యంలోనే ఇతడు ప్రదర్శించాడు. సంగీతంపై వెలువడిన "వెంకటాముఖి" సుప్రసిద్ధ గ్రంధం "చతుర్‌దండి ప్రకాశికై"ను అధ్యయనం చేశాడు. కావలసినమేరకు మన ధర్మ గ్రంధాల పరమైన జ్ఞానాన్ని కూడా సంపాదించగలిగాడు.రామస్వామి దీక్షితులు వీరి తండ్రి. వీరు సంగీత, వ్యాకరణ, జ్యోతిష, వాస్తు, మాంత్రిక, వైద్య విద్యలలో ఆరితేరిన వ్యక్తి. గురుగుహ ముద్రతో వున్న వీరి కృతులన్నీ సంస్కృతంలోనే వున్నవి. హిందూస్థానీ సంగీతంనుండి వీరు కర్ణాటక సంప్రదాయానికి వీరు తెచ్చిన రాగాలు సారంగద్విజావంతిమొదలైనవి. వీరు అనేక క్షేత్రములు తిరిగి ఆయా ప్రదేశములలో వున్నట్టి దేవస్థానములను సందర్శించి దేవతలపై కృతులు జేసారు. ఆయన రచించిన కృతులలోకమలాంబా నవావర్ణ కృతులునవగ్రహ కీర్తనలు ప్రత్యేక స్థానాన్ని కలిగి వున్నాయి. వీరి యితర ప్రముఖ రచనలు: వాతాపి గణపతిం భజే, మహా గణపతిం, శ్రీనాథాది గురుగుహో, అక్షయలింగ విభో, బాలగోపాల, అఖిలాండేశ్వరి, రామచంద్రం భావయామి, చేత: శ్రీబాలకృష్ణం, శ్రీ వరలక్ష్మి, సిద్ధి వినాయకం, త్యాగరాజ యోగవైభవం, హిరణ్మయీం, అన్నపూర్ణే, అరుణాచలనాథం, ఆనందామృతకర్షిణి, మామవ మీనాక్షి, మీనాక్షి మే ముదం దేహి, నీలకంఠం భజే, స్వామినాథ, శ్రీ సుబ్రహ్మణ్యాయ, పరిమళ రంగనాథం, మొదలైనవి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)