Blogger Widgets

శనివారం, ఫిబ్రవరి 03, 2018

రామచరిత మానస, 11, సజ్జనులు మంచినే పట్టుకుందురు.

శనివారం, ఫిబ్రవరి 03, 2018

దో -  భలో భలాఇహి పై లహఇ , లహఇ  నిచాఇహి నీచు ||
         సుధా సరాహిఅ  అమరతాC , గరల సరాహిఅ మీచు ||  5  ||
సజ్జనులు మంచినే పట్టుకుందురు.  దుర్జనులు చెడును విడిచిపెట్టారు.  అమృతము అమరత్వమును ప్రసాదించును, విషము మరణమునే ప్రసాదించును ఈరెండును తమతమ గుణములకు ప్రసిద్ధము, దోహదకారులు. 

చౌ - ఖల అఘ అగున సాధు గున గాహా | ఉభయ అపార ఉదధి అవగాహా ||
         తెహి తేC కఛు గున దోష బఖానే    | సంగ్రహ త్యాగ న బిను పహిచానే || 1  ||
         భలెఉ  పోచ సబ బిధి ఉపజాఏ     | గని గున  దోష బేద బిలగాఏ ||
         కహహిC బేద ఇతిహాస పురానా       | బీధి ప్రపంచు గున అవగున సానా || 2||
         దుఖ సుఖ పాప పున్య  దిన రాతీ    | సాధు అసాధు సుజాతి కుజాతీ ||
         దానవ దేవ ఊCచ ఆరు నీచు         | అమిఅ సుజీవను మాహురు మీచూ || 3||
         మాయా బ్రహ్మ జీవ జగదీసా           | లఛ్చి అలఛ్చి రంక అవనీసా ||
         కాసీ మగ సురసిరి క్రమనాసా          | మరు మారవ మహిదేవ గవాసా || 4||
         సరగ నరక అనురాగ బిరాగా           | నిగమాగమ గున దోష బిభాగా ||
దుర్జనుల పాపకృత్యాలను  దోషములను , సజ్జనుల సద్గుణాలను చెప్పే కథలు సముద్రములవలే అపారములు , అగాధములు .  ఇందులో సజ్జనుల గుణములను , దుర్జనులు దోషములను వర్ణించబడినవి .  ఎలా అంటే వారి తారతమ్యమును గుర్తించనిదే సుగుణాలను గ్రహించుటకును , దుర్గుణములను నిరాకరించుటకు సాధ్యము కాదు.  గుణదోషములు రెండును బ్రహ్మ సృష్టిలోని భాగమే .  వాటి తారతమ్యములను వేర్వేరుగా స్పష్టముగా విశదీకరించును .  వేదములతో పాటు  ఇతిహాసపురాణాదులు గూడా బ్రహ్మ సృష్టి గుణదోషముల సమ్మేళనమని నొక్కివక్కాణించెను .  ఇట్టి వైరుద్యములు ఈ సృష్టిలో అనంతము .  సుఖదుఃఖాలు, పాపపుణ్యాలు ,  దివారాత్రములు , మంచిచెడులు, సుజాతికుజాతులు , దేవదానవులు , ఉచ్చనీచములు , అమృతవిషములు , జననమరణములు , బ్రహ్మ - మాయలు , ఈశ్వర - జీవులు , సంపద - దారిద్రములు , రాజు - పేదలు , కాశీ - మగధలు , గంగా - కర్మనాశనాదులు ,  మార్వార - మాళవ దేశములు , బ్రాహ్మణుడు - కసాయివాడు , స్వర్గ -  నరకాదులు ,  వైరాగ్యము - అనురాగములు మొదలగున్నవి.  ఈ వైవిధ్యములు ప్రజలనిదర్శనము, వేదశాస్త్రములు వీటి మంచిచెడులను వివరించినవి .  

శుక్రవారం, ఫిబ్రవరి 02, 2018

రామచరిత మానస, 10, సాధువులకును, దుష్టులకును నమస్కరించుదును.

శుక్రవారం, ఫిబ్రవరి 02, 2018

దో - ఉదాసీన అరి మీత హిత , సునత జరాహిC ఖల రీతి |
         జానీ పాని జుగ జోరి జన ,  బినతీ కరఇ సప్రీతి           ||
దుష్టులు తమ మిత్రులయొక్క, శత్రువుల యొక్క, తటస్థులయొక్క ఉన్నతిని జూచి, ఈర్ష్యతో మాడిపోవుదురు.  వీరి యీరీతిని గమనించి, వినయముతో ప్రేమతో చేతులు జోడించి వీరికి నమస్కరింతును .  (దో || 4 )
చౌ - మైC  అపనీ దిసి  కీన్హ నిహోరా        |  తిన్హ  నిజ ఓర న లఉబ భోరా ||
         బాయస పలిఅహిC అతి అనురాగా  | హోహిC నిరామిష కబహుC కి కాగా || 1 ||
         బందఉC సంత అసజ్జన చరనా      | దుఖప్రద ఉభయ బీచ కఛు బఠనా||
         బిఛురత ఏక ప్రాన హరి లేహిC        |  మిలత ఏక దుఖ దారున దేహీC     || 2 ||
         ఉపజహిC ఏక సంగ జగ మాహిC      |  జలజ జోCక జిమి గున బిలగాహీC || 
          సుధా సుర సమ  సాధు అసాధూ     | జనక ఏక జగ జలధి అగాధూ         ||
          భల అనభల నిజ నిజ కరతూతీ      | లహత సుజస అపలోక బిభూతీ    ||
          సుధా సుధాకర సురసరి సాధూ       |  గరల అనల కలిమల సరి బ్యాధూ|| 4 ||
          గున అవగున జానత సబ కో ఈ       |  జో జెహి భావ నీకా తెహి సో ఈ         || 5 ||
నాధర్మముగా వారిని నేను ప్రార్ధించితిని .  కానీ వారిస్వభావమును మానుకొందురా ? కాకులను ఎంతటి తియ్యటి పాయసముతో పోషించినను అవి మాంసమును తినుట మానుకొనునా ? నేను సాధువులకును, దుష్టులకును నమస్కరించుదును.  ఉభయులును కష్టపెట్టేవారే.   కానీ వారిమధ్య మిక్కిలి అంతరం కలదు.  సాధువులు మనకు దూరమైనను మనకు ప్రాణములే  పోయినట్లే అగును .   దుష్టులు మనకు చేరువైనను మనకు ఎనలేని భాధకలుగును.  ఏ  కాలమునందైనను సజ్జనులను దుష్టులను ఈ లోకమున ప్రక్క ప్రక్కనే జనించుదురు .  కానీ వారి వారి స్వభావములు వేరు .   కమలములు జలగలు నీటిలోనే పుట్టు చుండును .  అమృతము మధిర రెండును సముద్రము నుండియే ఉద్భవించినవి .  సజ్జనులను దుష్టులును వారి వారి కర్మలను అనుసరించి కీర్తి - అపకీర్తి లను పొందును.  సాధువులు స్వభావములు అమృతము, చంద్రుడు పవిత్ర గంగానది  వంటివి .  దుష్టుల స్వభావములు ,విషము , అగ్ని , కలి పాపములతో గూడిన కర్మనాశనదివంటిది .  వీరి గుణావగుణములును ఎల్లరును ఎరుగుదురు .  ఎవరినచ్చినవి వారు గ్రహించుదురు .     

గురువారం, ఫిబ్రవరి 01, 2018

రామచరిత మానస, 9 , దుష్టలకుసైతము నేను సమస్కరింతురు .

గురువారం, ఫిబ్రవరి 01, 2018

              చౌ - బహురి  బంది ఖల గన సతిభాఏC  | జే బిను కాజ దాహినెహు బాఏC        ||
                       పర హిత హాని లాభ జిన్హా కేరేC        | ఉజరేC హరష బిషాద బాసేరేC       ||  1  ||   
                       హరి హర జస రాకేస రాహు సే         | పర అకాజ భట సహసబాహూ సే    ||  
                       జే పర దోష లఖహిC  సాహసాఖీ       | పర హిత ఘృత జిన్హా కే  మన మాఖీ || 2 || 
                       తేజ కృసాను రోష మహిషేసా           | అఘ అవగున ధన ధనీ ధనేసా      || 
                       ఉదయ కేత సమ హిత సబహీ కే      |  కుంభకరన సమ సోవతే నీకే          || 3 || 
                       పర అకాజు లగి తను పరిహరహీC    | జిమి హిమ ఉపల కృషీ దలి  గరహీC ||  
                       బందఉC  ఖల జస సేష సరోషా       | సహస బదన బరనఇ పర దోషా     || 4 || 
                       పుని ప్రనవఉC పృథురాజ సమానా  | పర అఘ సునఇ సహస దస కానా||  
                       బహురి సక్ర సమ బినవుఉC తేహి     | సంతత సురానీక హిత జేహీ          || 5 || 
                       బచన బజ్ర జెహి సదా పిఆరా            | సహస నయన పర దోష నిహారా    || 6 ||
దుష్టులు తమకు అవ్యాజ ప్రేమతో హితమునుచేకూర్చు వారిని సైతము హింసింతురు .  ఇతరులకు హాని చేయుటలోను తమకు లాభము కలదని భావింతురు. ఇతరులను పతనము చూసి ఆనంచుదురు.  ఉన్నతిని జూచి దుఃఖ పడుదురు.  అట్టి దుష్టలకుసైతము నేను సద్భావముతో సమస్కరింతురు .  వీరు హరిహరులకీర్తి అనెడి పూర్ణచంద్రునికి రాహువు వంటివారు.   ఇతరులకు కీడు చేయుటలో వీరు సహస్ర బాహువులు,  ఇతరుల దోషాలను  వేయికనులతో వెతకుదురు.  నేతిని చెడగొట్టు ఈగవలె  వీరి మనస్సులు ఇతరులు హితములను భంగపరచుటలో నిమగ్నమగుచుందురు.  వీరు ఇతరులకు తాపమును  గూర్చుటలో వీరు అగ్నివంటివారు  .     క్రోధములో వీరు యమునివంటివారు.  పాపములు , అవగుణములు అనే ధనమునకు వీరు కుభేరులు. కేతువువలె ( తోకచుక్క )  వీరు అందరహితములను నాశనము చేయుదురు.  వీరు నిద్రలో కుంభకర్ణులవ్వాటమే లోకమునకు  మేలు.  వడగండ్లు పంటలను పాడుచేసి,  తాముకూడా కరిగిపోయినట్లే  వీరు ఇతరులకు కీడు చేయుటకు వారి ప్రాణములు కూడా ఒడ్డేదరు.  వేయి నాలుకలు తో ఇతరుల దోషములను ఆక్రోశము తో ఎన్ను వీరిని శేషుడని భావించి నమస్కరించెదను .  ఇతరుల పాపకృత్యాలను గురించి పదివేల చెవులతో విందురు.  భగవత్కథలను వినుటకై పదివేలచెవులును గోరిన పృద్విరాజుగా వీరిని భావించుదును .  సుర పాన ప్రియులైన వీరిని సురానీక  ( దేవతాసమూహము ) ప్రియుడైన  ఇంద్రుడుగా భావింతును. కఠినాతికఠిన మైన వజ్రాయుధమే ఇంద్రునకు ఇష్టము.  అలానే కఠినాతి కఠినమైన పరుషవచనములే వీరికి ఇష్టము. ఇతరుల దోషములు వెతుకుటలో వీరు సహస్రాక్షులు .    

బుధవారం, జనవరి 31, 2018

రామచరిత మానస 8 సాధుపురుషులకు నమస్కరించెదను .

బుధవారం, జనవరి 31, 2018

                            దో -  బందఉఁ  సంత సమాన చిత , హిత అనహిత నహిC కోఇ |
                                     అంజలి  గత సుభ సుమన జిమి, సుమ సుగంధ కర దోఇ|| 3 (క ) || 
                                     సంత సరల చిత జగత హిత , జాని సుభాఉ   సనేహు      |
                                     బాలబినయ సుని కరి కృపా , రామచరన రతి దేహు         || 4 (ఖ) ||
దోసిట చేరిన పుష్పములు రెండుచేతులుకును (అంటే పుష్పములు కోసిన చేయికి మరియు పట్టుకున్న చేతికి )  సుగంధమును సమానముగా పంచును.     అట్లే సాధుపుంగవులు అందరిని సమభావముతోనే చూచుదురు .  వారికి శత్రువులుకానీ మిత్రులు కానీ ఉండరు .  అట్టి సాధుపురుషులకు నమస్కరించెదను . 
సాధువులు సరళ చిత్తులు , లోకోపకారులు , వారిసద్ భావమును స్నేహమును తెలుసుకుని , " ఓ సాధువులారా ! ఈ బాలుని ప్రార్ధనను మన్నించి శ్రీరామచంద్రునిపాదపద్మములపై ప్రీతికలుగునట్లు అనుగ్రహింపుడు" - అని తులసీదాసు వేడుకుంటున్నారు. 

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)