Blogger Widgets

Monday, January 12, 2009

బోగి పండుగ శుభాకాంక్షలు

Monday, January 12, 2009

పండుగ శుభాకాంక్షలు . మన ఆంద్రులుకు సంవత్సరములో అతిపెద్ద పండుగ మూడురోజులు వరుసగా జురుపుకొనే పండుగ ఇది అందుకే దీనిని పెద్ద పండుగ అనికూడా అంటారు. మొదటిది భోగి, రెండోది సంక్రాంతి, మూడోది కనుమ . ఈ పండుగలను మనదేశములో అన్ని రాష్ట్రాలలోని జరుపుకుంటారు. కాకపొతే వాటికి వారివారి పేరులు ఉన్నాయి.
అసలు ఈ పండుగ జరుపుకోనుతకు ప్రత్యేకమైన కారణం ఏమిటంటే సంవత్సరములో మొదటి పంట చేతికి అందుతుంది దానికి సంతోషముతో ఈ పండుగలను ఆనంద ఉత్సాహాలతో జరుపుకొంటారు.
ఈ మూడురోజులు పండుగ చాలా బాగాజరుపుకుంటారు. అసలైతే ఈ నెలరోజులు పండుగ వాతావరణమే వుంటుంది .
చలి ఎక్కువుగా ఉంటుంది. ఈ నెలరోజులు తెలుగువారి లోగిలి చాలా అందముగా ముస్తాబవుతుంది . ప్రతీ ఇంట రంగురంగుల ముగ్గులతో చక్కని వాతావరనముతో ముచ్చట గొల్పుతూ వుంటాయి. ఆ రంగుల ముగ్గు మద్యలో గొబ్బెమ్మలు ను అలంకరించుతారు. సాయంత్రము సమయాలలో పోలాల్లోనుమ్డి బళ్ళు ధాన్యపు బస్తాలతో నిండి వస్తాయి. చాలా ఆనందముగా సందడిగా ఉంటుంది . ఈ నెల రోజులు.ఆ నెల రోజులు, పగటి వేషగాళ్ళు, హరిదాసులు ,గంగిరేద్దులువాళ్ళు వస్తూవుంటారు .
భోగి పండుగ జనవరి 13 వ తారికున వస్తుంది . భోగి రోజు తెల్లవారుజాముననే లేచి నలుగు పెట్టుకొని స్నానాలుచేసి భోగి మంటను వెలిగిస్తారు . ఈ భోగి మంట లో పాత కర్ర సమానులు వంటివి పనికిరాని వన్ని వేసి చలిని పారగోలుపుతారు. ఈ పెద్ద పండగకి కొత్త అల్లుళ్ళు అత్తగారింటికి తప్పకుండా వస్తారు. బావా మరదళ్ల ఆటలు అల్లర్లుతో పండుగ చాలా సంతోషకరమైన శోభ తో ఉంటుంది. ఈ పండుగని రాయి తులు పండుగ అని కుడా అంటారు.
ఈ పండుగకి ముగ్గులులో గొబ్బెమ్మలు పెడతారు వాటి చుట్టూ పిల్లలు అన్నమాచార్య రచించిన గొబ్బెమ్మల పాట్లు పాడతారు.
కొలని దోపరికి గొబ్బిళ్ళో !
కొలని దోపరికి గొబ్బిళ్ళో యదు కుల స్వామికి గొబ్బిళ్ళో

కొండ గొడుగుగా గోవుల గాచిన కొండుక శిశువుకు గొబ్బిళ్ళో
దుండగంపు దైత్యులకెల్లను తల గుండు గండనికి గొబ్బిళ్ళో

పాప విధుల శిశుపాలుని తిట్టుల కోపగానికిని గొబ్బిళ్ళో
యేపున గంసుని యిడుమల బెట్టిన గోప బాలునికి గొబ్బిళ్ళో

దండివైరులను తరిమిన దనుజుల గుండె దిగులునకు గొబ్బిళ్ళో
వెండిబైడి యగు వెంకటగిరిపై కొండలయ్యకును గొబ్బిళ్ళో

అనే పాటలు పాడుతూ వాటి చుట్టూ తిరుగుతారు. సాయంత్రము సమయములో చిన్నపిల్లలకు బోగిపల్లును దిస్తితీసి వారి తలమీద పోస్తారు. దీనికి పెరంటాల్లను పిలిచి బోగిపళ్ళు పోస్తారు. ఈ బోగిపల్లలోకి శనగలు , పువ్వులు , అక్షింతలు, డబ్బులు, చెరుకుగడలు, రేగుపళ్ళు వేసి పిల్లలకు దిష్టితీసి తలమీదవేసి ఆసిర్వాదిస్తారు. బొమ్మల కొలువు పెట్టి పేరంటాలకి పసుపుకుంకుమలు ఇచ్చి దీవెనలు తీసుకుంటారు.
ఈ బోగి రోజు నెలరోజులు ధనుర్మాసము వ్రతము చేసిన గోదాదేవి రంగానాధునిని వివాహము చేసుకొని స్వామీ వారిలో ఐక్యము అయిపోతుంది. అందువలన అప్పటినుండి భోగిరోజు గోదా రంగానాయకులవివాహాలు ఆలయాలలోజరుపుతారు. ఈ వివాహము చూడటానికి రెండుకళ్ళు చాలని విధముగా చేస్తారు. ఇలా భోగి పండుగ ముగుస్తుంది.

2 comments:

  1. మీకూ మీ కుటుంబానికీ.. సంక్రాంతి శుభాకాంక్షలు..!!

    ReplyDelete
  2. అమ్మ లహరి , నిజంగా నవ్ అద్ద్భుతం ,నవ్ ఇంత చిన్న వయసులోనే అద్ద్భుతంగా వ్యఖయలాను రచిస్తున్నావ్ , నాకు అంతగా తెలుగులో రాయటం రాదు, తప్పులు ఉన్నట్లయితే మన్నించు . . .ur r really great maa...

    ReplyDelete

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers