Blogger Widgets

Friday, January 23, 2009

అమ్మ కి ప్రేమ .

Friday, January 23, 2009

నవ మాసాలు మోసి చాలా బాధలు ను ఓర్చి బిడ్డను కంటుంది అమ్మ . అనుక్షణమూ తన కంటికి రెప్పలా కాపాడుతూ పెంచి పెద్ద చేస్తుంది. మంచి చెడులను, విచక్షణా జ్ఞానములను, బుద్దులను నేర్పుతుంది . మనము సమాజములో ఎలాబతకాలో నేర్పిస్తుంది. అమ్మ తన బిడ్డ ను గురించి చాలా కలలు కంటుంది . ఆ కలలను నిజాము చేసుకోటాని చాలా కష్టాలు పడుతుంది. అసలు అమ్మ ఆ కష్టాలని కష్టాలుగానే చూడదు. అవి కుడా సుఖాలుగానే భావిస్తుంది. ఇది నిజము. తన బిడ్డ పెరిగి పెద్దవాడై తనని చూడాలన్న ఆసతో బిడ్డ కోసము కష్టపడటం లేదు . కేవలము ఎటువంటి స్వార్ధము లేకుండా తనబిడ్డ పెరిగి ప్రయోజకుడై నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలని. అందరు మెచ్చుకొనే స్థితికి చేరాలని . శ్రమిస్తుంది . ఆమె కోరుకున్న ఫలితము దొరికితే అమ్మ పడిన కష్టాలన్నీ ఎలామర్చిపోతుందంటే. అప్పటిదాకా ప్రసవవేదనను అనుభవించిన తల్లి బిడ్డ పుట్టినా మరు నిమిషానికి బిడ్డను చూసి ఆ సంతోశములో ఆమె పడిన వేదనను మరచినట్టుగా . ఆమె భాదలన్నీ మరచి చాలా సంతోషిస్తుంది.
తల్లి పిల్లలకోసము ఎంతటి త్యాగానికైనా సిద్దమై పోతుంది. బిడ్డ చెడిపోతుంది అని అనిపిస్తే తాళికట్టిన భర్తను సైతము లెక్కచెయదు. ప్రపంచములోచెడ్డ వారు వుంటారు కానీ. చెడ్డ తల్లులు అంటు వుండరట .
ఈ రోజులలో అమ్మని ఎవరు గౌరవంగా చూడటంలేదు . పెరిగి పెద్దఅయిన తరువాత పెరుతెచ్చుకొని ఆ అమ్మ తనకోసము చేసిన త్యాగాన్ని కష్టాన్ని మరచి .వివేకహీనులవుతున్నారు. ఇది విచారిచవలసినదే. ఆ తల్లిని ముసలి వారి నివాస గృహాలలో చేర్చుతున్నారు . ఇదేనా ఆమె కడుపున పుట్టి ఆమె ఋణము తీర్చుకోటము.
అమ్మకి బంగారాలు బాగ్యాలు ఇవ్వక్కరలేదు. అమ్మని ప్రేమగా చూసుకోండి చాలు. ప్రేమగా పలకరించండి చాలు.
నమస్తే .బాయ్.

0 comments:

Post a Comment

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers