Blogger Widgets

Tuesday, July 07, 2009

కొత్త కొత్త గా వుంది ,

Tuesday, July 07, 2009

హాయ్ ! కొత్త కొత్త గా వుంది అంటున్నాను ఏమిటి అనుకుంటున్నారా...........................? మీతో చాలా కబుర్లు చెప్పాలి అన్నాను కదా ! గుర్తు వచ్చిందా. సరే మరి చెప్తాను . అది ఏమిటంటే ..................
సమ్మర్ అయ్యిపోయింది కదా ! నేను చోడవరంలో వుండే దానిని కదా ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చేసాను . హైదరాబాద్ బలే బాగుంది . కొత్త స్కూల్లో చేరాను . కొత్త క్లాస్ లోకి వచ్చాను. కొత్త స్నేహితులు దొరికారు, కొత్త పుస్తకాలు , కొత్త uniform అవీ అవీ కాదు అన్నీ కొత్తవే. అందుకే కొత్త క్రొత్తగా వుండి అన్నాను ఇప్పుడు అర్ధమైందా మరి.
మాకు స్కూల్లో క్లాసు లు మొదలు పెట్టారు హోం వర్క్స్ ఇస్తున్నారు . సంగీతం , డాన్స్ , కరాటే నేర్చుకుంటున్నాను. నాకు కరాటే కంటే డాన్స్ బాగా నచ్చింది. పాటలు నాకు ఎలాగు ఇష్టమే కదా. మిగతా సబ్జక్ట్స్ కుడా బాగున్నాయి. నాకు అన్నిటి లోని మాథ్స్ చాలా నచ్చాయి. నాకు ఫ్రీ టైం దొరికితే మాథ్స్ చేస్తున్నాను . అవి అయిపోయాకా మా అమ్మమ్మ తో స్టోరీస్ చెప్పించుకుంటున్నాను. ఈ మధ్య నేను పోస్ట్ లు పెట్టలేదు కానీ మంచి మంచి కధలు చాలా చెప్పింది . నాకు వీలు కలిగినప్పుడు మీకు చెప్తానే మరి.
ఇక్కడ హైదరా బాదులొ నాకు చెట్లు బాగా నచ్చాయి . మేము వుండే ప్రదేశంలో పక్షులు వున్నాయి . వాటి సౌండ్స్ ఎంత బాగున్నాయో. నేను అప్పుడు అప్పుడు ఫొటోస్ కుడా తీశాను నాకు పక్షులు చాలా నచ్చాయి. అవికూడా మీతో వీలున్నప్పుడు షేర్ చేసుకుంటాను .
మరి నాకు అన్నీ కొత్తే కదా .............

4 comments:

 1. అమ్మలూ, చాలా బావుంది.ఒక్కొక్కటీ నిదానంగా చెప్పాలి.

  ఒక చిన్న సూచన. "ఫ్రీ టైం", "షేర్", "స్కూల్" ఇలాంటివి తెలుగులో (అంటే "ఖాళీ సమయం", "పంచుకోలు", "పాఠశాల" ..ఇలా) చెబితే ఇంకా బావుంటుంది. మనం తెలుగు వాళ్ళం, పైగా మీ తాతయ్య తెలుగు మాస్టారు కదా, అందుకు.

  ఇలా అంటున్నానని ఏమనుకోకే?

  ReplyDelete
 2. అవును వైష్ణవీ - తెలుగులో రాయడానికి ప్రయత్నించండి. ఈ రోజుల్లో పిల్లలు స్వచ్చమయిన భాష లో (ఇంగ్లీషు లో అయితే పూర్తిగా ఇంగ్లీషులో, తెలుగు లో అయితే పూర్తి గా తెలుగులో) మాట్లాడటాన్ని అందరూ ప్రోత్సహిస్తున్నారు. మరి మీ తాతయ్య గారి ప్రభావం మీ మీద ఉండాలి కదా. అది సరే - హైదరాబాదు లో ఏమయినా ప్రత్యేకంగా అనిపించాయా ? చోడవరం లో నచ్చినవీ, మిస్స్ (Sorry - English!) అవుతున్నవీ ఏమిటి ?

  ReplyDelete
 3. రవి అంకుల్ మీరు చెప్పినట్టే అన్నీ తెలుగు లొనే చెప్పటానికి try చేస్తాను. నాకు కొంచెమ్ type చెయటాని ఇబ్బందిగా వుంది . అయినా ప్రయత్నిస్తాను . సరేనా. మీకు నా ధన్యవాదములు.

  సుజాత అంటి, నా మీద తాతయ్య అమ్మమ్మ ప్రభావం చాలా వుంది. సరే హైదరాబాదు లో మేము వుండే ప్రదేశంలో పక్షులు చాలా ప్రత్యేకంగా వాటి అరుపులు చాలా నచ్చాయి.
  ఇక చోడవరంలో నా స్నేహితులను బాగా మిస్స్ అవుతున్నాను. రోజు సాయంత్రం స్కూల్ నుండివచ్చి వారితో ఆడుకునేదానిని. ఇప్పుడు వారు లేరు.
  హైదరాబాదులో కూడా మన్చి స్నేహితులు దొరికారు లేండి. మీకు కూడా నా ధన్యవాదములు.

  ReplyDelete
 4. పసిపిల్లలు ఏడ్చేది మాతృభాషలోనే
  పుట్టకముందే నేర్చుకుంటారు.మాతృభాషలో ఎన్నడూ మాట్లడనంటూ రాసి ఉన్న బోర్డులను చిన్నారి విద్యార్థుల మెడలో 'ఉపాధ్యాయులు' వేలాడదీయటం అనైతికమే కాదు అసహజం కూడా అని సైన్స్‌ నిరూపించింది. అప్పుడే పుట్టిన పసిపిల్లలు ఏడ్చే ఏడుపు కూడా మాతృభాషలోనే ఉంటుందని జర్మనీకి చెందిన శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. అమ్మ గర్భంలో ఉన్న తొమ్మిది నెలల్లో.. చివరి మూడు నెలల సమయంలో తల్లి మాటలు వింటూ పిల్లలు మాతృభాష గురించి తెలుసుకుంటారని, పుట్టిన తర్వాత వారి ఏడుపు అదే భాషను ప్రతిఫలిస్తుందని తెలిసింది.పిల్లలు గర్భంలో ఉండగానే తల్లి మాటలు వింటూ ఉచ్చరణ గురించి తెలుసుకున్నారని స్పష్టమైంది. పిల్లలు వివిధ రకాల ధ్వనుల్లో ఏడ్చే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ.. మాతృభాషకే ప్రాధాన్యమిస్తున్నారని కూడా ఈ పరిశోధనలో తెలిసింది. అమ్మతో అనుబంధాన్ని పెంచుకోవటం కోసమే శిశువు తనకు తెలిసిన మొదటి విద్యను ఇలా ప్రదర్శిస్తుంటారు.(ఈనాడు7.11.2009).కాబట్టి పాఠ్య పుస్తకాలతో పాటు అన్ని మతాల దైవప్రార్ధనలు కూడా మాతృభాషల్లో ఉండటం సమంజసం.

  ReplyDelete

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers